25వ క్లోను స్వగతం

damu
నా రాత్రికి దుఃఖమూ లేదు సంతోషమూ లేదు
నా చీకటికి మార్మికతా లేదు నిగూఢతా లేదు
నేను నియోహ్యూమన్ వుద్వేగ రహితుడ్ని
దేనికీ తగలకుండా జీవితం గుండా ప్రవహిస్తాను
నాకు భద్రతా లేదు స్వేచ్చయునూ తెలియదు
25 జీవితాలుగా మృత్యువు నన్ను మరచిపోయింది
జ్ఞాపకాలు మరణించాయి వూహలు మొలవలేదు
కోపమూ లేదు తాపమూ తాకదు
వేలాది దినాల విభిన్నత తెలీని కాలము
నాలోకి తిరిగి తిరిగీ కరుగుతోంది
ఈ విశ్వమే నాకు ద్రోహం చేసింది
నా స్వీయ నిరంతర పునఃసృష్టి లోకి కుదించుకు పోయాక
స్వీయ సంభాషణా స్వగతాల్లోకి మౌనాన్ని దిగ్గోట్టాక
సకల మానవ జ్ఞానం నుండి నన్ను నేను రక్షించుకున్నాక
ప్రేమా లేదు అసహ్యమూ లేదు
సానుకూలతా లేదు ప్రతికూలతా రాదు
Picasso7
నేను కాలానికి ఆవల నివసిస్తున్నాను
కొన్ని క్లోనుల కాలంలో కొన్ని క్లోనుల దూరంలో
జీవితము మొదలవలేదు జీవితము అంతమవలేదు
జననమూ లేని మరణమూ లేని
జీవించిందే జీవించిందే జీవించిందే జీవించిందే జీవిస్తున్న
యెడతెగని అనాసక్తి లోకి కూరుకుపోయాను
నా స్థలమూ కాలమూ నేనే
నాకు బయట చూచేందుకూ వినేందుకూ యేమీ లేదు
అర్ధరహిత శూన్యం లోకి పునర్జన్మిస్తూ వస్తున్నానో పోతున్నానో-
యుధ్ధం చేయటానికి నేనూ ఇతరులూ లేని వొక గ్రహమేదో నన్ను
మింగేసిందా?
అమ్మటమూ కొనటమూ మాత్రమే మిగిలిన
ఆనందమే దారి, గమ్యమూ అయిన మనుషుల నుండి
విముక్తి లోకి దిగబడి 25 క్లోనుల కాలం అయిందా
యిప్పుడేదో తిరోగమనాన్ని కాంక్షిస్తున్నానే
మానవలక్షణాల లక్షలాది క్షణాలు మరణించాక కూడా
లోపల్లోపల్లోపల్లోపలెక్కడో మనిషి వాసన మరుగుతుందే
–దాము
Download PDF

5 Comments

  • కెక్యూబ్ వర్మ says:

    ఎన్నాళ్ళకి మళ్ళీ మీ వాక్యం చదివాను.

    జననమూ లేని మరణమూ లేని
    జీవించిందే జీవించిందే జీవించిందే జీవించిందే జీవిస్తున్న
    యెడతెగని అనాసక్తి లోకి కూరుకుపోయాను

    మానవలక్షణాల లక్షలాది క్షణాలు మరణించాక కూడా
    లోపల్లోపల్లోపల్లోపలెక్కడో మనిషి వాసన మరుగుతుందే

    ఇదే ఈ మనిషి వాసన మరుగుతూ మిగిలి వుండాలి.. ధన్యవాదాలు సార్.

  • బాగుందండి,..

  • Jhansi says:

    Aa grahamedo Nannu kooda mingesindi…meelaagaa, naalaaga marendarino kooda…kaanee vichitram, okarikokaram thaarasapadam. Jeevinchadaanni marachipoyi puravasthu shaakhalaa jeevithaanni thavvukuntoo migili pothaamemo alochinchandi.

    Mee pada prayogam, bhava prakatana adbhutham …

  • Kondagali says:

    philosophically cursed…….

  • Sumanasri says:

    జీవితంలో నిర్వేదం మంచిది కాదు. ఎల్లప్పుడు ఆశాజనకమైన మానసిక స్థితిని పెంపొందించుకుంటే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది ప్రతి క్షణం. డార్విన్ పరిణామసిద్ధాంతం తలకెక్కితే జీవితం ఒక వ్యర్ధమైన కార్యక్రమంగా కన్పిస్తుంది. సంతోషంగా జీవితం గడపాలంటే జీవితం మీద సరియైన దృక్పధం అవసరం. విశ్వామిత్ర సృష్టి గురించి తెలుసుకదా! దానికి అప్పుడు అదే గౌరవం యిప్పుడు అదే గౌరవం. మంచి కవిత వ్రాసినందుకు అభినందనలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)