చీకటి దారి నడకలో…

విజయ్ కుమార్ ఎస్వీకె

విజయ్ కుమార్ ఎస్వీకె

జేబులో
కొన్ని
వెలుతురులు-

***

కలలో
నడకలా
దారంతా చీకటి-

గాఢత
నిండిన గాలీ
భయపెడ్తూ
చెవులు
కొరికేస్తూ-

నిశ్శబ్దంలో
మరో
నిశ్శభ్దాన్ని
మోస్తూ-

సాగే
కాళ్ళూ
ఆగేంత
కలవరం-

దూరం
తగ్గకా
దగ్గర
దగ్గరవకా-

గతం
ముందు బతుకూ
ఖాళీ మెదడులో
మూలన మెరిసీ
కనులు చిట్లీ
శవం మోస్తున్న
భావన-

***

జేబులో
కొన్ని
వెలుతురులు:

చీకటితో
పోరాటం
చేసీ చేసీ
వోడిపోయ్-

వెలుతురు
నడకా
క్రమంగా

చీకటై-

flower-22170-76253

ఇంకో కవిత:

కొన్ని వాన చినుకుల ముద్దు

 

వాన చినుకు
మట్టి వాసన
ఊపిరి పోసుకున్న
నేను-

దారంతా
కమ్ముకున్న మేఘం
మా యింటికి-

ఆనందించే
పెదవులు
కనుల్లో
తడి-

ఒక బొట్టు
నేల రాలిన
బంగారం-

ఆకాశం వంక
మొఖం
చినుకుల ముద్దు-
చినుకు తడి
నాలోకి
నేను చినుకులతో పాటూ
నేలలోకి-

-విజయ్ కుమార్ ఎస్వీకే

Download PDF

6 Comments

  • satya says:

    కొన్ని వాన చినుకుల ముద్దు
    నా మటుకు వాన గింజల సద్ది మూటలోని
    బువ్వ నీ దగ్గర
    వున్నటుంది,

  • vijay kumar svk says:

    థాంక్యూ గురూ…..

  • pusyami sagar says:

    జేబులో
    కొన్ని
    వెలుతురులు:

    చీకటితో
    పోరాటం
    చేసీ చేసీ
    వోడిపోయ్-

    చాల చక్కగా వివరించారు SVK గారు ..ఇలానే మంచి వి రాయాలని నా కోరిక …

  • చీకటితో
    పోరాటం
    చేసీ చేసీ
    వోడిపోయ్-

    వెలుతురు
    నడకా
    క్రమంగా

    చీకటై- బాగుంది

  • vijay kumar svk says:

    థాంక్యూ లక్ష్మణ్ స్వామీ సార్… :)

Leave a Reply to లక్ష్మణ్ స్వామి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)