ఒక హుషారు పూట

 

లాలస

లాలస


పసి పువ్వు పసి పువ్వూ తడుముకున్నట్లు ,మూడు నెలల పాపాయి పాల బుగ్గల మీద మూడేళ్ళ చిన్నారి చిరు ముద్దు- విలోమ సౌందర్యం కుప్పేసినట్లు ,నల్లటి నేల మీద రాలిన తెల్లటి పూల సొగసు- జ్ఞాపకం జ్ఞాపకంతో కరచాలనం చేసినట్లు,పాత పాటల వరుస కచేరీ- ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్లు , నిద్రకు స్వప్నం యక్షప్రశ్నలు -ఏమి జరుగుతుందో తెలీయనట్లు, వర్షానికీ  అంటిన తడి

 

ఒక ఉల్లాసపు మాట

 

అనంతాకాశం చూడాటానికి రెండే చిన్న కళ్ళు చాలు- కోటి నక్షత్రాలూ తళుక్కుమనేదీ వాటి నీలిమలోనే.- రెండు చిన్న కళ్ళున్న  అతని లేదా ఆమె అరి చేతి నుంచే మధ్యాహ్నం తన నాలుగు ముద్దలూ తింటుంది- ఒక గడ్డిపోచకు కిరణాల వెలుగు తగులుతుంది.- సముద్రం నుంచి నది వెనుతిరిగి ఎడారి తో స్నేహం చేస్తుంది- వూవొచ్చి సీతాకోకచిలుక మీద పూస్తుంది

45906960

ఒక దిగులు పాట

 

తోటలో వణుకుతున్న ఆకు లాంటి నిన్ను నువ్వు వెళ్ళి పట్టుకునేలోపు

గాలి ఎత్తుకు వెళ్ళిపోయింది.

పువ్వు మనసుకు ముల్లు పూచింది.

నిన్నా మొన్నల పలకరింపులో ఇవాళ అదృశ్యమైపోయింది.

– లాలస

చిత్రరచన: పికాసో

Download PDF

3 Comments

  • Sai Padma says:

    ఒక్కోసారి అనుకోకుండా దొరికిన కొన్ని వాక్యాలు , మనుషులు .. ఒక సంభ్రమం లో ముంచేస్తారు… అలాటి ఒక పసిపాప అమాయకత్వపు అచ్చెరువు లాలస కవిత్వం.
    కవిత్వానికి ఎడిటింగ్ , విపరీత వ్యాఖ్యానం అక్కర్లేని .. ఒక సహజత్వం లాలస కవిత్వం
    నేనొక ఇంటర్వ్యూ కోసం అడిగితే, లాలస రాసిన ఒక కవిత .. థేంక్ యు సో మచ్ డియర్ ..

  • kurmanath says:

    చక్కటి expression

  • V Ch Veerabhadrudu says:

    చాలా కాలం తరువాత లాలస కవిత చదివాను. లాలస చాలా భావుకురాలు. సున్నితమనస్కురాలు. ఆమె ఇంకా తన భావుకతని కాపాడుకుంటూ కవితలు రాస్తున్నదంటే ఈ లోకం మరీ అంత చెడ్డదేమీ కాదనిపిస్తోంది.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)