ప్రేమరాగం వింటావా!

kumar raja copy

“వర్షాకాలం వచ్చేస్తోంది! ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళ ప్రవేశించాయి . ఏరోజెైయినా, ఏ క్షణంలో అయినా మన నగరం లో ప్రవేశిస్తాయి” అని పేపర్లూ, టివీలు ఉదారగొట్టేస్తున్నాయి. జనం ఈ వేసవి ఏoడలు మరీ విపరీతం గా వున్నాయని చాలా అసహనంగా  వాపోతున్నారు.  దీనికి తగట్టు నీటి కొరత , కరెంట్ కట్టు, ఉక్కపోత  ఇక వీరి పాట్లు ఏమని చెప్పాలి ? అందుకే “వర్షాలు వచ్చేస్తున్నాయి” అనే వార్త కొచెం ఆనందాన్ని ఇస్తోంది. కానీ టివిల విపరీత ప్రచారం కొంచెం ఎబ్బెట్టుగా వుంది . ఇప్పుడు రుతుపవనాల ప్రభావం వల్ల చల్లగాలులు వీస్తున్నాయి . రాబోయే వర్షాన్ని అవి భరోసా ఇస్తున్నాయి.

అతనికి హైదరాబాద్ కొత్తేమికాదు. ఇంజనీరింగ్ ఇక్కడే చేసాడు. ట్రైనింగ్,ఉద్యోగాల కోసం వేరే నగరాలన్నీ తిరిగి మరల యిక్కడకు చేరుకొన్నాడు. చాలా రోజులు తరువాత సాయంత్రం నడకకోసం ఇలా పార్కుకు వచ్చాడు. చల్లగాలికి చెట్లన్నీ తలలు ఊపుతున్నయి, వర్షం రాకకోసం స్వాగతం పలుకుతున్నట్లు ఉంది. అతను నాలుగు  రౌండ్లు పాత్ వే  ఫై నడిచిన తరువాత,  ఎక్కడయినా కూర్చోవాలని బెంచీల కోసం వెతుకుతున్నాడు. ప్రేమికుల జంటలు చాలా కనిపిస్తున్నాయి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. మరికొంత మంది జంటలు భయం గా నడిచి వచ్చే వారి వైపు బెదురు చూపులు  చూస్తున్నారు. ఎవరైన తెలుసున్నవాళ్ళు కనిపిస్తారేమో అని భయం. కొందరైతే ఈలోకంలోనే లేరు, కలలలో తేలుతున్నారు.  ఇంతలో అదిగో ఆ మోదుగుపూల చెట్టు కింద బెంచీ కనిపించింది. కానీ ఓ అమ్మాయి ఒంటరిగా కుర్చుని ఉంది. ఇయర్ ఫోన్ లో  మ్యూజిక్ వింటోంది. కాలేజి అమ్మాయా? సాఫ్ట్ వేర్  ఇంజనీర్? ఏమో ఎవరికీ తెలుసు? చూడటానికి చక్కగా ఉంది . జీన్ ప్యాంటు , టీ షర్ట్ వేసుకొని  సింపుల్ గా ఉంది . పేపర్లో ఎదో రాస్తోంది. ఇప్పుడు ఏంచెయ్యాలి ? ’బెంచీ పెద్దగానే ఉంది. తను మరోచివర కుర్చోవచ్చు‘ అనుకొన్నాడు. తను ఎవరికోసమయినా ఎదురు చూస్తోoదా!  అతను వస్తే,  ఆమె ప్రక్కనే కూర్చుంటాడు, తరువాత కూడా ఇంకా ప్లీస్ వుంటుంది , అని తనలో తనే అనుకొంటూ ఆ బెంచీ మీద మరో చివర కూర్చున్నాడు . ఆమె చట్టుక్కున అతనివంక చూసింది . మరల తనపనిలో ములిగిపోయింది.

ఓ చల్లని గాలి తెమ్మెర సుడులుగా వచ్చి తనను తాకింది. మనస్సు ఆనందంగా వుంది . ఇన్నాళ కు ప్రకృతిలో చెట్లమద్య గాలి ని  గుండె నిండా పీల్చుకొన్నాడు. బెంచీ ఫై వెనక్కు వాలి కళ్ళు ముసుకొన్నాడు . చటుక్కున గుర్తుకు వచ్చింది ,  ఈ బెంచీ పైనే ఆ చివర ఓ అమ్మాయి కూర్చుందని . ఆమె వంక చూసాడు . ఆమె సీరియస్ గా గడులు నింపే ‘సుడోకు ‘ అనే ఆట ఆడుతోంది . ఇప్పుడు అతనికి ఆమె ఇంకా అందంగా కనిపిస్తోంది . మాట్లాడిస్తే బాగుంటుంది అనుకున్నాడు . ఆమె మ్యూజిక్ వింటోంది కదా అని , ఓ సారి పెన్ను ఇస్తారా అని సైగలతో చెప్పాడు . తన సైగలు చూసి నవ్వుకొంటూ పెన్ను ఇచ్చింది . నవ్వుతున్నప్పుడు ఆమె మొఖం ఇంకా వికసించింది . తనుకూడా తాను తెచ్చుకున్న పేపర్లో సుడోకు  ట్రై చేసాడు . ఆమె నవ్వుతూ ఇటీ  చూస్తోంది . తనకు హటాత్తు  గా  గుర్తుకువచ్చి, పెన్ను ఆమెకు ఇచ్చేసి థాంక్స్ చెప్పాడు . తను కూడా విష్ చేసింది . కొద్ది సేపు మాటలు లేవు . తను లేచి వెళ్ళిపోయింది . వీళ్ళకు మ్యూజిక్ వినడం , సుడోకు  ఆడటం మినహా వేరే పని ఉండదా  అని అనిపించిది .

తరువాత రోజు కూడా అతను పార్క్ కు వచ్చాడు. అక్కడ బెంచీ కాళీగా వుంది . బెంచీ మీద రాలిన రెండు ఎర్రని మోదుగు పూలు వున్నాయి . తను బెంచీ పైన ఓ చివర కుర్చుని ఓ పువ్వును చేతిలోనికి తీసుకున్నాడు . ‘ఎంత అందమైన ఎర్రరంగు ‘ అనుకొంటూ వాసన చూసాడు. ఏ వాసనా లేదు . ‘అరె ఈ అందమైన పువ్వు కు మంచి సువాసన కూడా వుంటే ఎంత బాగుండును ‘ అనుకున్నాడు . ఈసారి తను తెచ్చుకున్న పేపర్ పైన ‘సుడోకు‘ ఆడుతున్నాడు . కొద్దిసేపటికి ఆ అమ్మాయి వచ్చింది . నవ్వుతూ విష్ చేసింది , తాను కూడా విష్ చేసాడు . ఆమె చేవ్వుల్లో ఇయర్ ఫోన్ , ‘ఈమె అంత మ్యూజిక్ ప్యానా!’ అనుకొన్నాడు . అతని పేపర్ లో ఓ మూల కాగితం చింపి  దానిమీద రాసి ఆమెకు చూపించాడు ,”ఈరోజు మీరు లేట్“ అని. ఆమె చిరునవ్వు నవ్వింది. వేయిపువ్వులు వికసించినట్లుగా. రెండుమూడు రోజులు గడిచాయి. స్నేహం పెరిగింది. ఇద్దరూ కొంచెం దగ్గరయ్యారు . ఈ అమ్మాయి ఎప్పుడు  మ్యూజిక్ వినడం అతనికి విసుగనిపించింది . అతను పేపర్ అంచుఫై “మీరు వినే పాట, నేనుకుడా వినోచ్చా!” అని రాసి ఆమెకు చూపించాడు . ఆ అమ్మాయి నవ్వుతూ తన ఇయర్ ఫోను తీసి అతనికి ఇచ్చింది . తను పెట్టుకొన్నాడు , ఏమీ  వినపడలేదు. “కొంచెం ముందుకు నడపండి” అన్నాడు. ఆమె నవ్వింది . పేపర్ అంచున రాసింది “అందులో ఏమి లేదు “  అతను ఆశచర్యం తో “మరి ఏమి వింటున్నారు “ అన్నాడు . ఆమె తలదించుకోoది. మొఖంలో నీలి నీడలు , నెమ్మదిగా పెన్ను తీసుకొని రాసింది “నాకు మాటలు రావు, వినిపిoచదు కూడా“. అతను హతాసుడయ్యాడు. ఆశ్చర్యం నుంచి తెరుకోలేకపోయాడు .ఆమె మరల రాసింది “ నన్ను క్షమించండి !”. కొద్దిసేపు మానం , తరువాత ఆమె లేచి వెళ్ళిపోయింది .

తరువాతి రోజు అదేసమయానికి అతను అక్కడికి వచ్చాడు. అప్పటికే ఆమె కూర్చొని సుడోకు  పుర్తిచేస్తోంది . అతను ఆమె దగ్గరగా కర్చున్నాడు. ఆమె చిరునవ్వు నవ్వింది . అతను పేపర్ అంచున రాసి ఆమెకు చూపించాడు “క్షమించండి……కానీ మీ పాటను వినగలిగాను, తియ్యగావుంది , ఈరాగాన్ని ఎప్పుడు వింటూనే వుండాలనిపిస్తోంది “. ఆమె మొఖం వికసించింది. చల్లని గాలి బాగా వీచింది . యూకలిప్తుస్ ఆకులు వీళ్ళ మీద రాలాయి. రెండు మూడు పెద్ద నీటి చుక్కలు అతనిమీద పడ్డాయి . ఫైకి చుస్తే నల్లటి కారు మేఘాలు!. ఇద్దరూ లేచి తొందరగా నడుస్తూ షెల్టర్ వైపుకు వెళ్ళుతున్నారు . ఇప్పుడు వాళ్ళ చేతులు కలసి వున్నాయి . ఈ శ్రావన మాసపు మొదటి వర్షం జోరుగా ప్రారంభం య్యింది. రుతుపవనాలు నగరాన్ని ఆక్రమించాయి.

             15944_100443406646011_3087999_n — కూనపరాజు కుమార్ 

Download PDF

9 Comments

  • కొంచెం డ్రమెటిక్ గా వున్నా పాయింట్ బాగుంది. కాకపోతే కథనిండా అప్పుతచ్చులు. మొదటి పేరగ్రాఫులోనే ఏడు రాళ్ళు పంటికింద పడ్డాయి.

  • sreedhar parupalli says:

    కూనపరాజుగారి కథ బాగుంది. పనిలో పనిగా టీవీ చానెల్స్ రుతురాగాల మీద సెటయిర్లు వేసేశారు. మొత్తానికి కథలో అమ్మాయి,అబ్బాయి జీవితంలో నైరుతి ప్రవేశించింది. రుతురాగాలొకవంక, కుమార్ గారి అక్షర సరాగాలు మరోవైపు.

  • sreedhar parupalli says:

    తర్వాత రాసే కథల్లో లేదా ఈ కథ పునర్ముద్రణలో అక్షర దోషాలు పరిహరిస్తే బాగుంటుంది. ఇంత మాత్రం చేత కుమార్ గారు దోషేమీ కాదు.

  • Anil battula says:

    కథ మరియు మోహన్ గారి బొమ్మ , రెండు చాల బాగున్నై.

  • కధ బాగా ఉంది. అందరూ చెప్పినట్లు అచ్చు తప్పులే.. చూసుకోవాలి. సంపాదకులు చెప్తూనే ఉంటారు కదా..

  • editor says:

    “కాకపోతే కథనిండా అప్పుతచ్చులు. మొదటి పేరగ్రాఫులోనే ఏడు రాళ్ళు పంటికింద పడ్డాయి.” ధన్యవాదాలు, సత్యప్రసాద్ గారు.

    – రచయితలకు మరో సారి విజ్ఞప్తి

    దయచేసి మీ రచనల మేరకు మీరు అచ్చు తప్పులు లేని మంచి డ్రాఫ్ట్ పంపించాల్సిందిగా కోరుతున్నాము. అదే మీరు సారంగకి చేయగలిగిన గొప్ప సాయం.

    ఇక నించి టైపోలు వున్న డ్రాఫ్ట్ ని మేము కనీసం పరిశీలన కూడా చేయదలచుకోలేదు.

    – అఫ్సర్

  • aparna says:

    బావుంది!

  • padmaja says:

    కథ చాలా బాగుంది నిర్మలమైన సాయంకాలం లాంటి కథ

Leave a Reply to sreedhar parupalli Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)