ఎటు ?

స్వాతీ శ్రీపాద

స్వాతీ శ్రీపాద

నాలో నేను ఇంకిపోతూ

నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుంటూ

నా చుట్టూ గిరిగీసుకున్న వలయంలో

ఎన్ని సముచ్చయాలు

ఎక్కడెక్కడో పరిచ్చేదాలు

నిట్టనిలువునా ఒరుసుకుంటూ పారే నదీ నదాలు

 

సంకోచ వ్యాకోచాల మధ్య కుదిస్తూ విస్తరిస్తూ

కాస్సేపు నీలిని౦గి పరచుకున్న సముద్రాన్నవుతాను

అంతలోనే నూతి నీళ్ళలో మోహ౦ చూసుకునే చిన్నబోయిన

గోరంత నెలపొడుపు జాబిలినవుతాను

 

దిగంతాలు తాకే రెక్కలతో ఒక్కోసారి ఆల్బెట్రాస్ పక్షినవుతాను

 అంతలో

నీళ్ళ లో కరిగిపోయే తెలి మబ్బు నీడనూ అవుతాను

 

2.

రోజుకి ఎన్ని రూపాలు మార్చుకు౦టూనో

ఊహకందని లోకాల మధ్య విహరిస్తూ ఉంటాను

అయితే నేలమీద రెండడుగులు వేసేందుకు

పంచ ప్రాణాలూ అరచేత పెట్టుకు

పలుమార్లు తత్తరపడుతూ తప్పటడుగులే వేస్తాను

అడుగు అడుగునా మొలుచుకు వస్తున్నసూదిమొనల మీద

రక్తపు టేరులు మరిగించే లేతగాయపు చిరునామా నవుతాను

3.

ఇక్కడ ఊహలకూ, పులకింతలకూ కూడా వెలకడతారట

మనసులకూ ,ప్రేమలకూ కాలం చెల్లి

సంపాదనలనూ , అవసరాలనూ అందలాలు ఎక్కించాక

కొలమానాల విలువలు మిల్లీ కొలతలకు పడిపోయాక

కలిసినంత సమయం పట్టని విడిపోడాలు

దిక్కులనూ మూలలనూ ముక్కలు చేసి

ఎక్కడ పంచుకు౦టాయి

పగిలిపోయిన గాజు అనుభూతులు

4.

నాలో నేను ఒక సుడి గు౦డాన్నై

నాలోకి నన్ను  లాగేసుకు౦దుకు

నేను నేనుగా ప్రకటి౦చు కోవాలని

అక్షరాలూ నాలుగు పోగేసుకు౦దామని

ఇలా నీటి చెలమల్లోకి

కన్నీటి పాయల్లోకి ….

– స్వాతీ శ్రీపాద

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Download PDF

19 Comments

  • desaraju says:

    బావుంది, మంచి పోయెమ్

  • mercy margaret says:

    కవిత బాగుంది ..చదివినంత సేపు నాతో నేను మాట్లాడు కుంటున్నట్టు అనిపించింది.

    • swatee Sripada says:

      మర్సీ మనం ఇలా కవిత్వమే మాతాడుకుంటాం కదా

  • sailajamithra says:

    ఒక అద్భుతం చూసినట్లుంది స్వాతి గారు . చాలా బావుంది .

    • swatee Sripada says:

      శైలజా అది చూసే నీ మనసు గొప్పతనం ,థాంక్యూ

  • రవి says:

    స్వాతీ గారు,
    పోయెమ్ చాలా బాగుంది.
    అభినందనలు!

  • Elanaaga says:

    భావసౌకుమార్యంతో కూడుకున్న కవిత కనుక బాగుంది. అభినందనలు

  • ఎక్కడినుంచో యెగిరి ఇక్కడ పడ్డాను…
    అటూ ఇటూ తిరుగుతుంటే ‘ఎటు?’ అన్నారు స్వాతి శ్రీపాద గారు…
    నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకుని చెప్పాను…
    అక్షరాలు నాలుగు పోగేసుకు౦దామని…
    పగిలిపోయిన గాజు అనుభూతుల ముక్కలు
    కొన్నైనా యేరుకుందామని
    వచ్చానని…

    వెలకట్టలేనంత అందంగా పొందికగా వ్రాసిన ఒద్దికైన కవితకు
    ఒక నూతన మిత్రుని జేజేలు…

  • swatee Sripada says:

    మీ కవితాత్మకు అభినందనలు. జేజేలకు కృతజ్ఞతలు.

  • MADIPLLI RAJ KUMAR says:

    ఊహల్లాంటి శిఖరాలు, పక్కనే వాస్తవాల లోయలూ… అలా ఓ పర్వతారోహణం లా ఉందండీ మీ కవితా పఠనం నాకు.

  • erathisathyanarayana says:

    జలంలా చలనాత్మకమైన వైరుధ్యాల వైషమ్యాల జీవనంలో వ్యక్తిత్వపు అస్తిత్వ నాట్యాన్ని బాగా [ప్రదర్శించారు ] వర్ణించారు .

  • pathipaka mohan says:

    mee poem bagundi

  • టి. చంద్రశేఖర రెడ్డి says:

    స్వాతీ శ్రీపాద గారికి,
    మీ కవిత ఒకటికి రెండుసార్లు చదివాను. మీ భావాలు నాలో కొంత సంచలనం కలిగించిన మాట వాస్తవం కనుక అంగీకరించాలి. కవిత బాగుంది అని చెప్పి వదిలేస్తే నా విద్యుక్త ధర్మాన్ని పాఠకుడిగా నేను నిర్వర్తించినట్లు కాదు. అందుకని- లౌక్యం తెలియని జీవినుంచి మరో నాలుగు వాక్యాలు.
    గిరి అనే పదానికి మీరనుకునే అర్థం లేదు. అది గిఱి. గిఱి అంటేనే వలయాకారపు రేఖ. గిఱి అన్నతర్వాత వలయం అని మళ్ళీ అనటం వ్యర్ధ పదప్రయోగం.
    పరిచ్చేదాలు కాదు. పరిచ్ఛేదాలు.
    నిట్టనిలువునా బదులు అడ్డదిడ్డంగా మరింత సందర్భోచితమేమో!
    మోహం ఎంత భయంకరమైన అక్షర దోషం!
    నెలపొడుపు అన్నతర్వాత జాబిలి అవసరమా?
    నీడ నీళ్ళలో కరిగిపోతుందా చెదిరిపోతుందా?
    లేత గాయాలకే రక్తపుటేరులు పారతాయా? మరగటం మాట అటుంచి

    భవదీయుడు
    టి. చంద్ర శేఖర రెడ్డి
    09866302404

    • swatee Sripada says:

      చంద్రశేఖర్ రెడ్డి గారూ
      ముందుగా ఒక మాట నన్ను నేను సమర్ధించుకునే ప్రయత్నం కాదిది.
      ఈ కవిత ప్రతి అక్షరానికీ వివరణ నా వద్ద ఉంది, కాని రసాస్వాదన చదివే వారికే
      వదిలెయ్యదలచుకున్నాను.
      నూతి నీళ్ళలో మోహ౦ చూసుకునే చిన్నబోయిన

      గోరంత నెలపొడుపు జాబిలినవుతాను —ఎల్లలు లేని సముద్రాన్ని కాసేపటికే ఆ మోహం ఇరుకైన ఉపరితలంపై చూసుకుని చిన్నబోయిన కనీకనిపిమ్చని గోరంత నెలపొడుపు జాబిలి కావడం —గోరంత వెలుగిచ్చే జాబిలీ అనే అర్ధం లో
      నెల పొడుపు : తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)

      చంద్రోదయం,

      గిరి : శ్రీహరి నిఘంటువు (రవ్వా శ్రీహరి) Report an error about this Word-Meaning గ్రంథసంకేత వివరణ పట్టిక
      వి.

      అవధిగ గీయు గీత, నియమము, ఆజ్ఞ.

      నా చుట్టూ గిరిగీసుకున్న వలయంలో–ఇక్కడ చాలా అర్ధాల్లో గిరి అనేది రాసాను సారీ వ్రాసాను అనాలా నా చుట్టూ ఒక రక్షణ వలయంలా గీసుకున్న నియమాలలో………..

      పరిచ్చేదం -ఎంత ప్రయత్నించినా ఒట్టు గూగుల్ ఇన్పుట్ తెలుగులో రావడం లేదు

      నేను రాసింది మోహమే—మొహం కాదు
      refrain is a poetic device
      అందుకే నెలపొడుపు జాబిలీ stress చేసిచెప్పినది
      నీళ్ళలో నీడ కనబడుతుందా
      లేతగాయం అనివాడినది కొత్త గాయాలని ,తేలిక గాయాలు కాదు .రక్తపుటేరులు మరగట0
      సూది
      మొనల గాయాల మంటలు

      పరిచ్ఛేదము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు Report an error about this Word-Meaning
      parich-chhēdamu
      [Skt.] n.

      1. A division of a book, a section, or chapter. గ్రంథభాగము.
      2. A limit, extent, మేర.
      నా కవితలో ఒక్క పదం తొలగించినా అది అవకర0గానే
      కనిపిస్తోంది నాకు .
      పెద్దలు మీ విమర్శకు వినమ్రంగా కృతజ్ఞతలు

  • టి. చంద్రశేఖర రెడ్డి says:

    చిన్న సవరణ. విద్యుక్త ధర్మం కాదు. విధ్యుక్తధర్మం.

    • swatee Sripada says:

      ఒత్తులతో సమస్య సాఫ్ట్ వేర్ వాళ్ళ పరిష్కారం కాక వదిలేసాను

Leave a Reply to రవి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)