ఎంత సేపు…?

 Photo Garimella Narayana

ఇబ్బంది పెట్టాలంటే ఎంత సేపు…?

ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా..సరే

 

చెప్పు-రాయి

చెవి-జోరీగ

కాలి-ముల్లు

కంటి-నలుసు

ఉండనే ఉన్నాయిగా

అల్పంగా…

 

అల్పాతి  అల్పంగా

అలోచించి పారేస్తే

జిడ్డు బుర్రకి సైతం

తట్టక ఛస్తుందా

ఇబ్బంది పెట్టే ఆలోచనా…?

 

బురద చల్లాలంటే ఎంత సేపు?

 

పంది విదిలించినట్టు

గేదె తోక విసిరినట్టు

జలగ పాకినట్టు

బాతు ముక్కు బుక్క పెట్టి

ఉమ్మేసినట్టు…

 

పాతాళంలోకి కూరుకుపోయే

ఆలోచనలతో కుచించుకుపోతే

బురదేసే కళ

అదే వచ్చేస్తుంది..

 

అందుకే

దయచేసి

ఇబ్బందుల బురదల

ఇంగితం లేనోళ్ళు చేసే

సులువైన వాటిని

కండలు పెంచాలనుకుంటున్న

కాగడాలకు చెప్పి

అవమానించకండి…

 

Download PDF

5 Comments

  • మీ రచనలని చదివే అలవాటుంది నారాయణగారూ..ఈ కవిత బావుంది కానీ ఇంకా సాధనలో చెక్కొచ్చు అనిపించింది. రాస్తూ ఉండండి. అభినందనలు

  • రవి says:

    నరేన్,
    పోయెమ్ బాగుంది. “బాతు ముక్కు బుక్క పెట్టి” భలే ఉంది :-)
    అభినందనలు,

    -రవి

  • Garimella nageswararao says:

    బాగుంది నారాయణా.. అభినందనలు

  • Narayana says:

    తమ అభినందనలను/అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులకు పేరు పేరునా
    ధన్యవాదాలు.

    నారాయణ.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)