నగ్నపాదాల కన్నీళ్లదే రంగు?

sudhakar

1

పాదాలను చూశావా
ముఖ్యంగా పసిపిల్లల పాదాలను
అలల్లా
అలల్లా కదులుతున్న లేత ఆకుల్లా
ముట్టుకుంటే రక్తం చిందేట్టు..

2

మరి వాళ్ళ పాదాలెందుకు పగుళ్ళు దేరి
నగ్నంగా
తీరని కలల్ని మోసుకు తిరుగుతూ

ఆకలి రథాన్నెక్కి
సరిహద్దులు దాటి సంచరిస్తున్న ఆ పాదాలను-
ఖండిత శిరస్సులుగా వేళాడుతున్న
ఆ నగ్నపాదాలను-
నువ్వు ఏ లేపనం పూసి ఓదార్చగలవు!

ఆ స్త్రీల పాదాలను చూశావా
సముద్రాల దుఃఖాన్ని తెరలు తెరలుగా
వెంటేసుకుని..
నిశబ్దాన్ని మోస్తున్న నల్లని ఆకాశంలా…

ఎడారి పొడితనాన్ని
నిబ్బరంగా ముద్దాడిన నిన్నటి ‘వజ్రపు పాదాలే’నా అవి!

ఇప్పుడిలా చతికిలబడుతూ
కాసింత దయనూ,జాలినీ కోరుకుంటూ..

మన తల్లుల పాదాలూ ఇంతే కదూ
చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకోరాదూ..

mandira1

3

పిడికెడు కూడు దొరకని ఈ దేశంలో
పరాయివాళ్లెవరో..
సొంతవాళ్లెవరో..
కడుపు నిండిన కుబేరుడే
దేశానికి తలగా వ్యవహరిస్తున్నప్పుడు-
ఆకలి కన్నీళ్ల విలువెంత?
కన్నీటి కెరటాల ముందు
జ్వలించే నేత్రాల్లా నిలబడి
ధైర్యాన్ని పిడికిళ్లలోకి ఎత్తుకుంటున్న వాళ్లెంతమంది?

ఆకలే ఈ దేశాన్ని పీడిస్తున్న
అతి పెద్దజబ్బు..

4

అందుకే..
స్పృశించు
పాదాలను స్పృశించు
సంచార మనుషుల హృదయక్షేత్రాల్లాంటి
తడి జ్ఞాపకాల్లాంటి
పాదముద్రల మీద
నీ తలనాన్చి
అనంతకాల సంవేదనను ఆలకించు

కనిపించే ప్రతీ నగ్నపాదానికి ఉయ్యాల కట్టి
ఊపిరితో జోలపాడు..
లేదూ-
పాదాలకు పోరాటాన్ని నేర్పుతానంటావా..?

(painting: Mandira Bhaduri)

Download PDF

20 Comments

  • నా కళ్ళను, అలోచనలను
    అబ్బురపరచాయి

    అభినందనలు

    • balasudhakarmouli says:

      jhaan hyd kanumoori gaaru… mee maatalu naaku ananthamyna sakthini koodadeesi- andistunnaayi… anndangaa vundi… mee kallaku , mee aalochanalaku – videyudini.

  • మెర్సీ మార్గరెట్ says:

    బాగుందండి మీ కవిత .
    /ఆకలే ఈ దేశాన్ని పీడిస్తున్న
    అతి పెద్దజబ్బు../ అంటూ నే నగ్నపాదాల కన్నీళ్లను చూపించారు .

    మందిర భాడురి గారి పెయింటింగ్ ఆకట్టుకుంది . అభినందనలు .

    • balasudhakarmouli says:

      morsi maargaret gaaru… mee protsaaha balaaniki krithagnudi….. mandira bhaduri gaari kunche jaarchina chitramaa- kavithaku kottha sowrabhamaa… నీ baa prakatanaku – johaarlu….

    • balasudhakarmouli says:

      morsi maargaret gaaru… mee protsaaha balaaniki krithagnudi….. mandira bhaduri gaari kunche jaarchina chitramaa- kavithaku kottha sowrabhamaa… నీ baava prakatanaku – johaarlu….

  • **ఆ స్త్రీల పాదాలను చూశావా
    సముద్రాల దుఃఖాన్ని తెరలు తెరలుగా
    వెంటేసుకుని..
    నిశబ్దాన్ని మోస్తున్న నల్లని ఆకాశంలా…**
    వర్ణన హృదయాన్ని తాకడం కాదు.. భావం తోటి తడిపేసింది..
    పాదాల నుండి హృదయాన్ని భావ తరంగాలతో పద పాద దృశ్యం గా మలిచారు
    చాలా బాగుంది మౌళి గారు

    • balasudhakarmouli says:

      jayashree naidu gaaru… mee prematho koodina kavithvaanubhootiki- kavitha patla మీ aapyaayathaku- aandhamtho krithagnathalu teliyajesukuntunnaanu….

  • Dr.Ismail says:

    Moving Poem.

    ***

    Another comment by:

    DR.BHARGAVPRASAD BATHULA says:

    July 18, 2013 at 1:53 am

    నగ్న పాదాల కన్నీళ దేరంగు..ఈ కవిత్వం చాల చాల బావుంది,కాస్త శ్రీ శ్రీ గారి కవిత్వం గుర్తు కొస్తుంది.కాని ఇంత మంచి భావన ఎవరి కొస్తుంది.బాగా నచ్చింది.

    • balasudhakarmouli says:

      Dr.ismail gaaroo… kavithanu chadivi naaku- marinni kavithalu raayadaaniki balam icchinanduku meeku dhanyavaadhaalu…. Dr.bhargavprasad gaaroo.. kavitvam patla mee aapeksha ku- nenu dhanyunni.

  • KALLA APPARAO says:

    adi kavitvama ,….brahmanundi puttina bavajalama kakanekadu adi sree sree aksharalu ane thutaluga peluthnna bavam adi hatsaf to mouli

  • కనిపించే ప్రతీ నగ్నపాదానికి ఉయ్యాల కట్టి
    ఊపిరితో జోలపాడు..
    లేదూ-
    పాదాలకు పోరాటాన్ని నేర్పుతానంటావా..?

    చాలా నచ్చింది మౌళి గారూ..

    • balasudhakarmouli says:

      KAVITHAKU YEDYATHE PRANABHOOTANGAA VUNTUNDHO- DAANINE MEERU COTE CHESTHAARU….. thanku varma gaarooo………

  • సాయి పద్మ says:

    అందుకే..
    స్పృశించు
    పాదాలను స్పృశించు
    సంచార మనుషుల హృదయక్షేత్రాల్లాంటి
    తడి జ్ఞాపకాల్లాంటి
    పాదముద్రల మీద
    నీ తలనాన్చి
    అనంతకాల సంవేదనను ఆలకించు… అద్భుతమైన కవిత .. ఒక చిన్నపిల్లాడి అమాయకత్వం.. ఒక తాత్వికతా సంవేదన ఉన్న కవిత .. మంచి కవిత రాసినందుకు అభినందనలు మౌళి గారూ

    • balasudhakarmouli says:

      thank u SAI PADMA gaaru… kavithanu chadivi- కవి అంతర్ముఖాన్నీ chadivaaru. mee maataku naaku chaalaa aandam vesindi. manalo BAALYAANNI kolponivvakoodadhu. bathikanantha kaalam- baalyapu thummedanu mana venukane thippukovaali.

  • reddi raamakrishna says:

    మౌళి ,మీ కవిత్వం లో అనుభూతి గాఢత పెరిగింది.కవిత చాలా బాగుంది.అభినందనలు

  • K.WILSONRAO says:

    పాదాలకు నగ్నత్వాన్నాడ్డటమే గాక దానికి పోరాటాన్ని నేర్పే సుధాకర్ గారు మీ భావుకతకు జోహార్.

    • balasudhakarmouli says:

      kavitvapu parama lakshyaanni .. varthamaanamlo kavitvapu dhyeyaanni marokasaari teliyajesinanduku- మీకు నా జోహార్లు…..

  • రవి says:

    లేత ఆకుల్లాంటి పాదాల దగ్గరినుండి పోరాడే పాదాల వరకూ, అన్ని పాదాలు అద్బుతంగా వచ్చాయి. కవిత చాలా బాగుంది. అభినందనలు!

Leave a Reply to Dr.Ismail Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)