శిశిరానంతర వేళ ..!

DSC_1454 

మంచి కథలకు హామీ ఇస్తున్న కొత్త రచయిత్రి సాయి పద్మ. లేటుగా రాయడం మొదలుపెట్టినా లేటెస్టుగా రాస్తున్న రచయిత్రి కూడా. మార్చి 10, 1972లో పుట్టారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం సొంత ప్రాంతం. సామాజిక కార్యకర్తగా చరుగ్గా పనిచేస్తున్నారు. ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు నడుపుతున్నారు. భర్త ప్రజ్ఞానంద్‌తో కలసి వికలాంగులు, వృద్ధుల కోసం గ్లోబల్‌ఎయిడ్‌ అనే సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు కథలు రాశారు. మొదటి కథ ‘వైదేహీ మైధిలీయం’ ఈ ఏడాదిలోనే ‘కౌముది’లో ప్రచురితమైంది. రెండో కథ ‘రంగం పిన్ని ఆకాశం’ నాట్స్‌ బహుమతి పొందింది. మూడో కథ ఇదిగో -ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రచురితమైంది. గొప్ప ప్రామిసింగ్‌ రైటర్‌గా సాయిపద్మ ఎదుగుతోందనడానికి ఈ కథ ప్రత్యక్ష ఉదాహరణ.—వేంపల్లె షరీఫ్

***

మా సుందరం ఉన్నాడే , ఒకలాంటి వాడు కాడు. రెండు గంటల నుండీ వాడి కోసం వెయిట్ చేస్తున్నానా … వస్తాడు, తీయగా ఒక నవ్వు నవ్వి ఏదో లాజికల్ గా చెప్తాడు. నేనప్పుడు చల్ల బడి పోతాను. సుందరం గొప్పవాడు అనటంలో సందేహం లేదు . పోలియో చిన్నప్పుడే సోకింది సుందరాన్ని. ఒక కాలు ఈడ్చుకుంటూ నడుస్తాడు, వీలైనంత తన నడకని కవర్ చేస్తాడు కూడా. “ఒరే సత్తిగా .. మనం కాళ్ళీడ్చినా.. మన బ్రతుకు ఈడ్చినట్టు ఉండకుండా చూసుకోవాలిరా ..!!” అంటాడు .. ఆ సమయంలో నిజం చెప్పాలంటే వాడు నాకు గీతాచార్యుడే.

సుందరం తండ్రి చిన్నప్పుడే తాగి తాగి పోయాడు. –“పేరుకి పెద్ద బేమ్మర్ల కుటుంబమే గానీ , ఎవరూ ఏ కాపర్సూ విదల్చలేదోయ్” అంటాడు వాడు నవ్వుతూ..! వీడ్ని పెంచటానికి వీళ్ళమ్మ …సోమిదేవమ్మ పడని కష్టం లేదు . చాలా మంది ఇళ్ళల్లో వంట చేసింది . గుళ్ళో ప్రసాదాలు తినేవాళ్ళు తల్లీ కొడుకూ చాలా సార్లు. కానీ, కొడుకు చదువు ఎక్కడా ఆగనివ్వలేదు. వాడికి కావలసిన జోళ్ళ కోసం , ఒక డాక్టర్ గారి ఇంటిలో పనికి వొప్పుకొని, చేయించింది.  మా సుందరం గాడు కూడా , ఒక్క సంవత్సరం కూడా ఫెయిల్ కాకుండా చకా చకా చదివేశాడు. ఉద్యోగం కూడా అలాగే, మేము ఇంకా పైకి, పైపైకి చదవాలా, ఏం చేయాలి అన్నప్పుడు .. అప్పుడే సిటీ అవుతున్న మా వూళ్ళో వేళ్ళూనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థ లో ఉద్యోగం సంపాదించాడు. వికలాంగ కోటాలో ఉద్యోగం వచ్చినా , ఎప్పుడూ రిలాక్స్ కాలేదు. ” అమ్మ చాలా కష్టపడిందిరా .. నా బ్రతుకు పరుగు తీయాలని .. తను నిమిషం, నిమిషం కాలం ఈడ్చింది ..” అనేవాడు. వాడి తెలివితేటలకి అక్కడ మనుషులు వాళ్ళ అవసరాలూ, బలహీనతలూ కూడా దాసోహం అన్నాయి సహజంగానే . కొంచంగా మొదలై వాడి ప్రస్థానం అంచెలంచలుగా ఎదిగింది. తల్లి చేత పని మాన్పించేసాడు. మా సుందరం గొప్పవాడు కాడు అంటే అందుకే వొప్పుకోను నేను .

అదిగో వస్తున్నాడు .. కాళ్ళీడ్చుకుంటూ ..ఉత్సాహంగా .. గట్టిగా అడుగుదాం అని డిసైడ్ అయ్యా నేను ..” ఏరా.. రెండు గంటల నుండీ వెయిటింగ్ ఇక్కడ .. మళ్ళీ అక్కడికేనా ??’- వాడి మొహంలో ఇరవై ఏడేళ్ళ యవ్వనపు గర్వపు అతిశయం .. ” అవునోయ్ మై డియర్ సత్తీ ..: చెప్పాడు వాడు. ఎన్నో తీరని కాంక్షలని తీరాలని దాటించి , సగర్వంగా ఉన్న వాడి మొహం చూస్తే .. గట్టిగా అడగాలని అనిపించలేదు నాకు. మెత్తపడుతూ.. ” అలా  తరచుగా అలాంటి చోటుకి వెళ్ళటం .. మంచిది కాదేమోరా .. ఆలోచించు ”

ఒక నిమిషం ఆగి చెప్పాడు వాడు – ” నిజమేరా… కానీ కరుణ అలాంటిది కాదు.. నాకు మంచి .. ” వాడింకా ఏదో చెప్పబోయేంతలో , నాకు ఒక అసహనం ముంచుకొచ్చింది.. ” సాని దాని దగ్గర నువ్వు సంసారం ఎలా చేయాలో తెలుసుకోనక్కరలేదురా వొరేయ్ .. అలాంటి కబుర్లు చెప్పకు .. పెళ్లి చేసుకుంటావు కదా .. ఈలోగా .. ఇవన్నీ అవసరమా .. ఏదన్నా జబ్బు లాంటిదేదన్నా తగులుకుంటే .. చావాలి మళ్ళీ.. ఆలోచించు .. కాదు అసలింక అక్కడికెళ్ళటం మానేయ్ ..!” తిరుగులేనట్టు చెప్పాను నేను.. ఎన్ని వాదించినా , నా మాట , అపేక్ష, ప్రేమ అంటే వాడికి గురి అని నాకు తెలుసు .. !!

” కానీ కరుణ కి .. అలాంటి జబ్బులు లేవురా .. !!” ఇంకా ఏదో చెప్పాలనుకున్న వాడి ఉత్సాహానికి నా చూపు ఆనకట్ట వేసింది .

” అవన్నీ అనవసరం అబ్బాయి…. ఓకే.. మీ అమ్మ చూసిన సంబంధాలలో పెద్దింటి అమ్మాయిలకి నీ ఉద్యోగం నచ్చింది , కానీ నీ అవిటితనం నచ్చలేదు .ఇప్పటికి రెండు సంబంధాలు అదే కారణం మీద తప్పిపోయాయి అని నువ్వే చెప్పావు .  పెళ్లి, కుటుంబం అవసరం ఉన్న ఒక అనాధని తెచ్చి పెళ్లి చేసుకో .. నిజానికి అంత ఉద్యోగం చేస్తున్నావు ..ఎవరికి ఏం కావాలో క్షణాల మీద ఎరేంజ్ చేస్తావు.. వాళ్లకి కావలసింది ఇచ్చి , నీకు కావలసినవి నువ్వు తీసుకోలేవూ .. మనం అనాధ శరణాలయానికి వెళ్తున్నాం .. అక్కడ ఒక పిల్లని సెలక్ట్ చేస్తున్నాం ” మళ్ళీ నా మాట అనబడే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాను.

రెండు నెలలలో మా వల్లంపాటి సోమ సుందరం పెళ్లి ప్రసన్న కేర్ అఫ్ అనాధ శరణాలయం తో జరిగిపోయింది. మా సుందరం సెటిల్ అయ్యాడు మొత్తానికి.

***

 సుందరం గారి కోసం వెయిట్ చేయాలంటే విసుగ్గా ఉంటుంది. నిజానికి నాకైతే సుందరం గాడు అనాలనిపిస్తోంది అనుకోండి. అలా అనకూడదు, అనాధ శరణాలయపు అమ్మాయిని నన్ను ఎంచుకొని,దయతో తాళి కట్టాడు కదా నాకు.. ఆ… కట్టేడు లెద్దూ , గట్టిగా రెండు తులాల తాడు కూడా చేయించలేదు . ప్రసన్న సున్నితం, సున్నితం అనుకుంటూ , తల్లీ కొడుకూ ఎలాగైతేనేం , తులం బంగారంతో కానిచ్చేసారు. సర్లే , చేసుకున్నాక అంతా నాదే కదా అని ఊరుకున్నా.. !

అదిగో సుందరం గాడు వస్తూనే ఉన్నాడు.. కుంటుకుంటూ .. అదే నచ్చదు నాకు. మా ఆశ్రమంలో ఉన్న కుంటోడు రాజు గుర్తొస్తాడు. నేను తెల్లగా ఉన్నానని ఒకటే లైన్ వేసేవాడు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందని .. వాడ్ని చేసుకుంటే నాకేం వస్తుంది ?? కొంచం మర్యాదగా , చాలా నిర్మొహమాటంగానే వాడికి చెప్పాను ఆ మాట .. వింటేనా … మా శరణాలయం మాస్టారితో కూడా మాట్లాడాడు . ఈ కుంటోడికి ఏం చూసుకొని ఇంత గర్వం? నాలాంటి అందగత్తెకి ఇలాంటి వాళ్ళు ఎలా సరిపోతారని అనుకుంటారో అర్ధం కాదు. మాస్టారికి అదే చెప్పాను . సార్… నాకున్నది అందం ఒక్కటే, నేను ఇలా ఇక్కడే ఉండి, ఇక్కడే పెళ్లి చేసుకొని ఉండాలని లేదు. నాకు నా అందం ఇచ్చే ప్రతీ సౌకర్యం కావాలి… అని చెప్పేసాను . చాలా వింతగా చూసాడు ఆయన. చూస్తే చూడనీ .. రాజు గాడి బెడద నాకు వదిలించారు మరి వాడికి ఏం చెప్పారో ..! అదే మాస్టారు ముభావంగా చెప్పారు-“ ఇదిగో ప్రసన్నా, ఆ అబ్బాయి నిన్ను ఇష్టపడ్డాడు. నీ కలలో కూడా నువ్వు ఊహించని ఉద్యోగం, డబ్బు ఉన్నవాడు. మరి ఈ సారికి నీ లెక్కలతో ఎక్కువ నాన్చకుండా ఏదో ఒకటి తేల్చుకో, కానీ ఒకటే చెప్పగలను , అదృష్టం అందమైన శరీరాలలో లేదు , అందమైన మనస్సులో ఉంటుంది .. ఫలితం నువ్వు ఎంచుకున్నదాన్ని బట్టే ఉంటుంది. “- అంటూ ఇలా చాలా సేపు చెప్పారు. ఏదో ఒకటి, ఇక్కడ నుండి వెళ్ళచ్చు. అయినా మనసు, ప్రేమ అనుకుంటూ కూర్చుంటే , జీవితం, యవ్వనం, ఐసు పుల్లలా కరిగిపోతాయి, తర్వాత మొహం చూసే వాళ్ళు ఉండరు. సరే అన్నాను పెళ్ళికి. రాజు గాడికి ఈ విషయం తెలీకుండా  ఉంటే బాగుండును. లేకపోతే వాడ్ని కాదని ఇంకో కుంటి వాడ్ని చేసుకున్నానని వెటకారం చేసేవాడు.

” ప్రసూ.. ప్రసూ ” అంటూ వచ్చాడు సుందరం. సరిగ్గా నడవటం రానివాడికి పిలవటం ఏం వస్తుందిలే .. బలవంతాన నవ్వు పులుముకున్నా. మనం ఏది వద్దు అనుకుంటే అదే వెంట పడుతుంది ఎందుకో .. ఈ కుంటితనం నాకెంత అసహ్యమో , అదే తాళి అయి గుండెల మీద వేళ్ళాడటం కంటే జీవితంలో విచిత్రం ఉండదు .

” నేను లేనని దిగులుగా ఉందా ?” అడిగాడు సుందరం . నామొహం .. ఇంత త్వరగా వచ్చేసావేంటి? అనుకున్నా- అంటే ఇంకేమన్నా ఉందా .. ఇతన్ని వంచాల్సింది, మంచం దగ్గరే , కంచం దగ్గర మన పప్పులు ఉడకవు – అనుకుంటూ తల దించుకున్నా. ఇంత సిగ్గరి అయిన పెళ్ళాం దొరకడం అదృష్టం కదూ .. మావవుడికి, ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

పెళ్లి అయి సంవత్సరం అయింది . మొదటి రాత్రి పూర్తిగా సుందరం ఫెయిల్, అతన్ని నేను పాస్ అవనీలేదు. అతను నన్ను పూర్తిగా లొంగదీసుకున్నానని అనుకుంటే , అతని ఆధిపత్యం మొదలవుతుంది. దానికే ప్రేమ అని పేరు పెడతాడు. సుందరం తెలివైన మంచివాడు. అతని తెలివితేటల్ని, లాజిక్ ని పక్కన పెట్టేలా చేసి  .. మంచితనాన్ని, ఒక బలహీనతగా వాడుకోవాలి . అతని బలహీనతలు- తనలోని కామం, కోరిక , నన్ను ఇష్టపడటం. జీవితం సులభంగా దొరకదు అంటాడు సుందరం . మరి నాకు .. చాలీ చాలని ఆశ్రమజీవితం, వదిలేసిన బట్టలు, వాడేసి పేజీలు నలిపేసిన పుస్తకాలూ, నాకు మాత్రం ఈజీ గా దొరికిందా జీవితం ?

సుందరానికి శారీరక సుఖం అంటే ఇష్టం. అతనిలోని ప్రేమ ఉధృతి నాకు కూడా ఇష్టమే. కానీ , రెండు విషయాలు చికాకు పెడతాయి. అతని అవిటితనం, రెండోది నా అందానికి ఏ మాత్రం తగని అతను నన్ను అనుభవిస్తుంటే, నాకు దొరికిందేమిటి? నా లాభం ఏమిటి ? అనే ప్రశ్న నన్ను ఇబ్బంది పెడుతుంది. కావలసినంత డబ్బు ఇవ్వడు. ఇష్టం వచ్చినవి అన్నీ కొనుక్కోటానికి ఉండదు. దేవుడి దయ వల్ల మా అత్తగారు ఆమె ఉన్న వూరు వదిలి రాదు కాబట్టి , మేమిద్దరమే . ఏం చేసినా – ఈ మొదటి సంవత్సరాల లోనే చేయాలి . ఆశ్రమం లో చూడలేదూ.. అందం తగ్గిందని , నాగలక్ష్మి ని మళ్ళీ వాళ్ళాయన వదిలేస్తే , మళ్ళీ అక్కడే డేకురుతోంది అందరికీ వండి పెట్టుకుంటూ..!!

మొదటి రాత్రి అతనికి నేను సహకరించలేదు. తెలీక కాదు, పూర్తిగా తెలిసే…. ఒకళ్ళ బలహీనత ఎత్తి చూపటం ఎంత సేపు ..? మర్నాడు చాలా బాధ పడ్డాడు. సిగ్గు విడిచి తనకో వేశ్య తో పరిచయం ఉందని , అక్కడ ఆమెతో చాలా సుఖపడ్డానని , నేర్చుకున్నానని చెప్పాడు. దొరికావు గురూ అనుకున్నాను .. ఏడిచాను . బ్రతిమాలాడు. ఇంకెప్పుడూ పోను అని చెప్పాడు . ఏ ఉద్యోగం చేసినా, కింద తరగతి నుండి మధ్య తరగతికి ప్రమోట్ అయిన  మగవాడి ఆయువుపట్టు పరువు.  అనాధ పిల్లని తెచ్చి పెళ్లి చేసుకున్నా , వదిలేసింది అనే పేరు వస్తే సుందరం తట్టుకోలేడు అని నాకు తెలుసు. అందుకే బెట్టుగా కానిస్తున్నా సంసారం. డబ్బు ఇచ్చే సుఖం ముందు సుందరం ఇచ్చే సుఖం .. అతని కామన , కోరిక నాకు గుదిబండ లా తయారయాయి. ఆలోచిస్తుంటే, ఆరు నెలల క్రితం అతని కోరికని నాకు లాభంగా ఎలా మార్చుకోవాలో తట్టింది. ఏమీ లేదు.. సింపుల్ గా రేట్ పెట్టా అంతే .. ! ఈ ఆరు నెలల సంపాదన … రెండు లక్షలు , మూడు తులాల బంగారం . నా పేరిట ఒక డెభ్భై వేల ఫిక్స్డ్ డిపాజిట్. బాగుంది కదూ .. ! దీన్ని బట్టి సుందరం కోరిక తీవ్రత, అతని ప్రేమ అర్ధం చేసుకోండి. అన్నీ ప్రేమగానే మంచం దగ్గరే అడిగాను అనుకోండి.

బంగారు గుడ్లు పెట్టె బాతుని కోసుకొని తిన్నా కూడా మంచిదే . అది సరిగ్గా వర్క్ అవుట్ అయితే ..!!

అందుకే సుందరం విడాకులు అడగగానే మొదట ఆశ్చర్యం, తర్వాత ఆనందం వెల్లువలా వచ్చాయి. పడుకోడానికే మూల్యం చెల్లించినపుడు విడిపోడానికి … మంచి బేరం ! సరిగ్గానే అడిగాను వెలకట్టి. ఆఫీసులో లోన్ , తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను అన్నాడు .. కళ్ళల్లో నీళ్ళతో తను డబ్బు ఇచ్చాడు. మనసులో సంతోషంతో, ముఖంలో  ముభావంతో నేను మ్యూచువల్ విడాకుల కాగితాల మీద సంతకం చేసాను. చేసే ముందు ఒక గంట చెప్పాడు, సుందరం అతన్ని వదులుకోవటం వల్ల నేనేం కోల్పోతున్నానో .. !! సంఘం ,పరువు, ప్రేమ, తోడు వగైరా వగైరా . వినాలి మరి డబ్బు కదా ..!

మొదటి సారి నా అనాధ జీవితం నాకు నేర్పినదేమిటో అర్ధం అయింది. నాకు డబ్బుతో కూడిన స్వేచ్ఛ కావాలి. సుందరాన్ని పెళ్లి చేసుకొని నేను దానికి పునాది వేసాను. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగిరే పక్షిని.

సుందరం అనుకున్నంత చెడ్డవాడు కాడు. సుందరం గారు నా మాజీ భర్త.

***

 ఈ మధ్య పంతులు రావటం లేదు ఎందుకో.. ఎందుకేంటి పెళ్లి చేసుకున్నాడు కదా. సుందరం పంతులు అంటే నాకు భలే ఇష్టం. అతనితో పరిచయం కూడా విచిత్రంగా జరిగింది . ఒక నలుగురు ఫ్రెండ్స్ తో వచ్చాడు. కస్టమర్స్ వచ్చారు అంటే .. కాంతం అదే మా వ్యభిచార గృహ దెయ్యం అనబడే మేడం మమ్మల్ని పిలిచింది. వెళ్లాం అందరం . మధ్యలో కూర్చున్నాడు సుందరం. లేతగా ఉన్నాడు ఇక్కడేం పని? అనుకున్నా . పేర్లు చెప్పమన్నారు. నేను సుందరం వైపే చూస్తూ .. “ కరుణ’ అన్నాను . చప్పున నాలిక కరచుకున్నాను. మా దెయ్యం ఉరిమి చూసింది నావైపు . కస్టమర్ ఎవరొచ్చినా కరీనా అని చెప్పమంటుంది . దాని పిచ్చి గానీ , అది పెట్టుడు పేరు అని తెలీదూ.. వినేవాళ్ళకి .

నా పేరు వినగానే సుందరం తలెత్తి – “ నాకు ఈ అమ్మాయే కావాలి ‘ అన్నాడు .

అతన్నే చూస్తున్న నాకేం ఉంటుంది , అభ్యంతరం .. సరే అన్నాను . చేసిన ప్రతీ వెధవ పనికీ “ ప్రేమ ‘ అనే పేరు అడ్డేసుకొని , నన్ను వాడేసుకొని ఒక వెధవ ఇక్కడ అమ్మేసుకున్నాడు. అక్కడనుండీ ఏ తోవ ఎటు పోయినా ఉన్నవరకూ తిని బ్రతికితే చాలు అని ..రోజులు లేక్కేసుకొనే నాకు ..ఎవడైతే ఏంటి ? ఎక్కువ హింసించకుండా ఉంటే  చాలు. మా వూరి ప్రేమికుడే నా బ్రతుకుని , శరీరాన్ని అమ్మేసి .. ఆ విషయం మా అమ్మా నాన్నలకి తెలిసినా కిమ్మనకుండా ఉన్నప్పటి నుండీ .. నాకు మనుషుల మీద పెద్ద నమ్మకాలు గాని, మానవత్వం మీద మోజు గానీ లేవు .

గదిలోకి వెళ్లాం. జాకెట్ విప్పబోతుంటే “ వద్దు .. మీకిష్టమేనా .. మాట్లాడుకుందాం .. నాకు కొత్త” అన్నాడు సుందరం . అతని పేరు తర్వాత తెలిసింది లెండి .. పంతులూ అంటే నవ్వేడు. నా ఇష్టం అడగటం నిజంగా నాకు కొత్త. నా ప్రేమికుడు కూడా ఎప్పుడూ అడగలేదు . వాడెందుకు అడగలేదని .. అడగాలని కూడా నాకు తోచలేదు.

అలా మొదలైంది మా కధ. పంతులికి చాలా నేర్పించాను నేను. శరీరం ఏమిటో, ఎలా ప్రేమించాలో, ఆడదాని శరీరం ఏమిటో , ఎందుకో .. నా కస్టమర్ లే కదా నా యూనివర్సిటీ. సుందరం భలే చురుకైన వాడు సుమా.. ఇట్టే నేర్చుకుంటాడు. అది ప్రేమ అంటారో, మోహం అంటారో, దాహం అంటారో తెలీదు. తనకోసం నేను ఎదురుచూసే స్థాయి కి తీసుకొచ్చాడు. ఎంత సున్నితమైన వాడో .. మనిషంటే, మగాడంటే నేర్పించాడు . అనుభవానికీ సంగమానికీ కూడా తేడా ఏమిటో.. !

అదొక యోగం .. పెద్ద మాటలు చెప్తున్నాను కదూ.. నిజానికి , నా దగ్గర కొచ్చేసరికి పంతులికి తానేమిటో తెలీదు.. మగాడనే స్పృహ లేదు. ధ్యాసంతా తన కుంటితనం మీదే .. నెమ్మది నెమ్మది గా , అతనిలో స్వచ్చత, పసిపిల్లాడి లాంటి మనసు , కష్టాలను చూసి రాటు తేలినతనం, అయినా ఒక నెమ్మదితనం . నా గాయాలకు సానుభూతి లేపనం . నా శరీరం పచ్చిగా ఉంటె , పడుకోనిచ్చే వాడు. నన్నే అలా చూస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అతను వెళ్ళిపోయాక నా కళ్ళల్లో నీళ్ళు , మనసులో హాయి .. !

సుందరం  నన్నే అడిగేవాడు. నేను కూడా సుందరం రాగానే , తనకే అందుబాటులో ఉండేదాన్ని. అవొక అందమైన రోజులు. అస్థిరమైనవి. శాశ్వతం కాదు. కానీ ఆ క్షణాల అందం ముందు .. నేను అనుభవించిన నరకం బలాదూర్. అది ప్రేమ కాదు. సుందరం నాకు శాశ్వతం కాదు. కానీ ఆ నిమిషం, ఆ క్షణం నేను ఒక సమానమైన ఆడదాన్ని. వేశ్యని కాదు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందో నేను చెప్పలేను .

సుందరం వస్తే రేట్ తగ్గించమని దెబ్బలాడే దాన్ని . నా రేట్ నా చేతిలో లేకపోవటం గొప్ప దౌర్భాగ్యం . ఒకసారి అలానే ఏడిచాను. ఒక సాడిస్ట్ వెధవని గదిలోకి పంపింది కాంతం…గాయాలైపోయాయి,వాడి  పైశాచికత్వానికి పీలికలై ..రక్తపు చారికలైన వొళ్ళు. సుందరం కళ్ళల్లో నీళ్ళు. ఎన్ని .. ఆయింట్మెంట్ లు కొని తెచ్చి రాసాడో తెలీదు. రెండు రోజులు తనే వచ్చాడు కస్టమర్ లా.. నాకు మంచి స్నేహితుడు సుందరం.

సంబంధాలు కుదరనప్పుడు బాధ పడేవాడు. ఎన్ని మాట్లాడుకునేవాళ్ళమో.. నాకూ ప్రపంచానికీ కిటికీ సుందరం. అతని నుంచే చూసా నేను … మా ఊహల్ని.. బాధల్ని, ఆశల్ని నిరాశల్ని కూడా. నేనే చెప్పాను….కుటుంబం లాంటి ఎక్కువ రక్షణ వలయాలు లేని చోట నుండి పిల్లని తెచ్చి పెళ్లి చేసుకోమని. ఆమెకి తానే కుటుంబం ప్రేమ , తోడు నీడ అవగలడని. నిజమే తన ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు అన్నాడు. తెలీకుండా నాలో సుందరం అంటే అంత ప్రేమ ఏర్పడిందా ? నేను గమనించనేలేదు అనుకున్నా.

సుందరం పెళ్లి అయిపొయింది. నన్ను పిలవలేదు. పాపం పిలవలేడు. సుందరానికి సంసారం నేర్పిన మాస్తార్ని కదా .. మాస్టారు ఎప్పుడూ స్కూల్ లోనే ఉండాలి. స్టూడెంట్స్ కదా .. ఒక్కో దశ దాటి వెళ్తూ ఉండాలి.

పెళ్లి తర్వాత సుందరం రాలేదు. అర్ధం చేసుకోగలను.

సంవత్సరం తర్వాత అనుకుంటా .. ఒకరోజు సడెన్ గా  వచ్చాడు. ఎప్పుడూ ముటముట లాడే మొహంది కాంతం కూడా మనఃస్పూర్తిగా ఆహ్వానించింది సుందరాన్ని. వొళ్ళు చేస్తాడనుకున్న సుందరం కొంచం డల్ గా , నీరసంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు కరీనా .. అని అడిగాడు .. ఒక్క దెబ్బ వేయబోయి .. ఇద్దరం నవ్వుకున్నాం . మళ్ళీ పాతరోజుల్లా అనిపించింది.

” ఎలా ఉంది మీ ఆవిడ ?” అని అడిగాను..

” నన్ను పెళ్లి చేసుకుంటావా  కరుణా ?” సుందరం జవాబులా వినిపించే ప్రశ్న .

ఒకటే నవ్వాను. ” పెళ్ళాం వస్తే ఇంత మతి పోతుందా పంతులూ .. సానిదాన్ని నన్ను చేసుకోవటం ఏంటీ ?” నాకింకా నవ్వు ఆగటం లేదు .

” నిజమే అమ్మలూ.. తప్పే చేసాను. పెళ్లి చేసుకోవటం తప్పు. అంతకన్నా పెద్ద తప్పు నిన్ను చేసుకోక పోవటం .. అసలు మొదట్లో ఆ ఆలోచన రాకపోవటం . .! ” సుందరం మాటలకి, వాటిల్లో ఉన్న తీవ్రతకి నాకు నోట మాట రాలేదు.

” నేను అవిటి వాడ్ని. నువ్వు వేశ్యా వృత్తి లో ఉన్నావు. ఇలా తెలిసిన విషయాలు కాకుండా.. నన్ను చేసుకోవటానికి నీకు అభ్యంతరం ఏమన్నా ఉంటె చెప్పు .. !!”  పంతులు మాటల్లో అదే తీవ్రత.

” అలా అడిగితే … నేను పెళ్లి ..ఊహించలేదు ..!!” నా గొంతు లో వణుకు , గుండె వేగం తెలుస్తున్నాయి  నాకే .

కరుణా – మనం పెళ్లి చేసుకుందాం. శారీరక సుఖం కోసం మాత్రమే కాదు. కలిసి ఉండటం కోసం. గతంలో, నీ దగ్గరకి రావటం .. డబ్బులిచ్చి నీ శరీరాన్ని కొనుక్కోవటం ఎప్పుడూ తప్పు అనిపించలేదు. ప్రసన్న తో కలిసిన ప్రతీ నిమిషం వ్యభిచారం చేస్తుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఆమె గుండెల మీద తాళి .. ఆమెతో సుఖం కోసం నేను కట్టిన లైసెన్స్ లా .. ప్రతీ కలయికకీ .. నేను ఇచ్చే బహుమతులు తాకట్టు కి కట్టే వడ్డీ లా .. ఓహ్.. ఆ నరకం చెప్పలేను. నా కోరిక మీద నాకు అసహ్యం వేసేది .. ఆమె లేకుండా నేను ఉండలేనా .. ఇదేనా జీవితం. అనిపించేది. ముఖ్యంగా నగ్నమైన నా అవిటితనం తన కళ్ళల్లో నిద్ర లేపిన అసహ్యం తలచుకుంటే , ఆమెతో సుఖించినందుకు నామీద నాకే అసహ్యం వేసేది . నరకం చూసాను కరుణా ..

నువ్వు గుర్తు రాని క్షణం లేదు. ఆమె కి డబ్బు కావాలి. నేను, నా disability వద్దు. ధర్మేచ అర్ధేచ .. ఆమెకి అర్ధం అయినది కేవలం ఆర్దికమే అని తెలిసినప్పుడు.. అది  నాకు అర్ధం అయినప్పుడు… ఈ సంఘం, సాంప్రదాయం … వాటి కోసం నేను అణచుకున్న కాంక్షలు … ఈ బంధనాల తాళ్ళు ఒక్కసారి తెగిపోయి ఊపిరి తీసునట్టు అనిపించింది. ప్రసన్న కి కావలసిన డబ్బు, స్వేచ్చ ఇచ్చేసాను. నాకు కావలసిన అనురాగం, శాంతి, సంతోషం ఇవ్వగలవా ..???

అంత గొప్ప మాటకి నేనేం సమాధానం చెప్పగలను.. నిశ్శబ్దంగా నా ప్రేమ రాహిత్యాన్ని నెట్టేసిన  అతని  పాదాన్ని ముద్దెట్టుకోవటం తప్ప .

సుందరం అంత గొప్ప స్నేహితుడే కాదు, ప్రేమికుడు కూడా ..!!

***

నేనే సుందరాన్ని. చాలా రోజులు బ్రతుకు ఈడ్చాను. అమ్మ చెప్పిందని, పెళ్లి చేసుకుందామని పెళ్లి చూపుల్లో కూర్చున్నాను . వాళ్ళ చూపుల్లో నా హోదా మీద ఆశ, నా అవిటితనం మీద వెరపూ చూసాను. స్నేహితుని ప్రోద్బలంతో శరణాలయంలో ప్రసన్నని చూసాను. తల దించుకున్న ప్రసన్న  మోహంలో నా మీద అసహ్యం చూడలేనితనం మీద నా మీద నాకే అసహ్యం వేసింది. ఆమెతో సంసారం ఆమె చూపులనే కత్తుల తో, ఆమె కట్టే డబ్బు లెక్కలతో సహజీవనం అని అర్ధం అయ్యాక… నేనిలా జీవితాంతం బ్రతుకు ఈడ్చగలనా అని భయం వేసేది. నాకోసం నాకేం కావాలి? అని ప్రశ్నించుకుంటే, కరుణ చూపు రోజూ ఒక సజీవ జ్ఞాపకంలా వెంటాడేది. నేనెందుకు కరుణ ని అడగలేదు, ఈ ఆలోచన నాకెందుకు ముందు రాలేదు అని తిట్టుకున్నా, నా జీవితం నా చేతుల్లోకి తీసుకున్నాను . ఇంక తప్పదు ..! కరుణ ని అడగాలంటే సిగ్గు వేసింది… కానీ ఆమె చూపులోని ప్రేమ, సమానత్వం నాకు ధైర్యాన్ని ఇచ్చింది.

ఇన్నాళ్ళకి సంతోషానికి అర్ధం దొరికింది. సమాజం అవిటిది. స్వతస్సిద్ధ వికలాంగత్వం ఉంది దానిలో. దానికి నచ్చేలా ఉండాలని నా నడక కి ముసుగు వేసి, కష్టపడ్డాను. సమాజానికి లేని కరుణ .. నా కరుణ లో దొరికింది. నా నగ్నత్వానికి సిగ్గుపడని నా కరుణ తో కొత్త జీవితం .. నాలా ప్రారంభిస్తున్నాను. ఒక వేశ్య అయిన కరుణని పెళ్ళే చేసుకోవాలా? అని అడిగాడు నా స్నేహితుడు సత్తి . “ చేసుకోవాలి .. నా అవిటితనం నేనెలా తెచ్చి పెట్టుకోలేదో, వేశ్య అవుదామని తను కూడా అనుకోలేదు. ఆమె వ్యభిచారి అయితే, ప్రసన్నతో నేను చేసినదాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు.. కనీసం మనసున్నవాళ్ళు ..!” – నా జవాబుకి వాడి కళ్ళు చెమర్చటం నేను చూసాను. నా బాధ అర్ధం చేసుకున్న నా స్నేహితుడు నా శక్తి. నేను సుఖపడాలని తపించే అమ్మకి, నా సంతోషం ఎక్కడ ఉందో చెప్పగలిగే సామర్ధ్యం నాకుందని నాకు తెలుసు.

కరుణ మనసులోని సుందరం కోసం, కరుణ ప్రేమ కోసం నేను ఏమైనా చేయగలను అనుకోవటం ఎంత శక్తో తెలుస్తూనే ఉంది.నా జీవితం ఇంక కాళ్ళీడ్చుకుంటూ నడవదు… వీళ్ళ పనికిమాలిన రూల్స్ కి అందనంత వేగంతో పరుగు మొదలెడుతోంది. ఇంక నాకు తీరిక లేదు . నేను నాలా ఉండటం లో ఉన్న సంతోషం దేనికీ సాటి రాదు.

నేను నిజంగా తెలివైన మంచివాడ్ని అని నాకిప్పుడిప్పుడే నమ్మకం కలుగుతోంది  ….!!!!!

 

–సాయి పద్మ

 

 

 

 

 

Download PDF

50 Comments

  • స్వాతీ శ్రీపాద says:

    కదా బావుంది కధనం బాగుంది. కధలో ఫ్రాంక్నెస్ బాగుంది. కాని కదా చెప్పిన తీరు కొంచం సాగతీసిన రీతిగా…చివర సుందరం వర్షన్ లేకున్నా కధకేమీ తక్కువకాదు. నిజానికి కరుణ పాత్ర , ప్రసూన పాత్ర చాలు కధకు గొప్ప బిగువును ఇచ్చేందుకు . మంచి కధ

    • manibhushan says:

      అవును… అంతే.

    • సాయిపద్మ says:

      థేంక్ యు స్వాతి గారూ.. ఈ సారి కధనం కుదించే ప్రయత్నం చేస్తాను . ఎక్కువవుతోంది అనుకుంటూనే కొంచం ఎక్కువైంది

  • యాజి says:

    Really liked this story! You have finally arrived (in my world)! To be honest, I did not like your first two stories, because of utterly poor and stock characterizations. This one is brilliant! Each and every character is well written (including that of the friend) and have full grey scale sketches instead of black and white. I agree with Sharrif, stories like this will really mark your place! Please don’t revert :)

    • సాయిపద్మ says:

      Thank you so much siva garu.. thank you.

    • సాయి పద్మ గారు,

      గత సంవత్సరం నుంచీ మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ ధైర్యాన్ని, మీ అలోచనా ద్రుక్పదాన్నీ గమనిస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది మీ లాంటి వారితో స్నేహం పొందగలిగినందుకు,మిమ్మల్ని స్వయంగా కూడా కలిసే అవకాశం కలిగినదుకు మీలో ఉన్న మంచి రచయత్రిని వేంపల్లి షరీఫ్ గారు గుర్తించి ప్రోత్సహించడం, మీరు వెంటనే మంచి కథ రాయడానికి కష్టమైనా నిర్ణయించుకోవడం (ఇటువంటి కష్టంలోనే ఎంతో ఆనందం ఉంటుందని నాకూ తెలుసు).

      మీ భావాలను చాలా సూటిగా చెప్పగలిగే ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా!.
      మీ రచనలో నాకు నచ్చిన కొన్ని గొప్ప వాఖ్యాలు:
      మనం కాల్లీడ్చినా.. మన బ్రతుకు ఈడ్చినట్టు ఉండకూదాదు..!!
      నా బ్రతుకు పరుగు తీయాలని.. తను నిమిషం, నిమిషం కాలం ఈడ్చింది..” (అమ్మ గురించి)
      నాకు అందం ఇచ్చే ప్రతీ సౌకర్యం కావాలి..
      ఈ కుంటితనం నాకెంత అసహ్యమో, అదే తాళి అయి గుండెల మీద వేళ్ళాడటం కంటే జీవితంలో విచిత్రం ఉండదు…
      అతనకి కోరికని నాకు లాభంగా ఎలా మార్చుకోవాలో థత్తిన్ది. ఏమీ లెదు.. సింపుల్ గా రేట్ పెట్ట అంతే…!

      ఇటువంటివి వాఖ్యాలు ఇంకా చాలా ఉన్నాయి. భవిష్యత్తులో మీరు ఇలాంటి మంచి కథలు ఇంకా రాసి, సమాజ సేవతో పాటు సాహిత్య సేవ కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ..

      కందుకూరి రాము

      • సాయిపద్మ says:

        రాము గారూ.. థేంక్ యు . మీలాంటి మంచి మిత్రుల సహకారంతో రాసే ప్రయత్నం చేస్తాను. బట్ సేవ మాత్రం ముఖ్యం , ఇష్టం కూడా

  • manibhushan says:

    <> ఇవి సుందరం చెప్పిన ఆఖరి మాటలు.
    నిజానికీ కథలో సుందరం ఆది నుంచి అంతం వరకూ అల్లుకుపోయాడు. వేరుగా అతణ్ణి తీసుకురావల్సిన అవసరం లేదు. కానీ, ఓ వ్యధార్ధ జీవి తన పయనానికి మార్గం, తన బతుక్కి లక్ష్యం ఏర్పరచుకోవడానికి పైన చెప్పిన ఆఖరి మాటలు పునాదిని వేశాయి.
    సమాజంలో చాలా సమస్యలకు మూలం… మనం మనలా కాకుండా మరోలా ఉండాలని చేసే ప్రయత్న ఫలితాలే!

    మంచి కథ రాశారు సాయి పద్మగారూ, రాస్తూనే ఉండండి.

    • సాయిపద్మ says:

      థేంక్ యు మణి భూషణ్ గారూ . ఈసారి కధనం కొంచం కుదించే ప్రయత్నం చేస్తాను

  • ఒక అద్భుతం .

  • jagaddhatri says:

    కధనం బాగుంది ఇతివృత్తం కంటే … ఒక కధకురాలిగా ఎదిగే ప్రమాణం లో ఇంకా పరిణితి చెందాలని కధకురాలికి ఆశీస్సులు అభినందనలు ….ప్రేమతో జగతి

  • మీ మూడు కథల్లో నాకూ నచ్చిన కథ ఇది….షరీఫ్ గారన్నట్టు ఓ ప్రామిసింగ్ కథారచయిత్రిగా మీ ప్రస్థానం మొదలు. అభినందనలు

    • సాయిపద్మ says:

      థేంక్ యు శ్రీనివాస్ గారూ.. నా ప్రస్తానం వెనుక మీ ప్రోత్సాహం మరువలేనిది.

  • aparna says:

    కధ బాగుంది. ఇంకొంచెం కుదిస్తే అంటే…. బహుశా సుందరం వైపు వర్షన్ లేకపొయుంటే ఇంకా బావుండేదెమో అనిపించింది. మీరింకా బాగా వ్రాయగలరు.

    • సాయిపద్మ says:

      ప్రయత్నిస్తాను అపర్ణ గారూ .. మొదట సుందరం వెర్షన్ రాయలేదు . మళ్ళీ సరిగ్గా లేదేమో నని రాసేను ..

  • రంగం పిన్ని కి తనకంటూ అకాశం కావల్సివచ్చింది.
    ప్రసన్నకి సమాజం మంచి వైవాహిక జీవితంఅని నిర్దేశించిన ప్రమాణాలున్న జీవనం కావాల్సివచ్చింది.
    పంతులుకి తన అవిటితనాగుర్తించక , దానికి అతీతంగా ప్రేమించే మనిషి కావాల్సివచ్చింది.
    కరుణ కి తన సాని జీవితం నుంచి విముక్తినిచ్చే వైవాహిక జీవితం కావల్సివచ్చింది.
    వీరందరి జీవితాలనుండి అల్లుకుంటున్న ఒక నూలుపోగు కనపడటం లేదు..మీ కథలలో!?

  • సాయిపద్మ says:

    అవసరం నూలుపోగు మాత్రమే కదండీ .. బలమైన మోకు కూడా .. అది చెప్పకనే చెప్పాలనే ప్రయత్నం .. రాయటం అందునా తెలుగులో నాకు కొత్త .

  • మణి వడ్లమాని says:

    పద్మా! యెంత బాగా రాసావు! కాదు కాదు. మా కళ్ళకి చూపించావు ఒక బతుకు చిత్రాన్ని. ఇంక ఇంతకంటే చెప్పడానికి మాటలు దొరకటం లేదు. అంతగా కదిలించింది నీ కధ. wishing you all the best

  • Srikanth says:

    నేను కను రెప్ప కొట్టకుండా చదివిన మొదటి తెలుగు కథ

  • శోభ says:

    అవిటితనం సుందరానిది కాదు… మనసంతా అవిటితనం నింపుకున్న ప్రసన్నది.

    “అదృష్టం అందమైన శరీరాలలో లేదు, అందమైన మనస్సులో ఉంటుంది” ఈ ఒక్క వాక్యం చాలు కథ బలం అర్థమయ్యేందుకు.

    ఆపకుండా చదివించిందీ కథ సాయి పద్మ అక్కా…

    • సాయిపద్మ says:

      శోభమ్మా.. చాలా థేంక్ యు.. నీకు నచ్చినందుకు ..

  • Praveena says:

    ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను…ఇలాగే ఇంకెన్నో మంచి కధలు మీ దగ్గర నుంచీ వస్తాయని గ్యారంటి వచ్చేసింది నాకు.

    • సాయిపద్మ says:

      థేంక్ యు ప్రవీణా.. నువ్వు తోసి తోసి ఇచ్చిన ప్రోత్సాహం తక్కువేం కాదు ..

  • sujala says:

    మీ శిశిరాన్౦తర వేళ అన్న కథ చాలా చాలా బాగు౦ది. భావము, భాష రె౦డూ బాగున్నాయి. ప్రముఖులు చాలా మ౦దే చెప్పారు కాబట్టి నాక౦టూ చెప్పడానికి ఏమీలేదు రాదు కూడా . నాకైతే మీ ర౦గపిన్ని ఆకాశ౦ కన్నా ఈ కథ చాలా నచ్చి౦ది. అవిటితన౦ అన్నది మనసు కే కానీ శరీరానికి కాదని అ౦తర్గత౦గా బాగా చెప్పారు. ఇ౦కా ఇ౦కా మ౦చి కథలు రాయాలని, మీ లా౦టివాళ్ళు తెలుగు సాహిత్యాన్ని ము౦దుతర౦ వాళ్ళకు అ౦ది౦చాలని కోరుకు౦టూ, ఆశీర్వదిస్తూ,

    సుజల( అనూరాధ)

  • సాయిపద్మ says:

    థేంక్ యు సుజల గారూ .. రంగ పిన్ని , సుందరం రెండు సమాజాలకి ప్రతినిధులు. వాళ్ళని చుట్టుకుపోతున్న సమస్యలకి తోచిన పరిష్కారం వెతుక్కొనే లౌక్యులు అని అనుకుంటున్నాను . థేంక్ యు

  • కొంచెం ఆలశ్యంగా చదివితే ఇదే సమస్య అనుకుంటానండీ.. నేను చెప్పాలనుకున్నవన్నీ అందరూ ఇప్పటికే చెప్పేశారు.
    కధనం చాలా బావుంది.. అన్నిటికంటే భార్య వర్షన్ ఒక కరకు నిజాయితీగా చాలా బావుంది.. అసలు సుందరాన్ని మాట్లాడించకుండా వదిలేయాల్సింది.
    యెస్, నాక్కూడా మీ మూడు కధల్లో ఇది బాగా నచ్చింది :-)
    మీరు ఇంకా ముప్పై.. మూడొందలు… దాటేసి బోల్డన్ని మంచి కధలు.. మనలోని మనుషుల్ని చూపించే కధలు రాయాలని కోరుకుంటున్నాను.

    • సాయిపద్మ says:

      నిషి గారూ.. థేంక్ యు.. మొదట సుందరం వెర్షన్ లేదు . మళ్ళీ కన్వే అవదేమో అని రాసేను . ఇది ప్రింట్ లో వేస్తే కనుక తప్పకుండా తీసేస్తాను . థేంక్ యు

  • Dr.Ismail says:

    కాపీ & పేస్ట్>>>.. అసలు సుందరాన్ని మాట్లాడించకుండా వదిలేయాల్సింది.
    యెస్, నాక్కూడా మీ మూడు కధల్లో ఇది బాగా నచ్చింది :-)

    • సాయిపద్మ says:

      డాక్టర్ గారూ.. ఇక్కడ కూడా కాపీ పేస్టు
      థేంక్ యు.. మొదట సుందరం వెర్షన్ లేదు . మళ్ళీ కన్వే అవదేమో అని రాసేను . ఇది ప్రింట్ లో వేస్తే కనుక తప్పకుండా తీసేస్తాను . థేంక్ యు

  • బావుంది పద్మ గారూ. నాకు కూడా కధనం నచ్చింది ఎక్కువగా. సూటిగా, అవసరమైనంత మేరకే ఉండటం నచ్చింది.
    నేను కూడా పై ఇద్దరి నుండీ కాపీ & పేస్ట్…
    అసలు సుందరాన్ని మాట్లాడించకుండా వదిలేయాల్సింది.
    యెస్, నాక్కూడా మీ మూడు కధల్లో ఇది బాగా నచ్చింది :-)

  • సాయిపద్మ says:

    పద్మ గారూ.. కాపీ పేస్టు
    థేంక్ యు.. మొదట సుందరం వెర్షన్ లేదు . మళ్ళీ కన్వే అవదేమో అని రాసేను . ఇది ప్రింట్ లో వేస్తే కనుక తప్పకుండా తీసేస్తాను . థేంక్ యు

  • kollurusiva says:

    anta bagoledu

  • Dr. Md. Abdul Kaleem says:

    సాయి పద్మ గారు,

    మీ కథ, కథనం రెండూ బాగున్నాయి. కొందరు మిత్రులు చెప్పినట్లు సుందరం చేత మాట్లాడించడం తప్పు కాదు అని నా అభిప్రాయం. వ్యధలను అనుభవించిన వారి చేత చెప్పిస్తేనే కథకు సరైన అర్ధవంతమైన కథనం వస్తుంది. మంచి విషయాన్ని ఎన్నుకొన్నందుకు మీకు అభినందనలు. నిజానికి సుందరం వంటి వాళ్ళు అనేక మంది మన సమాజంలో ఉన్నారు. మీ కథా వ్యాసంగాన్ని కొనసాగించండి. మీలో రచయిత్రి ని గుర్తించి ప్రోస్తాహం ఇస్తున్న సారంగ వారికి కృతఙ్ఞతలు.

    • Dr. Md. Abdul Kaleem says:

      Sorry ప్రొస్తాహం కాదు ప్రోత్సాహం !! స్పెల్లింగ్ మిస్టేక్ !!

    • సాయి పద్మ says:

      కలీం గారూ.. ధన్యవాదాలు. మీ అభిమానానికి.

  • సాయిపద్మ గారు

    కథ నచ్చిందా ! బాగుందా ! అర్థంకాలేదు కానీ వెంటాడిందని చెప్పగలను.

    కథరాయటం రాదంటూనే
    శరీరిక వైకల్యం
    మానసిక వైకల్యం
    సామాజిక వైకల్యాలను చిత్రించారు.

    కొన్ని వాక్యాలను మీరేనా రాసింది అని ఆశ్చర్యాన్ని కలిగించినా, మీరే రాయగలరు అనిపించేలా వున్నాయి.

    అభినందనలు

    ఇలా రాస్తూ రాస్తూ త్వరలో ఒక సంకలనాన్ని తేవాలని ఎదురుచూస్తుంటాను

  • RammohanRao thummuri says:

    దాదాపు ఇరవై మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు.అయినా కథ చదివిన తర్వాత నాలుగు మాటలు రాయాలన్పించింది.
    సాధారణంగా బాగా చదివే అలవాటు ఉన్న వారికి మొదటి పరాగ్రాఫులోనే కథ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది.అక్కడ మార్కులు కొట్టేశారు.ఎందుకంటే ఒక పాత్ర స్వరూప స్వభావాలతో పాఠకుడి బుర్రలోకి దూర్చటమ్ అంత సుళువేం కాదు.
    రెండవది రచయిత్రిగా మీరుచెయ్యాల్సిన పరిచయాలు హాయిగా మీ పాత్రలే చేసుకున్నాయి.మూడు అలవోకగా కథ చెప్పినట్లుగా వుంది.నాలుగు కథాంశం లో కొత్తదనం ఉంది.ఐదు మీ ధైర్యానికి మెచ్చుకోవాలి ఎందుకంటే కొన్ని సున్నితమైనవిషయాలను నిర్భయంగా చెప్పారు.సీనియర్లు సైతం కొంచెం వెనుకా ముందాడుతారు.ఇక లెక్కపెట్టను.6,7అని.వాస్తవానికి దగ్గరగా ఉండడం
    ఏమిటంటే అనాథశరణాలయం నుంచి వచ్చినంత మాత్రాన మంచి కానక్కర్లేదు,daani కొంపలో ఉన్నంత మాత్రానచెడు కానక్కరలేదు,అలాగే అవిటివాడు హీరో కాకూడదని లేదు.కాని ఇది మూడో కథంటే నమ్మలేక పోతున్నా.ఎనీ హౌ కంగ్రాట్స్

    • సాయి పద్మ says:

      రామ్ మోహన్ రావు గారూ.. థేంక్ యు మీ అభిప్రాయానికి, అభినందనలకు. నేను వీలున్నంత వరకూ , జడ్జీ చేయకుండా రాసే ప్రయత్నం చేసాను. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది .

  • Kiran Kumar says:

    కరుణ గారు! మనం తట్టుకోలేని నగ్న సత్యం ఏమిటంటే, ఏదో చాలా కొద్ది మంది తప్ప మన జీవితం లో అడుగుపెట్టే ప్రతి ఒక్కరు మనతో వాళ్ళ relation వాళ్ళకి లభాదయకమా కాదా అని ప్రతి క్షణం లెక్కలు వేసుకుంటారు. కాని మనం బ్రతికేది ఆ కొద్ది మంది మన వాళ్ళ కోసం. మనకి తన మీద వున్నా నమ్మకం పోకూడదని దేవుడు అప్పుడప్పుడు అలంటి మంచి వాళ్ళని మన జీవితంలోకి పంపిస్తూ వుంటాడు. మీ కధ, శైలి చాల బావున్నాయి.

    • సాయి పద్మ says:

      అవును .. బాగా చెప్పారు . నిజమే .. ఎంతమంది తో అన్నా లెక్కలు వేసుకోవచ్చు కానీ .. కనీసం ఒక్కరి తో అన్నా బిజినెస్స్ కాకుండా బ్రతకాలనీ ప్రతీ వాళ్ళకీ ఉంటుంది అనుకుంటున్నాను .

  • ప్రదీప్ says:

    సాయిపద్మ గారు,
    ఇంతవరకు సారంగ లో కొన్ని కథలు చదివాను కాని ఏ కథ కి కూడా నా అభిప్రాయాలూ చెప్పలేదు. మీ కథ తోనే మొదలు పెడుతున్నాను :)
    మీ కథ లో నాకు మొదట నచ్చిన విషయం ఏంటంటే, నేను చదివిన కథల్లో , రచయిత్రి రాసిన కథల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న ఆడ క్యారెక్టర్ చాల తక్కువగా చూసాను . అంటే female characters ఎపుడు కూడా నెగటివ్ గానే ఉండాలని కాదు , కాని సమాజం లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని సూటిగా చెప్పడం నచ్చింది.
    ఇక పొతే నాకు ప్రసన్న character కూడా నచ్చింది (సహజంగా ఉంది ). ఎందుకంటే జీవితం లో డబ్బు వాళ్ళ కలిగే సుఖాలు అనుభవించని వాళ్లకి వాటిని అనుభవించాలని కోరిక కలగడం చాల సహజం . ఇక్కడ కూడా ప్రసన్న అలాగే కోరుకుంది . అనాధ గ ఉండడం వాళ్ళ తీరని కోరికల్ని సుందరాన్ని పెళ్లి చేసుకొని సుందరం ద్వారా తీర్చుకోవలనుకోవడం సహజంగానే తోచింది నాకు.
    సుందరం చేత మాట్లాడడం గురించి : నా మటుకు నాకు మొదటి 3 పేరా లు చదువుతున్నపుడు , వాళ్ళ వాళ్ళ స్వభావాలు మాత్రమె కనిపించాయి . సుందరం చేత చెప్పించినవేవి నా మనసుకి తట్టలేదు . ఉదాహరణకి “సమాజం అవిటిది. స్వతస్సిద్ధ వికలాంగత్వం ఉంది దానిలో. దానికి నచ్చేలా ఉండాలని నా నడక కి ముసుగు వేసి, కష్టపడ్డాను”, “ఆమె వ్యభిచారి అయితే, ప్రసన్నతో నేను చేసినదాన్ని కూడా వ్యభిచారం అనే అంటారు”, “నేను నాలా ఉండటం లో ఉన్న సంతోషం దేనికీ సాటి రాదు”. సుందరం చేత మాట్లాడిన్చకపోతే ఇవన్ని మిస్ అయ్యేవల్లమేమో అనిపిస్తుంది . ఇంకా చెప్పాలంటే నాకు ఆ చివరి పేరా కూడా బాగా నచ్చింది :)

  • సాయి పద్మ says:

    ప్రదీప్ గారూ.. మీ కామెంట్ తో కధ నిడివి, సుందరం తో మాట్లాడించటం అనవసరంగా చేసానేమో అనే ఫీలింగ్ తగ్గింది. చాలా ధన్యవాదాలు .

  • ananth mallavarapu says:

    సాయి పద్మ గారు,

    మీ “రంగ పిన్ని- ఆకాశం” కథ చదివిన తర్వాత, మీరు తప్పకుండా మరిన్ని గొప్ప కథలు వ్రాయగలరు అనిపించింది.
    అలాగే అంతకన్నా మెరుగైన కథ వ్రాశారు. మీరు కథ ఎలా ముగిస్తారు అనే విషయంలో, ఒక కథకురాలిగా మీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంటుందని నేను నమ్ముతాను! మీ కథలలో పాత్రల ద్వారా, మీరు నిర్భయంగా భావ వ్యక్తీకరణ చేయించే తీరు నాకు బాగా నచ్చుతుంది. మరిన్ని మంచి కథలు మీ కలం నుండి జాలువారాలని ఆశిస్తూ!

    • సాయి పద్మ says:

      అనంత్ గారు.. థేంక్ యు సో మచ్. ప్రయతినిస్తాను. మీ ప్రోత్సాహాన్ని మరువను

  • G.J.R. says:

    మెలోడ్రామా కొద్దిగా ఎక్కువయినా కథ రీడబిలిటీ బాగుంది.
    టెక్నికల్ గా కూడా పరిణితి అవసరం.
    – జి . జె . ఆర్.

    • సాయి పద్మ says:

      థేంక్ యు అండీ.. తప్పకుండా ప్రయత్నిస్తాను

Leave a Reply to G.J.R. Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)