పాండవులు ‘కౌరవులు’ ఎందుకు కారు?

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలోనే ఉండిపోయి, తపతితో కాపురం చేయడం; అక్కడ అతని రాజ్యంలో అనావృష్టి ఏర్పడడం, అప్పుడు వశిష్టుడు వచ్చి దంపతులు ఇద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లడం, దాంతో అనావృష్టి దోషం తొలగి పోవడం గురించి చెప్పి, చివరిగా…

‘అంత సంవరణునకుం దపతికిం దాపత్యుండై కురువంశకరుడు కురుండు పుట్టె, నది మొదలుగా మీరు దాపత్యుల రయితిరి’ అని గంధర్వుడు చెప్పాడు.

ఈ చివరి వాక్యంలో కథకుని గొంతు, గంధర్వుని గొంతు విడివిడిగా మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి చూడండి…అంతే కాదు, ఉభయులూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకున్నారని కూడా ఈ వాక్యం చెబుతోంది. సంవరణునికీ తపతికీ ‘తాపత్యుడు’గా కురుడు పుట్టాడని చెప్పడం గంధర్వుని ప్రయోజనం అయితే, ఆ వెంటనే ‘కురువంశకరుడు’ పుట్టాడని చెప్పడం కథకుని ప్రయోజనం. మీరు తాపత్యవంశీకులు అంటూ మొదట శృతి చేసింది గంధర్వుడే కనుక, తపతీ సంవరణులకు కురుడు పుట్టినప్పటినుంచీ మీరు తాపత్యవంశీకులు అయ్యారన్న మాటతో అతనే కథనానికి ముగింపు చెపుతున్నాడు.

మొత్తం మీద ఈ ఘట్టం కథకుడికీ, ఆదివాసీ గంధర్వుడికీ మధ్య సయోధ్య, సర్దుబాటు ఎలా ఏర్పడ్డాయో, ఇద్దరూ ఎలా ‘రాజీ’ పడ్డారో కూడా చెబుతోంది. ఇలా రాజీ పడడం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వివిధ తెగలు, వాటికి గల వేర్వేరు ప్రయోజనాలు, వేర్వేరు విశ్వాసాలు, వేర్వేరు ఆరాధనా పద్ధతుల మధ్య సంఘర్షణ జరగడం, చివరికి రాజీపడడం భారతదేశ పురాచరిత్ర, చరిత్ర పొడవునా జరుగుతూనే ఉంది. భౌగోళిక స్థితీ, విస్తారమైన వనరుల అందుబాటు మొదలైన కారణాల వల్ల భారతదేశానికి స్వభావ సిద్ధంగా సంక్రమించిన గుణం అది.  కోశాంబీ చేసిన విలువైన ప్రతిపాదనలలో ఇది ఒకటి.

వ్యక్తుల ముఖతా వ్యక్తమవుతున్న ఈ రాజీని వారు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలకు ఆపాదించి చూడండి…మీరు తాపత్యవంశీకులు అని పాండవులకు నొక్కి చెబుతున్న గంధర్వుడు మాతృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, కురువంశకరుడుగా కురుడు పుట్టాడని చెబుతున్న కథకుడు పితృస్వామ్యవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మానవజీవన ప్రస్థానంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మళ్లడం ఒక గొప్ప మలుపు అనుకుంటే, ఆ పరివర్తన క్రమంలో ఒక దశలో ఉభయవ్యవస్థలూ రాజీ పడడం, అంటే రెండు రకాల గుర్తింపులనూ ఆమోదించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అదే జరిగిందనడానికి, మన దగ్గరే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక సాక్ష్యాలు ఉన్నాయి కూడా.

బహుశా తపతీ-సంవరణుల కథ ఆ దశకు చెందినదే!!!

అందులోకి మరింత లోతుగా వెళ్లబోయే ముందు, మరో ముఖ్యమైన అంశం గురించి చెప్పుకుని, కిందటి వ్యాసం చివరిలో వేసుకున్న ప్రశ్నల దగ్గరికి వెడదాం.

మీరు తాపత్యవంశీకులని గంధర్వుడు పాండవులకు అంత గుచ్చి గుచ్చి ఎందుకు చెబుతున్నాడు? తపతి తమ ఆదివాసుల ఆడబడచు కనుక, ఆవిధంగా మనకు చుట్టరికం ఉందని చెప్పడం ఒక ఉద్దేశం. ఆ చుట్టరికం కారణంగానే అర్జునునికి చాక్షుసి అనే విద్యనూ, పాండవులందరికీ గుర్రాలనూ ఇవ్వజూపాడు.  చాలా కాలానికి కలసుకున్న గణబంధువులు ఒకరి కొకరు కానుకలు ఇచ్చి పుచ్చుకునే గణసంప్రదాయాన్ని కూడా అది వ్యక్తీకరిస్తూ ఉండచ్చు. అంతకు మించి, మీరు తాపత్యవంశీకులు, అంటే తపతి పరంపరకు చెందినవారే తప్ప కురుని పరంపరకు చెందినవారు కారని నొక్కి మరీ చెప్పే ఒకవిధమైన పట్టుదల గంధర్వుడి మాటల్లో ధ్వనిస్తోంది.

Arjuna_and_His_Charioteer_Krishna_Confront_Karna

కురువంశీకులుగా పాండవులు కూడా కౌరవులే అవుతారు. కానీ, కౌరవులుగా దుర్యోధనుడు, అతని సోదరులు మాత్రమే గుర్తింపు పొందుతున్నారు. పాండవులకు ఆ గుర్తింపు లేదని చెప్పడానికి గంధర్వుడు మీరు తాపత్యవంశీకులని ప్రత్యేకించి చెబుతున్నాడా?!

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది. నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా. అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో. ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే. ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు. ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి. పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

మొత్తానికి ఈ ‘గుర్తింపు’ల విషయంలో చాలా గందరగోళమే ఉన్నట్టుంది.  నిజంగా కూడా కురుని పరంపరకు చెందినవారుగా పాండవులు కూడా కౌరవులే కావాలి. కానీ కౌరవుల నుంచి వారిని విడదీసి పాండవులుగానే ఎందుకు చెబుతున్నట్టు? దుర్యోధనుడికీ, అతని తమ్ముళ్ళకీ కౌరవులనే గుర్తింపుకు తోడు ధృతరాష్ట్రుని సంతానంగా ధార్తరాష్ట్రులు అనే గుర్తింపు కూడా ఉంది. అలాగే, పాండురాజు కొడుకులుగా ధర్మరాజు, అతని సోదరులకు పాండవులు అనే గుర్తింపు ఉంది. ఈ విషయంలో ఇరువురికీ సామ్యం కుదిరింది కనుక పేచీలేదు. మహాభారతంలో ఆ ఉభయులనూ ఇలా తండ్రివైపునుంచి చెప్పడం చాలా చోట్లే కనిపిస్తుంది కూడా.  అయితే, తేడా ఎక్కడుందంటే, తల్లి వైపునుంచి చెప్పడంలో.  ధర్మరాజును, అతని సోదరులను తల్లి వైపునుంచి కౌంతేయులు గా చెప్పడం మహాభారతంలో చాలా చోట్ల కనిపిస్తుండగా; దుర్యోధనాదులను తల్లి వైపు నుంచి, గాంధారేయులుగా నొక్కి చెప్పడం, నేను గమనించినంతవరకు అంతగా కనిపించదు. ఇక, పాండవులకు కౌరవులన్న గుర్తింపు లేని సంగతి స్పష్టమే.

ఇంతకీ ఈ గుర్తింపు తేడాలు ఏం చెబుతున్నాయి? కౌరవులు పితృస్వామికవ్యవస్థకు, పాండవులు మాతృస్వామిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతినా? పాండవులు తాపత్యవంశీకులని గంధర్వుడు నొక్కి చెప్పడానికి కారణం, వారు మాతృస్వామ్యవ్యవస్థకు చెందినవారని గుర్తుచేయడమా? అది కూడా ఎప్పుడు? పాండవులు సరిగ్గా ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళేముందు! ఆ అయిదుగురు సోదరులూ ఆమెను వివాహం చేసుకోబోతున్నారు కనుక, అందువల్ల తలెత్తగల ఆక్షేపణను నివారించే ముందు జాగ్రత్తలో భాగంగా వారి మాతృస్వామిక నేపథ్యం గురించి గంధర్వునితో కథకుడు మాట్లాడిస్తున్నాడా? సరే, పితృస్వామిక కోణం నుంచి కథ చెప్పడం మీదే కథకునికి ఎక్కువ ఆసక్తి అన్నది వేరే విషయం. ద్రౌపదీ-పాండవుల వివాహానికి ఎదురు కాగల ఆక్షేపణలకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని వ్యాసుడు కూడా మరో రూపంలో త్వరలోనే చేయబోతున్నాడు.

ఇక కుంతికీ, ద్రౌపదికీ సామ్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కుంతి కన్యగా ఉన్నప్పుడు ‘వర’ ప్రభావంతో ఒక కొడుకునీ, వివాహితగా ‘నియోగ’ పద్ధతిలో ముగ్గురు కొడుకుల్ని కంటే; ద్రౌపది అయిదుగురు సోదరులను వివాహమాడింది. ఇప్పుడు కుంతీ, ద్రౌపదులతో ధృతరాష్ట్రుని భార్య గాంధారిని పోల్చి చూడండి. ఆ ఇరువురితో ఈమెకు ఎలాంటి పోలికా కనిపించదు. పెళ్లి కాకముందు గాంధారి పూర్తిగా తండ్రి చాటు బిడ్డ. ఆమెను ధృతరాష్ట్రుడికి ఇచ్చేశానని తండ్రి సుబలుడు చెప్పడం, అప్పటికప్పుడు ఆమె ధృతరాష్ట్రునికి అర్థాంగిగా మారిపోయి నేత్ర పట్టం కట్టుకోవడం, పెళ్లి తర్వాత భర్త చాటు ఇల్లాలుగా అంతఃపురానికే పరిమితం కావడం; కుంతీ, ద్రౌపదులకు భిన్నంగా ఆమెను చూపిస్తున్నాయి. గాంధారి పితృస్వామిక స్త్రీకి అసలు సిసలు ప్రతినిధి.

పాండవులకు కౌరవులన్న గుర్తింపును నిరాకరించడం అంటే ఏమిటి? దానిని ఇంకొంచెం పొడిగిస్తే, పైతృకమైన ఆస్తిలో కూడా వాటా నిరాకరించడమా?! కొంపదీసి కురు-పాండవ ఘర్షణ మొత్తానికి అదే కీలకమా? ఈ విధంగా ఇది మాతృస్వామ్య, పితృస్వామ్యాల మధ్య ఘర్షణ అనుకుంటే, యుద్ధం చివరిలో అశ్వత్థామ ఉపపాండవులనందరినీ వధించడం మాతృస్వామ్య అవశేషాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం అనుకోవాలా? చివరికి చూడండి, తనకు మాత్రమే భార్య అయిన సుభద్ర వల్ల అర్జునుడికి కలిగిన అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తే అనంతర కాలంలో రాజయ్యాడు. అంటే మాతృస్వామ్యానికి కాలం చెల్లిందనీ, పితృస్వామ్యం స్థిరపడిందనీ అది సూచిస్తోందనుకోవాలా?

చూసారా, విషయం ఎన్ని లోతుల్లోకి వెళ్లిపోతోందో! అనుకోకుండా కీ ఇచ్చి విడిచిపెట్టిన కారు బొమ్మలా నా ‘కీబోర్డు’ మీద ఈ విషయాలు వాటంతట అవే పరుగు పెడుతున్నాయి. ఈ పరుగుకు అర్జెంటుగా కళ్ళెం వేయాల్సిందే. సమస్యేమిటంటే, ఇంత గంభీరమైన విషయంలోకి పూర్తిగా తలదూర్చడానికి నేనిప్పుడు సిద్ధంగా లేను. అయితే, చాపల్యం అలాంటిది….ఎలాగూ మునిగాను కనుక, ఈ చర్చనుంచి పక్కకు తప్పుకునే ముందు చివరిగా ఒక్క ఆసక్తికరమైన పరిశీలనను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.

అదేమిటంటే, పైతృకమైన ఆస్తికి అర్హత ప్రశ్నార్థకం అయినది పాండవులు ఒక్కరి విషయంలోనేనా?… కాదు, అదే వంశంలో, వారికి సమకాలికంగానే మరొకరు ఉన్నారు…ఆయన భీష్ముడు!

అవును, భీష్ముడే. పాండవులు కౌంతేయు లైనట్టే భీష్ముడు గాంగేయుడు. అంటే, గంగ కుమారుడు. పాండవులలానే అతడు కూడా భరతవీరుడే, అందుకు అభ్యంతరం లేదు. భరతవంశస్థు డనేది ఒక విశాలమైన గుర్తింపు. కౌరవులనేది అలా కాదు. అది, ఒక నిర్దిష్టమైన గుర్తింపుగా కనిపిస్తుంది.  కనుక కౌంతేయులైన పాండవులలానే, గాంగేయుడైన  భీష్ముడు కూడా ‘కౌరవుడు’ కాడనే అనుకోవాలి. నేను ఆ దృష్టితో మహాభారతాన్ని పరిశీలించలేదు కనుక, భీష్ముని కానీ, పాండవులను కానీ కౌరవ్యులుగా ఎక్కడైనా పేర్కొన్నారా, పేర్కొని ఉంటే ఎన్నిసార్లు పేర్కొన్నారనేది చెప్పలేకపోతున్నాను. ఇప్పటికిప్పుడు ఆదిపర్వంలోని కొన్ని పేజీలను తిరగేస్తే భీష్ముని చాలాసార్లు గాంగేయుడిగానూ, ఒక్కసారి మాత్రం ‘పౌరవ్యుడి’గానూ పేర్కొనడం కనిపించింది…

చూడబోతే, ఈ గుర్తింపుల వ్యవహారం అంత సాదా సీదాగా తేలేలా కనిపించడం లేదు. ఇందులో చాలా మతలబులే ఉన్నాయనిపిస్తోంది.

ఇంతకీ కురుడు వంశకర్తగా కౌరవులు అనే పేరు ఏర్పడినతర్వాత ఎన్ని తరాలు గడిచాయో చూద్దామని లెక్క వేశాను. కురుడి నుంచి పాండవుల దగ్గరికి వచ్చేసరికి తొమ్మిది తరాలు మాత్రమే గడిచాయి. ఈ మధ్యలో వంశకర్తలు ఎవరూ లేరు. మహాభారతం పాండవులనే ఒక వంశంగా చెబుతోంది. అంటే కురుని తర్వాత పాండురాజే వంశకర్త అయ్యాడన్నమాట.  ఆ వంశంలో ప్రసిద్ధుడైన చివరి రాజు జనమేజయునికి కథ చెబుతున్న కథకుడు, జనమేజయుని  వరకూ సుదీర్ఘవంశక్రమాన్ని వివరించిన తర్వాత చివరిగా ఆ మొత్తం వంశాలను అయిదుగా వర్గీకరిస్తున్నాడు.

అవి: 1. ఐలులు 2. పౌరవులు 3. భరతులు 4. కౌరవులు 5. పాండవులు.

అసలు ఈ వంశక్రమాన్ని వివరించడం లోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని మరో సందర్భానికి వాయిదా వేస్తాను. పాండవులు, కౌరవుల కాలానికి వచ్చేసరికి, వారికి తొమ్మిది తరాల వెనకటివాడైన కురుని పేరిట ఏర్పడిన ‘కౌరవు’లనే వంశనామమే చలామణిలో ఉంది. అదే అధికారిక వంశనామం కూడా. బహుశా అదే అప్పటికి నిష్కళంకమైన వంశ నామం కూడా. ఎందుకంటే, కురునితో మొదలు పెట్టి ప్రతీపుని వరకూ…అనగా ఏడు తరాలపాటు ఆ వంశంలోని రాజుల వైవాహిక సంబంధాలలో ‘విలక్షణత’ ఏమీ లేదు. మాతృస్వామ్య/పితృస్వామ్య కోణంలో చెప్పుకోవాలంటే అవి పితృస్వామిక సంబంధాలే కాక, బహుశా సజాతి సంబంధాలు. ఆవిధంగా కురువంశం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటిది.

కానీ ప్రతీపుని కొడుకు శంతనుని దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి తిరగబడింది. శంతనుడు గంగా తీరానికి వేటకు వెళ్లినప్పుడు గంగ అందమైన స్త్రీ రూపంలో అతనికి కనిపించింది. ఆమె పట్ల అతను ఆకర్షితుడై తనను చేపట్టవలసిందని ప్రతిపాదించాడు. అందుకామె షరతులు పెట్టింది. అతనివల్ల తనకు కలిగిన సంతానాన్ని తను ఏం చేసినా అతను అడ్డు చెప్పకూడదు! అడ్డు చెప్పిన తక్షణం తను అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది. ఆమె అందానికి బందీ అయిపోయిన శంతనుడు ఒప్పుకున్నాడు. ఆమె తనకు కలిగిన ఒక్కొక్క సంతానాన్నే గంగపాలు చేస్తూ వచ్చింది. కష్టమనిపించినా షరతుకు కట్టుబడి శంతనుడు అడ్డు చెప్పలేకపోయాడు. ఏడుగురు కొడుకుల్ని అలా చేసిన తర్వాత, ఎనిమిదో కొడుకు విషయంలో ఊరుకోలేక పోయాడు. అడ్డు చెప్పాడు.  ఆ కొడుకును శంతనునికి అప్పగించేసి షరతు ప్రకారం గంగ అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. అతడే భీష్ముడు… గాంగేయుడు!

ఈ కథ పూర్తి వివరాలలోకి నేనిప్పుడు వెళ్లదలచుకోలేదు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, గంగా తీరంలో నీకు ఒక స్త్రీ కనిపిస్తుందనీ, ఆమె కులగోత్రాలు ఏమిటని అడగకుండా ఆమెను పెళ్లి చేసుకోమనీ తండ్రి ప్రతీపుడే శంతనునికి చెప్పడం. కుల గోత్రాలు అడగవద్దు అనడంలో ఆమెది సందేహాస్పద నేపథ్యం అన్న సంగతిని కథకుడే అమాయకంగా బయట పెడుతున్నాడు.  మళ్ళీ, తండ్రే ఆమెను చేసుకోమన్నాడని చెప్పడం ద్వారా దానిని పెద్దలు కుదిర్చిన సంబంధంగా, ఇంకా చెప్పాలంటే పితృస్వామిక వివాహంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దానినలా ఉంచితే, గంగా-శంతనుల వివాహం, తపతీ-సంవరణుల వివాహం లాంటిదే. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే అది కూడా మాతృస్వామిక వివాహం.

కనుక, గాంగేయుడైన భీష్ముడు కౌంతేయులైన పాండవుల్లానే కౌరవుడు కాదు, కావడానికి వీల్లేదు. ఆ విధంగా అతను సింహాసనానికీ అర్హుడు కాదు. అతని సింహాసన త్యాగానికీ, తన వారసులు కూడా సింహాసనానికి పోటీదారులు కాకూడదనే ఉద్దేశంతో అతను పెళ్లి కూడా మానేయడానికీ కథకుడు ఎలాంటి కారణాలైనా చెప్పవచ్చు గాక… కురువంశ స్వచ్ఛతను, పితృస్వామిక విలువలను కాపాడాలంటే అతనిని సింహాసనానికీ, పెళ్లికీ కూడా దూరంగా ఉంచవలసిందే. ఎన్ని కట్టుదిట్టాలు చేసినా భీష్ముడు మాట తప్పుతాడనే భయం ఉండచ్చు కనుక, అతణ్ణి ఈ లోకానికే దూరం చేయడం మరింత మెరుగైన పరిష్కారం. కానీ అక్కడికి వచ్చేసరికి తండ్రి శంతనుడు చక్రం అడ్డేశాడు. అతనికి ‘స్వచ్ఛంద మరణం’ అనే వరం ఇచ్చాడు. స్వచ్చంద మరణం అంటే, నీ మరణం నీ చేతుల్లోనే ఉంటుంది తప్ప, ఇంకొకరు నీ ప్రాణం తీయరని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే నీకు సహజ మరణమే కలుగుతుందని శంతనుడు అభయమిచ్చాడన్న మాట.

గంగా తీరంలో గంగ కనబడినట్టే, శంతనునికి యమునా తీరంలో దాసరాజు కూతురు సత్యవతి కనిపించింది. ఆమెను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. సత్యవతి అప్పటికే పరాశర మహర్షి వల్ల వ్యాసుడనే కొడుకుని కంది. కనుక ఆమె మాతృస్వామ్యానికి చెందినది. అయితే, సత్యవతి గంగలా తానుగా శంతనునితో పెళ్ళికి షరతు పెట్టలేదు. ఆమె తండ్రి షరతు పెట్టాడు. అంటే ఆమె తెగ పితృస్వామ్యంలోకి మళ్లే సంధి దశలోనూ ఉందన్న మాట. ఆ షరతు కూడా, సత్యవతికి కలిగే కొడుకులే నీ అధికారానికి వారసులు కావాలని మాత్రమే.

ఇంకొక ముఖ్యమైన తేడా ఏమిటంటే, గంగ శంతనుని ఇంటికి, అంటే హస్తినాపురానికి వచ్చి అతనితో కాపురం చేసినట్టు కథకుడు ఎక్కడా చెప్పలేదు. కానీ సత్యవతి హస్తినాపురం వచ్చి శంతనునితో కాపురం చేసింది. ఆమె వల్ల శంతనునికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కొంతకాలానికి శంతనుడు మరణించాడు.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది. భీష్ముడు ఒప్పుకోలేదు. ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే. విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట. వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

కానీ విచిత్రం చూడండి…భీష్ముని దూరంగా ఉంచడం కూడా కురువంశ పవిత్రతను కాపాడలేకపోయింది. చిత్రాంగదుడు ముందే మరణించగా, భీష్ముడు కాశీరాజు కూతుళ్లను ఎత్తుకువచ్చి విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసినా అతను సంతానం కనకుండానే కన్ను మూశాడు. అప్పుడు సత్యవతి కురువంశాన్ని నిలబెట్టే బాధ్యతను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమెకు మాతృస్వామ్య నేపథ్యం ఎలాగూ ఉంది. కనుక ‘విచిత్రవీర్యుడి భార్యలతో నువ్వు సంతానం కను’ అని భీష్ముడుకి చెప్పింది.  భీష్ముడు ఒప్పుకోలేదు.  ఇక మిగిలింది ‘నియోగ’ పద్ధతి. అది స్వయంగా ఆమెకు అనుభవమే. పరాశరుని వల్ల తనకు కలిగిన వ్యాసుని రప్పించింది. అతడు కూడా భీష్ముని లానే విచిత్రవీర్యునికి సోదరుడి వరసే.  విచిత్రవీర్యుని భార్యలకు సంతానమిమ్మని భీష్ముడికి చెప్పినట్టే వ్యాసునికీ చెప్పింది. ఆ చెప్పడంలో కూడా ‘తల్లి హక్కు’(Mother Right)ను చాటే ఒక మాతృస్వామిక న్యాయాన్ని గుర్తుచేసింది. ‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో, తల్లికీ అలాగే ఉంటుంది. కనుక నేను చెప్పినట్టు చేయి’ అంది. అంటే, సత్యవతి ఈ విషమ ఘట్టంలో తన మాతృస్వామిక హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించిందన్న మాట.

వ్యాసుడు తల్లి మాట శిరసావహించాడు. విచిత్రవీర్యుడి భార్యలు అంబికకు, అంబాలికకు సంతానమిచ్చాడు. ‘ఆంబికేయుడు’గా ధృతరాష్ట్రుడు, ‘ఆంబాలికేయుడు’గా పాండురాజు పుట్టారు. ఈవిధంగా వారిది మాతృస్వామిక నేపథ్యం.

ఇప్పుడు మనం మళ్ళీ పాండవులు కౌరవులు ఎందుకు కారనే ప్రశ్న దగ్గరకు వస్తున్నాం. ధృతరాష్ట్రుడు అంధుడైతేనేం, ఇద్దరిలో పెద్దవాడుగా కురువంశ స్వచ్ఛతను, పితృస్వామికతను పునరుద్ధరించగల ఆశాకిరణంగా కనిపించాడు. పితృస్వామిక విలువలకు ప్రాతినిధ్యం వహించే సుబలుని కూతురు గాంధారిని ఇచ్చి అతనికి పెళ్లి చేశారు. ఆ విధంగా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతా, తద్వారా సింహాసనంపై హక్కును స్థాపించుకునే అవకాశమూ ధృతరాష్ట్రుడికి లభించాయి. పితృస్వామిక వివాహ ఫలితంగా అతనికి కలిగిన దుర్యోధనాదులకు కూడా ‘కౌరవులు’ అనిపించుకునే అర్హతా, దాంతోపాటే అధికారమూ సహజంగానే సంక్రమించాయి.

మాతృస్వామ్య నేపథ్యం ఉన్న కుంతిని పెళ్లాడడం ద్వారా ‘కౌరవుడు’ అనిపించుకునే అర్హతను మొదట కోల్పోయింది పాండురాజు. ఆ తర్వాత తల్లి కుంతి ఆదేశంతో ద్రౌపదిని అయిదుగురూ పెళ్లి చేసుకుని మాతృస్వామ్య సంప్రదాయాన్ని పాటించడం ద్వారా పాండవులూ ఆ అర్హతను కోల్పోయారు. దాంతో, ‘కౌరవు’డిగానే కాక, పితృస్వామ్య ప్రతినిధిగా రాజ్యం మీద నాదే హక్కు అని దుర్యోధనుడు అన్నాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధం కౌరవులన్న గుర్తింపుకు, పితృస్వామిక విలువలకు మధ్య జరిగిన పెనుగులాట. ఆ పెనుగులాటలో చివరికి పాండవులే గెలిచారు. అయినా సరే, వారికి ‘కౌరవు’ లన్న గుర్తింపు లభించే అవకాశం లేదు. కనుక పాండురాజునే వంశకర్తను చేసి పాండవులన్న గుర్తింపుకే వారు పరిమితమయ్యారు.

ఇక్కడే ఇంకో విశేషం కూడా చెప్పుకోవాలి. కురుని పేరుతోనే ఉన్న కురుక్షేత్రంలోనే యుద్ధం జరగడం, ఆ యుద్ధాన్ని ధర్మయుద్ధంగా, ఆ క్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా చెప్పడం; అది కురువంశం మీదా,తద్వారా అధికారం మీదా హక్కును స్థాపించుకోడానికి జరిగిన యుద్ధమన్న సంగతిని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయా?

విశేషమేమిటంటే, దుర్యోధనుడు యుద్ధంలో ఓడినా అతడు ప్రాతినిధ్యం వహించే పితృస్వామ్యం గెలిచింది.  ఎందుకంటే, అది అప్పటికి పురోగామి వ్యవస్థ. పాండవులు కూడా పితృస్వామ్యం వైపు క్రమంగా మళ్ళారు…

***

ఎన్నో లోతైన, గంభీరమైన విషయాలను ఈ చిన్న వ్యాసంలో చెప్పి వాటికి అన్యాయం చేసేనేమో నన్న అసంతృప్తి నన్ను బాధిస్తోంది. ఇవన్నీ చాలా విపులంగా చెప్పుకోవలసిన విషయాలు. ఎన్నో మౌలికమైన విషయాలలోకి నేను పూర్తిగా వెళ్లలేకపోయాను.  వాటినలా ఉంచితే, సంవరణుడు పన్నెండేళ్ళు అడవిలో తపతి దగ్గరే ఎందుకు ఉండిపోయాడన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అందులోకి వెళ్లబోయే ముందు, పైన ‘Mother Right’ అనే ప్రస్తావన చేశాను కనుక, కాస్త రిలీఫ్ కోసం Mother Right గురించిన ఆసక్తికరమైన ఓ పురాతన ఐరిష్ కథ గురించి చెప్పుకుందాం.

అది వచ్చే వారం…

–కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

Download PDF

20 Comments

  • భాస్కరంగారు,

    ఒకప్పుడు భగవద్గీత – ఒక మార్క్సిష్ట్ పరిశీలన అనే పేరున్న ఒక పుస్తకం నా కంట బడింది. ఇంకెక్కడ, విశాలాంధ్రవారి ఎగ్జిబిషన్ లోనే, మల్కాజ్‌గిరిలో.

    మీరు ప్రస్తుతం మహాభారతం – ఒక మార్క్సిష్ట్ పరిశీలన అనే పరిశోధనాకార్యక్రమంలో నిమగ్నమై పోయారని అనిపిస్తోంది.

    మన దేశంలో మేథావుల ఏకైక కార్యక్రమం ఆర్షజీవనవిధానాన్ని వెక్కిరించటం అందులో భాగంగా ఆర్షసాహిత్యాన్ని చిత్రవిచిత్రమైన విమర్శల పేరిట అభాసుపాలు చేయటం.

    నా బోటీవాళ్ళం‌ మీలా మేథావులం కాము గాబట్టి వింతవింత సిధ్ధాంతాలను కల్పించుకొని వాటికి అనుగుణంగా ఆర్షసాహిత్యాన్ని వంచీ విరివీ నరికీ సంతోషపడటం‌ చేయం. అది మాకు ఇష్టమూ ఉండదు, చేతా కాదు.

    మీరు భారతం ఒక దుష్టగ్రంథం అనో రామాయణం ఒక దుష్టగ్రంథం అనో నిరూపించటానికి అనుకూలమైన సిధ్గ్గాంతాలను తయారుచేసుకొనో‌ దిగుమతి చేసుకొనో, వాటి సాయంతో ఆ గ్రంథాలకు (మీ దృష్టీలో) పరాభవం చేస్తే, దానివల్ల భారత దేశానికి ఒరిగే మంచి ఏమిటో బోధపడటం లేదు! వస్తే గిస్తే మీకు కొంచెంగానో గొప్పగానో కీర్తి రావచ్చు, మీ పుస్తకాలు మీక్కాస్త సొమ్ములు అందించవచ్చును. ఈ దేశానికి మాత్రం ఒరిగేదేం లేదు.

    నాకు చాలా విచారం కలుగుతోంది ఇలాంటి పోకడల వలన!

    • కల్లూరి భాస్కరం says:

      సారీ ఆండీ…మీ విచారంలో పాలుపంచుకోలేకపోతున్నాను. వ్యాసవాల్మీకుల పట్ల కృతజ్ఞతతో చాలా సంతోషంగా ఈ వ్యాసాలు రాస్తున్నాను. మీరు విచారిస్తూ కూర్చుని ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా మీ వెర్షన్ ను కూడా నిక్షేపంగా రాసుకుని వస్తే గిస్తే కొంచెం గానో, గొప్పగానో కీర్తినీ, కాస్తో కూస్తో సొమ్ముల్నీ మూటగట్టుకోవచ్చు. అయితే మార్కెట్ నిండా, చానెళ్లలోనూ మీ వెర్షనే ఉంది కనుక ఈ విషయంలో మీకు మంచి పోటీ ఉండచ్చు. మేధావిని కాదంటూనే నా ప్రయత్నంపై గొప్ప గొప్ప కామెంట్లు పాస్ చేయడమే కాకుండా ఈ వ్యాసాలకు మీరు పేరు కూడా పెట్టేశారు. ఇలాంటి పక్క పోటు విమర్శలతో మేధావితనం చాటుకోవడం కన్నా విషయం మీద విమర్శ చేసి మేధావిత్వాన్ని చాటుకుంటే నాకు సమాధానం చెప్పేందుకు వీలు కలుగుతుంది. ఆర్షసాహిత్యం తాలూకు మీ వెర్షన్లను శతాబ్దాలుగా ప్రచారంలో ఉంచి కూడా ఈ దేశానికి మీరు ఏం ఒరగబెట్టారో చెబితే సంతోషిస్తాను.

      • వ్యాసవాల్మీకులపట్ల మీకు గల కృతజ్ఞత కేవలం వారు మీ సిధ్ధాంతాలను అన్వయించటానికి అనుకూలంగా ఉండే పెద్దపెద్ద గ్రంథాలను అందించినందుకే అనుకోవాలేమో. ఎందు కంటే, వారి మాటల నుండి మీరు మీ సిధ్ధాంతాలకు అనుకూలమైన అర్థాలు తీయటానికి యత్నిస్తున్నారే కాని వారికి తమ ఉద్దేశాలను అడుగడుగునా దాచిపెట్టి వ్రాయవలసిన అగత్యం లేదని నా అభిప్రాయం.

        నాకు మీ కార్యక్రమం ఫలానాగా అనిపిస్తోందన్నాను కాని అదే పేరు కానవసరం లేదు కదా.

        నా వ్యాఖ్య సూటిగానే చేశాను కాని ప్రక్కపోటు ఏమీ లేదు. మీ అభిప్రాయాలను మీరు వ్రాసారు విస్తారంగా. నా అభిప్రాయాన్ని నేను చెప్పాను క్లుప్తంగా. వృత్తిగతమైన పనుల్లో తీరికలేని నాకు ఖండనమండనలతో పుస్తకాలకు పుస్తకాలుగా వ్రాసే తీరిక లేదండీ.

        ఆర్శసాహిత్యం ఈ దేశానికి ఏమీ ఒరగబెట్టలేదని మీ పక్షమూ, అదే ఈ దేశానికి గుర్తింపు తెచ్చిందని మరొకపక్షమూ వాదించికోవటం వల్ల ప్రయోజనం కనిపించటం లేదు.

        నేను మేథావి నయ్యేది కాకపోయేది, మీ రచనపై నా అభిప్రాయం చెప్పేందుకు అది ఒక కొలబద్ద కాదని అనుకుంటాను.

  • కల్లూరి భాస్కరం says:

    తప్పకుండా నండీ, వ్యాసవాల్మీకుల పట్ల అందుకే నాకు కృతజ్ఞత. వారి పుస్తకాలు లేకపోతే గతంలోకి వెళ్ళి అర్థం చేసుకునే అవకాశమే ఉండేది కాదు. అప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అవసరమైన జాగాను కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్లినందుకే కృతజ్ఞత. ఆ జాగాను కప్పిపెట్టి ఆర్షసాహిత్యాన్ని తమకు అనుకూలమైనంత మేరే చెప్పుకుంటూ సొమ్ము చేసుకుంటున్న వాళ్ళకు ఆ జాగాలను తెరచి చూపించే ప్రయత్నం కంటగింపుగానూ, అసహనంగానే ఉంటుంది మరి. అందువల్ల వారి ఉపాధి దెబ్బతింటుంది. ఇక ‘నేను మేధావిని కానన్నది.’ మీరన్న మాటే. మీ వ్యాఖ్య సూటిగా చేసుంటే విషయం మీద చేసుండేవారు. విషయంలోకి వెళ్లకుండా వ్యక్తిగతంగా ఏదేదో ఆపాదిస్తూ వెర్బల్ గూండాగిరీకీ, నాటు మోటు వ్యాఖ్యలకీ, బడితె విమర్శకీ పాల్పడ్డారు కనుకే మీది పక్కపోటు విమర్శ అనాల్సి వచ్చింది. ఆర్షసాహిత్యాన్ని చీకటి గదిలో పెట్టి దానికి బడితె పుచ్చుకుని కాపలా కాసే వారికి వాటి విషయంలోకి వెళ్ళి వ్యాఖ్యానించేవారి రాతల్లో జోక్యం చేసుకునే అర్హత ఎలా ఉంటుందో ఒకసారి యోచించుకోవాలి. పుస్తకాలకు పుస్తకాలు రాసే తీరిక లేదన్నారు. పుస్తకాల మీద మీ అభిప్రాయానికి నాకు నవ్వు, జాలీ కూడా కలుగుతున్నాయి. పుస్తకాలు రాయడం అనేది తీరిక ఉన్నప్పుడు చేసే పనికాదు. తీరిక చేసుకుని మరీ చేసే పని. వ్యాసవాల్మీకులు కావలసినంత తీరిక ఉండి ఆ సాహిత్యాన్ని మనకు ఇచ్చి పోయారా? ఫర్వాలేదు, మీ వృత్తి ఉద్యోగాలు మీరు చేసుకోండీ. ఇలా సగం సగం తీరిక చేసుకుని అపరిపక్వ వ్యాఖ్యలతో ఇంకొకళ్ళ టైము వేస్టు చేయద్దని మనవి. చివరిగా, ఈ రాతలతో దేశానికి మీరు ఏం ఒరగబెట్టారని అడిగారు కనుక ఆర్ష సాహిత్యాన్ని శతాబ్దాలుగా ప్రచారం చేస్తూ మీరు ఏం ఒరగబెట్టారని సూటిగా స్పష్టంగా అడిగాను. అంత సూటిగానూ, స్పష్టంగానూ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది.

    • కల్లూరి భాస్కరం says:

      మరచిపోయాను, మీది మామూలు మేధ కాదు, వక్రించిన మేధ అని కూడా అనకుండా ఉండలేకపోతున్నాను. ఆర్షసాహిత్యం దేశానికి ఏమీ ఒరగబెట్టింది లేదని నేను అన్నట్టు చిత్రించారు చూడండి, అదీ వక్రించిన మేధ అంటే. నా రచన దేశానికి ఏమీ ఒరగబెట్టదని మీరు అన్నారు కనుక ఆర్షసాహిత్యాన్ని శతాబ్దాలుగా ప్రచారం చేస్తున్నవారు ఏం ఒరగబెట్టారని అడిగాను. దీనికి సమాధానం చెప్పకుండా మీ పక్షమూ, మరో పక్షమూ అంటూ కప్పదాట్లకు పాల్పడుతున్నారు. మీకు ఇష్టమూ లేని చేతకానీ పని లోకి తలదూర్చి ఎందుకీ రొష్టు మహానుభావా?

      • భాస్కరంగారూ,

        మీరు భారతకథలకు వ్యాఖ్యానాన్ని వ్రాయదలఉకున్న ధోరణిలో వ్రాస్తున్నారు.
        అదే సత్యావిష్కరణం కానవుసరం లేదు.

        మీరు నన్ను అనదలచుకున్న చిత్రవిచిత్రమైన మాటలు అన్నారు.
        అవన్నీ సత్యాలు కానవుసరం లేదు కూడా.

        ఈ మేథస్సులూ వాటి ఋజుత్వవక్రత్వాలూ సాపేక్షాలు.
        ఆ సంగతి మీకూ చక్కగా తెలుసుననే నా అభిప్రాయం.

  • kalluri bhaskaram says:

    మీ మూదు పేరాలకు వరస క్రమం లో ఈ జవాబు
    1. ఎవరైనా తను రాయదలచుకున్నట్టే రాస్తాడు. ఇంకొకళ్ళు చెప్పినట్టు రాయడు, బుర్రను చిలక్కొయ్యకు తగిలించుకున్నవాడు తప్ప. ఈ మాట ద్వారా మీరు ఏమి చెప్పదలచుకున్నారో, ఎలాంటి గొప్ప సత్యాన్ని చెప్పదలచుకున్నారో మీకే తెలియాలి.
    ‘అదే సత్యావిష్కరణ కానవసరం లేదు’ ఇది సత్యావిష్కరణ అని నేను ఎక్కడైనా అన్నానా? ఇది ఇంతే ఇదే సత్యం అనే ధోరణి మీ వ్యాఖ్యల్లోనే కనిపిస్తుంది. దానిని నాకు అంటగడుతున్నారు. హతవిధీ.
    2. మిమ్మల్ని నేను ఏదో అన్నానని అన్నారు. ఇది కూదా పైలాంటిదే. మీ మొదటి స్పందన ఒకసారి చూసుకోండి, నేనన్నవి మీరన్నదానికి జవాబు మాత్రమే కాదు వాస్తవాలు కూదా. అవి సత్యాలు కానవసరం లేదంటే మీరన్నవి సత్యాలు అవుతాయా?
    3. ‘ఈ మెథస్సులూ రుజుత్వ పక్షత్వాలూ సాపెక్షాలు’: ఏవి, నేను అనని దానిని నాకు ఆపాదించారు చూడండి, ఆ వక్రత సాపెక్షమా? ఆర్ష సాహిత్యాన్ని ఇంతకాలం ప్రచారంలో ఉన్నవాళ్ళు దేశానికి ఒరగబెట్టింది ఏమిటని మీరన్న దానిపై నేను అడిగితే, ఆర్ష సాహిత్యం ఏం ఒరగబెట్టిందని నేను అడిగినట్టు చిత్రించారు చూడండి ఆ మేధో వక్రత సాపెక్షమా? హతోస్మి.ఆ సంగతి మీకూ తెలుసు అన్నారు. నిజంగా ఇలాంటి వక్ర విన్యాసాలు నాకు తెలియవండి. మీ అద్భుత పాండిత్యం ముందు ఓటమిని అంగీకరిస్తున్నాను.

  • Sai Babu says:

    భాస్కరం గారికి ,

    నమస్కారాలు. మీ వ్యాసాలు బాగున్నాయి. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అలానే “నిజమేనే ఇదెందుకు నాకు స్పురించలేదు” అనిపించేలా ఉన్నాయ్. ఈ వ్యాసాలతో రామాయణ మహాభారతల పై మమకారం గౌరవం పెరిగింది ఇంకొకసారి చదివి మరింత అర్ధం చేసుకునే ప్రయత్నం చేసేలా పురికోల్పుతున్నై. మీకు నా అభినందనలు

    సాయిబాబు గరిమెళ్ళ

    • కల్లూరి భాస్కరం says:

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు సాయిబాబు గారూ…

  • ఏల్చూరి మురళీధరరావు says:

    శ్రీ కల్లూరి భాస్కరం గారికి
    నమస్కారములతో,

    ఎంతో లోచూపుతోనూ, సాహిత్యానుభవంతోనూ మీరు వ్రాస్తున్న ఈ వ్యాసశ్రేణి ఆదినుంచి ఆసక్తికరంగా సాగుతున్నది. నూత్నవిషయాలను ఆవిష్కరిస్తున్నపుడు కొన్ని చర్చనీయాంశాలు చర్చకు రావటం సహజమే.

    ‘పాండవులు కౌరవులు ఎందుకు కాలేదు’ అన్న మీ వ్యాసవిషయానికి ఉత్థాపనీయమైన అనుబంధంగా ‘పాండవులు కౌరవులుగా ఎప్పటినుంచి పరిగణింపబడలేదు’ అన్న ప్రశ్నకూడా ఉదయిస్తుంది.

    సంస్కృతభారతం ఈ విధమైన వేర్పాటును గుర్తించినట్లు కనబడదు. ‘కురువంశీయులు’ (descendants of Kuru) అన్న అర్థంలో ‘కౌరవః’, కౌరవ్యః’, ‘కౌరవేయః’ – ఇత్యాదిశబ్దాలు పాండురాజుకు, తన్మూలాన పాండవులకు వ్యస్తంగానూ, విడివిడిగా ఆ అయిదుగురికీ పేరుపేరున అన్వయించేట్లుగానూ బహుధా వందలాదిమార్లు ప్రయుక్తమై ఉన్నాయి. ‘కౌరవర్షభాః’ = పాండవులు, ‘కౌరవాగ్రః’, ‘కౌరవాణాం రాజా’, కౌరవనాథః, కౌరవేన్ద్రః = ధర్మరాజు, ‘కౌరవరాజపుత్త్రః’, ‘కౌరవాణాం ధురంధరః’ = అర్జునుడు. ‘కౌరవ్యపత్నీ’ = కుంతి. ‘కౌరవరాజపత్నీ’ = ద్రౌపది. అర్జునుని భార్య ఉలూపి కౌరవ్యకులనందిని మాత్రమే గాక వివాహకారణాన కూడా కౌరవ్య. ఆమె కొడుకు బభ్రువాహనునికి సైతం ‘కౌరవః’ అనే సంకేతం. కురువంశదౌహిత్రునికి ఆ పదం ఏర్పడదు. పాండవులకు ఈ వ్యవహరణం భారతంలో పాండవోత్పత్తి మొదలుకొని ఆద్యంతమూ ఉన్నది. మహాప్రస్థానికంలో జనమేజయునికి ‘కౌరవః’, కౌరవేన్ద్రః’ అనే. యుద్ధంలో పాండవపక్షాన నిలిచి పోరాడినవారిలోనూ యుయుత్సుడు, శతానీకుడు, శ్రేణిమంతుడు మొదలైన పెక్కుమందికి తత్తత్సందర్భాలలో కౌరవులనే వ్యవహరణం. అది సహజమే. ఆ తర్వాత అటువంటివారి సంతతిని ఏమని వ్యవహరించారో వెతికి చూడాలి. భగవద్గీతాదిని ధృతరాష్ట్రుడు “మామకాః పాండవాశ్చైవ’ = అన్నచోటకూడా ఆ మాట అంటున్నది సంజయునితో కాబట్టి ‘నా కుమారులు, తమ్ముని కొడుకులు’ అని మాత్రమే అన్వయించుకోవాలి గాని, కౌరవ పాండవులన్న భేదవ్యవహారార్థం కాదు.
    శంతనుడు కౌరవుడే. ‘కౌరవః’, ‘కౌరవ్యః’ అని పలుమార్లు వచ్చింది.

    భీష్ముడు కౌరవుడు కాడని మీరు వ్రాశారు. కౌరవ శబ్దం ఆయనకు పర్యాయంగా భారతంలో బహుధా ప్రయుక్తమై ఉన్నది. ‘కౌరవాణాం ధురంధర’, ‘కౌరవశార్దూల’, ‘కురుశ్రేష్ఠ’, ‘కురూద్వహ’, ‘కురుకులశ్రేష్ఠ’, ‘కురుకులోద్వహ’, ‘కురుముఖ్య’, ‘కురూణాం శృంగం’, ‘కురుసత్తమ’, ‘కురురాజర్షిసత్తమ’, ‘కురువంశకేతు’, ‘కురుపితామహ’ – ఇత్యాదులతో. కురుకులపితామహుడు కురుకులీనుడు కాకపోవటామూ, కౌరవుడు కాకపోవటమూ సంభావనీయం కాదు.

    ఇక, దుర్యోధనునికి తల్లి పేరిట గాంధారుడన్న వ్యవహారానికీ కనీసం 35కి పైగానే ప్రయోగాలు ఉన్నాయి.

    కురువంశంలో సంస్కృత భారతం ప్రకారం ‘కౌరవులు’ అన్న వ్యవహారం లేని ప్రసిద్ధులు దాదాపు లేనట్లే.

    కాలికత రీత్యా పాండవ వంశమని ప్రత్యేకంగా ఏర్పడలేదు కాబట్టి ఉన్నది కురువంశమొక్కటే. ‘పాండవ వంశం’ అని భారతం ఎక్కడ పేర్కొన్నదో నా కంటికి అందలేదు.

    ధర్మాధర్మావ్యవస్థ కారణంగానే వారిని వేఱుపఱచి చూడటం జరిగిందని లోకరూఢి. ఈ మాతృస్వామ్యాదిభావన వెలుగులో దీనిని మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించాలి.

    భారతేతర సంస్కృతకావ్యాలలోనూ కౌరవ శబ్దం పాండవులకు ప్రయుక్తమై ఉన్నందుకు ప్రయోగాలు లభిస్తాయి. తిక్కన గారి వ్యవహారంలోనూ కౌరవ శబ్దం పాండవులకు పర్యాయమై ఉండినట్లు గుర్తు. ఇప్పుడు సద్యఃస్ఫురణలో తోపలేదు.

    వంశాలు శాఖాంతరితాలయే కారణాలను గురించిన మీ నిర్దేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘పాండవులు’ అన్నంత మాత్రాన పాండవులు కౌరవాన్యతములని వ్యాసదృష్టిలో లేని ఈ వ్యవహారం ఎప్పటినుంచి లోకంలో రూఢికెక్కినది స్పష్టపడితే దీని మూలాలు విశదమవుతాయి.

    ప్రశంసనీయమైన మీ వ్యాసస్థగుణాన్ని గౌణీకరించటానికి ఈ లేఖను వ్రాయలేదని, దీని చారిత్రాత్మకత చర్చనీయమని సూచించటానికి మాత్రమే వ్రాశానని – మీ సహృదయం తేలికగానే గుర్తిస్తుంది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    • “తిక్కన గారి వ్యవహారంలోనూ కౌరవ శబ్దం పాండవులకు పర్యాయమై ఉండినట్లు గుర్తు. ఇప్పుడు సద్యఃస్ఫురణలో తోపలేదు.” అన్నారు శ్రీఏల్చూరివారు. తిక్కనగారి భారతాంధ్రీకరణంలోని ఘోషయాత్రాఘట్టంనుండి ఒక పద్యం ఉటంకిస్తాను. ఇది ఆ ఘట్టాన్ని వివరించమని వైశంపాయనుడిని జనమేజయమహారాజు అభ్యర్థిస్తూ పలికిన మాట.

      చం. అనిశము బాండుపుత్రులకు నప్రియకార్యము రోయునట్టి దు
      ర్జనుడు సుమోధనుండటుల శత్రులచే నవమానితుందు పే
      ర్చిన కృప నొప్పుచున్న కురుసింహుల చేత విమోక్షితుండు నై
      మనమున నాన లేక ముని మండన యెమ్మెయి నేగె వీటికిన్

      ఈ పద్యంలో పాండవులను కురుసింహులు అని సంబోధన చేయటం తిక్కనగారి ప్రయోగమేనా లేక మూలమైన వ్యాసభారతంలో కూడా అదే కాని, తత్సమానమైన మరొక పదంకాని వాడటం జరిగిందా అన్నది పరిశీలించవలసిన విషయం.

  • కల్లూరి భాస్కరం says:

    ఏల్చూరి మురళీధరరావుగారూ, నమస్కారం.

    మీ స్పందన సంతోషం, ఆహ్లాదం కలిగించింది. ధన్యవాదాలు. పాండవులను, భీష్ముని కౌరవ్యులు, లేదా కౌరవ్యుడిగా పేర్కొన్న ఉదాహరణలను మీరు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. నా వ్యాసంలో ఈ కోణం అనుకోకుండా ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని సందేహార్ధకంగానే విడిచిపెట్టాను. మహాభారతాన్ని ఈ కోణం నుంచి చూడలేదని కూడా అన్నాను. కనుక ఇది సబ్జెక్టు టు కరెక్షన్.
    అయితే మాతృస్వామ్య, పితృస్వామ్యాలనే విశాల ఇతివృత్తంలో, లేదా చట్రంలో భాగంగానే ఈ ఆధారాల అన్వేషణ. ఈ చట్రం విషయంలో మాత్రం నాకు ఎలాంటి సందేహమూ లేదు. ఒక దశలో మాతృస్వామిక పురాణకథలను పితృస్వామిక కథలుగా మార్చడం, పితృస్వామిక కథలను కొత్తగా సృష్టించడం అనేవి దాదాపు ప్రపంచవ్యాప్తంగా జరిగింది. అందుకు ఆధారాలు చాలానే ఉన్నాయి. ఆ పరివర్తన ఛాయలు మహాభారత రామాయణాలలో కూడా ఉన్నాయి.
    ఈ చర్చ అంతా ప్రస్తుత సందర్భంలో గంధర్వుడు పాండవులను తాపత్యవంశీకులనడం నుంచి వచ్చింది. అది మామూలుగా ఫలానా పురుషుడి వంశంగా చెప్పినట్టే, స్త్రీ వంశంగా కూడా చెప్పడం మాత్రమేనా; లేక విశేషం ఏమైనా ఉందా అన్నది ప్రశ్న. నా ఉద్దేశంలో విశేషం ఉన్నదనే. ప్రధానవస్తువుకు ఆధారాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఇది వాటికి బలం కలిగించే ఉప-ఆధారం అయినా కావచ్చు.
    కౌరవులు, పాండవుల విషయానికి వస్తే; పాండవులను కూడా కౌరవులుగానే వ్యాసుడు పేర్కొని ఉన్నా దుర్యోధనాదులకే కౌరవులు అన్న రూఢి ఎందుకు ఏర్పడింది అన్న ప్రశ్న వస్తుంది. అది కేవలం ఇరువురినీ వేరు చేసి చెప్పే వ్యవహార సౌలభ్యం కోసమే అనుకోవాలా? వంశనామం గురించి పట్టింపు ఉండే ఒకానొక కాలంలో కౌరవులన్న నామం కేవలం వ్యవహార సౌలభ్యానికే పరిమితం చేయగలమా? లేక అది అధికారప్రతిపత్తితోనూ, సామాజిక ఆమోదంతోనూ కూడా ముడిపడి ఉందా? ఇవి ఓపెన్ ప్రశ్నలు. వింగడింపు కోసమే అయితే, పాండవులను ఉప-కౌరవులు అని అనచ్చు. (సశేషం)

  • కల్లూరి భాస్కరం says:

    వ్యాసవిస్తర భీతి వల్ల పై వ్యాసంలో ఒక అంశాన్ని ప్రస్తావించలేదు. అదేమిటంటే, పాండురాజు హస్తినాపుర సింహాసనానికి పోటీదారు. పోటీదారును అధికారానికి దూరంగా ఉండేలా చూసే ప్రక్రియలో భాగమే అరణ్యవాసం అనడానికి రామాయణంలో రాముడితో మొదలుపెట్టి, భారతంలో పాండరాజు, పాండవులవరకు ఆధారాలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు కౌరవులనేది అధికారిక వంశనామం అనుకుంటే, అధికారానికే దూరంగా ఉంచినవారిని అధికారిక వంశనామానికి కూడా దూరంగా ఉంచడంలో ఆశ్చర్యం ఉందంటారా?
    కేరళలో ఒక ఆచారం ఉందని లీలగా విన్నాను. బ్రాహ్మణ కుటుంబంలో పెద్ద కొడుకు మాత్రమే బ్రాహ్మణస్త్రీని పెళ్లి చేసుకుంటాడు. మిగిలిన సోదరులు బ్రాహ్మణేతర స్త్రీలతోనే సంబంధం పెట్టుకుంటారు. అది పెళ్లి కాదని విన్నట్టు జ్ఞాపకం. కేరళలో మాతృస్వామ్యం ఉండేదన్న సంగతి తెలిసినదే. పై ఏర్పాటు పితృస్వామ్య/మాతృస్వామ్య సంధి దశలో రాజీసూత్రంగా ఏర్పడిందా? ఇది కూడా ఒక ఓపెన్ ప్రశ్న. భారతంలో కుంతి, గాంధారుల సామాజికనేపథ్యంలో తేడా ఉండడం స్పష్టమే.
    ‘పాండవ వంశం’ ప్రస్తావన గురించి: ఆదిపర్వం, చతుర్థాశ్వాసంలో ఈ పద్యం ఉంది. “వీరైలులు బౌరవులును/భారతులును గౌరవులును బాండవులు ననన్/వీరులయి పరిగిరిది నయ/పారగ భవదీయవంశ పరిపాటి మెయిన్” కథకుడు జనమేజయునితో అన్న మాటలివి.
    దుర్యోధనాదులు కౌరవులుగా రూఢి కెక్కినప్పుడు విజేతలైన పాండవులు ఆ వంశనామాన్ని స్వీకరిస్తారా? లేక తమ తండ్రి పేరిట వంశనామాన్ని ఏర్పరచుకుంటారా? ఇదీ ఓపెన్ ప్రశ్నే. ఇవి ఇలా ఉంచి కురు-పాండవుల వంశ వివరణలోనే చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో ఆ సంగతి ప్రస్తావించి విడిచిపెట్టాను. మరోసారి దాని గురించి రాస్తాను. మరోసారి ధన్యవాదాలతో, సెలవు.

  • కల్లూరి భాస్కరం says:

    సారీ మురళీధరరావు గారూ…ఈ online కామెంట్లలో ఒక సమస్య ఉన్నట్టుంది. ఎదుటివారి టెక్స్ట్ ఎదురుగా ఉండదు కనుక కొన్ని పాయింట్లు మిస్ అవుతాం.
    భీష్ముడు కౌరవ్యుడు కావడం గురించి: సరే, మీరు భీష్ముని కౌరవ్యుడిగా పేర్కొన్నవి ఉదహరించారు. అలాగే పాండవులను కూడా. కానీ నేను భీష్ముడికీ, పాండవులకీ ఉన్న పోలికలను కూడా ప్రస్తావించాను. ఉభయులూ మాతృనామంతో ప్రసిద్ధులు. ఉభయులూ అధికారానికి దూరమయ్యారు. అయితే, భీష్ముడు అరణ్యవాసం మాత్రం చేయకుండా హస్తినలోనే రాజ్యసంరక్షకుడిగా ఉండిపోయాడు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆయనకు ఆ మినహాయింపును ఇచ్చి ఉండచ్చు. ఆయనకు ఉన్న స్వచ్ఛంద మరణం అనే వరం ఆ మినహాయింపునే సూచిస్తూ ఉండచ్చు. ఎప్పుడో చదివిన ఒక అస్పష్ట జ్ఞాపకం ఏమిటంటే, పోటీదారుని భౌతికంగా కడతేర్చడం కూడా ఉండేది. ఆ తర్వాత దానిని అరణ్యవాసంగా సవరించారు. పాండవులను లక్క ఇంటిలో ఉంచి చంపడానికి ప్రయత్నించడం తెలిసినదే.
    పాండువంశం గురించి: ఉయ్యాలలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా మహాభారతం అవతారికలోనే చెప్పిన విషయాన్ని మరచిపోయాను. “హిమకరు దొట్టి పూరుభరతేశు కురుప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్తలనగా నొప్పిన….”అనే పద్యం ఉంది. ఇక్కడే ఇంకో తమాషా ఉంది. చంద్రుడి కొడుకైన బుధుడికీ, మనువు పుత్రిక అయిన ఇలకీ పుట్టిన పురూరవుడిలో కురుపాండవుల మూలాలు ఉన్నాయి. అయితే పురూరవుడి వంశాన్ని బుధుడితో కాక ఇలతో సంకేతిస్తూ(మాతృనామం)ఐలులు అనడం ఆసక్తికరం. కానీ పై పద్యంలో చంద్రుడితో మొదలైనట్టు చెప్పి పితృస్వామికతను కల్పించారు.

  • i v l narasimharao says:

    భాస్కరంగారు ఈవారం మీ అర్తికాల్ తోటు చాలావిషయాలు ఇంటరెస్టింగ్ గాసాగాయి .వ్యాసభారతం చదవాలన్న కోరికకలిగించారు మొదటిసారిగా !సాగించండి మా అలొచనలకు పడునుపెదతాం .నమస్తే

    • కల్లూరి భాస్కరం says:

      మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు నరసింహారావుగారూ…

  • ఏల్చూరి మురళీధరరావు says:

    మాన్యులు శ్రీ కల్లూరి భాస్కరం గారికి
    _/\_ !

    సర్వధా ఐకమత్యాన్ని ప్రకటింపవలసిన ఆత్మీయమైన మీ సమాధానవివృతికి ధన్యవాదాలు. మీ వ్యాసపరంపర ఇతోధికాసక్తికరంగా కొనసాగి అచిరకాలంలో ముద్రితప్రకాశితం కాగలదని ఆశిస్తుంటాను.

    • కల్లూరి భాస్కరం says:

      మురళీధరరావు గారూ, మీ సహృదయపూర్వక ఆకాంక్షకూ, ప్రోత్సాహకరవచనాలకు కృతజ్ఞతలు, నమస్సులు.

  • sujala says:

    భీష్ముడు గాంగేయుడే కానీ ఇక్కడ మీరు కౌంతేయులతో పోల్చడం సరిగా అనిపించలేదు…కుంతిలా గంగకు సంతానం కనడానికి ఎలాంటి వరాలు లేవు…శంతనుడి ద్వారానే ఎనిమిది మంది సంతానాన్ని కన్నది..కానీ కౌంతేయులు పాండురాజు, కుంతికి జన్మించిన వారు కాదు అలాంటప్పుడు భీష్ముడికి, కౌంతేయులకు సామ్యం ఎలా కుదురుతుంది, ఒకటే ఎలా అవుతారు…మీరు చెప్పినదాన్ని బట్టి వేరే కులస్త్రీ అవ్వడం వల్లే గాంగేయుడిని అలా వేరు చేశారా?

  • కల్లూరి భాస్కరం says:

    కులగోత్రాలు అడగకుండా గంగను పెళ్లి చేసుకోమని శంతనునికి తండ్రి చెప్పడంలోనే మీ ప్రశ్నకు సమాధానం ఉంది. మరికొంత వివరణ కావాలంటే కాస్త నిరీక్షించక తప్పదు సుజల గారూ. స్పందనకు ధన్యవాదాలు.

Leave a Reply to Sai Babu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)