ఇది ‘పెట్టుబడి’ చేసిన హత్య!

Uday-Kiran-Modeling-Pic‘‘ప్రముఖ సినీనటుడు ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య’’ అన్న వార్త టెలివిజన్‌ తెరమీద స్క్రోల్‌ రూపంలో చూసినపుడు నాకు పెద్దగా ఆశ్చర్యంకానీ, దు:ఖం కానీ కలగలేదు. వైయక్తిక దు:ఖానికి తప్పిస్తే, సామాజిక అవ్యవస్థకి మనం మనుషులుగా స్పందించడం మానేసి చాలాకాలమయింది కనుక…దు:ఖం స్థానంలో ఒక నిర్లిప్తత, ఒక ఉదాసీనత ఏదో కలిగింది. చిత్ర సీమకు ఇలాంటి రోజు ఏదో ఒక రోజు వస్తుంది అని తెలుస్తూనే వుంది కనుక ఆశ్చర్యం లాంటి భావమేదీ కలగలేదు.
ఆ ఏదో ఒక రోజు ఇంత త్వరగా రావడం మాత్రం ఖఛ్చితంగా విషాదమే!
సినిమా అవకాశాలు తగ్గిపోవడమూ, ఆర్ధిక ఇబ్బందులు, పరాయీకరణ లాంటి కారణాల వలన డిప్రెషన్‌కి గురి అయి ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించి ఇవ్వాళో, రేపో కేసు మూసివేయ వచ్చు. కానీ ‘‘హత్య’’కి ఆత్మహత్యకి మధ్య ఉన్న ఒక సన్నని రేఖను వాళ్ళెప్పుడూ, ఎప్పటికీ ఛేదించలేరు. అది వాళ్ళ తప్పు కూడా కాదు సమాజంలో కొండలా పేరుకుని పోయిన రుగ్మత, పోలీసులకి భౌతిక, ప్రాసంగిక సాక్ష్యాలు కావాలి. వాటి అవసరం లేకుండానే సమాజం, ఏది హత్యో, ఏది ఆత్మహత్యో నిర్ధారణ చేయవచ్చు కానీ మన సమాజం ఆ దిశగా ప్రయత్నించదు అది మన దురదృష్టం.
‘‘ఉదయ్‌ కిరణ్‌’’ హత్య, పోనీ ఆత్మహత్య వెనుక నాలుగు శక్తులు ప్రధానంగా పనిచేశాయి అని ఈ వ్యాసకర్త బలమయిన నమ్మకం. ఒకటి సినిమా, రెండు సమాజము, మూడు ప్రేమ రాహిత్యము చివరగా చెపుతున్న కారణం  అత్యంత బలమయినది. ఏ ఆత్మహత్య వెనుక అయినా, కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ నాలుగు అంశాలు తప్పిస్తే మరేమీ కన్పించవు.
ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త లోకానికి వెల్లడి కాగానే మొదటి చూపుడు వేలు సినిమా రంగం వైపే చూపించింది. అవునన్నా, కాదన్నా యివ్వాళ సినిమా రంగంలో  సామాన్యుడికి స్థానం లేదు.
ప్రపంచీకరణ విధానాలు ఆంధ్రదేశంలో అమలు కావడం మొదలయిన తర్వాత, ఆ విధానాలకు బలంగా ప్రభావితమయినది మాత్రం సినిమా రంగమే 1980 దశకం దాకా రాష్ట్రం ఎల్లలు దాటని సినిమా రంగం షూటింగ్‌లు, సినిమా వ్యాపారము 1990 తర్వాత మెల్ల మెల్లగానూ 2000 తర్వాత ఉధృతంగానూ విశ్వవ్యాప్తమయినాయి.

ప్రేమాభిషేకం లాంటి సినిమా ఇరవై, ముప్పై లక్షలులో తయారయిందంటే మనకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఇవ్వాళ ‘‘కోటి’’ రూపాయల బడ్జెట్‌ లేకపోతే ఎంత చిన్న సినిమా అయినా తయారుకాదు. ఒకప్పుడు ‘‘అడవిరాముడు’’ అనే సినిమా రాష్ట్రవ్యాప్తంగా 27 ధియేటర్లలో విడుదల అయితేనే ఒక రికార్డు. కానీ ఇవ్వాళ సినిమా రెండు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతుంది పెట్టుబడి వరదలాగా చిత్రసీమలోకి వచ్చి చేరుతున్నది ప్రభుత్వ రాయితీలూ యింతకు ముందు కంటే పదిరెట్లు పెరిగాయి. ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పుడు చిత్రసీమ కళకళలాడుతూ ఉండాలికదా… అలా వుండలేదు ఎందుకని?
దీనికి ప్రధానమయిన కారణం కేంద్రీకరణ, పెట్టుబడి, అవకాశాలు, మార్కెటీకరణ లాంటి అన్ని అంశాలలో కేంద్రీకరణ కేవలం నాలుగయిదు కుటుంబాలకే పరిమితం కావడంతో ఈ దుస్థితి ఏర్పడిరది. ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య వార్త వినగానే ఏ రాజకీయాలూ తెలియని ఒక సినిమా ప్రేమికుడి ప్రతిస్పందన ‘‘తొక్కేశారు’’అని.
అక్కినేని కుటుంబం నుండి అయిదుగురు నటులు చిరంజీవి కుటుంబం నుండి ఐదుగురు నటులు, దగ్గుబాటి కుటుంబం నుండి ఇద్దరు నటులు, మంచు వంశం నుండి నలుగురు నటులు ఇవ్వాళ ఇండస్ట్రీలో ఉన్నారు. వీళ్ళ అధీనంలోనే రాష్ట్రంలో తొంభైశాతానికి పైగా ధియేటర్లు వున్నాయి, వీళ్ళ చేతుల్లోనే మీడియా వుంది. దర్శకులు, నిర్మాతలు కుటుంబాల వారీగా విడిపోయారు ఈ నటులు ఎవరిని చెపితే వారినే తీసుకునే స్థితిలో వున్నారు చిన్న సినిమాకు, చిన్న నటులకు అవకాశం ఎండమావి.
ఈ పెద్ద కుటుంబాలలోని హీరోలకి ఒక్క హిట్‌ వస్తే చాలు పది, పదిహేను మంది నిర్మాతలు క్యూ కడతారు. ఆ పదింటిలో మరొక్క హిట్‌ వస్తే మరొక పది, పదిహేను సినిమాలు చేతిలోకి వస్తాయి. ఈ హీరోల సినిమాలకి ఆయా సామాజిక వర్గాలకి చెందిన రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వెన్నుదన్నుగా నిలుస్తాయి. లక్షలు వెచ్చించి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కొంటాయి మీడియా సినిమా వసూళ్లు ఇన్ని కోట్లు దాటాయి అన్ని కోట్లు దాటాయి అని ప్రచారంతో హోరెత్తిస్తుంది. ఇన్ని సౌకర్యాలు చిన్న సినిమాకు ఏవి? చిన్న సినిమాకు ధియేటర్లు దొరకటమే కష్టం, దొరికినా ‘‘సినిమా బావుంది’’ అనే మౌత్‌ పబ్లిసిటీ వ్యాపించే లోగానే ధియేటర్ల నుండి ఆ సినిమాను ఎత్తేస్తారు అందుకేనేమో చిన్న సినిమాల వైపుకి వెళ్లకుండా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి ఒక పెద్ద హీరో సినిమాను ఇవ్వాళ తీస్తున్నారు. ఒక పెద్ద హీరో సినిమాకు ఇద్దరు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. ఇక నిర్మాతలు, దర్శకులు అయితే తమ సృజనాత్మకతను అంతా ఆ పెద్ద హీరోల ప్రాపకం కోసం ఖర్చు పెడుతున్నారు. ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో ఒక నిర్మాత ‘‘నాన్నా దేవుడు ఎలా వుంటాడు?’’ అని మా అబ్బాయి అడిగితే గదిలోకి తీసుకెళ్లి ఫలానా హీరో ఫోటో చూపించాను అని చెప్పడం ఈ కేంద్రీకరణకి పరాకాష్ట.
నాగార్జున మొదటి సినిమా ‘విక్రమ్‌’ నాగేశ్వరరావుగారి అబ్బాయి ఎలా చేశాడో అన్న ఉత్సుకతతో జనం చూశారు. తరువాత కెప్టెన్‌ నాగార్జున, అరణ్యకాండ, మజ్నూ వరకు వరుస ఫ్లాప్‌లు. బాలకృష్ణకి సుల్తాన్‌, కృష్ణబాబు, రాణా సమయంలో వరుస అపజయాలు. చిరంజీవి ఏకంగా సంవత్సరంపాటు ముఖానికి రంగేసుకోలేదు, ఫెయిల్యూర్‌కి భయపడి అయినా వాళ్లంతా ఎలా నిలదొక్కుకున్నారు వారి వెనుక బలమయిన డబ్బువుంది. దాన్ని మించిన అక్కినేని ఫ్యామిలీ, నందమూరి వంశం చిరంజీవి మెగాస్టారిజం అనే దుర్బేధ్యమయిన గోడలు వున్నాయి. ‘‘మనవాడు పడిపోకూడదు’’ అని కాపు కాసిన కుల సంఘాలు ఉన్నాయి.  ఉదయ్‌ కిరణ్‌ వెనుక యివేమీ లేవు.
ఇవ్వాళ ఉదయ్‌ కిరణ్‌ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇంతకు ముందే ఒక నిర్మాత ఒక భారీ సినిమా నిర్మించి విడుదల చెయ్యలేక హుస్సేన్‌ సాగర్‌ లో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు మరో నిర్మాత బాగా నడుస్తున్న సినిమాను మరో పెద్ద హీరో సినిమా కోసం ధియేటర్‌ నుండి తీసివేస్తున్నారని ‘‘కూకట్‌ పల్లి’’ చౌరస్తాలో  ధర్నా చేసి పోలీస్‌ కేస్‌ పెట్టాడు.
ఇవన్నీ చదువుతుంటే మీకు ఏం అనిపిస్తోంది? కె.వి. రెడ్డి, బి.ఎన్‌. రెడ్డి తరంలో సినిమా ఒక కళ. అది ప్రజల ప్రయోజనాలని కలవరించింది, కాంక్షించింది.
బాపు, విశ్వనాధ్‌, దాసరినారాయణరావుల తరంలో ‘సినిమా’ కళాత్మక వ్యాపారం కళాత్మక విలువలు కాపాడుకుంటూనే వ్యాపార సూత్రాలను అందిపుచ్చుకుంది.
ఎస్‌.ఎస్‌ రాజమౌళి, వి.వి. వినాయక్‌ల తరంలో సినిమా కళకాదు, వ్యాపారమూ కాదు. డబ్బు తయారుచేసే యంత్రం. వ్యాపారంలో, యుద్ధంలో కొన్ని నైతిక సూత్రాలు, విలువలు వుంటాయి కానీ యంత్రానికి అదేమీ తెలియదు. మానవీయ స్పర్శ ఇప్పటి సినిమాకు లేదు.
విశ్వనాధ్‌ ప్రతి సినిమాకు ‘‘ఎస్‌’’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెడతానో, మూడు అక్షరాల పేర్లు మహేష్‌ బాబుకి కలసి వస్తుందనో, వి.వి. వినాయక్‌ హీరోయిన్‌కి ‘నందిని’ అనే పేరు పెడితే హిట్‌ అవుతుందనో, కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌ ఎప్పుడూ ‘‘మహాలక్ష్మీ’’ అనో సినిమా పరిశ్రమకి సెంటిమెంట్లు ఎక్కువ అని మనం అనుకుంటాం కానీ… సెంటిమెంట్‌ లేనిదే సినిమా పరిశ్రమలో!
సెంటిమెంట్‌ అంటే ఒక మానవీయ స్పర్శ. సెంటిమెంట్‌ అంటే భావోద్వేగాల కలబోత. సెంటిమెంట్‌ అంటే మనిషి పట్ల ప్రేమ, సెంటిమెంట్‌ అంటే మనిషిని సొంతం చేసుకునే గుణం ఇవేవీ ఇవ్వాళ ఇండష్ట్రీకి లేవు.
అందుకే ఉదయ్‌కిరణ్‌ గురించి నాలుగు మంచి మాటలు చెప్పిన సిన జీవుల ముఖాల మీద దు:ఖం సగం కరిగిన మేకప్‌ లాగా కనిపించింది.
ఇక రెండో చూపుడు వేలు సమాజం ఆంధ్రదేశంలో ఎన్నికలు ఏడో ఋతువు అన్నాడు నగ్నముని, ఎనిమిదో ఋతువు కూడా వుంది అది ఆత్మహత్య. ఉద్యమాల పేరుతో, వ్యవసాయ రంగం సంక్షోభం పేరుతో, మానసిక ఒత్తిడి పేరుతో ఈ పదిహేనేళ్ల కాలంలో ఆంధ్రదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నవారి సంఖ్య కనీసంలో కనీసం యాభైవేలు పదిహేనేళ్ల కాలంలో ఆత్మహత్యల్లో ఆంధ్రదేశ పోగ్రెస్‌ రిపోర్ట్‌ యాభైవేలు.
ఇది ఏ రకంగా చూసినా ఆందోళన కలిగించే విషయమే నిర్భయ ఉదంతం జరిగినప్పుడు ఒక టి.వి ఛానల్‌ ఢల్లీిలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ‘‘లైవ్‌’’ లో చూపించింది. విరామ సమయంలో అది చూపించిన ప్రకటన గుర్తుందా? ‘‘అమ్మాయిలను పడగొట్టడం ఎలా?’’ అనే విరాట్‌ కోహ్లి ప్రకటన నిర్భయకి నివాళులు అర్పిస్తూనే ఈ ప్రకటనను చూసి మనం ఆనందించాం అంటే మన చైతన్యస్థాయి ఏ రకంగా వుందో తెలుస్తూనే వుంది.
ఇలాంటి సమాజం ‘‘ఆత్మహత్యలు’’ లాంటి మానసిక సంక్షోభాలను ఎలా దాటుతుంది? ఒక ఆత్మహత్య జరిగినప్పుడు కవులు ఒక కవిత రాసి, ఒక కవిత్వ సంకలనం వేసి తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. సామాజిక అధ్యయన పరులు రెండురోజులు ఓపెన్‌ ఫోరంలలోనూ, బిగ్‌ డిబేట్లలోనూ చర్చోపచర్చలు చేసి తమ పని అయిపోయింది అనుకుంటారు. ఎవరికి వారు తమ తమ లోకంలోకి జారుకుంటారు ఒక సమగ్రమయిన కార్యచరణ తీసుకుని ముందుకి కదలరు ఎందుకని? ఇవ్వాళ ప్రతి మనిషీ ఒక ఒంటరి ద్వీపం భౌతికంగా అతడు సమాజంలో నివశిస్తున్నాడు తప్పిస్తే దానితో అతనికేమీ సంబంధం లేదు అతడొక ఒంటరి ద్వీపం అతడొక రహస్యగాయం అతడు ఏ పరమార్ధాన్ని కౌగిలించుకోలేని నిలువెత్తు స్వార్ధం. అతడొక కాగితం పువ్వు.
అందుకే ఈ సమాజంలో ఆత్మహత్యలు అనేవి ‘‘ఎనిమిదో’’ ఋతువు అనేది.
ఇక మూడవ చూపుడు వేలు ప్రేమరాహిత్యం. ఉదయ్‌కిరణ్‌ మృతశరీరాన్ని తీసుకోవడానికి తండ్రి నిరాకరించాడన్న వార్త కలచివేసింది తండ్రి వంద తప్పులు చేసి వుండ వచ్చు కొడుకూ వంద తప్పులు చేసి వుండవచ్చు ఆ తప్పులు తండ్రులవీ, కొడుకులవీ తప్పిస్తే తండ్రీకొడుకుల బంధానిది కాదుకదా!
‘‘అంగా దంగాత్సంభవతి నిజస్నేహజో దేహసౌర:
ప్రాదుర్భూయ స్థితి ఇవ బహిశ్చేతనా ధాతురేక:
సాంద్రానంద క్షుభిత హృదయ ప్రస్రవేణావస్తికం
గాఢాశ్లేషస్సహిమమ హిమశ్చ్యోత మాశంసతవ’’
అంటాడు ఉత్తరరామ చరిత్రలో భవభూతి. పుత్రుడి శరీరం తండ్రి ప్రతి అంగం నుండి ఉదయిస్తుందట అంటే తనే మరోసారి పుడతాడన్న మాట. అలాంటి పుత్రుడు విగతజీవిగా పడివున్నప్పుడు తండ్రి నిరాకరించాడంటే  ఆ బంధం ప్రేమాన్వితం అనాలా? ప్రేమరాహిత్యం అనాలా? ఈ ప్రేమరాహిత్య మూలం కూడా సామాజిక మూలంలోనే దాగి వుంది.

భార్య అంటే భర్తకి ప్రేమ వుండదు. భర్త అంటే భార్యకు ప్రేమ వుండదు తల్లి దండ్రులు పిల్లలని తమ కోరికలకి ప్రతిరూపం కావాలని అనుకుంటారు. కానీ వాళ్లకీ ఒక లోకం ఉందని గ్రహించరు మనుషుల మధ్య మిగిలీ మిగలని మానవ సంబంధాలని కలిపి విడదీస్తున్న ఊహా మేఘం డబ్బు. డబ్బులేని చోట ప్రేమ వుంటుందా? డబ్బుకొద్దీ ప్రేమ అని బాలచందర్‌ ఊరికే అన్నాడా…? ఇటీవలి సినీ నటి అంజలి ఎపిసోడ్‌ గుర్తుందా?

ఇక చివరి చూపుడు వేలు ఉదయ్‌ కిరణ్‌  చివరగా చెపుతున్నా మొదట చెప్పవలసింది ఉదయ్‌ కిరణ్‌ గురించి…!
అవును ఉదయ్‌ కిరణ్‌ హత్యకి అతడే కారణం మన పక్కంటి పిల్లాడిలాగా కనిపించే ఉదయ్‌ కిరణ్‌ మన పక్కింటి పిల్లాడి  లాగానే ఒత్తిడి తట్టుకోలేకపోయాడా? 2000 నుండి 2013 వరకు సినిమా రంగంలో వున్నాడు కదా…! ఆ మాయాజలతారు మృదుచేలాంచలములకొసగాలుల విసురు పట్టుకోలేక పోయాడా? ఆ పాకుడు రాళ్లమీద కాలు బలంగా నిలపలేక పోయాడా?

ఒక రంగంలో వైఫల్యం ఎదురయినప్పుడు మరోరంగాన్ని ఎంచుకోవాలనే ప్రాప్త కాలజ్ఞత ఎందుకు లోపించింది? జీవితాన్ని సున్నా నుండి ప్రారంభించి గెలవగలిగే ఆత్మస్థైర్యాన్ని ఎందుకు కోల్పోయాడు. జీవితాన్ని ఒంటరిగా గెలవాలనే విషయాన్ని ఎందుకు మర్చిపోయాడు తను పోషించిన పాత్రలను తనెందుకు మనసులోకి తీసుకోలేక పోయాడు? శిఖరం మీద ఎవరూ ఎల్లకాలం ఉండరనే విషయం త్వరగానే గ్రహింపుకి వచ్చివుండాలి కదా..

ఒక విజయం ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. ఒక అపజయం ఆత్మవిశ్వాస స్థాయిని పడవేస్తుంది నిజమే! ప్రాణం పోసే శక్తి మనకు లేనప్పుడు ప్రాణం తీసుకునే హక్కు మనకు ఉందా అనేదే అసలు ప్రశ్న…బ్రతకడానికి వందకారణాలు అవసరం లేదు ఒక్క కారణం చాలు ఎందుకంటే జీవితం ఒక్కటే కనుక. మరణానికే వంద కారణాలు కావాలి.

ఏదయితేనేం హృదయ కమలం వాడిపోయింది. ఉదయ్‌కిరణ్‌ ఇక లేడు. అతడి పందొమ్మిది సినిమాలు అతడి మరణాంతరం కూడా జీవిస్తాయి.
అతడి మరణం నుండి అయినా చిత్రసీమ పాఠం నేర్చుకుంటుందా? దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ లాంటి పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తారా…. సగటు సినీ ప్రేమికుడిగా అడుగుతున్న ప్రశ్నలకు స్పందిస్తారా…. లేక ఇది ఒక కామా మాత్రమేనా…..?

 – వంశీ కృష్ణ

Download PDF

26 Comments

  • Thirupalu says:

    ‘చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేక పోయిందంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరం!!
    నిజం. అలా అనుకుంటె సమాజంలో 75 శాతం జీవితాలు ముగించుకోవాలి? ఎంత సానుబూతి చూపించ ప్రయత్నించినా ఒకటి మాత్రం నిజం. సమాజంలో తమ అంతస్తు ఏమాత్రం తగ్గిపోగూడదు ఎంతమంది కి అసలు అంతస్తులే లేక పోయినా వారికి ఏ బాధ వుండదు. తాము మాత్రం ఈ సమాజానికిమించి గొప్పావాళ్లు అనుకోవటమే కారణం. తాము సాటి మనుషులమే అనేసాధరన అభిప్రాయం ఉన్నట్లైతే నూటికి నూరుశాతం ఈలాంటి ఆత్మ హత్యలను ఆపవచ్చు. మనదేశంళొ గౌరవ హత్యలు ఉన్నట్లే గౌరవ ఆత్మ హత్యలు కూడ ఉన్నాయన్నమాట?!’ వీటి గురించి ఓడి పోవటానికి ఇష్టపడని అహాంకారలు ఆత్మ అభిమానమో తప్ప మరేమి కాదు.

    • Ravi says:

      నూటికి డెబ్బయ్యైదు కాదుసార్! తొంభయ్‌కి పైగానే. False pristage కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళని బ్రతుకుతున్నాను అనేకన్నా పరువుకోసం వ్యభిచరిస్తున్నారు అంటే సరిపోతుంది. ఏం అంతకంటే ఛావడం గౌరవంకాదా?! పరువొక్కటి నిలుపుకోవడంకోసం దొంగనీతులుచెప్పేవారొకరు, గౌరవంకోసం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి లేని అనందాన్ని నటించి పతివ్రతలుగా వెలిగేవారింకొకరు, కులాభిమానాన్ని అభిమానంగా pass on చేస్తున్నవారింకొకరు. లేదులేదంటూనే కులపిచ్చితో ఇదే సినిమాల్నభిమానిస్తూ ఈ విషవృక్షపు ఎదుగుదలకి ఇతోధికంగా సాయపడుతున్నవారు ఇంకెందరో!

      వీళ్ళెవ్వరినీ ఒక్కమాట అనని మనం ఒక్క చిన్నవాడు ఆత్మహత్యచేసుకుంటే వాదిమీదకు ఒంటికాలితో లేవడం ఎంతవరకూ సమంజసం? ఉదయ్ కిరణ్‌ని ఎందుకు మనం తప్పుబట్టాలి అంటే అతను తనపైజాలిపడే అవకాశాన్ని మనకు మరికొంతకాలం కల్పించకుండా ముందే వెళ్ళిపోయాడు అందుకు. అతనలా బాధపడుతూ బ్రతికే ఉన్నట్లైతే మనం కొంచెం జాలిని ఒలకబోసి తేలికపడుండేవాళ్ళం. అంతకుమించి ఇంకేమీచెయ్యడానికి మనకు తీరికుండదుకదా! సుజాతగారన్నట్లు ఈ post mortem మనకు నిజంగా చాలా ఆనందాన్నిస్తుండాలి.

      సినిమారంగంలో ఎం చాన్నాళ్ళనుంచీ జరుగుతూవస్తోండో మనకు తెలుసు. దానిగురించి మనం పీకింది ఏమీలేదు. పీకబోయేదీ ఏమీలేదు. మనక్కావలసింది మన కులపోడి రికార్డులు ఆఫలానా కులపోడి రికార్డులను బద్దల్లుకొట్టాలి. మనలోని సెక్సుకోరికలు, పైశాచికపు కోరికలను నాయికానాయకుల అభినయాల్లో వెదుక్కొని perverted ఆనందాన్ని పొందడం. ఏదైనా జరిగితే అలాక్కాదు ఇలా జరిగుంటే బాగుండేదంటూ తీర్పులు చెప్పగలగడం. ఇదికాక ఆ నలుగురికో, నలభైమందికో మనమే అధికారమిచ్చాం దాన్ని ఉపసంహరించుకోవడానికి ఏమైనా చెయ్యగలమా? డబ్బుమదంతో స్థాయిమరచి ప్రవర్తిస్తున్నవారికీ, మొత్తం సినీరంగాన్నే కబళించజూస్తున్నవారికీ ఏమైనా బుధ్ధిచెప్పగలమా?

    • vinodkumar says:

      jeevitham antene poratam ,porade shakthi lekapothe evaru emi cheyaleru….
      talent unte evaru emi cheyaleru, ippudu unna genaration ki taggatlu ga update kavali…..evari chavu ki vaalle karanam

    • Divya says:

      “”చావడానికి ఉన్న ధైర్యం బతకడానికి లేక పోయిందంటే ఆ పరిస్థితి ఎంత దుర్భరం!!””

      క్షమించండి!! నేను ఏమైనా తపుగా మాట్లాడుతూ ఉంటె…..

      సర్, నేను ఈ మాట చాల సందర్బాలలో చాల వ్యక్తుల నుండి వింటున్నాను.. కాని ఒకసారి ఆలోచించండి. చావడానికి దైర్యం అవసరం లేదు. తనకు ఎవరు లేరు అన్న ఆలోచన, బ్రతుకు మీద ఆశ లేకపోతే చాలు. ఇప్పుడున్న జనాలు అందరు అలాంటివాళ్ళే.

      మీరు చీప్పే ఆ వాక్యం కొన్ని సంవత్సరాల ముందు మాట ఐ ఉంటుంది కాని ఇప్పటి పరిస్తులకి అది సరి ఐన వాక్యం కాదు అని న అబిప్రాయం.

      ఇట్లు,
      ఓ అమ్మాయి..

      • Thirupalu says:

        దివ్య గారు,
        నావ్యాఖ్యలో మొదటి వాక్యం నాది కాదు. నేను ఇంకో బ్లాగర్‌ రాసిన వాక్యాన్ని కోట్‌ చేస్తూ దాని కింద జవాబు చెప్పాను. అదే ఇక్కడ సరిపోద్దని ఇక్కడ పేస్ట్‌ చేయడంలో పొరపాటున వచ్చింది. అయినా ఇందులో తాప్పూన్నట్లు నేను అనుకోవడం లేదు. ఈ తరానికే కాదు ఏ తరానికైనా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం జీవించడానికే ఉంది. నాకు తెలిసి బాగా చదువుకొనిం ఐ ఐటీ లాంటి పెద్ద సంస్తల్లో సీటు సంపాదించి అపారమైన భవిష్యుత్తు ఉందని కలలుకని ఒక్క సెమెస్టర్లో ఒక్క సబ్జెక్టులో తప్పి పోతే జీవితమే పోయినట్లు లేక చిన్న అంబిషన్‌ నెరవేరలేదని ప్రాణాలు తీసుకొనే వారంతా ఈకోవకి చెందిన వారు కాదా? పైన వినోద్ కుమార్ గారు చెప్పినట్లు జీవతమమ్టేనే పోరాటం. ఆ పోరాటాన్ని పోరాడి గెలవాలి. ఆ గెలుపు కోసం ప్రయత్నం చేయ్యాలి. దాన్నే ఇక్కడ ప్రస్తావించాను.

        తనకు ఎవరు లేరు అన్న ఆలోచన, బ్రతుకు మీద ఆశ మనం ఏ సమాజంలో బ్రతుకుతున్నామో ఆసమాజం హామీ ఇవ్వాలి. అలా ఇవ్వక పోగా ఒంటరి తనాన్ని ప్రోస్తహిస్తుంది. విపరీతమైన ఆశలు కల్పించి సమాజం నుండి వెలి వెస్తుంది. జీవితాన్ని జీవించడానికి కావాలసిన దైర్యాన్ని ఇవ్వడం లేదు.

  • Sujatha says:

    పోయిన వాడెలాగూ పోయాడు. సో కాల్డ్ మీడియాతో కల్సి అందరూ ఇంకెన్నాళ్ళు ఈ పోస్టు మార్టం సెషన్స్? పోతేనన్నా శాంతిగా ఉండొచ్చనుకుంటే ఆ కోరిక కూడా తీరేలా లేదు పాపం

    దీన్నుంచి ఎవరూ ఏ పాఠాలూ నేర్చుకోరు. నిన్నటితో అతడి శకం ఖతం. ఇవాళ్టి నుంచీ అంతా మామూలే! రేపటి నుంచీ అతడు చరిత్ర లో భాగం

  • Naren says:

    ఈ వ్యాసంలో ఎంతో ముఖ్యమైన మూల ప్రశ్నలను సంధించినందుకు, చాప క్రింద నీరు లాంటి విషయాలను చర్చకు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
    నా. (నరేన్).

  • narayana sharma.m says:

    నిజమే…సినిమా వాళ్లు..సినిమా వాపుని బలమనుకునే వాళ్లు..బోలడంత చరిత్ర రాయొచ్చు..కాని వాస్తవాలు వేరు..”ఉదయ కిరణ్” హత్య వెనుక ..ఈ హస్తం లేదని అనలేం..చావడానికి…కేవలం బాహ్య కారణాలు మాత్రమే ఉండవు..పోతున్న వాళ్లు ఓటమిని తట్టుకో లేక పోతే బతికున్న వాళ్లు మరొకరి విజయాన్ని తట్టుకో లేక పో తున్నారు…

  • Santosh says:

    వాట్ ఉ సైడ్ పర్ఫెక్ట్ ….. సినిమా అనాది లైఫ్ లో ఒక భాగం అంత తప సినిమా న లైఫ్ కాదు . కా భాతి , నూతన హీరో హెరొఇఒన్ మాతరం దయ చసి సినిమా అణా ముసుకు లో పది లైఫ్ నాశనం చసుకోకండి ప్లీజ్ మీరు మంచి వాలుగా వుండాలి అంట ఒక పేద స్టూడెంట్ కి హెల్ప్ చింది ఇంకా మీరు ఆమిన చాయగాలుగుట పూర్ పీపుల్ కి హెల్ప్ చింది బట్ లవ్ చసి మ్యారేజ్ చసుకున మన అసెట్స్ కోసం మానను ఎబదండి పడతారు సో ప్లీజ్ దొంత కిల్ యువర్ సెల్ఫ్ హెల్ప్ ఒథెర్ బె హ్యాపీ ఇన్ వాట్ ఉ ఎఅర్న్

  • శ్రీధర్ బాబు says:

    ఆత్మహత్యలకు మూలాలు సమాజంలోనే ఉంటాయని సరిపెట్టంకుండా.. మానవ సంబంధాలు ఊహామేఘాల మధ్య ఎలా కొట్టుమిట్టాడుతున్నాయో బాగా చెప్పారు.

  • Nani Malloju says:

    మీ విశ్లేషణ అర్ధవంతంగా వుంది. . ఏం చేసిన మారని ఈ సమాజం గురించి అలోచించి బుర్ర పాడుచేసుకోవడం తప్ప ఏం ఫలితం ఉండదు .. గురజాడ గారు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు మనుషులు .. కాని దేశంలో ఎక్కడ మట్టి లేకుండా చేసారు అదే మనుషులు..

  • Madhu Addanki says:

    చాల అద్భుతమైన విశ్లేషణ ..పరిస్థితులని తట్టుకోలేక ప్రాణం తీసుకుని పలాయన వాదం చేసిన పిరికివాడు ఉదయ కిరణ్..ఏది ఏమయినా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు..చాల కలచి వేసిన సంఘటన అతని మృతి..అన్నింటికన్నా బాధాకరమైన విషయం అతని తండ్రి ప్రవర్తన..అటువంటి కరుడు కట్టిన మనుషుల మధ్య మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నామా అనిపిస్తోంది..మ్రుత్యువుతోనైన అతనికి శాంతి దొరికిందేమో..

  • చాలా బాగా విశ్లేషించారు ! చక్కని సమన్వయం కనిపించింది .
    “దీన్నుంచి ఎవరూ ఏ పాఠాలూ నేర్చుకోరు. నిన్నటితో అతడి శకం ఖతం. ఇవాళ్టి నుంచీ అంతా మామూలే! రేపటి నుంచీ అతడు చరిత్ర లో భాగం”…అన్నారు సుజాత గారు .
    కాస్త ఖాళీ సమయం ఉంటె చాలు ఏదో ఒక సినిమాకి పోదామనుకోవడం , ఏదో ఒక చెత్త మూడుగంటల సేపు చూసి డబ్బూ , టైమూ ఖర్చు పెట్టేసి ఇల్లు చేరడం సగటు తెలుగువాడికి అలవాటై పోయింది. అందువల్లే ఒకేలాంటి స్టంట్ లూ , పసలేని కథలూ , హాస్యాస్పదమైన కథనం…ఇదే సగటు సినిమా అనే స్థితి .
    ఒకప్పుడు వర్షాకాలం వస్తే చాలు టెలిఫోన్ పనిచేసేది కాదు . ఫిర్యాదు చేస్తే వారం పట్టేది బాగవడానికి. ఒక టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ చేత్తో పట్టుకుని మామూలు అడుక్కుంటూ BSNL స్టాఫ్ వచ్చేవారు. ఇవాళ పోటీ తట్టుకోవడానికి BSNL ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది .
    అలాగే ఢిల్లీ లో AAP పార్టీ విజయం . రాజకీయాల్లో లాగే సినీ ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది. మంచి టాలెంట్ ఉన్న కళాకారుల నుంచి , అతి తక్కువ బడ్జెట్ తో వస్తున్న చక్కని short films రాబోయే మార్పుని సూచిస్తున్నట్టు అనిపిస్తోంది !

  • Rama Bhaskar says:

    ఇది హత్య , లేదా ఆత్మ హత్య అనేదానికన్నా మనం అందరం మనకు మనం ద్రోహం చేసుకుంటున్నాం అనడం కరెక్ట్ , మనకి కులం , గోత్రం , జాతి,ప్రాతం అనే జాడ్యాలు ఉన్నత కాలం , ఎవరో ఒకరు ఎలా పోవడం సహజం,

  • Rama Bhaskar says:

    బ్రతికున్న పెద్ద వాళ్ళ కోసం , ఉదయ కిరణ్ , అతని భార్యని , కుటుంబాని తప్పు పట్టి ,వాళ్ళని ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు భాహు పారాక్

    • Ravi says:

      నిజం!

      ఒక చెంచా నటుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా. “మేమొచ్చేసరికి ఇక్కడెవ్వరూ లేరు, మాంఛిగా విచారించమని పోలీసులకు చెప్పాం. నాకు బాధేసింది”. ఎవరికి చెబుతారుసార్ కబుర్లు. జనాల్ని ముంచింది వీరి ఇలవేల్పుకాదూ. ధియేటర్లు గుప్పిట్లోపెట్టుకొని, సినిమాలు వీళ్ళస్థాయిని దాటకుండా ensure చేస్తున్న వాళ్ళొకరు, నిర్మాతని కాల్చీ, అధికారపు అండతో తప్పించుకోగలివారొకరు, తమ బాగుకోసం ఇతరులు జీవితాల్ని అంతంచేసో, కుట్రలుపన్నో కనకపు సింహాసనన్ని అధిరోహించామని విర్రవీగే ప్రబుధ్ధులు కొందరు. ఇలాంటివాళ్ళకు కాపుకాయడానికి చేతులుకలిపి ముందుకొచ్చే మీడియా. ఇదీ ప్రస్తుత పరిస్థితి.

  • సగటు మనిషి మనసులో కదలాడే ఆలోచనలనన్నింటికీ మీరు అక్షర రూపం కల్పించారు.సినీ రంగంలోని పెద్దలందరికీ ఇవి తెలియనివా! కాకుంటే,అందరిలాగే వారు నిమిత్త మాత్రులు.

  • చదివి, మనసు బరువెక్కింది.

  • t.v.suresh says:

    చాల బాగా చెప్పారు సర్, ఉదయ కిరణ్ ఇంకా లేదు అనేది మా బోటి అభిమానులకు ఒక పెద్ద శిక్ష, యీక పోతే సినీ పెద్దలు అనే వారు ఏమి చెప్పిన పోయీన ఉదయ్ ఇంకా తిరిగిరాదు, పోయే ముందు ఒక 5 నిముషాలు ప్రశాంతంగా ఆలోచన చేసి వుంటే ఉదయ్ మన మధ్య లోనే మిగిలి ఉండేవాడు, గెలుపు, ఓటమి ఎప్పుడు శాశ్వతం కాదు అన్న విషయం ఒక్క క్షణం లోనే మరిచి తనని తను హత్యా చేసుకున్నాడు,కానీ తనకి తెలియలేదు చనిపోతే మరునాటి తన చావు పాత విషయమని, అదే బ్రతికి వుంటే ఏమైనా సాదిన్చాగాలమని. ఏమైనా గాని ఈ విషయంలో వాళ్ళని వీళ్ళని నిజా నిజాలు తెలిసికోకుండా నిందించడం కూడా ఒక తప్పే అని అందరు తెలుసుకోవాలి.

  • Sagar says:

    Excellent analysis! !
    Thank you so for all those who responded. I have read all responses and you really made me think that there are so many people who have desire to change the way things are going.
    Once again thanks a lot

  • buchireddy gangula says:

    చాల చక్కగా నిజాలని తోడారు —అపుడు –యిపుడు — ఎప్పుడు సిని లోకం కొద్ది మంది
    పెత్తనాల తో నడుస్తూ — రోజో రోజు కు — కుటుంభ వారసత్వాలతో —
    నేడు నాలుగు కుటుంభాల తో — వాళ్ళ గుప్పిట్లో — తెలుగు సిని ప్రపంచం —
    మొన్న — టి . వి ఇంటర్వ్యూ లో తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా మురళి మోహన్ గారి లాగే — దాపుడు ముచ్చట్లు చెపుతూ —అ కుటుంభాల ను సమర్థిస్తూ —-
    వారికి చెంచా గిరి దేనికో —???అ రోజు రాక పోదు —జనం తిరగబడే రోజు వచ్చి తీరుతుంది
    రావాలి —ఆశిద్దాం
    థాంక్స్ వంశీకృష్ణ గారు
    ————————————————————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  • Gundeboina Srinivas says:

    వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది.
    గుండె బోయిన శ్ర్హీనివాస్
    హన్మకొండ

  • kamal says:

    Chanipoyaka prathivadu comment chesevade blogs rasevale…bathikundaga okadu okadiki kuda help cheyaru..raytalu kana chetalo unte super ga untadi.. nalguriki upyoga padidi

  • Bharathi says:

    వంశీ కృష్ణ గారు, మీ వ్యాసం ఓ ఫాక్ట్. దయచేసి ఇంకిన్ని పత్రికలలో మీ వ్యాసం రావాలి.
    ఇటువంటి ఫీల్డ్ – సినిమా, నృత్యం, పాట లాంటి వాటిల్లో ఈ అణిచివేయబడడం, వాడుకోబడడం ఎక్కువే…

    ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో డబ్బు ఉండాలి, లేదా స్టార్ ఫాదర్ ఉండాలి. అవి ఉంటె చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. వారు కొడుకులు సినిమాలు హిట్ అయ్యేంత వరకు కోట్లు పోసి సినిమాలు తీస్తూనే ఉండవచ్చు.

    ఓ రీడర్ అన్నట్టు వాళ్ళ (పెద్ద హీరోల కొడుకుల) సినిమాలు చూడడం మానేయాలి. వాళ్ళ కాసేట్ రిలీజ్ ఒక్కో కార్యక్రమానికి అయ్యే డబ్బుతో ఉదయకిరణ్ సినిమాలు ఒకటైనా తీయవచ్చు. అటువంటి నిజమయిన సినిమా హీరో, సహజమైన లక్షణాలున్న, అందమైన, కాంక్ష ఉన్న హీరో నిలదొక్కుకునేవాడు.

    దాసరి గారు లాంటివారు కనీసం ఓ ఎవేర్ నెస్ తేవాలి. మరింతగా…
    పాపం ఉదయకిరణ్ డెసిషన్ వెనుక వ్యధ, అవమానం, నిరాశ, ఒంటరితనం…ఎంత బాధించిందో? అతన్ని.

    అయినా అతని బాధ అంతమయింది. .

  • MADIPLLI RAJ KUMAR says:

    ఇవాల్టి విద్యా విధానం మారకుండా Atma హత్యలు చావవు.

Leave a Reply to Madhu Addanki Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)