ఒక్క నీకు మాత్రమే…

Ravi_Verelly

మలుపు మలుపులో మర్లేసుకుంటూ

ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో

ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ

తన కోసం కాని నడక నడుస్తూ

నది.

అట్టడుగు వేరుకొసని

చిట్టచివరి ఆకుఅంచుని

కలుపుతూ పారే

మూగ సెలయేటి పాట వింటూ

తనలోకి తనే వెళ్తూ

చెట్టుమీదొక పిట్ట.

 bird

నడిచి నడిచి

అలసి

ఏ చిట్టడివి వొళ్లోనో

భళ్ళున కురిసే కరిమబ్బులా

కనిపించని నీ దోసిట్లో

ఏ ఆకారమూ లేని

ఏ స్పర్శకూ అందని

ఒక్క నీకు మాత్రమే కనిపించే

ఒకానొక పదార్ధంగా కరిగిపోతూ

నేను.

కరిగి ప్రవహించడం తెలిసాకే-

మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

చుట్టరికం తెలిసింది.

– రవి వీరెల్లి

Download PDF

11 Comments

  • Harikrishna mamidi says:

    కరిగి ప్రవహించడం తెలిసాకే-

    మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

    మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

    చుట్టరికం తెలిసింది.
    Wonderful lines ravi veerelli garu..

  • ns murty says:

    రవి గారూ,

    అద్భుతమైన Synthesis .

    హృదయపూర్వక అభినందనలు.

  • Subrahmanyam Mula says:

    చాలా బావుంది రవి గారు.

  • Radha says:

    రవి గారూ,
    చాలా బావుంది. భలే రాస్తారండీ మీరు సింపుల్ గా, గ్రేస్ ఫుల్ గా. అభినందనలు.

  • prasuna says:

    Chaalaa baavundi Ravi garu.

  • kcubevarma says:

    చివరి పాదాలు హత్తుకున్నాయి సార్.. చాలా హృద్యమైన చిత్రాన్ని కవితగా ఆవిష్కరించారు.. అభినందనలతో..

  • చాలా బావుంది, రవి గారూ! మామూలు పదాలతో గాఢమైన భావాన్ని సృష్టించడం మీలాంటి చాలా కొద్ది కవులకే సాధ్యమౌతుందండీ!

    ఇవి బాగా నచ్చాయి…

    “నడిచి నడిచి

    అలసి

    ఏ చిట్టడివి వొళ్లోనో

    భళ్ళున కురిసే కరిమబ్బులా..”

  • balasudhakarmouli says:

    కవిత వొక అలలా కదిలింది. నీటి పాయలా కనువిందుగా సాగింది. నిర్మాణం అద్భుతంగా వుంది. ప్రకృతితో మీ మానసికమైన అనుభవాన్ని కవిత్వం రూపంలోకి అద్భుతంగా అనువదించారు. కవిత్వ శిల్పానికి ముందుగా నా అభివాదములు. థ్యాంక్యూ రవి గారూ…………….

  • Thirupalu says:

    నిర్మాణం అద్భుతంగా వుంది.

  • రవి వీరెల్లి says:

    స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు!

  • SREEDHAR BABU PASUNURU says:

    హాయిగా.. అద్భుతంగా ఉంది మీ కవిత రవి వీరెల్లి గారూ..

Leave a Reply to ns murty Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)