తెలంగాణ సంస్కృతి, చరిత్రకు అద్దం ‘జిగర్‌’

jigar-title_336x190_scaled_cropp
jigar title
ఆగస్టు పదో తేదిన హైదరాబాద్‌లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో ‘జిగర్‌’`తెలంగాణ విశిష్ట కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఆ సంకలనం ప్రధాన సంపాదకులు -అనిశెట్టి రజిత గారితో ఇంటర్వ్యూ.
* ‘జిగర్‌’ తీసుకురావాలనే ఆలోచన ఎలా వచ్చింది?
రజిత:  తెలంగాణ ఉద్యమ సందర్భంగా వస్తున్న కవిత్వంలో జై తెలంగాణ, తెలంగాణ తల్లి, సకల జనుల సమ్మె లాంటి వాటి మీద ఎక్కువ కవిత్వం వచ్చింది. అయితే తెలంగాణ విశిష్టతల్ని, చారిత్రక కట్టడాలు, నదులు, పండుగలు, ఆచారాలు, సంస్కృతి, వైతాళికులు, జిల్లాల ప్రాశస్త్యం, చార్మినార్‌, గన్‌పార్క్‌ లాంటి ఘన వైభవ చరిత్రను రికార్డు చెయ్యాలనుకున్నాం. దానిలో భాగంగానే ఈ సంకలనాన్ని తీసుకువచ్చాం. ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం.
* కవిత్వ సేకరణలో మీరు నిర్దేశించుకున్న ప్రామాణికాలు ఏంటి?
రజిత: ముందు చెప్పినట్లుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోని విశిష్టతలు, వైతాళికులు, చారిత్రక ప్రదేశాలు, వాటి ప్రాశస్త్యం అన్నింటిని రికార్డు చేయాలని అనుకున్నాం. దానికి అనుగుణంగానే ఆ యా జిల్లాలకు చెందిన కవులను వాళ్ల జిల్లాలోని ప్రత్యేకతల మీద రాయమన్నాం. ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని, వరంగల్‌ రామప్ప ఇలా ప్రతి జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు, కట్టడాల మీద కవితలు కావాలని కోరాం. అలాగే కొమరం భీమ్‌, షేక్‌ బందగీ, పండుగ శాయన్న, చాకలి ఐలమ్మ, పోతన లాంటి తెలంగాణ వెలుగుల మీద కూడా కవిత్వముండాలని నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా సంకలనం చేశాం.
* కవిత్వ సేకరణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు?
రజిత: చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘జిగర్‌’ను నేను ఒంటరిగానే మొదలుపెట్టాను. ఈ పని చేస్తున్న క్రమంలో నలుగురు మిత్రులు కలిశారు. రెండు వందలమందికి పైగా కవుల నుండి కవిత్వాన్ని సేకరించడం కోసం ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం వేరే ఆలోచన, వేరే పని చేయకుండా అందరమూ కలిసి చాలా శ్రమ చేశాం. తెలంగాణ ఉద్యమం గురించే రెండు వందలకు పైగా కవితలు అందాయి. ‘విశిష్ట’ కవిత్వం తీసుకురావాలనుకున్నాం కాబట్టి ఒక్కొక్క రచయితతో మాట్లాడి మా ఉద్దేశ్యాన్ని వివరంగా చెప్పి కవిత్వాన్ని రాయించాం. ఈ సంకలనంలో సీనియర్‌ కవులతో పాటుగా ఇప్పుడిప్పుడే కవిత్వం రాస్తున్నవారూ ఉన్నారు. కొన్ని మొట్టమొదటి కవితలు కూడా ఉన్నాయి.
*మహిళా సంపాదకురాలిగా మీ అనుభవం ఎలా ఉంది?
రజిత: మహిళల సంపాదకత్వంలో కథా సంకలనాలు వచ్చాయి. కాని కవితా సంకలనం మహిళా సంపాదకత్వంలో రావడం ఇదే ప్రథమం. (ఫెమినిస్టు కవిత్వం మినహా) ఈ పుస్తకానికి నేను (అనిశెట్టి రజిత) ప్రధాన సంపాదకురాలిగా, కొమర్రాజు రామలక్ష్మి, కరిమిళ్ళ లావణ్య, భండారు విజయగ, గడ్డం పద్మాగౌడ్‌లు సంపాదకవర్గంగా కలిసి పనిచేశాం. మహిళల ఆధ్వర్యంలో ఈ సంకలనం రావడం మహిళా రచయితలకు స్ఫూర్తిని ప్రోత్సాహాన్నిస్తుందని భావిస్తున్నాను. ఒకనాడు మహిళలు రాసిన సాహిత్యానికి అంతగా ప్రాధాన్యత లేదు. అలాంటిది సంకలనాలు తీసుకొచ్చే స్థాయికి ఎదిగాం.
jigar back
* ‘జిగర్‌’ ముందుమాటలో ‘lamenting’/మర్సియా అనే పదాన్ని వాడుతూ రాసిన ముందు మాట గురించి చెప్పండి
రజిత: సంగిశెట్టి శ్రీనివాస్‌గారు మంచి మిత్రులు. ముందుమాటను త్వరగా సమగ్రంగా రాసిండ్రు. ‘రుద్రమ’ ప్రచురణలు పేరు పెట్టమని సూచించింది కూడా తనే. ఈ సూచన మహిళా సంపాదకులుగా మేం తీసుకు వస్తున్న రచనలకు ఈ పేరు సూచించడం స్త్రీలకు మనోబలాన్నిస్తుంది. lamenting  సాహిత్యం అనేది  ఎప్పటికీ ఉంటుంది. సమాజంలో వెతలు, బాధలు, కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణకు సీమాంధ్ర ఆధిపత్యం అన్న అదనపు దోపిడి రాష్ట్ర పునర్నిర్మాణం తర్వాత పోతుంది. కాని సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. సమ సమజాం వచ్చేవరకు సామాజిక ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. సాహిత్యం నిరంతరం వస్తూనే ఉంటుంది.
చివరగా… రుద్రమ ప్రచురణలు తరపున మరో పుస్తకం ‘ఉద్విగ్నాలు’ తీసుకువస్తున్నాం. పన్నెండు మంది మహిళల ఆధ్వర్యంలో దీన్ని తెస్తున్నాం. ఇందులో ఐదుగురు సంపాదక వర్గంలో ఉంటారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ తర్వాత దాని ఫలాలు అందరికీ అందాలని ఆశిస్తూ… ధన్యవాదాలు.
ఇంటర్వ్యూ: ఏశాల శ్రీనివాస్‌
Download PDF

3 Comments

 • buchireddy gangula says:

  రజిత గారికి నా సాల్యుట్స్
  జై తెలంగాణా — రంగు రుచి వాసన — ఉన్న రచయితల ను కాంగ్రెస్
  ప్రబుత్వం గుర్తించదు
  –ఎగుడు – దిగుడు మాటలు చెపుతూ —వేయి మంది కి పయిగా అమరవీరులు
  ఆత్మ బలిదానాలు చేసుకున్న — నాలుగున్నర గుండె కోతల చప్పుడు **జై తెలంగాణా
  అయినా జయ Shankar — వర వర గార్లు పుట్టిన జిల్లా వాసి అయిన అంపశయ్య Naveen
  గారు జై తెలంగాణా ను సమర్థించక పోవడం —శోచనీయం —
  ఎన్ని పుస్తకాలు రాస్తే ఏమిటి– ప్రజల గుండెల ను అర్థం చేసుకొని రాతలు దేనికి -ఎందుకు ??
  న్యాయం గా అల్లం రాజయ్య గారు– కాలువ మల్లయ్య గారు– పెద్దింటి Asoka కుమార్ గారు
  డాక్టర్ కేశవా రెడ్డి గారాలను ఎప్పుడో సాహితీ ప్రపంచం — కాంగ్రెస్ ప్రబుత్వం గుర్తించ వలిసే
  ఉండే
  (డాక్టర్ వి. Chandra శేఖర్ రావు –గారు కాశిబట్ల వేణుగోపాల్ గారు కూడా –వడ్డెర చండి దాస్ గారు
  యండమూరి గారు—ఉత్తమ నవలా రచయితలు )
  యీ దోపిడీ వ్యవస్థ లో అవార్డ్స్ –రివార్డ్స్ అంతా రాజకీయం –కాదా ??
  ————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 • jwalitha says:

  ”గాయాలే గేయలై ” అనే కవిత సంపుటి మహిళల సంపాదకత్వం లోనే తెలంగాణా ఉద్యమ నేపధ్యం లో వచ్చింది .
  అమ్రుతలత , రాజీవ ,జ్వలిత సంపాదకవర్గం . ముందు మాట ముదిగంటి సుజాతారెడ్డి రాసారు 2010లొ వచ్చింది ఇందులో అనిసెట్టి రజిత కవిత కూడా ఉంది శీనన్నా .. వీలయితే పుస్తకం చూడండి

 • buchireddy gangula says:

  నవీన్ గారి ఇంటర్వ్యూ లో —రచయిత అయిన వాడు ఏ ఒక్క విదానానికో — రాజకీయ పార్టి కో —అని చెప్పారు —వారు Nehru — Indira Gandhi –Rajiv గాంధీ ల అభిమాని —వారితో ఇండియా
  వెళ్ళినపుడు వాదించుకోవడం జరిగింది — ప్లస్ వారు నాకు రాసిన ఉత్తరాల్లో నిజం కనిపిస్తుంది –కావాలంటే పబ్లిష్ చేయగను —అ ఇంటర్వ్యూ కామెంట్స్ ను తొలిగించారు ??? కావున యిక్కడ
  రాయడం జరిగింది —
  దళిత శఖం లో–ఒబామా యుగం లో నిజం చెప్పడానికి -రాయడాని కి –భయం దేనికి ??పెన్ నేమ్ తో
  లైన్ క్రాస్ చేసి రాయడం తప్పు–
  మీ వెబ్ పత్రిక — మీ యిష్టం —ఏదో నా ఒపీనియన్
  ——————————
  బుచ్చి రెడ్డి గంగుల

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)