దోసిలిలో ఒక నది

mercy
బయటికి ప్రవహించేందుకు దారి వెతుకుతూ
నాలుగు గోడల మధ్య ఒక  నది
ఊరుతున్న జలతో పాటు
పెరుగుతున్న గోడల మధ్యే తను బందీ

 

ఆకాశమే  నేస్తం నదికి
మాట్లాడుకుంటూ, గోడును వెళ్లగక్కుకుంటూ
గోడల మధ్య బందీయై  ఏడుస్తున్న తనతో
ఊసులు పంచుకుంటూ

 

అప్పుడప్పుడు
నదిని ఓదారుస్తూ  వర్షంలా మారి ఆకాశం
గోడల పై నుండి జారి నదిని కావలించుకోవాలని
చేసేది ప్రయత్నం
ఉదయాన్నే కిరణాల కరచాలనంతో సూర్యుడు నదిని పలకరించి
తన స్వభావం కొద్ది ఆకాశాన్ని ఆవిరి చేసి
ఆకాశాన్ని నదిని విడదీస్తూ వేడిగా నవ్వేవాడు

 

రాత్రుళ్ళు చీకట్లో
నిశబ్ధం నాట్యం చేసేది గోడలపై
ఎలా నిన్ను బంధించానో  చూడని గోడలు
ధృడమైన నవ్వు నవ్వేవి, ఆ నవ్వు నదిని కుదిపేసేది
ప్రతిఘటించాలని ప్రయత్నిస్తే సూర్యుని సాయంతో
నది దేహాన్ని గోడలు వేడి వేడిగా కొరికి పీల్చేసేవి

 

వలస వెల్తూ పక్షొకటి  నది  పరిస్థితి చూసి
ఏమి చేయలేనని నిట్టూర్పు విడిచి
సాయపడ్డం ఎలాని? ఆలోచిస్తూ వెళ్ళింది

 

ఒక రోజు
గోడలను పెకిలిస్తూ
మర్రి చెట్టు  వేళ్ళు వ్యాపించడం నది చూసింది
ఇంకొద్ది రోజులకే గోడ  ఒక వైపు కూలింది
నదికి స్వాతంత్ర్యం వచ్చింది
పరవళ్ళు తొక్కుతూ, కొండలెక్కుతూ,
పల్లం వైపు జారుతూ భూమినంతా తడుపుతూ  ప్రవహించింది
బంజరు భూములను పచ్చగా చేసి
ప్రతి పల్లె దాహాన్ని తీర్చి తల్లిగా మారింది

 

ప్రతి విత్తనాన్ని మొలకెత్తిస్తూ స్వేచ్ఛని పండిస్తూ
మర్రి విత్తనాన్ని నాటిన పక్షి ఋణం తీర్చుకుంటూ
నింగికెగసి ఆకాశాన్ని పలకరించి
భూమి నలుదిక్కులా వ్యాప్తమై,
స్వేచ్ఛా విరోధపు గోడలను మింగేస్తూ
సహాయానికి , సహనానికి నిలువెత్తు సాక్ష్యమై
తనను తీసుకునే ప్రతి ఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉంది
Download PDF

35 Comments

  • కథా కదనరీతిలో సాగిన కవిత ఆద్యంతమూ ఆసక్తిగా సాగింది.

    విస్తృతమైన నదిలక్షణాలను దృష్టిలో చదివితే ఆ లక్షణాలను కుందించేసినట్టు అన్పిస్తుంది.
    నడికున్న ప్రవాహం – ప్రవాహానికుండే వేగం – దానినుంచి పుట్టే శక్తిని గోడలు ఆపలేవు. ఒకవేళ ఆపినా తాత్కాలికమే. తనే కూల్చేస్తూ ప్రవహిస్తుంది.

    నదికి మర్రిచెట్టు ఆశ్రయం అవసరంలేదు

    • mercy margaret says:

      ధన్యవాదాలు జాన్ హైడ్ కనుమూరి సర్ ,

      • khaja says:

        నీ కవితలో తెలియని మాదుర్యం వుంది.నీ ఆలోచలనల నీ రూపు తెలుస్తుంది.థాంక్స్. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నీకు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ మీ శ్రేయభి లాషి
        ఖాజా ఖమ్మం నుంచి.

  • నదిని బంధించడం అనేది ఒక యుక్తి. మీ కవిత్వంలో అది అవసరం కూడా .

    నదిని బంధించడం ఎవరి తరం కాదు కొండలని బండలని త్రోసుకుని ప్రవహించడం నది లక్షణం జాన్ హైడ్ గారి వ్యాఖ్య తో నేను ఏకీభవిస్తున్నాను

    ప్రతి ఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉంది అని చెప్పడం బావుంది నైస్ మేడం.

  • రాజేంద్ర కుమార్ దేవరపల్లి says:

    నాకు తెలిసి మంచి కవిత్వం రెండు రకాలు.
    గుర్తుండి పోయేదీ,చదవగా చదవగా కంఠతః వచ్చేది.
    కవిత్వం పెద్దగా చదవని నాలాంటి వాళ్ల అభిప్రాయం అది.
    పట్టించుకోకపోయినా ఫరవాలేదు.
    మెర్సీ కవిత నిండా ప్రకృతి పరుచుకుని ఉంది.
    సంఘటనలు,సంఘర్షణలూ ఉన్నాయి.
    శృంఖలాలు తుత్తునియలయ్యాయి.
    స్వేఛ్చకు స్వాతంత్ర్యమొచ్చింది.
    ఆశావహంగా కవిత ముగిసింది.
    చాలు.చాలా కాలం గుర్తుండి పోతుంది.
    క్రమంగా చదవగానే కంఠతః వచ్చే కవితలూ
    ఈవిడ రాయగలదన్న నమ్మకం పెరుగుతోంది.
    అభినందనలు మెర్సీ.

    • mercy margaret says:

      thank you so much sir
      మీ మాటలు ఉత్సాహాన్ని నింపాయి . మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

  • BV Prasad says:

    దోసిలి దాటిన నది
    గూడు లో చిక్కుకున్న ఒక రామ చిలుక స్వేచ్ఛను పొందినపుడు అనుభవించిన ఆనందాన్ని కొలిచే ఎంత్రాలు ఇంకా రాలేదు వస్తాయేమో తెలీదు కాని అలాంటి స్వేచ్చనే నది చూసింది అందుకే అది దోసిలి దాటిన నది

    • mercy margaret says:

      చెప్పాలనుకున్నది చాల దగ్గరగా అర్ధం చేసుకున్నారు సర్ .. ధన్యవాదాలు ..

  • jagaddhatri says:

    మెర్సీ నీ కవితలోని జీవన సత్యం , ప్రకృతి ప్రేమ ప్రస్ఫుటంగా ఉన్నయ్ … అసలు నీ భావనే అద్భుతంగా ఉంది . ప్రకృతి అవ్యాజ్య ప్రేమను ఎంత బాగా చె్ప్పేవో … చాలా మంచి హృద్యమైన కవిత … మీలాంటి యువత ఇలాంటి కవిత్వం రాస్తే చాలా ఆనందం తో గుండె నిండి పోతుంది నిజం అభినందనలు ….ప్రేమతో …జగతి

  • ఇది ఒక అందమైన కవిత, చాలా బాగా రాచారు సిస్టర్ , ప్రకృతిలో వుండే స్నేహాన్ని, వాటిలో వుండే వైరాన్ని , సహాయపడే గుణాన్ని అద్భుతంగా కవితలో ఆవిష్కరించారు….

  • renuka ayola says:

    ప్రకృతి కి మనిషికి అవినాభావ సంబంధం మనసు దోసిలిలో నది
    ప్రవహించడానికి బంధీగా వుండేది కొన్ని క్షా ణాలే/ అది
    దేనిని అసారగా తీసుకున్నాసరే/ చాలా బాగుంది మెర్సి…..

    /

    a

    ti

  • ns murty says:

    మెర్సీ గారూ,

    ఈ కవిత మూలభావననుండి అక్షరాల్లో ఒదిగినక్రమం వరకూ ఆద్యంతమూ మనసుని కట్టిపడేసింది.
    Absolutely beautiful poem
    మనఃపూర్వక అభినందనలు.

    • mercy margaret says:

      ధన్యవాదాలు సర్ .. మీ కామెంట్ నాలో ఉత్సాహం నింపింది

  • K.Geeta says:

    -“ఒక రోజు
    గోడలను పెకిలిస్తూ
    మర్రి చెట్టు వేళ్ళు వ్యాపించడం నది చూసింది
    ఇంకొద్ది రోజులకే గోడ ఒక వైపు కూలింది
    నదికి స్వాతంత్ర్యం వచ్చింది
    పరవళ్ళు తొక్కుతూ, కొండలెక్కుతూ,
    పల్లం వైపు జారుతూ భూమినంతా తడుపుతూ ప్రవహించింది
    బంజరు భూములను పచ్చగా చేసి
    ప్రతి పల్లె దాహాన్ని తీర్చి తల్లిగా మారింది”-

    కవితలో ఈ పాదాలు తప్ప మిగతా అన్నీ అద్భుతంగా కవిత్వం అయ్యాయి-
    చాలా కొత్తగా, బాగా రాస్తున్నారు మెర్సీ-
    కంగ్రాట్స్-

    • mercy margaret says:

      thank you so much mam .. మీ సలహాను గుర్తుంచుకుంటానండి ….

  • NAGARJU says:

    వురకలు వేస్తు ప్రవహించే నది ని అపడం సాద్యం కదని తెలుపుతు
    ఇతర జీవరాసులతో్ ప్రకృతికి గల అవినబావ సంబందాన్ని తెలియజేస్తు, ప్రకృతి నుంచి మనిషి నేర్చుకునె విషయన్ని వివరిస్తూ చాల చక్కగా వర్ణించారు. చాల బావుంది మీ కవిత!

    • కథ చెప్పబోయి kavitvamloki మారి చెప్పడంతో కొద్దిగా చొన్ఫుసిఒన్. అందుకే బ్రెవిటి అవసరం . అచ్చం విశ్వనాధ్ సినిమాలా ఎక్కడో స్పష్టత దెబ్బతింది .

  • gadiraju rangaraju says:

    kavita title baagundi. marricheTTutoa poalika nachhaleadu.nadini ApeaSakitti deanikileadukadha.prayatanaM baagundi.

    • mercy margaret says:

      నా ఈ ప్రయత్నాన్ని మన్నించి స్పందించినందుకు ధన్యవాదాలు సర్

  • suresh jajjara says:

    మనిషి తనకు తాను ఎంత స్వాతంత్ర్యం గా ఉంటాడో…
    ఇతరుల నుండి కూడా అలాంటి వాతవరనాన్ని కోరుకుంటాడు.
    ఇతరులు అర్ధం కాని గోడలు కట్టినప్పుడు భావ నది పడే అవస్థను
    చాల అద్భుతంగా రాసావు మై డియర్ వైఫ్….
    లవ్ యు! proud of you!

  • nbvs sarma says:

    మీ కలంలో బంధించబడిన సిరా మీ చేతివేళ్ళ చిరుకదలికలతో తన బంధనాన్ని తెంపుకొని సన్న దారిగుండా ప్రవహించి ఈ శ్వేత పత్రం మీద ఓ మంచి కవితను ఆవిశ్క రించినట్లు …….

    ఎక్కడో బంధించబడిన “నది” ప్రకృతిలో (మనిషి తప్ప ) జివించె చెట్టు ,పుట్ట మరియు పిట్ట సహాయంతో తన కట్టను తెంపుకొని గుండెలనిండా శ్వేచ్చను నింపుకొని కొత్త ఉత్సాహంతో ఉరకలువేస్తూ భూమాతకు కొత్త పావడను కప్పి ప్రకృతి కి ఎనలేని అందాన్ని చేకూర్చింది . బాగుంది మీ కవితాలోచన …………

    కవితను కొంచం edit చేస్తే ఇంకా బాగుంటుంది …

  • సి.వి.సురేష్ says:

    కవిత నడిచిన తీరు క౦టే, కవిత లోని భావ౦ చాలా గాడమై౦ది. జీవిత౦ చాలా స౦క్లిష్టమై౦ది. ఏ ఒక్కరు స్వయ౦ ప్రకాషితాలు కాక పోవడ౦ సహజమై౦ది. ఇ౦కొకరి సహాయ౦తోనో , ఇ౦కోకరి ఆసరాతోనో తన ఒరిజినాలిటిని వెలికి తీసుకోవాల్సి వస్తో౦ది. కవిత లో నాకు తోచిన అ౦శ౦ ఇది. కవిత ఏకబిగిన చదివి౦చి౦ది. కానీ, పక్షికి ఎ౦దుకు కృతజ్న్జతలు చెప్పి౦చారో నాకు అర్థ౦ కాలేదు.
    ఇ౦కొక ముఖ్యమైన అ౦శమేమ౦టే, కథ టైటిల్ ‘ దొసిలి లో నది ‘ అద్భుత౦గా కుదిరి౦ది. జీవితాన్ని నాలుగు గోడల మధ్య నదితో పోల్చారని నేను భావిస్తున్నాను. చాలా బావు౦ది మెర్శి మేడమ్!!

    • mercy margaret says:

      నా ఆలోచనల్ని చక్కగా అర్ధం చేసుకున్నందుకు , మీ వ్యాక్య ద్వారా ప్రోత్సాహపూరితంగా స్పందించినందుకు ధన్యవాదాలు సర్

  • కంగ్రాట్స్ మెర్సీ!

    దోసిలి లో ఒక నది, కవిత ఆద్యంతమూ ఆసక్తిగా సాగింది.

    గుర్తుండి పోయే కవిత.

    మెర్సీ నీ కవితలో ప్రకృతి ప్రేమ ప్రస్ఫుటంగా ఉంది.

    ….ప్రేమతో

    Vijaya Kasani

  • ఈ కవిత చదువుతుంటే నాకొక దృశ్యం స్పష్టంగా కనిపించింది. భారత మాత వేష ధారణలో మన మెర్సీ తన దోసిలిలోనుండి నదులన్నిటినీ జాలువార్చుతూ లక్షల ఎకరాలకు పంటనీరు అందిస్తూ తద్వారా కోట్లాది ప్రజల,ప్రకృతి, పశు పక్ష్యాదుల ఆకలినీ,దాహానీ తీరుస్తూ ,విద్యుచ్చక్తిని అందిస్తూ పచ్చదనాన్ని పెంచుతూ భారత ప్రజలను “సుఖీభవా ” అని దీవిస్తున్నట్టుగా అగుపించింది.గత రెండు నెలలుగా అపరభగీరధుదు సర్ ఆర్థర్ కాటన్ గారి తెనుగీకరించబడిన జీవిత చరిత్ర గ్రంధం “డెల్టా శిల్పి ” ని పలు మారులు చదివిన నాకు ,నదీమ తల్లులను ఆనకట్ట లు కట్టడం ద్వారా పంట పొలాలకు మళ్ళించి ఆంధ్ర దేశాన్ని అన్న పూర్ణ గా మార్చిన ఆ మహానుభావుని త్యాగాలు చదివిన వెంటనే “దోసిలిలో ఒక నది “చదివి ఎంతో ఆనందించాను. మెర్సీ గారికి అభినందనలు

  • kalyanivutukuri says:

    చాల బావుంది !!!!

  • mercy margaret says:

    గాబ్రియేల్ గారు , కళ్యాణి వుటుకూరి గారు ధన్యవాదాలు ..

  • Prasuna says:

    కవిత మొత్తం నది పాట వినిపిస్తోంది. చాలా బావుంది.

  • అప్పుడప్పుడు మీకవిత్వం అక్షరరూపం వదిలి వస్తురూపం తీస్కుని మరీ వెంటొస్తుంది…అలాంటివాటిల్లొ ఇదొకటి. అభినందనలు మెర్సీ.

Leave a Reply to గాబ్రియేల్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)