నలుగురికి ‘కథా కోకిల’ అవార్డులు

 

custom_gallery
images not found

ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు.

తెలుగులో కథాసాహిత్య రంగానికి సంబంధించి ఇస్తున్న అవార్డులలో మధురాంతకం పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు ఒక ప్రత్యేకత వుంది. ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా కథా వార్షిక ప్రచురణ ఒక సత్సంప్రదాయంగా తెలుగు సాహిత్యంలో స్థిరపడింది. ప్రతి ఏడాది ప్రచురితమయ్యే అనేక వందల కథలు చదివి, వాటిల్లోంచి డజను కథల్ని ఎంపిక చేయడమూ, వాటి గురించి విపులమయిన సింహావలోకనం రాయించడమూ ఒక ప్రయోగంగా మధురాంతకం నరేంద్ర చేపట్టారు. ఇందులో కథలన్నీ ఒక ఎత్తు అయితే, సింహావలోకనాలు ఇంకో ఎత్తు. ఆ ఏడాది వెలువడిన కథలని గురించి ఒక అవగాహన ఏర్పరచడం లో ఈ వార్షికలు విజయవంతమవుతున్నాయి.

 

Download PDF

4 Comments

  • sailajamithra says:

    బెస్ట్ సెలక్షన్ . గుడ్ .

  • ramakrishna says:

    గ్రేట్

  • Excellent ! congrats to all !

  • అందరికీ అభినందనలు.
    చిన్న అనుమానం… ప్రతి సంవత్సరం మ.రా. ఫౌండేషన్ కథావార్షికతో పాటే ఈ పురస్కారాలు ప్రకటిస్తారు కదా? అందులో ఒకటి ఒక కథాసంపుటికి, మరొకటి ఆ సంవత్సరం కథలను సింహావలోకనం చేసినవారికి.. కథా వార్షిక 2011 పుస్తకం చివరి అట్ట మీద సం.వెం.రమేశ్ గారి పేరు (ప్రళయకావేరి కథలకి), అలాగే అఫ్సర్ గారి పేరు (సింహావలోకనానికి) వేసేశారు కదా. ఇప్పుడు కొత్తగా 2011 అవార్డుల గురించి ఎందుకు ప్రకటించినట్లు?

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)