నాట్స్ సాహిత్య పోటీల విజేతలు

nats-logo

డల్లాస్ లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో జూలై 4,5,6 వ తేదీలలో జరగబోయే 3 వ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను పురస్కరించుకొని సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు ఈ క్రింది సాహిత్య అంశాలలో పోటీలు నిర్వహించారు.

  • కథలు
  • కవితలు
  • ఫోటో కవితలు
  • ఛందస్సుతో కూడిన పద్యాలు

ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వందల మంది రచయితలు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు.  వివిధ అంశాలలో వచ్చిన రచనలను ఆయా రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, రచనలను నిశితంగా పరిశీలించి ఈ క్రింది విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భముగా ఈ పోటీలలో పాలుపంచుకున్న ఔత్సాహికులైన రచయి(త్రు)తలకు, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీ మిత్రులకు, సాహిత్య కార్యక్రమాల కార్యవర్గ సభ్యులకు, ఈ సాహిత్య పోటీల మరియు నాట్స్ సంబరాల సాహిత్య కార్యక్రమాల సమన్వయ కర్త అనంత్ మల్లవరపు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు జూలై 5,6 వ తేదిలలో సంబరాలలో భాగంగా జరిగే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాల వేదిక మీద జ్ఞాపిక  బహుమతి ప్రధానం ఉంటుందని తెలియచేశారు.

 

కథల పోటీల విజేతలు:

మొదటి బహుమతి:  రంగ పిన్ని ఆకాశం – సాయి పద్మ (విశాఖపట్టణం)

రెండో బహుమతి:  గజల్ – రఘు మందాటి  (హైదరాబాద్)

మూడో బహుమతి:  గులాబి ముల్లు – విజయ్ ప్రసాద్ కోపల్లె (కర్నూల్)

 

కవితలపోటీలవిజేతలు:

మొదటి బహుమతి:  కొన్ని రోజుల తర్వాత – నాగరాజు అవ్వారి (గిద్దలూర్)

రెండో బహుమతి: ఈ రాత్రి  – నిషిగంధ (ఫ్లోరిడా)

మూడో బహుమతి:  బాల్యం తిరిగొచ్చింది – ప్రసూన రవీంద్రన్  (హైదరాబాద్)

 

ఫోటో కవితలపోటీల విజేతలు:

మొదటి బహుమతి:  వలని వలచిన వాళ్ళు –  కె.వి.వి.డి.రావు (విశాఖపట్టణం)

రెండో బహుమతి:  పెద్ద సిక్కే పడిందయ్యా! – ఆర్.దమయంతి (నార్త్ కెరోలినా)

మూడో బహుమతి:  ఆశా దీపాలు – వెంకట శాస్త్రి చిలుకూరు  (డల్లాస్)

 

ఛందస్సుతో కూడిన పద్యాలపోటీల విజేతలు:

మొదటి బహుమతి:  తెలుగు భాషకు ‘విజయ’ వత్సరం – రామ మోహన్ అందవోలు (హైదరాబాద్)

రెండో బహుమతి:  పద్యాలు – గరికిపాటి వెంకట సుబ్బావధాని (విజయవాడ)

మూడో బహుమతి:  విశ్వ విజేత – విద్యాసాగర్ అందవోలు (డల్లాస్)

 

 

Download PDF

12 Comments

  • అందరికి అభినందనలు

    నాకు తెలిసిన వారి పేర్లు
    సాయి పద్మ
    నాగరాజు అవ్వారి
    నిషిగంధ

    వీరికి ప్రత్యేక అభినందనలు

    • జాన్ హైడ్ కనుమూరి says:

      – రఘు మందాటి (హైదరాబాద్) koodaa

  • సాయి పద్మ, రఘుమందాటి… ఇంకా అక్షర నేస్తాలైన నాట్స్ పోటీ విజేతలందరికీ అభినందనలు

  • పున్నమరాజు says:

    విశ్వవిజేతలందరికీ అభినందనలు !!!

  • G.S.Lakshmi says:

    అందరికీ అభినందనలు..

  • jabalimuni says:

    విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న సాహిత్యాభిలాషులకు నా అభినందనలు

  • విజేతలందరికీ అభినందనలు

  • విజేతలందరికీ హృదయపూర్వకమైన అభినందనలు ! అనేక దేశాల నుంచి కథలూ,కవితలూ వచ్చి వుంటాయి కనుక రచనల్లో మంచి వైవిధ్యం ఉంటుందని ఊహిస్తూ వాటిని చదివే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.

  • రమాసుందరి says:

    విజేతలందరికీ అభినందనలు

  • Garimella Nageswararao says:

    విజేతలకి అభినందనలు, కార్య నిర్వాహకుల అభిరుచి కి సాహిత్య సేవకి వందనాలు

  • Narayana Garimella says:

    పద్యాలు, ఫోటొ కవితల పోటీలు కూడా కలిసి నాట్స్ వారి తెలుగుభాషాభిమానాన్ని చెప్పకనే చెప్పాయి. విజేతలకు అభినందనలు.

    నారాయణ గరిమెళ్ళ.

  • ఏ దేశంలో ఉన్నా, ఏమి చేస్తున్నా తల్లి భాషని మరచిపోకుండా ఆ భాషా సంస్కృతుల్ని కాపాడడానికి నాట్స్ చేస్తున్న కృషికి అభినందనలు

Leave a Reply to జాన్ హైడ్ కనుమూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)