“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

Sri hari - EPS

Sri hari - EPS

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి ఇంకా లేరు అంటే ఎలా నమ్మేది ?
శ్రీహరి గారిని మొదట చూసింది పరశురాం షూటింగ్ లో .

అప్పట్లో చిరంజీవి అంజి సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో ఒక ఫ్లోర్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది .  (అది దాదాపు గా ఆరేళ్ళు తీసారు ) నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ శ్యాం గారి ని కలవడానికి అన్నపూర్ణ కి వెళ్తూ ఉండేవాడిని .

అలా ఒక రోజు వెళుతూ ఉంటె , అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న భవంతి దగ్గర గోల గోల గా ఉండి చాల మంది గుమిగూడి ఉండటం చూసి బండి పక్కన పెట్టి చూడటానికి వెళ్తే , అక్కడ కనిపించారు శ్రీహరి .

అలా  చూస్తూ ఉండగానే చక చక ఆ భవంతి పైకి ఎక్కి రెండు గొడుగులు పట్టుకుని అకస్మాత్తుగా కిందకి దూకారు, ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం , ఆ తరవాత చప్పట్లతో మారు మోగిపోయింది ఆ ప్రదేశం .

నాకు ఆయనతో పరిచయం లేకపోవడం వల్ల నేను కూడా అందరితో పాటు చప్పట్లు కొట్టి అక్కడ నుంచి వచ్చేసాను .
తరవాత కొన్ని రోజులకి రచయితా / దర్శకుడు / నిర్మాత / నటుడు   పోసాని కృష్ణ మురళి గారిని ఒక స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు ఆయన చెప్పారు శ్రీహరి గారు ఆయనా ఒకే అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు అని.  నేను కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అయన నన్ను శ్రీహరి గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసారు . అలా శ్రీహరి గారిని మొదటి సరి కలవడం జరిగింది .  కాని అప్పుడు ఇంటర్వ్యూ లాంటిది ఏమి చెయ్యలేదు ఇద్దరికీ సమయం సరిగ్గా కుదరక .
ఆ తరవాత నేను అమెరికా వచ్చాక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం . మహానంది సినిమా విడుదల కి ముందు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను .  తరవాత అక్షర (శ్రీహరి గారి అమ్మాయి బాగా చిన్న వయసు లో పోయింది ) పేరు మీద తను గ్రామాన్ని దత్తత చేసుకున్నపుడు అభినందించడానికి ఫోన్ చేశాను .  ఆ తరవాత అంతగా ఫోన్ చెయ్యలెదు. ఈరోజు పొద్దున్నే ఫోన్ తో మెలకువ వచ్చి మెసేజ్ చూస్తె శ్రీహరి గారు లేరు అని వార్త .  కొంచం సేపు ఇది నిజం కాకపోతే ఎంత బాగుండును అన్న భావన .. అసలు నిజమే కాదేమో అన్న ఫీలింగ్ … ఈ లోపల ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ న్యూస్.
ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావా తమ్మి అని పిలిచే ఆ గొంతు మూగ పోయింది అంటే ఎలా నమ్మేది . ఒక భద్రాచలం, ఒక షేర్ ఖాన్ (మగధీర) , ఒక ప్రతినాయకుడు, ఒక రియల్ ఫైటర్ , ఒక మంచి మనిషి , ఒక మంచి స్నేహితుడు , వివాదాలు లేని వ్యక్తీ ,  అన్నిటికి మంచి ఒక మంచి మానవతావాది శ్రీహరి గారు . వారి ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ఈ తీర్చలేని లోటు నుండి తట్టుకునే ఆత్మ స్తైర్న్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్దిస్తూ .

- శ్రీ అట్లూరి

Download PDF

2 Comments

 • DrPBDVPrasad says:

  తెచ్చిపెట్టుకున్న నటన కాక పాత్రలో ఒదిగిపోతూనే తమదైన శైలి చూపించే అతి కొద్దిమంది మహానటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటూ మరో యశ్వి రంగారావు గారిలా మురిపించనున్నాడు అనుకొనే సమయంలో ఆకస్మిక మౄత్యువాత పడటం చాలా బాధాకరమైన విషయం .రియల్ స్టార్ శ్రీహరి ఆత్మకు శాంతి కలుగు గాక

 • buchireddy gangula says:

  మంచి వ్యక్తి —సినీ మిత్రుల అందరి నోట అదే మాట విన్నాను —
  అన్ని రకాల పాత్రల ను పోషిస్తూ —డాక్టర్ ప్రసాద్ గారు అన్నట్టు —మల్లి
  ఒక యశ్వి రంగా రావు — గా నిలిచి పోతా డు– అనుకునే సమయం లో — యిలా
  యింత చిన్న వయసులో —
  మంచి నటున్ని తెలుగు సినీ లోకం కోలి పోయింది —
  వారి ఆత్మ కు శాంతి కలుగాలని ప్రార్థిస్తూ —
  ఆటా తరుపున వారి కుటుంభానికి సంతాపం తెలియచేస్తూ —–
  ——————————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)