పసి పువ్వు పసి పువ్వూ తడుముకున్నట్లు ,మూడు నెలల పాపాయి పాల బుగ్గల మీద మూడేళ్ళ చిన్నారి చిరు ముద్దు- విలోమ సౌందర్యం కుప్పేసినట్లు ,నల్లటి నేల మీద రాలిన తెల్లటి పూల సొగసు- జ్ఞాపకం జ్ఞాపకంతో కరచాలనం చేసినట్లు,పాత పాటల వరుస కచేరీ- ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్లు , నిద్రకు స్వప్నం యక్షప్రశ్నలు -ఏమి జరుగుతుందో తెలీయనట్లు, వర్షానికీ అంటిన తడి
ఒక ఉల్లాసపు మాట
అనంతాకాశం చూడాటానికి రెండే చిన్న కళ్ళు చాలు- కోటి నక్షత్రాలూ తళుక్కుమనేదీ వాటి నీలిమలోనే.- రెండు చిన్న కళ్ళున్న అతని లేదా ఆమె అరి చేతి నుంచే మధ్యాహ్నం తన నాలుగు ముద్దలూ తింటుంది- ఒక గడ్డిపోచకు కిరణాల వెలుగు తగులుతుంది.- సముద్రం నుంచి నది వెనుతిరిగి ఎడారి తో స్నేహం చేస్తుంది- వూవొచ్చి సీతాకోకచిలుక మీద పూస్తుంది
ఒక దిగులు పాట
తోటలో వణుకుతున్న ఆకు లాంటి నిన్ను నువ్వు వెళ్ళి పట్టుకునేలోపు
గాలి ఎత్తుకు వెళ్ళిపోయింది.
పువ్వు మనసుకు ముల్లు పూచింది.
నిన్నా మొన్నల పలకరింపులో ఇవాళ అదృశ్యమైపోయింది.
– లాలస
చిత్రరచన: పికాసో
ఒక్కోసారి అనుకోకుండా దొరికిన కొన్ని వాక్యాలు , మనుషులు .. ఒక సంభ్రమం లో ముంచేస్తారు… అలాటి ఒక పసిపాప అమాయకత్వపు అచ్చెరువు లాలస కవిత్వం.
కవిత్వానికి ఎడిటింగ్ , విపరీత వ్యాఖ్యానం అక్కర్లేని .. ఒక సహజత్వం లాలస కవిత్వం
నేనొక ఇంటర్వ్యూ కోసం అడిగితే, లాలస రాసిన ఒక కవిత .. థేంక్ యు సో మచ్ డియర్ ..
చక్కటి expression
చాలా కాలం తరువాత లాలస కవిత చదివాను. లాలస చాలా భావుకురాలు. సున్నితమనస్కురాలు. ఆమె ఇంకా తన భావుకతని కాపాడుకుంటూ కవితలు రాస్తున్నదంటే ఈ లోకం మరీ అంత చెడ్డదేమీ కాదనిపిస్తోంది.