సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ…

on smileనవ్వు!

దేవుడు మనిషికి ప్రసాదించిన అందమైన వరం.. నవ్వు! నవ్వే జంతువొకటేదో ఉందని అంటూంటారు కానీ అసలు ‘గొడ్డుకీ మడిసికీ’ తేడాను తెలిపేది నవ్వే కదా.  చక్కగా పలువరస కనబడేలా, మనసులో ఆనందమంతా నవ్వులో కనబడేలా హాయిగా నవ్వుతున్న మనిషిని చూస్తే ఎంత చిరాకులో ఉన్నా అప్రయత్నంగా మనమూ ఓ చిరునవ్వు నవ్వమూ?! మనసారా హాయిగా నవ్వుకోగలిగిన మనిషిని ఏ చింతలూ కలవరపరచలేవు. నాకైతే నవ్వు లేని మొహం విచ్చుకోని మొగ్గలా అసంపూర్ణంగా అనిపిస్తుంది.

జీవితంలో ఎన్ని చికాకులూ, సమస్యలూ ఉన్నా కొందరి మొహం మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అలాంటివారిని చూస్తే మన చికాకులు కూడా మర్చిపోతాం. మరికొందరుంటారు.. వీళ్లకు అసలు నవ్వడం రాదా అని సందేహం కలిగేట్లు, ఎప్పుడూ కనుబొమలు చిట్లించుకుని చికాకు పడుతునే ఉంటారు. వాళ్ల ముడిపడ్డ కనుబొమలు విడదీసి దగ్గరకు రాకుండా సెలోటేప్ వేసి దూరంగా అతికించేయాలనిపిస్తుంది అలా చిరాకుపడేవాళ్లను చూస్తే!  అసలు ఓ మనిషి తత్వాన్ని వాళ్ల నవ్వుతో అంచనా వేసేయచ్చు.

ఇక ఈ నవ్వులో ఎన్ని రకాలో..! పలకరింపు నవ్వు, మొహమాటం నవ్వు, ఆశ్చర్యపు నవ్వు, చమత్కారపు నవ్వు, విచారపు నవ్వు, వెటకారం నవ్వు, కళ్లలో ప్రేమ నిండిన నవ్వు, పొట్ట చెక్కలయ్యే నవ్వు… ఇలా మాటలు అవసరం లేకుండా ఒక్క నవ్వుతోనే మనసులోని భావమంతా గుమ్మరించేయచ్చు. అమాయకమైన పసిపాప బోసి నవ్వులు ప్రశాంతతని, హాయినీ ఇస్తే, అందమైన అమ్మాయి నవ్వులు ఆనందాన్ని ఇస్తాయి. మరి ఇంత చక్కని ఆహ్లాదకరమైన “నవ్వు” గురించి మన సినీ కవులు ఏమన్నారో వినేద్దామా…

1) “సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ..
చిరకాలముండాలి నీ నవ్వు..
చిగురిస్తు ఉండాలి నా నవ్వు.. నా నవ్వు…”
అంటూ ప్రియురాలి నవ్వు  తనను పలువిధాలుగా ఎలా ప్రభావితం చేసిందో చెప్పే పాట ఇది..
నటీనటుల కన్నా జానకి నవ్వులే ఈ పాటకు ప్రత్యేకమైన అందం.

(జ్యోతి)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5307

2) “ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు
జాజిమల్లెపువ్వు బజ్జోమ్మ నువ్వు”
అంటూ సాగే ఈ జోలపాటలో జోలతో పాటూ నాయకుడి ఒంటరితనపు ఛాయలు కూడా వినిపిస్తారు పి.బి…

( సత్తెకాలపు సత్తెయ్య)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6505

3) “ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే
నిషా కనుల దానా”
అని అబ్బాయి అంటే,

“ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే
నిషా కనులవాడా”
అంటుంది అమ్మాయి..! వీళ్ల కథేమిటో విందామా…

(ఇద్దరు మిత్రులు)

4) “మనసు తీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనము రోజూ పండుగె పండుగె పండుగె చెయ్యాలి ”
అంటూ సాగే ఈ పాట సరదాగా జీవితాన్ని గడపమనే సందేశాన్ని ఇస్తుంది..
ఈ గీతానికి “నెవెర్ ఆనె ఎ సండే<

అనే పాపులర్ ఆంగ్ల గీతం ప్రేరణ. దీని అసలు మాతృక ఒక గ్రీక్ సాంగ్ ను ఇక్కడ <

వినవచ్చు.

అసలు పాట క్రింద లింక్ లో..

(గూఢచారి 116)

5) “పువ్వులా నవ్వితే
మువ్వలా మోగితే
గువ్వలా ఒదిగితే
రవ్వలా పొదిగితే
నిన్ను నేను నవ్విస్తే
నన్ను నువ్వు కవ్విస్తే
అదే ప్రేమంటే…అదే అదే…” అని సాగే ఈ సరదా పాటని వినేద్దాం…

(ప్రేమబంధం)
http://www.raaga.com/player4/?id=193973&mode=100&rand=0.2858572390396148

6) “నవ్వవే నా చెలీ..నవ్వవే నా చెలీ..
చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను..
వలపులు పొంగే వెళల్లో..”
అని ప్రియురాలిని నవ్వమని, లోకమేమన్నా ఆమెకు తాను తోడున్నాని ధైర్యం చెప్తూ ఓ ప్రియుడు పాడే పాట ఇది..

( అంతా మన మంచికే)

7) “మిసమిసలాడే చినదానా
ముసిముసినవ్వుల నెరజాణా
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే
నా చెంతకు రావేమే”
అని ఓ ప్రేమజంట పాడుకునే పాట ఇది..

(పూలరంగడు)
http://www.song.cineradham.com/player/player.php?song[]=2330

శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలో ఓ చిత్రమైన పాట ఉంది.

8) “ఈ చిరునవ్వులలో .. పూచిన పువ్వులలో
ఓ చెలియా నా వలపే విరిసినదే” అని చెలికాడు అంటే
“నవ్వులు వీడునులే.. పువ్వులు వాడునులే
నీ వలపే నా మదిలో నిలుచునులే..” అంటుంది నాయిక
వాద ప్రతివాదాల్లా ఉంటుందీ పాట..

http://www.mediafire.com/listen/k4c5wcktxcse5dn/Sri+Tirupatamma+Katha+-+Ee+chiru+navvulalo.mp3

9) “చిరునవ్వుల చినవాడే
పరువంలో ఉన్నాడే
నా మనసే దోచాడే
ఏమేమో చేసాడే..”
అనే సాగే ఈ పాటలో ఓ ప్రియురాలు తన మనసుని ప్రియుడు దోచుకున్న వైనాన్ని తెలుపుతుంది..
(పవిత్రహృదయాలు)

10) “కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ”
అంటూ చెలి సోయగాలు తనలో ఏలాటి కోరికలు రగిలించాయో వర్ణిస్తాడు నాయకుడు.
(చదువుకున్న అమ్మాయిలు)

11)  “ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ..” అంటూ మరో ప్రేమజంట పాడుకునే గీతాన్ని విందామా..

(ఇద్దరు మిత్రులు)

12) “నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా
నీ సరి ఎవరమ్మా..”
అంటూ ప్రేయసిని నవ్వులపువ్వుతో పోలుస్తాడీ ప్రియుడు. పాట చాలా బాగుంటుంది కానీ నవ్వు గురించిన వర్ణన ఎక్కువ ఉండదీ పాటలో…

(అందమైన అనుభవం)

“నవ్వు” పై రాసిన మరికొన్ని సినీగీతలు:

* “నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు”
(లక్ష్మీనివాసం)

* “చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే కోటి వరాలు”
(పవిత్రబంధం)

* “బుజ్జి బుజ్జిపాపాయి బుల్లి బుల్లి పాపాయి
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ..”
(ఆడబ్రతుకు)

* “నవ్వే ఓ చిలకమ్మ
నీ నవ్వులు ఏలమ్మా
ఆ నటనలు చూడమ్మా
ఏ జవరాలినుడికించకమ్మా ”
( అన్నదమ్ములు)

* “నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెద రాజుని రమ్మంది..”
(చదరంగం)

* “కిలకిల నగవుల నవమోహినీ ప్రియ కామినీ”
ఘంటసాల భాగేశ్వరి రాగం లో పాడిన ఈ గీతం “వసంతసేన” చిత్రంలోది.

* “నవ్వరా నువ్వైనా నవ్వరా
ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబూ..”
(అబ్బాయిగారు అమ్మాయిగారు)

* “నవ్వు నవ్వు నవ్వు నవ్వు
నవ్వే బ్రతుకున వరము”
(ఆకాశరామన్న)

ఇవండీ.. నవ్వులపువ్వులు పూయించే కమ్మని ఆపాత మధురాలు! మళ్ళీసారి మరొక నేపథ్యంతో కలుసుకుందామేం…

raji–తృష్ణ

Download PDF

16 Comments

  • tejaswi says:

    వాహ్! అద్భుతమైన సేకరణ! చాలా మంచి పాటలను గుర్తు చేసి, ఆనందింపజేసి, ఆస్వాదించేలా చేసినందుకు కృతజ్ఞతలు.

  • surabhi says:

    తృష్ణ గారు చాలా బాగుంది మీ పాటల కంపైలేషన్ . నాకు నవ్వు అనగానే ఎకవీరలోని పాటే గుర్తసుంది. అందుకే కొంచెం మార్చి మీకొసమ్
    ” నవ్వులా ఇవి కావు మనసును
    మురిపించు రసరమ్య గీతాలు “

  • శ్రీనివాస్ పప్పు says:

    భలే,బాగా రాస్తున్నారండీ.ఇది చదువుతుంటే ఒకప్పుడు మా గురువు చేసిన కలక్షన్ గుర్తొస్తోందండీ.అవాడూ ఇలానే సీ-వాయేజ్ కి వెళ్ళినప్పుడల్లా బోలెడంత సమయం ఉండేదని ఆ టైములో ఇలాగే నవ్వుల మీద పువ్వుల మీద,వాన మీద,చీరల మీదా అన్నిటిమీదా ఓ పేద్ద పాటల కలక్షనే రాసాడు.

    • @శ్రీనివాస్ పప్పు: చీరల మీద కూడానా? ఇంట్రెస్టింగ్ ! సిరీస్ నచ్చినందుకు థాంక్స్ అండి..

  • అంతం సినిమాలో
    `నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో!
    నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో`
    అనే పాటకూడా నవ్వులమిద వచ్చిన మంచి పాటల్లో ఒకటి. మీ కలెక్షన్ బాగుంది. అభినందనలు.

    • @Kishore Varma Dantuluri : ఈ సిరీస్ ముఖ్యంగా పాత పాటలను గుర్తుచేసుకోవాలనే ప్రయత్నమండి.. అందుకని కొత్త పాటలు రాయలేదు.. (ఇప్పుడది పాత పాట క్రిందనే వస్తుందనుకోండి..:))
      ధన్యవాదాలు.

  • Kumar N says:

    Very Nice Trishna ji.
    I see some of my favorite songs here

  • devikarani says:

    తృష్ణగారూ మీ కలెక్షన్ బాగుంది. మంచి మంచి పాటల్ని గుర్తు చేశారు. కృతజ్ఞతలు….

  • PEEVEEYES says:

    నవ్వు పాటలన్నీ మరచిపోకుండా వ్యాస పరిధి లోకి తీసుకు రావటం నవ్వుతాలు కాదుగానీ మీరు ఓ మంచి పాటని మరచి పోయారనుకుంటానండీ!

    చిన్నారి నీ చిరునవ్వు
    విరిసిన మల్లె పువ్వు
    పొన్నారి నీ అందం
    పూచిన పూడెందం.

    చిత్రం: పసిడి మనసులు
    రచన: ఉషశ్రీ. (ఆకాశవాణి వారు కాదు)
    సంగీతం: అశ్వద్ధామ.
    గాయకుడు: ఘంటసాల.
    నటన:శోభన్ బాబు, శారద.

    ఈ పాటకి ఓ ప్రత్యేకత కూడా ఉన్నది.
    నిజానికి ఇది పాట కాదు. ఓ వచన కవిత. తెలుగు సినిమాల్లో వచన కవితల్లాంటి పాటలు మూడంటే మూడే ఉన్నాయని అంటారు. వాటిలో ఇది ఒకటి. మిగతా రెండూ అదృష్టవంతులు లోని “నమ్మరే! నేను మారానంటే నమ్మరే!”,
    గోపాలరావు గారి అమ్మాయి సినిమాలోని “సుజాతా! ఐ లవ్ యు సుజాతా! నిజంగా ఐ లైక్ యు సుజాతా!

    • PEEVEEYES గారూ, మీ వ్యాఖ్యను ఆలస్యంగా చూస్తున్నానండీ..
      ఈ పాట మర్చిపోలేదు కానీ పాటలాగ ఉండదు కదా అన్నట్లుగా ఇందులో కలపలేదండి. ఈ పాట పిక్చరైజేషన్ కూడా మా అమ్మగారు చెప్తూండేవారు..
      మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  • lalitha says:

    నవ్వుల పాటలు బావున్నాయి .
    అసలు పాటల్ని పట్టివ్వడం ఇంకా బావుంది

Leave a Reply to తృష్ణ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)