బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

sangisetti- bharath bhushan photo

1970ల కన్నా ముందు అధికారం కేంద్రీకృతమై ఉండిది. ఇది విశ్వవ్యాప్తమైన భావన. దాన్ని కూలదోస్తే సమసమాజం ఏర్పడుతుందనే అవగాహన ఉండిది. అయితే అధికారం వికేంద్రీకృతంగా ఉంటుందనే వాస్తవాన్ని అస్తిత్వ రాజకీయ ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చాయి. అది ‘బ్లాక్స్‌’ పోరాటం కావొచ్చు, ఫెమినిజమ్‌ కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ కావొచ్చు. అస్తిత్వ ఉద్యమాలకు ఒక ‘పరిధి’ ఉంటుంది. ఆధిపత్యాన్ని, అణచివేతను ధిక్కరించేందుకు పోరాటం జరిగింది. కళ్ళముందర కనబడే శత్రువుతో ఉద్యమం కొనసాగింది. ఈ అస్తిత్వ రాజకీయాల్లో సామూహికతకు స్థానం లేదు. కానీ ఇవ్వాళ కొంతమంది భాష పేరిట, జాతి పేరిట, సమాజం పేరిట ‘సామూహికత’ను తీసుకొస్తున్నారు. దీని వల్ల తెలంగాణ వాళ్లకే గాదు సీమ, డెల్టా, ఉత్తరాంధ్రవారి ఉనికికి కూడా ప్రమాదమేర్పడనుంది.

స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారెవ్వరూ పరాయి ఆధిపత్యాన్ని, అణచివేతను, నిరాకరణను సహించలేరు. అంతేగాదు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అయితే తెలంగాణ విషయంలో ‘పరాయి’ ఎవ్వరు అని తెలుసుకునే లోపలే జరగరాని నష్టమంతా జరిగిపోయింది. 1956 నుంచీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలేసుకొని చరిత్రలో రికార్డు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో కొందరు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్లీనంగా తమ కోస్తాంధ్ర బానిసభావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లమంతా ఒక్కటే, తెలుగాజాతి అంతా ఒక్కటే, ఆధిపత్యాలు లేకుంటే అంతా మళ్ళీ కలిసిపోవొచ్చు, సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు, తెలుగు ప్రజల ఐక్యత కేవలం ఒక భావనగా కాకుండా భౌతిక వాస్తవికంగా మారాలని వ్యాఖ్యానిస్తూ, భవిష్యవాణి చెబుతూ, ఆకాంక్షిస్తున్న వాళ్లలో తెలంగాణ వాదులు, బుద్ధిజీవులు, సాహిత్యకారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు రాష్ట్రాల్లో తమ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఉండీ, రెండు ప్రాంతాల్లో వాటి మనుగడ కోరుకునే వారు, రెండు రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం, ప్రాధాన్యత, గుర్తింపు లభించాలని  ఆశించే పచ్చి అవకాశవాదులు ఈ మాటలు మొదటి నుంచీ చెబుతుండ్రు, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

ఈ అవకాశవాదుల్లోనే ఇంకొందరు పెండ్లినాడే సావుడప్పుకొట్టినట్లు అవసరమైతే ‘తెలుగువాళ్ళం మళ్ళీ కలువొచ్చు’ అంటుండ్రు. పేచీ అంతా తెలంగాణవాదుల ముసుగులో రంగంమీదికి వస్తున్న ఆధిపత్యాంధ్రుల బృందగానం ఆలపించే వంధిమాగదుల తోనే! తెలంగాణ సోయితో ఎన్నడూ మెలగని వాళ్ళు రాష్ట్రమొచ్చినాక ప్రత్యేక సంచికలు తీసుకొస్తూ తాము మాత్రమే ఉద్యమంలో ముందున్నట్టు, తమ కృషితో మాత్రమే తెలంగాణ సాధ్యమయింది అనే భావన కలిగిస్తుండ్రు. తెలంగాణ గురించి కూడా ఇందులో ఆంధ్రోళ్ల తోటి రాయిస్తుండ్రు. ఇలాంటి నయా సీమాంధ్ర బానిసలు రేపు తెలంగాణలో కోకొల్లలుగా పుట్టుకొచ్చి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తాము అభిమానించే ఆంధ్రాధిపత్య సాహిత్యకారుల కాళ్ల దగ్గర కట్టిపడేస్తారు. ఎందుకంటే వీళ్ళెవరూ తెలంగాణ కోసం ఎన్నడూ ఒక్క మాట మాట్లాడిరది లేదు, రాసిందీ లేదు, కనీసం సంఫీుభావంగా ఒక్క సమావేశంలో పాల్గొన్నదీ లేదు. ఇప్పుడు వలస పాలన మాత్రమే పోయింది. ఈ వలసాధిపత్యులు స్థానిక బానిసలను ప్రోత్సహించి, మెచ్చి మెడల్స్‌ ఇప్పించి తమ పెత్తనాన్ని శాశ్వతంగా కొనసాగించే ప్రమాదముంది. అందుకే అటు రాజకీయాల్లో గానీ ఇటు సాహిత్య, సాంస్క ృతిక రంగంలో బానిసల పట్ల జాగరూకతతో మెలగాలి. నిజానికి వెన్నెముఖలేని సాహిత్యకారులు ఎంతటి తెలంగాణవాది అయినా సారాంశంలో సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగానే మిగిలిపోతాడు.
రెండు ప్రాంతాల్లోనూ తమ కులం వాళ్ళు ఉండడం, ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవానికి లోటు రాకుండా చూసుకోవడానికి, రాష్ట్ర, కేంద్ర అవార్డులు నిర్ణయించడంలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తెలంగాణలోని ఆధిపత్యులు  సీమాంధ్రుల మనసెరిగి మసులుతుండ్రు. అనివార్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన వీళ్ళు తమకు అవసరమనిపిస్తే తిరుపతి ప్రపంచ సభలకు వెళ్ళినట్టే ఇక్కడి ప్రజలకూ పంగనామాలు పెట్టగల సమర్ధులు. భాషకు పట్టం కట్టే పేరుతో తిరుపతికి వెళ్ళినామనే వాళ్ళు రేపటి తెలంగాణలో అదే భాష పేరిట స్థానికుల ‘హిందూత్వ’ వైఖరి అవలంభించే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఇదివరకే ఉర్దూని ముస్లిముల భాషగా ముద్రేసిండ్రు.
తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచీ ఆంధ్రాధిపత్యులు, వారికి వంతపాడే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ కేవలం తెలుగువారి రాష్ట్రంగానే పరిగణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలుగు మాట్లాడేవారే కాదు ఉర్దూ మాతృభాషగా మాట్లాడే వాళ్ళు దాదాపు 15శాతం మంది ఉన్నారనే సోయి బుద్ధిజీవులకు లేకుండా పోయింది. తెలంగాణలో ఉర్దూమాట్లాడే ముస్లిములే గాకుండా కాయస్థులు, హిందీ మాత్రమే మాట్లాడే లోధీలతోపాటు భిన్నమైన ఇతర భాషలు మాట్లాడే రంగ్రేజ్‌, ఆరెమరాఠీలు, లంబాడీ, కోయ, గోండు, చెంచులు కూడా తెలంగాణలో భాగమనే గ్రహింపు కూడా వీరికి లేదు. తెలుగువాళ్లంతా ఒక్కటే అని కూడా టీవి చర్చల్లో అటు ఆంధ్రవాండ్లు, ఇటు తెలంగాణ వాండ్లు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.

సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి. భాషకు కూడా కులముంటదని బుద్ధిజీవులు గుర్తించరు. ముఖ్యంగా బీసీల్లోని దాదాపు ప్రతి కులానికి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, అవసరాల రీత్యా మిగతా వారితో మాట్లాడుకునే భాష భిన్నంగా ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగానూ ప్రత్యేకమైన భాష ఉంది. అది తమ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్క ృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఆ భాషలు వారికి పరాయివి కావు. హైదరాబాద్‌లో ఇప్పటికీ పాతబస్తీకి వెళితే ఉర్దూ మాట్లాడే కాయస్థులు, తెలుగు మాట్లాడే కన్నడిగులు, కన్నడ మాట్లాడే మరాఠీల కనబడతారు. అందుకే నిజాం జమానాలో ప్రతి ఫర్మాన్‌ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో వెలువడేది. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రిక ‘హైదరాబాద్‌ సమాచారము’ ఈ అన్ని భాషల్లో ప్రచురితమయ్యేది. ఈ పంచభాష సంస్క ృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే. తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగు భాషని కాపాడలనే వారెవ్వరూ హైదరాబాద్‌లో తెలంగాణలో ఉర్దూని కాపాడలనీ, కన్నడను కాపాడాలని ఎన్నడూ అడుగరు.
తెలంగాణలో పాఠ్యపుస్తకాల్లో ఒకరకమైన భాష ఉంటుంది. అది బోధించే ఉపాధ్యాయుడు తనదైన భాషలో చెబుతాడు. తనదైన భాష అన్నప్పుడు అతని కులం, పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం వల్ల అబ్బిన భాష. చదువుకునే విద్యార్థికి ఇవి రెండూ కొత్తగానే ఉంటాయి. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలో చదువుకుంటున్నది బహుజనులు మాత్రమే. అదీ తమ తరంలో మొదటి వారు మాత్రమే! ఈ పాఠ్యపుస్తకాల్లో విషయం ఎట్లాగూ తెలంగాణకు సంబంధించినది ఉండదు. కనీసం వాటిని వ్యక్తికరీంచేందుకు తెలంగాణ నుడికారానికి కూడా చోటులేదు.

అందుకే రెండు ప్రాంతాల్లో ఉనికిలో ఉండే (అగ్ర)కులాల వాండ్లకు తప్ప తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనే భావన బహుజనుల్లో ముఖ్యంగా బీసీల్లో ఏర్పడలేదు. మెజారిటీగా 50శాతానికి పైగా ఉన్న బీసీలు (ఉర్దూ మాట్లాడే ముస్లిములను మినహాయిస్తే ఈ శాతం ఇంకా పెరుగుతది) తాము స్వతహాగా మాట్లాడుకునే భాష ఎక్కడా లేదు. తెలుగుభాషగా చలామణిలో ఉన్న భాషలో బహుజనుల నుడికారం, పదసంపద కానరాదు. అలాంటప్పుడు భాష కలిపి ఉంచే సూత్రం ఎంతమాత్రం కాదు. ఇది బలవంతంగా, కృత్రిమంగా కల్పించిన బంధం మాత్రమే. ఈ బలవంతపు బంధం విడిపోయిందంటే సంతోషపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ భాష గురించి గుండెలు బాదుకుంటుంది కూడా అగ్రకులస్తులే అనే విషయాన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బహుజనులు తెలుగుకన్నా ఇంగ్లీషుపై దృష్టి కేంద్రీకరించాలనేది నేటి డిమాండ్‌.
తెలుగుజాతి అంతా ఒక్కటే అనే సూత్రాన్ని కూడా ఇదివరకే కొందరు తెలంగాణవాదులు కొట్టిపారేసిండ్రు. అయినా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరు ప్రాంతాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొందరు, తమ పార్టీ, సంఘం ప్రయోజనాలను కాపాడడానికి కొందరు, ఇంకా చెప్పాలంటే రెండు ప్రాంతాల్లోనూ తమ ఆధిపత్యం యథాతథంగా కొనసాగాలనుకునేవారు (వీళ్లు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నారు) ఈ తెలుగు జాతి సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఒక జాతికి తనదైన ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకే జాతీయ నాయకులను ఆరాధించడం, ఒకే భాష, ఒకే సంస్క ృతి, ఒకే చరిత్ర కలిగి ఉండడమే గాకుండా ‘అంతా ఒక్కటే’ అనే భావన కూడా ప్రజల్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారికి లేదు.

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

తెలంగాణకు సంబంధించిన సర్వాయి పాపన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, కుతుబ్‌షాహీలు, మహబూబ్‌అలీఖాన్‌, కొమురం భీమ్‌ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రాంతంలో తెలిసిన వారు కాదు. వారి గురించి ఎన్నడూ వినలేదు. కనీసం పాఠ్యపుస్తకాల్లోనూ వారి గురించి పాఠాలు లేవు. ఆంధ్రప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు (ఈయన ఎక్కువ కాలం జీవించింది తమిళనాడులోనే) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు వొదిలిండు. ఈయనెవరికీ తెలంగాణలో తెలువదు. తెలంగాణవాళ్లు ఆయనతో మనకెలాంటి సంబంధం లేదు అనుకుంటారే తప్ప మనవాడు అనుకోరు. ఆయన్ని సమైక్యవాదిగా సీమాంధ్రులు ముందుకు తీసుకురావడం వల్ల కోమట్లు తమ వాడు అనే గౌరవంతో పల్లెల్లో నిలబెట్టిన ఆయన విగ్రహాలకు కష్టకాలం వచ్చి పడిరది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కూడా తెలంగాణ వాళ్ళకు (కొంతమంది రెడ్లు మినహాయింపు) అదే భావన ఉంది. ఈ ‘జాతి’ నాయకుల గురించి ఎన్నడూ ఎవ్వరూ అందరికీ పరిచయం చేయాలని ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన భావ సమైక్యత ఎన్నడూ కలుగలేదు. అంతెందుకు వల్లభ్‌భాయి పటేల్‌ సీమాంధ్రులకు జాతీయ నాయకుడు కావొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ముస్లిములకు ఒక విలన్‌. పటేల్‌ అటు సాయుధ పోరాట యోధులను చంపించడమే గాకుండా పోలీస్‌ యాక్షన్‌ పేరిట వేలాది ముస్లిముల ప్రాణాలు తీసిండు.

అలాగే భాష ఒక్కటి కాదని పైన చర్చించుకున్నాము. ఇక సంస్క ృతి ఒక్కటి కాదనే విషయాన్ని 1969 నుంచి ఇప్పటి దాకా ప్రతి తెలంగాణ వాదీ రాసిండు.  మా పండుగలు వేరు, మా ఆచార వ్యవహారాలు ఆఖరికి మేము మొక్కే దేవతలు కూడా వేరు అని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిండ్రు. నిరూపించిండు. అంతేగాదు తెలంగాణది హీన సంస్కతి అని కూడా ఆధిపత్యులు ప్రచారం చేసిండ్రు. మీరు కోడిపుంజుల కొట్లాట పెడితే మేం బతుకమ్మలు ఆడుతాం అని తెలంగాణ వాళ్ళంటే అది సంస్కతిలోని భిన్నత్వాన్ని పట్టిస్తుంది తప్ప కించపరచడం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే ఆధిపత్య వాదులు తెలంగాణ సంస్క ృతిపై మరో నింద కూడా వేసిండ్రు. మీదంతా దొరలు, నవాబుల సంస్కృతి రాములమ్మ సినిమాలోని సంస్క ృతి అంటూ నిందించిండ్రు. రాములమ్మ సినిమాలోని సంఘటనలు వాస్తవ సంఘటనలు అని ప్రచారం చేసి, తెలంగాణ దొరలంతా స్త్రీలను చెరబట్టే వారిగా చూపించిండ్రు. ఇది వాస్తవం కాదు. (ఈ విషయం గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం) ఇంత భిన్న సంస్క ృతి ఉన్న వాళ్ళమధ్య భావసారుప్యత రావడమనేది అసంభవం.

ఇక చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ఆధునిక చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంవత్సరాలను లెక్కేసి మరీ మీ చరిత్ర వేరు మా చరిత్ర వేరు అని తేల్చి చెప్పిండు. అన్ని విషయాలు భిన్నంగా ఉన్నప్పుడు జాతి ఒకటే అనే భావన ఎలా కలుగుతుంది. నిజానికి పురాణ కాలం నుండి తెలంగాణ జాతి భిన్నమైనదే! షోడశ జానపదాల్లో అశ్మక సామ్రాజ్యం ఒకటి. ఇందులో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయే తప్ప ఆంధ్రప్రాంతాలు లేవు. ఆంధ్ర అంటే నిఘంటువుల్లో అర్థాలు కూడా ఏమంత వీనుల విందుగా లేవు. అట్లాంటిది జాతి భావన పేరిట మళ్ళీ జత కట్టాలని ప్రయత్నించడమేంటే 60 యేండ్లుగా దేనికి వ్యతిరేకంగా తెలంగాణ భూమి పుత్రులు, కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారో మళ్ళీ అదే పాలన, ఆధిపత్యాన్ని, ఆణచివేతను తీసుకొచ్చేందుకు చేసే కుట్రగానే భావించాలి.
ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పది జిల్లాల నుంచి పదివేలకు పైగా కవిత్వ, వ్యాస, కథా, నవలా పుస్తకాలు, సంకలనాలు, సంపుటాలు, సీడీలు వెలువడ్డాయి. ఇందులో ఏవి కూడా సీమాంధ్రలోని పుస్తకాల షాపుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతెందుకు నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడలో దగ్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర కొలమానాల్లో తూచి, శైలి, శిల్పం, వస్తువు, వ్యక్తీకరణ పేరిట కథల్ని, కవిత్వాన్ని అంచనా వేసి నాసిరకం అని తేల్చేస్తుండ్రు. తెలంగాణ భాషలో రాసిన కథలేవి మాకు పంపొద్దని పత్రికా సంపాదకులు నిర్ద్వందంగా తేల్చి చెబుతుండ్రు. మన ప్రతిభను అంచనాగట్టడానికి పరాయి వాళ్ళకు పెత్తనమిస్తే వాళ్లు నెత్తంతా కొరిగి పెట్టడమే తప్ప ఒరగబెట్టేదేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

ఆధిపత్యం లేకుంటే ఆంధ్రవాళ్ళతో కలిసిపోవచ్చు, తెలుగువారి ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కూడా అత్యాశే! అంతేకాదు అవాంఛనీయం కూడా! ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ‘కలిసిపోవొచ్చు’ అనే భావన తెలంగాణవారి మనస్సులో లక్షలో ఒక వంతు కలిగిన దాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు సీమాంధ్రులు సిద్ధంగా ఉంటారు. రేపు తెలుగుభాషకు సాహిత్యానికి జాతీయిస్థాయిలో దక్కే అవార్డుల కోసం, గౌరవం కోసం, పద్మఅవార్డుల కోసం ఇతర గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో తెలంగాణ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటది.

అలాంటప్పుడు నిర్ణేతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా సాంప్రదాయిక తెలంగాణవాళ్ళు ఉన్నట్లయితే అవి మళ్ళీ మళ్లీ ఆధిపత్య ఆంధ్రులకే దక్కే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే మన సాహిత్యాన్ని అంచనాగట్టేందుకు మనమే కొత్తకొలమానాలను రూపొందించుకోవాలి. ఆధిపత్యుల చెర నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇక తెలుగువారి మధ్యన ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కన్నా భారతీయుల మధ్యన ఐక్యత కోరుకుంటే అంతా సమానమన్న భావన వస్తది. (అసలు సిద్ధాంతమయితే ప్రపంచ కార్మికులారా ఏకంకడి అనుకోండి) అయినా 60 యేండ్ల సంది తెలంగాణను నంజుకు తిన్నవారితోటి ఐక్యత ఎవరి అవసరం? కచ్చితంగా ఇది తెలంగాణ వారి మేలుని కోరేదయితే కాదు. అయితే చుండూరు బాధితుల తరపున, పోలేపల్లి నిర్వాసితుల తరపున ఇటు తెలంగాణవారు, అటు ఆంధ్రవారూ సమస్యల వారిగా సంఘటితంగా పోరాటం చేయవచ్చు.

అంతేగాని మొత్తంగా తెలుగువారి ఐక్యత అంటే మళ్ళీ ఆంధ్రాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకతీతంగా అగ్రకులాధిపత్యానికి ఆహ్వానంగా భావించాలి. అయితే పోలవరం విషయానికొస్తే బుద్ధిజీవులు ఎవరి పక్షాన నిలబడుతారనేది వారి నిబద్ధతకు గీటురాయి. తమ సర్వస్వాన్ని సెజ్‌ల కోసం కోల్పోయే వారికి సంఫీుభావంగా ఉంటారా? సర్వం కొల్లగొట్టి తీరాంధ్రలోని బలహీనవర్గాల భుక్తిని కూడా కొల్లగొట్టే మూడోపంటకు నీరు కోరుకునే వారి పక్షాన నిలబడతారో తేల్చుకోవాలి.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ కలకాలం మనగలగాలి అంటే ఈ 60 యేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యం, హింస, ఉక్కుపాదంతో అణచివేయబడ్డ ఉద్యమాలు, కబ్జాకు గురైన చెరువులు, భూములు, రాజ్యహింసకు గురైన ప్రతి ఒక్క మనిషి చరిత్రను సాలార్జంగ్‌ మ్యూజియం కన్నా పదింతల పెద్దదయిన ప్రదర్శనశాలలో పెట్టాలి. 1969 కాలంలోనే జరిగిన బంగ్లాదేశ్‌ యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, చిన్నారులను చిత్రవధ చేయడం దగ్గరి నుంచి రక్తాలోడుతున్న చిత్రాలను అక్కడి ప్రభుత్వం జాతీయ మ్యూజియంలో నిక్షిప్తం చేసింది. పాకిస్తాన్‌ మిలిటరీ పాల్పడ్డ అకృత్యాలను సజీవంగా చిత్రిక గట్టింది. అందుకే ఆ మ్యూజియం సందర్శించిన వాళ్ళు పాకిస్తాన్‌పై మరింత కసిని పెంచుకొని బైటికి వస్తారు.

అలాగే ఇవ్వాళ తెలంగాణ తాను కోల్పోయిన సహజ వనరుల్ని, విధ్వంసానికి గురైన బతుకుల్ని, ఛిధ్రమైన వారసత్వ సంపదని, నెత్తురోడిన 1969 ఉద్యమ చిత్రాల్ని, వంచనకు, హేళనకు గురైన నిన్న మెన్నటి ఉద్యమ డాక్యుమెంటరీలను, సమైక్య రాష్ట్రంలో పద్మ అవార్డులకు దూరమైన వైతాళికుల్ని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీలులేదు, ఒక్కపైసా ఇవ్వం ఏం జేసుకుంటారో చేసుకోండి అనే ప్రసంగ పాఠాల్ని, చిత్రాల్ని, తెలంగాణ ప్రజల్ని విలన్లుగా చూపించిన సినిమాలను ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరముంది. లేకుంటే రేపటి తరానికి నిన్నటి తరానికి జరిగిన అన్యాయంపై అవగాహన లేకుండా పోతుంది. ఇవ్వాళ అవగాహన రాహిత్యంతో బుద్ధిజీవులు చెబుతున్న తెలుగువాళ్ళమంతా ఒక్కటే అనే భావనలో మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని, హింసను కచ్చితంగా రికార్డు చేసి పెట్టాలి.
ఇన్నేండ్లు తెలంగాణ విస్మరణ, వివక్షకు, వక్రీకరణకు గురయ్యిందని చెబుతూ వచ్చాం. దానికి సాక్ష్యాలను రికార్డులను ప్రదర్శనకు పెట్టనట్లయితే మళ్ళీ మనం మోసపోయే ప్రమాదముంది. సాహిత్యంగా కన్నా రాజకీయం ఈ అవసరం ఎక్కువగా ఉంది.  మన ప్రతీకల్ని మనం నిర్మించుకోకుండా ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేము. ట్యాంక్‌బండ్‌పై మన విగ్రహాలను కొలువు దీర్చకుండా భావజాలంలో మార్పు తీసుకురాలేము. తెలంగాణ వాండ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇక్కడి వైతాళికులని ఒక్కొక్కరిని లెక్కగట్టి స్మరించుకోవాలి. అది తెలుగు వాళ్ళమన్న భావనలో గాకుండా తెలంగాణవాళ్లమన్న సోయితోనే సాధ్యం.

                                                                                                                                                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌
Download PDF

21 Comments

  • ప్రత్యెక రాష్ట్రం సాధించిన సందర్భంగా తెలంగాణా సంస్కృతీ , సాంప్రదాయం , సాహిత్యం , వారసత్వాలను సుసంపన్నం చేయడానికి శ్రీనివాస్ గారు చాలా పెద్ద ప్రణాళికను సిద్ధం చేశారు. దానిని అమలు చేయాలంటే పెద్ద యంత్రాంగం కావాలి.

    ముందుగా అక్కడ స్థిరపడ్డ వలస పాలకులను , దోపిడీ దొంగలను [సీమాన్ద్రులను అని వేరుగా చెప్పనక్కర లేదనుకుంటాను.] అక్కడి నుండి పంపించి వేయాలి.
    సీమాన్ద్రులకు చెందిన అన్ని రకాల సంస్థలను అంటే వ్యాపారాలను , ఉత్పత్తి సాధనాలను ,మీడియా సంస్థలను మొదలయిన వాటిని అక్కడ నిషేధించాలి.
    అన్నిటిని కూకటివెళ్ళతొ సహా పెకలించివెయాలి. లేకపోతె తిరిగి మొలకెత్తే ప్రమాదం వుంది. ఎందుకంటె సీమాన్ద్రులను తక్కువగా అంచనా వెయకూడదు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి మరల తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రమాదం వుంది. [ఈమధ్యనే పేపరులో ఒక వార్త చూశాను.హైదరాబాదులో పనిచేస్తున్న సీమాంధ్ర డాక్టర్లు సీమాన్ధ్రకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారట! ఒక వేళ బలవంతం చేస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడె స్వంతంగా వైద్యం చేస్తారట.!!]

    తెలంగాణా మేధావులకు , రచయితలకు చేపట్టవలసిన కార్యక్రమాలను గూర్చి అవగాహన కల్పించాలి.
    అన్ని పాఠ్యపుస్తకాలలొ తెలంగాణా సంస్కృతీ , సాంప్రదాయాలు , భాష , మాండలికాలతో పాటు వలస పాలనలో తెలంగాణాకు జరిగిన అన్యాయాలను గురించి కూడా ఉండేలా చూడాలి.
    వీటిని అమలు పరిచేలా ప్రభుత్వం పయ్ వత్తిడి తేవాలి.
    ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలని కోరుకుందాం.

    • srinivas sangishetty says:

      తెలంగాణా వాళ్లే వలసవాదులకు రెడ్ కార్పెట్ పరిచే పనిలో ఉన్నారు. ముందుగాల ఆళ్ళ పని బట్టాలే.

    • Krishna Mohan says:

      With people like you around who needs Nazis or xenophobes !! Way to go Mr Jay, keep up this great thought process and I’m sure there’ll be a bunch of folks who will support you as well in this great people friendly strategy that you drew up

      • Sir , Pl. go through the article written by Mr. Sangisetti Srinivas and then see my comments. Intelectuals like him think that their culture , liturature , language , etc. are spoiled by Seemaandhra people and now they would like to restore the same. What is wrong in my comment ? It only shows their way of understanding the problems in their own way! Isn`t it ?

    • మంజరి.లక్ష్మీ says:

      బాగా చెప్పారు.

    • మంజరి.లక్ష్మీ says:

      బాగా చెప్పారు జయ ప్రకాష్ రాజుగారు. అలా చేస్తేనే తెలంగాణా బాగా అభివృద్ది చెందుతుంది.

      • పాపం , కృష్ణ మోహన్ గారు నేను చెప్పినది సరిగా అర్థం చేసుకోక నన్ను నాజీ గా , పచ్చకామెర్ల రోగిగా వర్ణించారు !

  • నా కామెంట్ చూసిన కొంతమంది నా స్నేహితులు సీమాన్ధ్రులు నిజంగా వలస వచ్చిన వాళ్ళా అని అడిగారు. దానికి నా సమాధానం – ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు , సంగిసెట్టి శ్రీనివాస్ గారు , కోదండరాం గారు , ప్రో. హరగోపాల్ గారు , యన్. వేణుగోపాల్ గారు , వరవర రావు గారు యింకా కొంతమంది మేధావులు అలానే అన్నారు కాబట్టి నేను అలానే అనవలసి వచ్చింది. కాదంటారా ? వలస వచ్చిన వాళ్ళు అంటె వేరే అర్ధం ఉందేమో నాకు తెలియదు.

  • buchi reddi gangula says:

    తెలంగాణా వాళ్ళ మన్న సోయి —అవసరం — కాని రాజు గారు
    రాసినట్లు వలస పాల కుల ను పంపించి వేయాలి — తరిమి వేయాలి —
    అది మంచిది కాదని నేను బావిస్తాను —వేరు పడ్డా — అందరం తెలుగు వాళ్ళం — కలిసి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతూ — రొండు రాష్ట్రాల
    అబివృద్ది కోసం కలిసి పాటు పడు ధామ్ —అ తిరుగా అ రీతిలో
    నడుచుకోవడం అవసరం —-
    శ్రీనివాస్ గారు చక్కగా చెప్పారు —
    2019 లో తెలంగాణా లో తెలుగు దేశం పాలన అంటూ — యిప్పటి నుంచే
    బాబు కూతలు —-మల్లి యిద్దరు నాయుడు లు కలిసి మోసం చేయక
    మానరు —దయాకర్ రావు — రేవంత్ రెడ్డి — మొతుకుపల్లి — లాంటి
    తెలంగాణా ద్రోహులు — మన లో నే ఉన్నారు — వీళ్ళు వాళ్ళ ఉనికి కోసం
    ఆధిపత్యం కోసం — డబ్బు సంపాదన కోసం — బాబు కు చెంచాలు గ ఉంటూ —కాలోజి గారన్నట్లు –ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ???___ ???
    అవకాశ వాదులు — ఊసరవెల్లులు —అవనీతిపరులు — ఎక్కువ శాతం చూసేది –అగ్రకులాల్లో — దొరల్లో —-అమెరికా అయినా –అమలాపురం అయినా –
    డబ్బు ఆడిస్తుంది — డబ్బు మాట్లాడిస్తుంది — డబ్బు గెలిపించుకుంటుంది —
    ముస్లిం అంటే పరాయి వాడు —Desha ద్రోహి ani- –దళితుడు అంటే తక్కువ వాడు —స్త్రీ అంటే చులకన — స్వంత ప్రాపర్టీ — అని —ఉన్నోల్లకు — దాసోహం –చేస్తూ ——యీ తిరు పోవాలి —-
    గళం ఎత్తాలి
    సమానత్వం పెంచాలి మార్పు తేవాలి
    వచ్చి తీరుతుంది
    ***********************************************
    బుచ్చి రెడ్డి గంగుల

    • అందరం తెలుగు వాళ్ళం అని అందరు అంటున్నందుకేగా శ్రీనివాస్ గారు బాధపడుతుంది ! అందుకే అలాటి సలహా యిచ్చాను బుచ్చి రెడ్డి గారూ !! మరొకసారి వారి ఆర్టికల్ చదవండి.

      • Thirupalu says:

        అయితే ఎవరి రాస్ట్రాల్లో వారు గిరిగీసుకొని బతకాలా? ఇక పై భారత ఏశంరాస్ట్రాలుగా విడి పోతుందా? మరో యు ఎస్‌ ఎస్‌ అర్‌ కాబొతుందా? అమ్మో!

      • తిరుపాలు గారూ ! శ్రీనివాస్ గారు కోరుకున్నది అదే !!

  • buchi reddi gangula says:

    హిందీ రాష్ట్రాలు ఉండగా రొండు తెలుగు రాష్ట్రాలు ఉంటె
    ఎందుకింత చిరుతల రామాయణం ?? భారతం ??
    విడిపోదాం — కలిసి బ్రతుకుదాం —-అదే మన నినాదం కావాలి
    —–యిప్పుడు — ఎప్పుడు అయినా ———–
    ————————————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  • hari.S.babu says:

    ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు
    >>
    ఉద్యమం మొదటి నుంచీ ఈ “రెండున్నర జిల్లల భాషని మా మీద రుద్దిన్రు” అనే మాతతో చాలా చేశారు!యే రెండున్నర జిల్లాల భాషని గురించి మీరు చెప్తున్నారు? ఆ రెండున్నర జిల్లల భాషని రుద్దదమే జరిగీతే మీరు కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు వ్యతిరేకించరా?భాషాభిమానం మీకు మాత్రమే ఉందా?

    ఒక కృష్ణా జిల్లా వ్యక్తీ ఒక కరీం నగర్ జిల్లా వ్యక్తి మొదటి సారి కలవగానే తమ తమ మాందలికాల్లో మాట్లాడుకోవతం మొదలు పెడీతే ఆ సంభషణ యెలా ఉంటుందో తెలుసుకోగలరు కదా? ఇప్పుడు మనం బ్లాగుల్లో కూడా అందరికీ అర్ధమయ్యేలాగా ఇలాగే యెందుకు మాట్లాడుకుంటున్నాం?విభజనకు పూర్వం 23 జిల్లలౌ ఉందేవి కదా, వాళ్ళందరూ అర్ధం చేసుకోవడానికి యాసలు లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విధంగా యేర్పాటు చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారే?మీ కన్నా రాయల సీమ వళ్ళకి రోషం మరీ యెక్కువే, వాళ్ళని మీలో కలుపుతున్నాం అన్నప్పుడు “వామ్మో, సీమోళ్ళు?!” అనేశారు మీరు.మీరంటున్న రెండున్నర జిల్లల భ్హష నే పదబంధంలో మీ వెటక్క్రంతో కూడిన అతి తెలివి తప్ప ఇంకేదయినా ఉందా?సూచనగా కృష్ణా గుంటూరు జిల్లాలని గురించి అంటున్నారని తెలుస్తుంది(అర జిల్లా యేదో మీరు చెప్పాలి) గాబట్టి ఒక మాట అడుగుతున్నాను, నిజమగా కృష్నా జిల్లాకి తనకంటూ ప్రయేక మయిన మాండలికం లేదా, ఇప్పూదు మామీద రుద్దారు అంటున్న ఈ భాష లాగే ఉంటుందా?

    మొదలు పెట్టటమే రెండున్నర జిల్లలౌ అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిసతె మిమ్మల్ని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో?

  • hari.S.babu says:

    అయ్యా,
    ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వీవరిస్తే బాగుంటుంది.

    ఉద్యమం మొదటి నుంచీ ఈ “రెండున్నర జిల్లల భాషని మా మీద రుద్దిన్రు” అనే మాటతో చాలా చేశారు!యే రెండున్నర జిల్లాల భాషని గురించి మీరు చెప్తున్నారు? ఆ రెండున్నర జిల్లల భాషని అందరి మీదా రుద్దడమే జరిగీతే మీరు కాకుండా మిగతా జిల్లాల వాళ్ళు వ్యతిరేకించరా?భాషాభిమానం మీకు మాత్రమే ఉందా?

    ఒక కృష్ణా జిల్లా వ్యక్తీ ఒక కరీం నగర్ జిల్లా వ్యక్తి మొదటి సారి కలవగానే తమ తమ మాందలికాల్లో మాట్లాడుకోవటం మొదలు పెడీతే ఆ సంభాషణ యెలా ఉంటుందో తెలుసుకోగలరు కదా? ఇప్పుడు మనం బ్లాగుల్లో కూడా అందరికీ అర్ధమయ్యేలాగా ఇలాగే యెందుకు మాట్లాడుకుంటున్నాం?విభజనకు పూర్వం 23 జిల్లలౌ ఉందేవి కదా, వాళ్ళందరూ అర్ధం చేసుకోవడానికి యాసలు లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విధంగా యేర్పాటు చేస్తే దాన్నీ తప్పు పడుతున్నారే?మీ కన్నా రాయల సీమ వాళ్ళకి రోషం మరీ యెక్కువే, వాళ్ళని మీలో కలుపుతున్నాం అన్నప్పుడు “వామ్మో, సీమోళ్ళు?!” అనేశారు మీరు.మీరంటున్న రెండున్నర జిల్లల భాష నే పదబంధంలో మీ వెటకారంతో కూడిన అతి తెలివి తప్ప ఇంకేదయినా ఉందా?సూచనగా కృష్ణా గుంటూరు జిల్లాలని గురించి అంటున్నారని తెలుస్తుంది(అర జిల్లా యేదో మీరు చెప్పాలి) గాబట్టి ఒక మాట అడుగుతున్నాను, నిజమగా కృష్ణా జిల్లాకి తనకంటూ ప్రత్యేక మయిన మాండలికం లేదా, ఇప్పుడు మామీద రుద్దారు అంటున్న ఈ భాష లాగే ఉంటుందా?

    మొదలు పెట్టటమే రెండున్నర జిల్లలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో?

  • teluguone says:

    కామెంట్స్ రాసే పాఠకులారా !! సోయి తెచ్చుకోండి.
    ఇక్కడ రచయిత ఉద్దేశ్యమే విద్వేషాలు రెచ్చగొట్టడం మరియు లాభం పొందటం (బహుశా పద్మ అవార్డుకి పునాది అనుకుంట).

  • srinivas sangishetty says:

    …..
    రెండున్నర జిల్లోళ్లు
    రెండు మూడు తెగలోళ్ళు
    చదువుకున్న కులపోళ్ళు
    రెండున్నర జిల్లాలదే
    అధికారమంత గూడ
    తామే పంచుక తింటే
    తక్కినోళ్ళ నోళ్ళ యాస
    తొక్కిపెట్టి నొక్కేస్తే
    తిరగాdబడాల్న వద్దా?
    తెలుపండి నలిగెటోళ్ళు
    ………………………. కాళోజి
    (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము)
    ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన.
    1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము. రేట్ స్కూల్స్ మొదట వచ్చింది అక్కడే. ప్రభుత్వానికి ఉల్టా పైసలిచ్చి ఏర్పాటు చేసిన బడులవ్వి. వీళ్ళని గోదావరి జిల్లాల వారిగానే తెలంగాణా వాళ్ళు అనాటి నుంచి చూసిన్ద్రు.
    ఇగో ఇప్పుడు పోలవరం ఈ రెండున్నర జిల్లాల వారికి వరం కాగ తెలంగాణా ఆదివాసి బిడ్డల సావుకొచ్చింది.
    – ఇంకో సంగతి రెండున్నర కులాలు అంటే ఆ సగం కులం ఏది అని అడుగకున్ద్రి. ఆ విషయం మల్లొక్క సారి తీరిగ్గ మాట్లాడుకుందాం.
    అయినా ఈ బాబులకు ఎట్ల చెబితే అర్ధం అయితదో|

    తెలుగుఒన్ అని ఇంగ్లీష్ల రాసినాయినదైతే మరీ ఇచ్చన్త్రంగ ఉంది. మా వాటాలో హక్కుగా దక్కాల్సిన పద్మ అవార్డులు కచ్చితంగా డిమాండ్ చేసి తీరుతామ్.
    అట్లా అడిగితె విద్వేషాలు రెచ్చగొట్టడమా? అయితే ఆ పని లక్ష కొట్ల సార్లు చేస్తా.

    • hari.S.babu says:

      ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!

      ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట

  • buchi reddi gangula says:

    తెలుగు వన్ గారు —-మీరు రాసిన అ కారణాల చేత విడి పోవడం జరిగింది —సొల్లు రాతలు రాయకండి దయతో —
    తెలుగు వన్ — అమ్మ పెట్టిన పేరు కాదనుకుంటా —-నిజమయినా పేరుతో
    రాయలేరా ?? భయమా ???
    యింత కాలం –అవార్డ్లు లు — సోమ్ముల్లు — నీల్లు — ఉద్యోగా లు — కాజిసింది మీ రే కదా సర్ —-యిక అ పప్పులు ఉడకవు సర్
    ——————————————————–
    బుచ్చి రెడ్డి గంగుల

    • hari.S.babu says:

      ఈ మధ్యనే అందెశ్రీ గారి తెలంగాణా జాతీయ గీతం చదివాను,ఇదేనా?
      http://vrdarla.blogspot.in/2014/05/blog-post_31.html
      అది స్వచ్చంగా గంభీరంగా ఆ రెండున్నర జిల్లాల భాషలోనే ఉందిగా!

  • hari.S.babu says:

    ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి.అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది.

    ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్కృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఈ పంచభాష సంస్కృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే.

    ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!

    ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు.
    >>
    ఇంత ఘనంగా ప్రత్యేక భాషా ఆస్తిత్వానికి కట్టుబడ్డ మీరు మీ రాష్ట్ర గీతాన్ని మళ్ళీ ఆ బలవంతంగా రుద్దబడిన అందరి భాషలోనే యెందుకు రాసుకున్నారు.ఆ పాట యెక్కడా పంచవేణీ సంగమం ఆనవాళ్ళు, తెలంగాణా పలుకుబడులు లేకుండా పాత తెలుగు వాసనే వేస్తుందేం?

Leave a Reply to buchi reddi gangula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)