కౌమారపు తోటలో కొన్ని పూల గుసగుసలు!

mythiliఈ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది ..రహస్యాలు గుసగుసగా వినపడుతూ వుంటాయి..

నీ అడుగు ఎక్కడ పడుతోందో గమనించుకుంటావు కదూ

‘ నా పన్నెండేళ్ల మేనగోడలికి బహుమతి ఇస్తూన్న ‘ ద సీక్రెట్ గార్డెన్ ‘ పుస్తకం మొదటి పుట లో ఈ మాటలు రాశాను.ఈ నవల శీర్షికని దాని అంతర్ధ్వని కోసం ఇష్టపడతాను..

లోపలి తలుపులూ బయటి తలుపులూ తెరుచుకుంటూ కనిపింపచేసే అందమయిన ఆరామంగా ఆ వయసు వుండాలి.అది ఆదర్శమవనీ,స్వప్నమే అవనీ..అక్కడ కొన్నాళ్లు నిలవాలి.

ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది. చందమామ వాళ్లు గొప్ప దయతో ఏర్పరచిన పాత సంచికల భాండాగారాలన్నీ చదివేసుకుంది.ఎనిడ్ బ్లైటన్  పుస్తకాలన్ని అయ్యే పోయాయి. ఇప్పుడు తను తెలుగులో చదవదగిన  కథా సంకలనాలు కొన్ని వున్నా నవలలు ఎన్నో లేవు. మార్క్ ట్వేన్ ని తెలుగులోకి తెచ్చి అంతతో ఆగిపోయారు నండూరి రామమోహనరావు గారు. ముళ్లపూడి వారు భూప్రదక్షిణం ఒక్కటే అనువదించారు. టాం సాయర్ ని తెలుగు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు, ఆవరసలో రావలసిన ఇతర సాహిత్యమేదీ తెలుగులోకి రాలేదు.

బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం బాగా నచ్చి తర్వాతి కథ చదవబోయిన పిల్లలకి ఆశాభంగమవటం నేను చూశాను. శ్రీ  పాద వారి వడ్లగింజలూ,మార్గదర్శీ కౌమార  సాహిత్యం లో చేర్చవచ్చు. సులోచనారాణి గారి మీనా ని కూడా నేను ఈ కోవలో చెప్తాను.mythili3

టాగూర్ అనువాదాలలో పడవ మునక సరళం గా వుంటుంది..కొంతవరకు గోరా కూడా.నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టాగూర్ కథ హోం కమింగ్ ని పిల్లల సాహిత్యం లో చేర్చటం.నా చిన్నప్పుడు నేను కూడా  ఆ అతి విషాద గాథ ని చదవవలసి వచ్చింది.అది పద్నాలుగేళ్ల అబ్బాయి కథ అయినా టాగూర్ దాన్ని పెద్దవాళ్ల కోసం రాసారుగానీ పిల్లలకి కాదు.నా చిన్నప్పుడు శరత్ సాహిత్యాన్ని కూడా ఈ వయసు పిల్లల కోసం అనేవారు.నిష్కృతి ఇ,నవవిధాన,బిందుగారబ్బాయి అలాంటివే కాని అన్నీ కావు.శరత్ చాలా నవలలలో దిగులు పాళ్లు ఎక్కువ.

నేను  ఆ వయసులో వున్నప్పుడు కనపడినవన్నీ చదివేశాను..వాటిలో కొన్ని అప్పుడు చదవకుండా వుండవలసిందని తర్వాత అనిపించింది.నాకు వేరే దారి కూడా అప్పుడు లేదు..ఇన్ని ఆంగ్లపుస్తకాలు నేను గడిపిన పల్లెటూళ్లలో గ్రంథాలయాల్లో కూడా లేవు, వున్నవి చదివేటంత ఆంగ్లం నాకు వచ్చేది కాదు.

ఈ పిల్ల విషయానికి వస్తే తనది విపరీతమయిన పఠనా దాహం.నాకులాగా తనకి పుస్తకాల షాపులు కలలలో వస్తూ వుంటాయి.  తను చిన్న పిల్ల కాదు, యువతీ కాదు.కొంత తెలుసు,చాలాతెలియదు..అంతా తెలుసు అనుకునే ప్రాయం ఇది ఎంత సుకుమారమో,ఎంత సుతిమెత్తగా చూసుకోవాలో! .అదృస్టవశాత్తూ ఆంగ్లం లో ఈ వయసు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు వున్నాయి.

వాటిలో పాత శతాబ్దంలో రాసినవి అన్ని ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుతాయి..నాకయితే Project Gutenberg ఒక అనంతమయిన నిధి నిక్షేపాల నిలయంలాగా అనిపిస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు.ప్రతి గ్రేడ్ లోనూ వాళ్లు చదివి అర్ధం చేసుకోవలసిన పుస్తకాలు వాళ్లకి కేటాయించబడుతూ వుంటాయి.బాధంతా భారత దేశంలోని 12-16 వయసున్న  పిల్లల గురించే.

వీళ్ల పాఠ్యప్రణాళిక లో సాహిత్యానికి చాలా తక్కువ చోటు వుంది. ఈమద్య దశాబ్దం నుంచి పట్టిన విద్యా విషజ్వరం  ఏ ‘ ఇతర ‘ పుస్తకాన్ని చదివే వ్యవధి ఇవ్వటం లేదు.ఆర్ధికమయిన వెసులుబాటు ఎక్కువగా వున్న తల్లిదండ్రులు ఎంచుకునే ‘ అంతర్జాతీయ ప్రమాణాలు ‘ గల పాఠశాలలు కూడా సరయిన దారిని చూపించటం లేదు.

ఏతావాతా ఈ కౌమారంలోని పిల్లలు ‘ చిక్’ లిటరేచర్  కి అలవాటు పడుతున్నారు. వీటిలో చాలా వరకు ఏ విలువలనీ పాటించాలని అనుకోరు,కొన్ని మినహాయింపులు వున్నా.ఇబ్బంది పెట్టే ‘ చెడ్డ భాష ‘ ని యధేచ్ఛ గా వుపయోగించే ఈ పుస్తకాలు ఆలోచననీ వ్యక్తీకరణనీ కూడా దెబ్బ తీస్తున్నాయి.

కొంచెం మార్గం చూపించాలి -తల్లిదండ్రులు, దగ్గరివారు,ఉపాధ్యాయులు..ఎవరయినా. మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది.  చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.
అది కాదు.

mythili2వేర్వేరు  సందర్భాలలో వేర్వేరు  మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో -ఎలా లోబడిపోవచ్చో, ఎలా ఎదగవచ్చో -ఎలా నలుగుతారో ఎలా తెప్పరిల్లుతారో-ఈ ప్రయాణమంతా మంచి పుస్తకం అన్యాపదేశంగా మాత్రమే చెప్పాలి.ఇందుకు  ఒకే పుస్తకం సరిపోదు.చాలా,చాలా కావాలి.వాటిని వెదకాలి.

అయితే జీవితపు భయానక వాస్తవికతని ఒక్కసారిగా వీళ్లమీదకి వదలకూడదు.చీకటిని తెలియనివ్వాలి,ఆ తర్వాతి వెలుతురుని తప్పనిసరిగా చూపించాలి.తీవ్రమయిన నిరాశ,అయోమయం కలిగించే అఘాతాలు,దయలేనితనం – ఈ వయసు పిల్లలు తట్టుకోలేరు.

పరస్పరవిరుద్ఢ   భావాలని పెద్దవాళ్లు పిల్లలముందు ఎలా నియంత్రించుకుంటారో ఈ పుస్తకాలూ అలాగే వుండాలి.సంఘర్షణ వుండకుండా వీలవకపోవచ్చు,కాని అది సులభంగా అర్ధమయేలాగే వుండాలి.

ఉండదగినన్ని అనురాగపు ఛాయలు  ,అవీ నిజాయితీగా మాత్రమే వుండాలి.సంక్లిష్టమయిన ప్రేమసంబంధాలను గురించి చర్చించకపోవటం ఉత్తమం.

ఈ షరతులన్నీ వర్తించే పుస్తకాలు నా దృష్టిలోకి చాలా వచ్చాయి.సమకాలీన ఆంగ్ల సాహిత్యం లో యంగ్ అడల్ట్ విభాగం చాలా పెద్దది .అన్ని ఇ మాల్ లలోనూ ఇవి దొరుకుతాయి.చాలా మెచ్చుకోదగినవి కూడా వున్నాయి.అయితే నా దృష్టి లో గుటెంబర్గ్,క్లాసిక్ రీడర్ వంటి చోట్ల ఉచితంగా  దొరికే పుస్తకాలే వీటికన్నా  మంచివి.

వీటిని పాశ్చాత్యదేశాల్లో తొమ్మిదేళ్ల వయసునుంచే  సూచించినా ఇక్కడి పిల్లలకి పదకొండు పన్నెండేళ్ల తర్వాతే బాగుంటాయి.ఇది నా స్వానుభవం.పిల్లలని ఈ మహాతల్లుల, పెద్దమనుషుల  చేతుల్లో పెట్టి కొన్నాళ్లు నిజంగా నిశ్చింతగా వుండవచ్చు.

Frances Eliza Hodgson Burnettరాసిన పుస్తకాలని నేను మొదట వుంచుతాను.A Little Princessలో నిబ్బరం,అభిజాత్యం అబ్బురమనిపిస్తాయి.యేబ్రాసి  పిల్లMary Lennox..The Secret Garden లో ఎలా సున్నితంగా మారుతుందో ఏమెమి కనుక్కుందో ఆసక్తిగా అనిపిస్తుంది.Little Lord Fauntleroy లో చిన్న పిల్లాడు  తనకి కొత్తగా పట్టిన అదృష్టం లో ఎలా గుక్క తిప్పుకోగలిగాడో,కఠినుడయిన  తాతగారిని ఎలా మార్చుకున్నాడో చదవటం  ముచ్చటగా వుంటుంది.

తర్వాత చెప్పవలసిందిLucy Maud Montgomery  గురించి.Anneఅనే విలక్షణమయిన అమ్మాయి గురించి చాలా నవలలు వుంటాయి.ఇంచుమించు అన్నీ హాయిగా వుంటాయి.ఈవిడే రాసినEmily trilogy సూక్ష్మమయిన పరిశీలనతో  నడుస్తుంది.నేను చదివించిన పిల్లలందరూ తమని తాము చూసుకున్నారు ఈ పాత్రలో.
తర్వాతLouisa May Alcott . .ఈవిడ రాసినLittle Women ఎప్పటికీ నచ్చుతూ  వుంటారు..అసలు ఆ పేరే ఎంత బాగుందో చూడంది..ఈవిడ ఇతర రచనలు Eight Cousins,An Old Fashioned Girl,Under the Lilacs కూడా చక్కగా వుంటాయి. Eleanor H. PorterరాసినPollyanna  పుస్తకం ఎంత ప్రసిద్ఢికెక్కినదంటే  నిరంతర ఆశావాదాన్నిPollyannaism అని పిలుస్తారు.ఈ అర్ధం నిఘంటువుకెక్కింది.Pollyanna Grows Up అని దీని తర్వాతి భాగం.పాజిటివ్  థింకింగ్ ఎంతో కొంత  నేర్చుకుని తీరాలి నచ్చితేJust David అనేది  ఇంటిపేరు తెలియని  ఒక అబ్బాయి గురించి.చాలా ఉదాత్తమయిన   నవల.

Edith Nesbit మరీ చిన్నపిల్లల కోసం అనుకుంటారుగానీ ఈవిడ రాసిన అద్భుతకథలు ఈ వయసులోనూ బాగుంటాయిThe House of Arden, The Railway Children ఆరోగ్యకరమయిన రచన లు .తర్వాత Kate Douglas Wiggin రాసిన  Rebecca of Sunnybrook Farm చెప్పుకోదగినది .ఈవిడదే Mother Carey’s Chickens కూడా మంచి నవల .Jules Verne మంచి సైన్స్ ఫిక్షన్  రాసాడు .20,000 Leagues under the Sea ,The Mysterious Island  ప్రసిద్ఢి  వున్న Around the World in Eighty Day బాగున్నంతా బాగుంటాయి .

Johann David Wyss  ది The Swiss Family Robinson  ఎన్నిసార్లు చదివినా బాగుంటుంది .Robert Louis Stevenson, Thomas Hughes మొదలయినవారు ప్రత్యేకించి  అబ్బాయిలకి  నచ్చే పుస్తకాలు రాసారు.

వీళ్లు కొంతమంది మాత్రమే.ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకెన్నో అంతేలేదు ..

“If you look the right way, you can see that the whole world is a garden.”
― Frances Hodgson Burnett, the Secret Garden

Download PDF

25 Comments

  • రమాసుందరి says:

    చాలా మంచి సూచనలు చేసారు. నేను ఎనిమిదవ తరగతి లోనే ఒక చిన్న లైబ్రరీ చదివేసాను. ఆ రోజు ఈ సృహలు లేవు. చెప్పేవాళ్ళు, నియంత్రించే వాళ్ళు లేరు. ఆ వయసుకి చదవ కూడని పుస్తకాలు చదివినా మీరన్న సంఘర్షణలు పడలేదనుకొంటాను. మంచి పుస్తకాలు మాత్రం నాకు పూర్తిగా తెలిసాకే చదివాను.

  • కౌమార దశని గురించి సరైన గమనికలు చెప్పారు. తెలుగులో పిల్లల సాహిత్యం చెట్టుముందా విత్తనం ముందా అన్న చందంగా తయారయింది.

  • వదిన
    చాలా బాగుంది మీ ఆర్టికల్. నేను చదివిన సాహిత్యం అస్సలు సాహిత్యం కానే కాదు అని అర్ధమయ్యింది, చదవాల్సిన గని ఎంత పెద్దదో అర్ధమయ్యింది.

  • suvarchala says:

    maiThiligaaru! enta koolgaa, Opiggaa cheppaaru! nEnu kuDaa chadavaalanipinchElaa! EvO..chinnappuDu ingliish naanDiTailD pustakaallO chadivina aangla saahityanni..paaTHaalugaa chadavaTam tappa! maa pillalu konta aangla saahityam chaduvutaaru.. raskinbaanD, aar.ke.naaraayaN, THaagOr, nEshanal buk TrusT vaarivi maatramE! ee vyaasaanni maa pillalatO chadivistaanu. mIru chaalaa viluvaina samaachaaram tO baaTu, entO viluvaina vislEshaNa chESaaru. adentO muchchaTa vEsindi naaku.

  • ప్రి-టీన్స్, టీన్స్ సాహిత్యం, సినిమాలు మనకి లేవు. నిజానికి చాలా అవసరమైన బ్రిడ్జ్ సాహిత్యం ఇది. ఈ టైంలో పాఠకుల్ని తయారుచెయ్యకపోతే భవిష్యత్తు పాఠకులు తయారుకారు. మంచి సూచనలు చేశారు.

  • Santwana says:

    “The world doesn’t function according to me!” is the only complaint several adolescents have. They are slowly coming out of parent’s scaffolding and no one in the world outside is kind enough to let them have their wishes any more as it pleases with kids. This is what makes adolescence a tricky age to deal with.

    In such an age of confusion.these books introduced me to the ways of the world.. how people have shades of grey in them,how to deal with difficult people. how to build up relationships that last, how to be your own self even at times of doubt and how people admire you for that very quality.. and lots and lots more.

    They taught me all these lessons with an air of positivity that helped me to look at the world from a plane above.. helped me know the vitality of human relations and how important it is to forgive..
    In fact they are the only things that matter in life,they are the ones that matter the most in adulthood.

    They taught me that being a child and an adult are not mutually exclusive things.. they helped me cherish the pure, childlike feelings, telling me that you never need to forget them, while growing into a full fledged adult…

    Go on.. these aren’t just for children, they are for anyone who wishes to unlearn things and start over fresh.. The treasure is just a click away..

    • I liked your last line the most. Yeah I agree with you(Thumbs up!)…

    • mythili says:

      thank you very much bhuvana..

    • mythili says:

      thank you

    • kameswari says:

      ఈ మాటలన్నీ అమ్మకి తగిన కూతురివే ! సాంత్వన ఎంత బాగా చెప్పావు. నాకు పిల్లల సాహిత్యమే ఎన్నో విషయాలను నేర్పింది. మైథిలి గారు నేను చదవ వలసినది చాలా ఉందని తెలుసు .ఏమేమి చదవాలో ఇప్పుడు తెలిసింది. హోం కమిం గ్ చదివి ఎందుకు బాధపడ్డానో ఇప్పుడు అర్థం అయింది. చాలా ధన్యవాదాలు

  • Pramadha Mohana says:

    Honestly, many of the books cited above have made my fingers itch. However, read some I have, and to say that they have made me think would be a gross understatement.
    Frances Burnett’s A secret garden and A little princess are quite inspiring. But not entertaining enough. I have found Little lord Fauntleroy rather cute and it made me savor the whole idea of a well-behaved child. Being an adventure lover myself, ‘Around the world in eighty days’ and ‘The mysterious island’ have amazed me and made me quite the Vernian. Alcott’s ‘Little women’ is sweet. I have also enjoyed the plot of ‘Treasure Island’ by R.L Stevenson, but I was quite offended by the gore in it.
    As the author persists on books with morals, I cannot help but mention some of my all-time favorites, Alice in wonderland, The wonderful wizard of oz and The lorax.

  • Nidhi Adury says:

    i still remember how much i enjoyed reading pollyanna !
    and little woman is one of my all time favorites. ^_^

  • Thanks for the wonderful piece of writing.

    If ever I regret anything in my life, its only not having read these books early.
    I have read a few of those you mentioned but I can understand the actual intention with which you have so passionately expressed your concerns here.

    Yes I truly agree that Teenage is the most wonderful time in everybody’s life but if left unchecked it could also be the scariest period. I remember being a kid, loaded with thoughts almost all the time, but never knew how to channelize them. These books came as as a boon to people like me.

    In spite of being brought up in a healthy environment, children at that age tend to go through THE period where there is a need to keep a close watch on them. Unfortunately keeping a watch is easily considered as intending something wrong for others but its actually stopping them from doing it to themselves.
    Its observing the the way they are building their character, thought process, the way they handle a situation and so on, which will later play a key role in facing their future.

    This is when these books come in handy and kids will unknowingly try to adhere to the benchmarks the characters in them keep. It always feels good to see yourself in the character you liked the most and I feel the books have that potential better than the media many are after these days(only those who read can understand that a book always has better impact than the movie taken from its story).

    I hope and sincerely wish that the kids in the coming generations at least have a better childhood with these wonderful mates.

    PS: Thanks so much for introducing me to the books. ‘The Little Princess’ is still my favorite and I guess it will always remain..:)

  • nidhi adury says:

    little women..i am sorry..but jo is the little woman i like most in the story..

  • Ismail says:

    “మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది. చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.”…ఎంత చక్కగా చెప్పారు. Thanks for introducing to a wonderful trove of teen books, which I need pretty soon:-)

  • pavan santhosh surampudi says:

    వ్యాసం చాలా బాగుందండీ అని వదిలెయ్యడం ఎస్కేపిజమే అవుతుందని వ్యాసం చదివాకా కాసేపు ఆలోచించాను. ఇలాంటి వయసుకు తగ్గ పుస్తకాలు ప్రత్యేకించి తెలుగులో ఏమీ లేవు కానీ “అమరావతి కథ”ల్లో చాలా కథలు బావుంటాయేమో.మరీ ముఖ్యంగా అమ్మకు పులిహోర తెచ్చి పెట్టే పిల్లాడు, ఆవలిఒడ్డుకు పడవల్లో వెళ్లి, “ఆహో ఓహో కాపాడండో” అని ఏడ్చి పాలేరు అన్నం పట్టుకుని వస్తే అక్కడే ఆనందంగా తిని ఆడుకునే పిల్లలూ, ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి(మరీ పసివాళ్ళకి పనికి వస్తాయవి అంటే ఏమో లెండి). ఆయన కథలు అన్నింటిలోనీ(కొన్ని మినహాయింపులు ఉంటాయి లెండి) సంక్లిష్టం కాని మానవ స్వభావాలు కనిపిస్తాయి. స్వచ్చమైన మమతానురాగాలుంటాయి, హాయిగా చదివించే వచనమూ, ఇలా ఎన్ని చెప్పుకున్నా ఆయన కథలు నీరు కలవని పాలే. కనుక అవి బావుంటాయి.
    నారాయణ స్వామిగారి తుపాకీ కూడా చాలా బావుంటుంది ఈ వయసు పిల్లలకిచ్చి చదవమనడానికి. ఇంకా ఎక్కువగా ఇప్పటికిప్పుడు తట్టట్లేదు కానీ ఉన్నాయి మన సాహిత్యంలో. చేయాల్సిందల్లా సంకలనమే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)