రెప్పతెరిచేలోగా…

జాన్ హైడ్ కనుమూరి

జాన్ హైడ్ కనుమూరి

మబ్బుకమ్మిన ఆకాశంలో ఎటో తప్పిపోయిన గాలిపటమై
గాలిపటం – చేతిలోని చరకాల మధ్య
తెగిన దారమైనప్పుడు
ఏది ఆత్మహత్య చేసుకున్నట్టు?
***
వినీలాకాశంలోకి
గాలిపటాలను రంగుల్లో ఎగురవేయడం
దారాలను మాంజాలుగా మార్చడం
తెగిన దారానికి విలవిలలాడే గాలిపటాన్ని
కేరింతలతో వినోదించడం జీవితపరమార్థం అనుకుంటాం
***
రోషాన్నో పౌరుషాన్నో
కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
ఎగిరిపడ్డ కత్తివేటుకు
రక్తమోడిన నేల
విలవిలలాడే దేహాలమధ్య
వినోదమెవరిది? జూదమెవరిది?
***
అంతా ఎదురుగానే ఉంటుంది
సూర్యాస్తమయానికి వెలుగుపై చీకటికమ్మిట్టు
ఒక భ్రమ ఒకభ్రాంతి
వెలుగురేఖను కత్తిరిస్తుంది
రెప్పతెరిచేలోగా
ఒకదేహం జీవశ్చవమౌతుంది
ఒకదేహం కన్నీరుమున్నీరౌతుంది
***
ఆత్మను ఎవ్వరూ హత్యచేయలేరు
మెలిపెట్టీ  మెలిపెట్టీ
నొక్కేసేచేతులమధ్య స్వరాన్ని కోల్పోతుంది
ఇక శరీరం
తన్నుతాను హత్యకావించుకుంటుంది
గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
“ఆత్మహత్య”  అరుపులు కోలాహలమౌతాయి
***
చెమర్చిన కన్నేదీ
నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు
***
ఎక్కడో
ఒక తీతువు గొంతును
ఒక రాబందు రెక్కలను సరిచేసుకుంటాయి
****
తెగిన గాలిపటం ఏ కొమ్మకో చిక్కుకుంటుంది
రక్తమోడ్చిన పందెపు పుంజు మషాలాలతో ఎవ్వరికో విందు చేస్తుంది
ఇది ఆత్మహత్యేనా అని చెవులు కొరుక్కుంటూనే ఉంటాం

Download PDF

13 Comments

  • buchireddy gangula says:

    బాగుంది జాన్ జి
    ——————————
    బుచ్చి రెడ్డి గంగుల

    • జాన్ హైడ్ కనుమూరి says:

      థాంక్స్
      బుచ్చి రెడ్డి గంగుల గారు

  • రాజశేఖర్ గుదిబండి says:

    “రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది?”

    చాలా బాగుంది సర్

  • Rajasekhar Gudibandi says:

    “రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది?”

    —-చాల బాగుంది సర్

  • శ్రీనివాసు గద్దపాటి says:

    రోషాన్నో పౌరుషాన్నో
    కళ్ళలోంచి కాళ్లలోకి తెచ్చి
    ఎగిరిపడ్డ కత్తివేటుకు
    రక్తమోడిన నేల
    విలవిలలాడే దేహాలమధ్య
    వినోదమెవరిది? జూదమెవరిది….

  • రవి says:

    జాన్ గారు,

    కవిత బాగుంది.

    రవి

  • సగం కవిత వాచ్యమైంది. అయినా మిగతా కవితలో మంచి ధ్వని ఉంది. తాకే గుణమున్న మంచి కవిత.
    సుబ్బాచారి పులికొండ.

    • జాన్ హైడ్ కనుమూరి says:

      మీ పరిశీ లనాత్మకమైన స్పందనకు ధన్యవాదాలు
      “సగం కవిత వాచ్యమైంది.” కొంచెం వివరించ గలరా?

  • Elanaaga says:

    ఈ కవితలో పూర్తి స్పష్టత లేకపోయినా కవితా స్పర్శ,కళాత్మకత ఉండటం విశేషం. కాబట్టి Congratulations .

  • జాన్ హైడ్ కనుమూరి says:

    స్పందించిన అందరికి మరియు పత్రిక సంపాదకులకు నా ధన్యవాదాలు

  • Augustus Kanumuri says:

    చెమర్చిన కన్నేదీ
    నిర్జీవదేహానికి జీవాన్నివ్వలేదు

  • Rahmat says:

    I’m impressed by your writing. Are you a professional or just very knlgeedwoable?

  • ‘గొంతును నులిమిన చెయ్యి కనబడకుండా
    “ఆత్మహత్య” అరుపులు కోలాహలమౌతాయి’- కవిత బావుంది. ఎన్నో ఆత్మ హత్యలు నిజానికి, గొంతు నులిమిన చేతులు కనపడని హత్యలే.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)