లోపలి లోకం…..

                              
ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో
నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం..
ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య
కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే!

విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
మిగిలేది సుదీర్ఘ మౌనం!

ఆఖరి శ్వాస తోటే అంతమయ్యే శిక్ష
ఒకటి విధించబడ్డాక
అదృష్టరేఖలెన్ని ఉన్నా అర్ధరహితాలే!
224870_513475185340722_815911299_n

వద్దనుకున్న ప్రయాణంలో తోవ తప్పినా
మధ్యలో మజిలీ ఏదో ఇష్టమౌతుంది..
పొగమంచు వదలని రహదారి పక్కన్నించి
లిల్లీకాడల చేతులు రెండు
పట్టి లాగి కూర్చోబెట్టుకుంటాయి..
కాస్త శాంతినీ.. కొంచెం ఆశనీ
నుదుటి మీద దయగా అద్దుతుంటే
నొప్పేసిన నిమిషాలన్నీ ఈసారి నవ్విస్తాయి…
తర్వాతెప్పుడో
తూరుపు జ్ఞాపకాలన్నీ
కాగితప్పడవలోకి ఎక్కించి
ఒక్కళ్ళమే వాన వింటున్న క్షణాల్లోకి జారవిడిచామా

నీరెండ నిర్మలత్వం
లోపలి లోకాన్ని
ఆదరంగా అలుముకుంటుంది!

     ~ నిషిగంధ

Download PDF

17 Comments

 • Beautiful.. Optimistic!
  Great to see you back after long time! :-)

 • Ravi Verelly says:

  Awesome poetry!

  “విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక”

  “తూరుపు జ్ఞాపకాలన్నీ కాగితప్పడవలోకి ఎక్కించి ఒక్కళ్ళమే వాన వింటున్న క్షణాల్లోకి జారవిడిచామా”

  భలే ఉన్నాయి ఈ లైన్లు.

 • అర్ధమైందని చెప్పలేను కానీ అభివ్యక్తి బాగుంది.

 • Saikiran says:

  విరిగిపడిన శకలాలు
  సెలయేటిలో గులరాళ్ళలా
  గుండెలోతుల్లో సర్దుకు కూర్చున్నాక
  మిగిలేది సుదీర్ఘ మౌనం!

  వండర్ఫుల్ లైన్స్ నిషిగంధ గారు.

 • Manasa says:

  ‘Wow’ is the word, Nishi. Good to see you back :)

 • Manasa says:

  “Wow” is the word.So beautifully written;

 • “విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
  గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
  మిగిలేది సుదీర్ఘ మౌనం!”

  Wonderful..!

 • డిఫైన్ చెయ్యడానికి అంతు చిక్కని లోపలి లోకాన్ని బాగా పట్టుకున్నావ్.

  నాకు బాగా నచ్చిన లైన్స్

  విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
  గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
  మిగిలేది సుదీర్ఘ మౌనం!

  ఆఖరి శ్వాస తోటే అంతమయ్యే శిక్ష
  ఒకటి విధించబడ్డాక
  అదృష్టరేఖలెన్ని ఉన్నా అర్ధరహితాలే! — How True!!!

 • kcubevarma says:

  తర్వాతెప్పుడో
  తూరుపు జ్ఞాపకాలన్నీ
  కాగితప్పడవలోకి ఎక్కించి
  ఒక్కళ్ళమే వాన వింటున్న క్షణాల్లోకి జారవిడిచామా…చాలా బాగుంది ..

 • మొదటినుంచీ చివరి వరకూ ప్రతి పదమూ ఒక చిరు అల స్పర్శ
  కవిత పూర్తి అయే టప్పటికి.. మానస అన్నట్టు.. just a wow feel !

 • చాలా బావుందండి

 • Jyothi says:

  నాది కూడా నారాయణ స్వామి గారి మాటే “అర్ధమైందని చెప్పలేను కానీ అభివ్యక్తి బాగుంది.”
  Good to see you back, Nishi :)

 • అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. :-)

  నారాయణస్వామి గారు, ఆశ్చర్యం! నేను మామూలు కంటే ఎక్కువ సూటిగా/సరళంగానే భావాన్ని చెప్పాననుకున్నాను. :-)

 • narayanasharma says:

  చాలమంచికవిత..బాగుంది..ఈ కాలపు వ్యక్తీకరణ పరికరం మనోవైఙ్ఞానిక భూమికే అని రుజువు చేస్తుంది..నిశ్శబ్దశ్శబ్దం..లాంటి ప్రయోగాలపై కొంత రూఢి అవసరమేమో…

 • టి. చంద్ర శేఖర రెడ్డి says:

  ఆలోచనల్ని కవిత్వంగా మార్చాలంటే కొంత ఆలోచించాలి. కవిత్వాన్నే సూటిగా ఆలోచించకలిగితే ఆ అగత్యం ఉండదు. మనసుకి తట్టిన దాన్ని యథాతథంగా కాగితం మీద పెడితే కవన వనంలో పాఠకుడిని విహరింపచేయడం సాధ్యమా? అనుమానం ఉన్నవాళ్ళు ఒక్కసారి ఈ కవిత చదవండి. నివృత్తి ఎవరి ప్రవృత్తో బోధపడుతుంది.

  భవదీయుడు
  టి. చంద్ర శేఖర రెడ్డి09866302404

 • prasuna says:

  Ela miss ayyani kavita. Very beautiful poem Nishi.

 • ధన్యవాదాలు నారాయణ శర్మ గారు, చంద్రశేఖర రెడ్డి గారు, ప్రసూన…..

  :-)

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)