నిద్ర నుండి నిద్రకి

bvv
నిద్రలేవగానే నీ ముందొక ఆకాశం మేలుకొంటుంది
వినిపించని మహాధ్వని ఏదో విస్తరిస్తూపోతున్నట్టు
కనిపించని దూరాల వరకూ ఆకాశం ఎగిరిపోతూ వుంటుంది

ఈ మహాశూన్యంలో నీ చుట్టూ దృశ్యాలు తేలుతుంటాయి
నీ లోపలి శూన్యంలో జ్ఞాపకాలు తేలుతుంటాయి
తేలుతున్న జ్ఞాపకాలు, తేలుతున్న ఇంద్రియాలతో
తేలుతున్న దృశ్యాలలో ఆట మొదలుపెడతాయి

404138

ఇక బయలుదేరుతావు
కాంతినో, చీకటినో నీలో నింపుకొనేందుకూ
నీ చుట్టూ నింపేందుకూ

రోజు ఒక ఆకులా రాలిపోయే వేళ అవుతుంది
పండిన ఆకులాంటి మలిసంధ్య రాలిపోయాక
మోడువారిన చీకట్లో
నిన్ను నువ్వు వెదుక్కోవటం మొదలుపెడతావు

దిగులు నగారా ఎడతెగక మోగుతుంది
జవాబుకోసం మేలుకొన్న నువ్వు
నిన్నటి ప్రశ్ననే మళ్ళీ పక్కలోని పసిబిడ్డలా తడుముకొంటావు

ప్రశ్నరాలిన చప్పుడు వినకుండానే
నువ్వు ఎప్పటిలాగే ఎక్కడికో వెళ్ళిపొతావు

బివివి ప్రసాద్

Download PDF

6 Comments

  • knvmvarma says:

    దిగులు నగారా ఎడతెగక మోగుతుంది
    జవాబుకోసం మేలుకొన్న నువ్వు
    నిన్నటి ప్రశ్ననే మళ్ళీ పక్కలోని పసిబిడ్డలా తడుముకొంటావు…..చాలా బాగుంది ప్రసాద్ గారూ..

  • akella ravi prakash says:

    రోజు ఒక ఆకులా రాలిపోయే వేళ అవుతుంది

    బాగుంది ప్రసాద్,

  • prasuna says:

    Chaalaa chaalaa baavundi prasad garu

  • dasaraju ramarao says:

    ఆకాశం ఎగిరిపోవడం …..బాగుంది , అభినందనలు.

  • చదివిన, కామెంట్లు రాసిన మిత్రులకి ధన్యవాదాలు.

  • nmraobandi says:

    ఇదీ అని ప్రత్యేకంగా విడదీసే అవసరం లేకుండా
    ప్రతి పంక్తీ మక్కువ గొలిపే విధంగా వ్రాసారు…
    very nice…

    అభినందనలు…

Leave a Reply to nmraobandi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)