ఆకాశం, చలం, సముద్రం….ఒక్కోసారి ఒక్కోలా…!

Kuppili Padma Photoవేసవి గాడ్పులు. ముదురాకుపచ్చని జీడిమామిడి చెట్లు గొడుగైన ఆ మధ్యాహ్నాం నా  రెండు చిన్నారి  చేతుల నడుమ ప్రేమలేఖలు. ఆ వేసవి వేడి, మట్టివాసన ,రాబోయే కాలానికి నిబద్దతతో ఆహారసేకరణలో చీమలు బారులు. చిన్నవి, ఎర్రనివి, నల్లనివి. గండు చీమలు. అలాంటి వొకానొక వేసవి మధ్యాహ్నం  ఫ్రేమలేఖలని చదవటం మొదలు పెట్టాను. వొక పేజ్‌ నుంచి మరో పేజ్‌లోకి చూపులు కదలనని మొరాయిస్తున్నాయి. కాసపటికి గూస్‌పింపుల్స్‌.
అప్పటికే మైదానం, శశిరేఖ , అమీన , హంపీకన్యలు చదివి యీ పమలేఖలకి ముందు అరుణని చదివి వున్నాను. అప్పటికింకా నా చెవుల్లో అరుణ జలపాతపు నవ్వు హారెత్తిస్తోనే వుంది. ఆ చలం యీ చలం వొక్కరేనా… వొక్కరే. వాళ్లు అమ్మాయిలు. యివి లేఖలు.

ఆ సాయంకాలానికి గాలిదుమారం చాలా వేసవి సాయంకాలాల్లానే. కాని ఆ నాటి ఆ దుమారం రాబోయే కాలంలో నా హదయంలో చెలరేగే మనోదుమారానికి నాందని ఆ క్షణం తెలియలేదు.

కరెంట్‌ పోయింది యింట్లో.  హరికేన్‌ లాంతరు వెలుగులో చదవాలని ఆరాటపడ్డాను. యీ పుస్తకంలో మునిగి అసలే సాయంకాలం మల్లెమొగ్గలు కోయలేదని అలిగిన మా మేనత్తలు నాకు  లాంతరు యివ్వకుండా  శిక్షించారు. చివరికి గాలి ఆగింది. కరెంట్‌ వచ్చింది. హరికేన్‌ దీపాలు ఆర్పిన తరువాత వచ్చే మసివసన కమ్ముకొంటుంటే మరిన్ని లేఖలు చదివాను. ఆ రాత్రి  అందరు నిద్రపోయాక కూడా వెదురు బద్దలు రెయిలింగ్‌తో వున్న వరండాలో కూర్చుని మరి కొన్నింటిని చదువుకొన్నాను. అలా ఆ వేవవిలో చాలాసార్లు ఫ్రేమలేఖలని చదువుతూనే వున్నాను.
తొలిసారి పాపాయి కన్నులు విప్పినంత మదువుగా మనసు విచ్చుకొంటుంది. మెల్లమెల్లగా నా హదయంలో వొక పసికోరిక విప్పారటం మొదలయింది… ఫ్రేమలేఖ రాయాలని. అప్పుడే యెవ్వరు మనసులోకి వచ్చే అవకాశం పెద్దగా ఆ సమయంలో యెవ్వరికి ఇస్తాము. కానీ  చివరికి రాసేశాను. యెంత బాగ రాసుకొన్నానో. యెడిట్‌ తెలియని మనసుతో. యెవ్వరు లేని మనసులో యెవ్వరినైన మనసులో నింపుకొంటే అంత గాఢంగా అంతే మదువుగా  అంతే చిలిపిగా అంతే గౌరవంగా నింపుకోవాలి. యిది పరస్పరం. అది సాధ్యం కానప్పుడు చలంగారే దారి కనుగొన్నారు. ప్రపంచానికే  ప్రేమలేఖలు రాయాలి.

అలా యెప్పుడు చలంగారివి యే పుస్తకం పట్టుకొన్న వాళ్లని మనం వదల్లేం. వొకసారి చదివినప్పుడు తోచనవి మరోసారి తోస్తాయి. కొన్నిసార్లు మొదట తోచినవి మరెప్పుడో కాదనిపిస్తాయి. నేను చదువుకొన్న తెలుగు సాహిత్యంలో నాతో  యిలా దాగుడుమూతలు ఆడిన  రచయిత మరొకరు లేరు. ఆకాశము, సముద్రమూ చలం వొక్కసారి కనిపించిన్నట్టు మరోసారి కనిపించరనిపిస్తుండేది.
మెల్లమెల్లగాగా సైన్స్‌ చదువుతుంటే సముద్రమూ ఆకాశమూ వెనుకనున్న శాస్తం తెలుస్తున్నట్టు లోకాన్ని చూస్తున్న కొద్దీ చలంగారు , చలంగారిని చూసేకొద్ది లోకం యేదో తెలుస్తున్నట్టుండేది.
యింతకీ చలంగారు యెందుకిలా మనలని మనం, ఆయన్ని పలకరించుకొనే వుంటాం. యిప్పటికి యెంతో యిష్టంగా ఫ్రేమగా. యెందుకు మనకి యితను దార్శనీకుడు.
చలంగారి శతజయంతి వుత్సవాలప్పుడు ఢల్లీలో మీటింగ్‌కి వెళ్లాం. ఆంధ్రా భవన్‌లో సభ. వి.యస్‌. రమాదేవిగారు మాటాడుతు తన వృత్తిలో కొన్ని బిల్స్‌ ముఖ్యంగా స్తీలకి సంబంధించినవి  తయ్యారు చేసినప్పుడు చలంగారు యెలా గుర్తొచ్చేవారో ఆ సాహిత్య ప్రభావం యెలా వుండేదో చెప్పారు.

అలానే చలంగారు తమ తరంవారికే కాకుండా యిప్పటి తరం వారిని యెలా ప్రభావితం చేస్తున్నారో చూడండని ఆమె నన్ను సభ ముందుకి చేయిపట్టి లాక్కొచ్చి సభకి పరిచయం చేసి యీ యంగ్‌లేడీ యిప్పుడు ప్రసంగిస్తారని చెప్పారు. అలానే వరంగల్లో చలంగారి ఫ్రేమలేఖలపై మాట్లాడినప్పుడు ఆ సభలో వున్న కాళోజి గారు మొదటి వాఖ్యం పూర్తికాగానే చప్పట్లు కొట్టారు. సభ అయ్యాక కాళోజిగారితో మాటాడుతుంటే కాళోజిగారు అన్నారు చలంని యెప్పటికప్పుడు కొత్తతరం తమ కాలానికి అనుగుణంగా చూస్తోందన్నారు. ఆ రాత్రి  చలంగారి అల్లుడు విశ్వంగారి దగ్గర కూర్చుని చలంగారి కబుర్లు చెప్పించుకొన్నాను. ఆ రోజు నుంచి విశ్వంగారు మంచి స్నేహితులయ్యారు. విశ్వంగారు మా యింటికి వచ్చినప్పుడొకసారి యక్సర్సైజ్ చేసే సైకిల్‌ని చూసి రోజు చేస్తావా అని అడిగారు. లేదు… అప్పుడప్పుడూ అన్నాను. చలంగారిని యిష్టపడటమంటే  స్వేచ్ఛని యిష్టపడటం … డిసిప్లీన్‌ లేని స్వేచ్ఛ చాలా ప్రమాదకరం. చలంగారు చాలాచాలా చిన్నచిన్న విషయాలలో కూడా యెంతో బాధ్యతగా వుండేవారని విశ్వంగారు చెప్పారు.
సభలు సమావేశాలు , పుస్తకాలు యిలా చాలా వుత్సాహంగా చలంగారి శతజయంతిని జరుపుకొన్నామంతా.
తిరిగితిరిగి ఆలోచిస్తోంటే అనేకానేక ఆలోచనలు కమ్ముకొనేవి. స్త్రీవాద  రచనలు విరివిగా వచ్చినకాలంలో ఆధునిక స్తీలకి సంబంధించిన  విషయాలు ఆలోచిస్తోంటే చలంగారు స్పశించని స్తీల విషయం వుందాఅనిపించేది. అసలు స్తీ గురించి పిల్లల గురించి చలంగారు అన్ని కోణాల నుంచి నిక్కచ్చిగా రాయటం వలన సాహిత్యంలో స్తీస్వేచ్ఛకి వో రహదారి యేర్పడింది. అసలు చలంగారు యింతగా రాసుండక పోతే యెక్కడ నుంచి ప్రశ్నించటం  మొదలుపెట్టాలి. యెంతగా వివరించాల్సి వచ్చేదో కదా. అంత శక్తి వున్న వారు యెవరు. మార్గం సుగమం అయింది.
కొందరు చలంగారిని మొదటి ఫెమినిస్ట్‌ అనేవారు. చలంగారిని అలా వో విషయానికి పరిమితం చేయలేమనిపించేది. ఆయన అందించిన తాత్వికత జీవితంలో యెన్నెన్నో పార్స్వాలకు  సంబంధించేది. లోతైనది . సౌందర్యంతో మిలమిలలాడే రచనలు. కపటత్వాన్ని అసూయని అనుమానాన్ని ద్వంద నీతిని నిక్కచ్చిగా యెత్తి చూపించి హృదయాలని ప్రక్షాళన చేయ్యాల్సిన అవసారాన్ని  నిర్భయంగా నిజాయితీగా చూపించింది.
ప్రస్తుత సమాజంలో  ముఖ్యంగా స్తీపురుష సంబంధాలు అత్యంత హింసాత్మకంగా మారిపోతోన్న వేళ , యిన్‌సెక్యూరిటీతో వొకరినొకరు పోలీసింగ్‌ చేసుకొంటున్న  సమయమిది.
ప్రస్తుతం జీవితాలు బోల్డంత యెక్స్‌ట్నాలైజ్‌ అయిపోయిన సందర్భంలో మన సమాజం, జీవితాలు వున్నాయి. అన్ని విషయాలని మార్కెట్‌ నియంత్రిస్తున్న యీ సమయంలో యే వస్తువు యే ఫ్రేమకి, యేయే అనుబంధాలని నిదర్శనమో చెపుతు మనలని కండీషనైజ్‌ చేయటమే కాకుండా యెలాంటి స్త్రవర్‌బతీవం యేయే  వివాహానికి, పిల్లలపెంపకానికి , ఫ్రేమకి, స్నేహాలకి, కుటుంబాలని  మిగిలిన మానవసంబంధాలకి ప్రతిబింబమో చెపుతోన్న యీ సందర్భంలో మనకి మన హదయం అంటూ వొకటుందని తెలుసుకొనే నిశ్శబ్ధం మనచుట్టూ వుందా. యిక్కడే మనకి సాహిత్యం మన మనసులపై టార్చ్‌ని ఫోకస్‌ చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని అందించిన అరుదైన నిత్యసత్యాన్వేషకులు  చలంగారు.
డబ్బు, పోరు, పోటితత్వం సమాజనీతి, ప్రపంచ ధర్మం అయిన యీ సమయంలో సంబంధాల నుంచి సంబంధాల్లోకి  కష్టపడుతునో, సునాయాసంగానో  నడిచే వో స్పేస్‌ని సంపాందించుకున్నాక కూడా యెందుకు సంతోషంగా వుండలేకపోతున్నారు. అలానే అనేక అసంతప్తుల నడుమ వొకరితోవొకరు యెందుకు కపట ఫ్రేమలు కొనసాగిస్తున్నారు. వొక ప్రజాస్వామిక స్పేస్‌ని యెందుకు రచించుకోలేకపోతున్నారు. వొక బంధాన్ని అనుబంధంలో కంటే యిమేజ్‌ చట్రం లో  చూడటం యెందుకు యెక్కువవుతుంది… ఆరోగ్యవంతమైన ప్రేమ ఆనవాలుని యే జీవితపు మలుపు దగ్గర పారేసుకొన్నామో లేదా విసిరేసామో , జారిపోయిందో  యెవరికి వారు ఆత్మశోధన చేసుకోవలసిందే.
అసత్యల బంధాల మేడలని ప్రపంచపు మెప్పుపొందాలని  నిర్మిస్తారో  లేదా సత్యవంతమైన పొదరిల్లుని  యెవరి ఆనందం కోసం వారు నిర్మించుకొంటారో…  యెవరి చాయిస్‌ వాళ్లది.
మన పెదవులపై నికార్సైన నవ్వు వెలగాలంటే , మన మన:శరీరాలు మోహపు పువ్వుల పరిమళపువనం కావాలనుకొంటే , మన జీవితాదర్శం శాంతి అయితే  చలంగారు తరతరాలకు  చిగురించే సాహిత్యపుతోటని యిచ్చారు. సీతకోకచిలుకలమై వనమంత చూసొద్దామా…

Download PDF

13 Comments

  • mythili says:

    వట్టివేళ్ల పరిమళమూ వేసవి వర్షంలో తడిసిన మట్టివాసనా కలిసిపోయినట్లుంది చదువుతూంటే

    • kuppilipadma says:

      మైథిలి గారు ,

      మీ స్పందనే కవిత్వంలా చాల అందంగా ఉంది .
      Thank You .

      పద్మ .

  • చాలా బావుంది. ఆలోచనలో నలుగుతుంది.

    • kuppilipadma says:

      వనజ గారు ,
      మీకు నచ్చినందుకు సంతోషంగా అనిపించింది .
      Thank you .

      పద్మ.

  • పద్మ గారు,

    చాలా బాగుంది. కొన్ని వాక్యాలు చాలా నచ్చాయి. “ఎడిట్‌ తెలియని మనసుతో” అనడం బాగుంది.

    హరికేన్‌ దీపాలు, మసివాసన, మల్లెమొగ్గలు, మేనత్తలు అన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

    మీ వ్యాసం చదివాక మళ్ళీ మా ఇంట్లో ఉన్న ప్రేమలేఖల దుమ్ము దులిపా. ఇక చదవాలి.

    చలం గారి ప్రేమలేఖలు చదివాక ప్రేమలేఖ రాయకుండా ఎవరూ ఉండలేరేమో!

    • kuppilipadma says:

      రవి గారు ,

      మీరు ప్రేమలేఖలన్ని మళ్ళి చదివే ఆనందం లో ఉండిఉంట్ట్టారనుకున్తున్నాను .
      మీకు నా వాక్యాలు నచ్చినందుకు Thank you .

      పద్మ.

  • chinnagadu says:

    జీవితంలో చలం ప్రాసాదించిన ఆలోచనలే ఆచరణలై నిజం వైపు నడిపించి కదిలిస్తున్నాయి .. చలం చలనం జన్మ ధన్యం

  • చాలా బాగా రాశారు మీదైన శైలిలో. చదువుతోంటే నేను కాలేజిలో ఉండగా జరిగిన సంఘటన గుర్తొచ్చింది. చలం గురించి తెలుసుకుందామని కాలేజి లైబ్రరీలోంచి మైదానం తీసుకున్నా. లైబ్రేరియన్ ముందు పెట్టా ఎంట్రీ చేసుకోవడానికి. అంతే , ఏమిటీ.. ఇలాంటి పుస్తకాలు చదువుతారా ఆశ్చర్యంతో ప్రశ్న. ఇంతవరకూ ఈ లైబ్రెరీ లో ఆడపిల్ల లెవరూ ఇలాంటి పుస్తకాలు ముట్టుకోలేదు అంటూ నన్ను అదోలా చూసాడు. ఆ పుస్తకాలు చదివితే ఆడవాళ్ళు చెడిపోతారు ఇవ్వనన్నాడు. చెడిపోయే పుస్తకాలైతే లైబ్రెరీ లో ఎందుకు పెట్టారని వాదించి మరీ తీసుకోవాల్సి వచ్చింది. చలం గురించి 1983-84లలో అలా ఉంటే చలం రాతలు అంద్తకు ముందు వారిని ఇంకా ఎంత కలవర పెట్టాయో కదా!

    • kuppilipadma says:

      శాంతి గారు,

      మైదానం జ్ఞాపకాన్ని పంచుకోవటం సంతోషంగా అనిపించింది.

      Thank you .

      పద్మ.

  • akella raviprakash says:

    “మన పెదవులపై నికార్సైన నవ్వు వెలగాలంటే , మన మన:శరీరాలు మోహపు పువ్వుల పరిమళపువనం కావాలనుకొంటే , మన జీవితాదర్శం శాంతి అయితే చలంగారు తరతరాలకు చిగురించే సాహిత్యపుతోటని యిచ్చారు. సీతకోకచిలుకలమై వనమంత చూసొద్దామా”…
    నైస్ లైన్స్

  • ramachandra reddy says:

    చాలా బావుంది మీ స్మరణ. ఎప్పటికప్పుడు(ఏ కాలానికైనా ) చలాన్ని గుర్తుచేసుకోడం జీవితాన్ని వెలిగించుకోడమే.

Leave a Reply to akella raviprakash Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)