రామా చంద్రమౌళి కి ‘ఫ్రీ వర్స్ ఫ్రంట్-2012’పురస్కారం

free verse front-2012

free verse front-2012

వరంగల్:1967 వ సంవత్సరంలో స్థాపించబడి మొట్టమొదట రు.116 రూపాయల నగదు పురస్కారంతో ‘వచన కవిత ‘కు జవజీవాలనందించి ప్రోత్సహించాలన్న సదాశయంతో డా.కుందుర్తి ఆంజనేయులుగారు స్థాపించిన ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం క్రమేపి తెలుగు కవితా ప్రపంచంలో ‘సాహిత్య అకాడెమి ‘తో సమాన విలువగల ఒక సామాజిక గౌరంగా స్థిరపడింది.కుందుర్తి కీర్తిశేషులైన తర్వాత ఆయన సతీమణి కుందుర్తి శాంత, కొడుకు సత్యమూర్తి ఈ పురస్కారాల ప్రదానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.తెలుగు కవుల్లో ప్రముఖులైన శివారెడ్డి,డా.ఎన్.గోపి, నగ్నముని,నిఖిలేశ్వర్,వరవరరావు..వర్థమాన కవులు శిఖామణి,యాకూబ్ వరకూ ఈ పురస్కారాన్ని ఇంతవరకూ అందుకుంటూ వచ్చారు.

నిన్న హైదరాబాద్ లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సంవత్సర వార్షిక సాహిత్య సమావేశంలో ప్రతిష్టాత్మకమైన ఈ ‘ఫ్రీవర్స్ ఫ్రంట్-2012′ పురస్కారాన్ని వరంగల్లుకు చెందిన ప్రముఖ కవి రామా చంద్రమౌళి రచించిన ‘అంతర ‘కావ్యానికి ప్రదానం చేసారు.ఈ సందర్భంగా ఘనంగా జరిగిన సభలో రామా చంద్రమౌళిని పదివేల రూపాయల నగదుతో,విలువైన జ్ఞాపికతో,శాలువాతో,శ్రీ నగ్నముని,శీలా వీర్రాజు,డా.నాళేశ్వరం శంకరం సన్మానించారు.శ్రీ శిఖామణి ‘అంతర ‘కవితా సంపుటిని సమీక్షించి ఎందుకు ఈ కావ్యం పురస్కారార్హమో సభికులకు తెలియజేశారు.

అనేకమంది కవితాభిమానులు పాల్గొన్న ఈ సభలో ప్రముఖ కవులు కె.శివారెడ్డి,డా.ఎన్.గోపి,నిఖిలేశ్వర్,సుధామ,కందుకూరి శ్రీరాములు,డా.గుడిపాటి,సి.ఎస్.రాంబాబు,డా.కె.ఎల్.వి.ప్రసాద్,స్వాతి శ్రీపాద మొదలైన ప్రఖ్యాతులతో పాటు శ్రీమతి శీలా సుభద్రాదేవి,కుందుర్తి శాంత మరియు కుందుర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత రామా చంద్రమౌళి ని జంటనగరలకు చెందిన పలువురు ఆయన అభిమానులు,వరంగల్లు నుండి ప్రత్యేకంగా సభలో పాల్గొన్న కవిత్వ ప్రేమికులు అభినందించారు

Download PDF

10 Comments

 • rajaram thumucharla says:

  రామాచంద్రమౌళి గారు సీనియర్ కవే కాకుండా నిరంతర కవిత్వ రచన చేస్తున్న కవి .వారికీ అవార్డ్ వచ్చినందుకు నమస్సులతో అభినందనలు.

 • buchireddy gangula says:

  కంగ్రాట్స్ మౌళి గారు —-

 • buchireddy gangula says:

  కంగ్రాట్స్ మౌళి గారు

  ———————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 • chandramouli rama says:

  బుచ్చిరెడ్డి గారూ,
  ధన్యవాదాలు.
  -mouLi

 • DrPBDVPrasad says:

  కొంచెం ఆలస్యమైన పురస్కారాలు లక్ష్యాన్ని చేరతాయి.
  పురస్కారం మౌళి గారికి పుష్పగుచ్చం పాటిదే
  అయినా…
  కవిమిత్రుల సమక్షంలో కుందుర్తి పేరిట ఇచ్చేది కాబట్టి
  మాలాంటి రామా చంద్రమౌళిగారి అభిమానులకు ఆనందమే

  • prof.raamaa chandramouli says:

   డా.ప్రసాద్ గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు.

   – మౌళి

 • AMARA JYOTHI says:

  ANTARA KAVITA SAMPUTIKI PRAKHYATA KAVI RAMA CHANDRAMOULI GARKI VACHANA KAVITA PITAMAHULU STHAPINCHINA KUNDURTI PURASKARAM ANDUKUNNANDUKU ABHINANDANALU

  AMARAJYOTHI

 • Gundeboina Srinivas says:

  ంగ్రాట్స్,సర్

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)