నన్ను వెతుక్కుంటూ వొచ్చింది కవిత్వం!

premio-nobel-de-literatura-chileno-pablo-neruda-2013-03-22-57728

premio-nobel-de-literatura-chileno-pablo-neruda-2013-03-22-57728

 

“నెరుడా గురించి రాయమన్న వెంటనే నాలోపల ఏదో గాలి సందడి చేసింది.పగలబడినవ్వాలనిపించింది. సరే అని రాయటం మొదలుపెడితే కాగితాలు కాగితాలునిండిపొయ్యాయి. నేను రాయల్సింది కొద్దిగనే కదా అని గుర్తుకుతెచ్చుకోని, రాసినదంతా పడేసి ఏదో పది వాక్యాలు రాద్దాం అని కూర్చుంటే- అలా కవితలువస్తున్నాయ్. నెరుడాని అమితంగా ఇష్టపడే వాళ్లకు  నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది.

 

మా ఇంట్లోనే ఒక గోడౌన్  ఉండేది. అక్కడికి సామాన్యంగా ఎవ్వరూపోరు. ఒక్కతినే అక్కడికి వెళ్లి, అక్కడ వేలాడుతున్న చిన్న బల్బునువెలిగించి, అక్కడి నిశ్శబ్దానికి నెరుడా కవిత్వాన్ని వినిపించే వాడిని.  ఆనిశ్శబ్దంతో ఒక సంబంధం ఏర్పరుచుకున్నానో ఏమో, అక్కడికి వెళ్లి దొరికిన నెరుడాకవిత్వం అంతా చదవటం ఒక అలవాటు గా మారిపోయింది. ఇక్కడ నేను కవిత్వంరాయకుండా కేవలం వాస్తవాలను రాస్తూ నెరుడాని పరిచయం చేయటానికివిశ్వప్రయత్నం చేయదల్చాను.

 

నెరుడా చిలీకి చెందిన మహాకవి. నిజానికి నెరుడాని చిన్నవయస్సులో మరో గొప్ప కవయిత్రి గబ్రిఎల్ మిస్ట్రల్ చాలాప్రొత్సహించింది. నెరుడా కి తన సవతి తల్లి అంటే ఎంతో ఇష్టం. నెరుడా తన “మెమోఇర్స్” లో ఆమె పై తన ప్రేమను అత్యంత కవితాత్మకంగా చెప్తాడు. ఆమె “ఇంట్లోని చీకట్లనుండి బయటకి వొచ్చే నిశ్శబ్ద నీడ” అంటాడు.

 

నెరుడాతన తొలి పుస్తకం – “ఇరవై ప్రేమ కవితలు మరియూ ఒకవిషాద గీతం” – 1921 లో ప్రచురితమయ్యింది. అత్యంత చిన్న వయసుతోనే ఆ పుస్తకంద్వారా నెరుడా సాహిత్యలోకంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తనప్రేమ స్మృతులన్నీ – చిలీ దేశపు ప్రకృతి అందాలని కలగలిపి ఒక కవితాత్మక రూపంఇవ్వటంలో నెరుడాకు సాటి ఎవ్వరూ లేరు. గొప్పకవి అయిన లోర్కా నెరుడా కు మంచిస్నేహితుడు. లోర్కా నెరుడా గురించి యిలాచెప్తాడు “తనకు తత్వశాస్త్రం కంటేచావుతోనే ఎక్కువ సాన్నిహిత్యం, అంతర్గత ఆలోచనల కంటే బాధకి ఎక్కువ దెగ్గర-సిరా కంటే రక్తం గురించే ఎక్కువ తెలుసు. ఆ కవిలో ఎన్నో రహస్యమైన గొంతులువినిపిస్తూ ఉంటాయ్, అవేంటొ తనకే తెలియవు.”

 

రాజకీయంగా, నెరుడా కమ్యునిస్టు భావాలని నమ్మాడు. 1971 కాలం, నెరుడా రాజకీయ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి చేరుకున్న సమయం.  చిలీకమ్యునిస్టు పార్టీ నెరుడా ని ప్రసిడెంట్-అభ్యర్థిగా గా ఎన్నుకున్నప్పుడుతను ఆ భాద్యతని సాల్వడార్ అలండేకి ఇచ్చాడు. ఆ కాలంలోనే తనకు నొబెల్పురస్కారం కూడా వొచ్చింది. కాని ఆరోగ్యం క్షీణించడం వల్ల 1973లోకన్నుమూసాడు.

 

‘కవిత్వం’ అనే ఈ కవితలో నెరుడా తనకు మొట్టమొదటి సారికవిత్వం తో ఎలా పరిచయం అయ్యిందో చెప్తాడు. ఎది నాకు ఎంత ప్రియతమైన కవితఅంటే దీన్ని ఇంట్లో నా గోడ పై రాసుకుని రోజు పొద్దుననే లేచి చదివే దాన్ని .

 

ఈ నెల కవి: పాబ్లో నెరుడా

 tumblr_lgmaonlhmf1qdy8lno1_500

కవిత్వం 

 

 

 

అప్పుడు, ఆ వయసులో నన్ను వెతుక్కుంటూ

వొచ్చింది కవిత్వం.

 

నాకు తెలీదు, 

అది ఏ శీతాకాలం నుండో, ఏ నది లోంచి పుట్టిందో

దాని గురించి ఏమీ తెలీదు.

 

 

ఎలా వొచ్చిందో, ఎప్పుడు వొచ్చిందో,

అది స్వరం కాదు,పదాలూ నిశ్శబ్దం కాదు.

 

అకస్మికంగా రాత్రి శాఖల ద్వారా

ఒక వీధి నన్ను రమ్మని పిల్చింది,

క్రూరమైన మంటల నుండో, ఒంటరిగా తిరిగి వెల్తున్నప్పుడో.

అక్కడ ఒక అనామకుడిగా నిల్చుండిపోయినప్పుడు 

 

కవిత్వం నన్ను తాకింది. 

 

నాకు ఏం చెప్పాలో తెలియదు, 

మాట్లాడటానికి దార్లన్నీ మూసుకుపొయ్యాయి,

నా చూపు గుడ్డిదయింది, 

లోపల ఏదొ మొదలయ్యింది, 

జ్వరమో, మరచిన రెక్కనో ,

ఆ జ్వాల అర్థాన్ని వెంటాడుతూ,

నా దారిన నేను వెళ్లిపోయాను,

 

అప్పుడు రాసాను

ఏమీ తెలియని వాడు రాసే స్వచ్చమైన జ్ఞానంతో

పదార్థం లేని, బలహీనమైన,

శ్రేష్టమైన, అర్థరహితమైన, 

మొదటి అస్పష్ట వాక్యం, 

 

అకస్మికంగా స్వర్గాలు విడుదలయ్యాయి, 

గ్రహాలు తెరుచుకున్నాయి, తోటలు జీవం పోసుకుని ఆడాయి, 

నీడలకు చిల్లులు పడ్డాయి, 

 

 

బాణాలు, మంటలు, పూలు, 

ముడుచుకుంటున్న రాత్రి, ఈ విశ్వం

అన్నీ పొడుపుకథలు అయ్యాయి. 

 

 

 

అక్కడ అత్యంత సూక్ష్మజీవిని అయిన నేను,

రహస్యం లాంటి ప్రతిమ కలిగిన

ఆ గొప్ప నక్షత్రాల శూన్యాన్ని తాగి

నాకు మాత్రమే తెలిసిన స్వచ్చమైన అగాధం లో

నక్షత్రాల చక్రాలను నడుపుతుంటే


హృదయం గాలులతో స్వేచ్చగా విహరించింది.

 

 

 పరిచయం

సిరా- This name is a pseudonym. Please represent me as a pseudonym. Hope you see that many poets in history had written with a pseudonym. I would like to use the photo of Pessoa who is the master of pseudonyms and here is how I would like to introduce myself-

కేవలం సాహిత్యం కోసమే ఒక జన్మ ఉంటే బాగుంటుంది.

ప్రపంచం లోని అన్నిరకాల విషయాలను మర్చిపొయ్యి కేవలం సాహిత్యానికే పరిమితమవ్వాలి అనే  ఒక ఆలోచన ఎంత బాగుంటుంది?

సాహిత్యాన్ని సమాజాన్ని వేరు చేసే ప్రయత్నం కాదు, కాని సమాజం లో ప్రతిమూలని కెకేవలం సాహిత్యంతో చూస్తే ఎలా ఉంటుంది?

అసలు సమాజం అంతా మారుతున్నప్పుడు సాహిత్యం స్ఠానం ఏమిటి? ఇలాంటి  ఆలోచనలనుండి పుట్టినది సిరా.

సిరా కి స్వచ్చంగా నవ్వటం తెలుసు. అన్యాయం జరుగుతుంటే ఖండించటం తెలుసు. మౌనంగా కుర్చోని రోజులు గడపటం తెలుసు. గొప్ప సాహిత్యం చదివాక దానితో ఎప్పటికీ వీడలేని బంధం ఏర్పరుచుకోవడం తెలుసు. కుదిరితే అప్పుడప్పుడు అనువాదం చేయటమో, కవిత్వం రాయటమో తెలుసు.
There is a surreal Pessoa’s photo representing his many faces. I hope, that suits as my picture.

pessoa_________-

 

Download PDF

18 Comments

 • తిలక్ says:

  చాలా బాగుంది కవిత మరియు మీ విశ్లేషణ .
  అభినందనలు

 • నెరూడా పద్యానువాదం చాల బాగుంది. జీవిత పరిచయమూ బాగుంది.

  ఎట్టా రాయాలనిపిస్తే అట్టా రాయబోయి… కవిత్వం జోలికి పోవద్దు, జీవిత వాస్తవాలే చెప్పాలి, అదీ కొన్ని మాటల్లోనే చెప్పాలి… అని నియమాలెందుకు పెట్టుకున్నారు?
  ఇది అభ్యంతరం కాదు. అలా చేయడానికి మీకేదో కారణం వుంటుంది, అదేమిటో తెలుసుకుందామని అంతే.

 • balasudhakarmouli says:

  బాగా రాసారు. థ్యాంక్యూ..

 • rajaramt says:

  నెరుడా గురించి ఆయన కవిత్వం గురించి అద్భుత విశ్లేషణ చేస్తూ,అనువాదం కూడా బాగా చేశారు

 • Sira says:

  హెచార్కే గారు నా ముందు ఒక ప్రశ్నను కుర్చోపెట్టారు. అది నన్నే చూస్తోంది. కన్నార్పకుండా నన్నే చూస్తోంది. పాపం ఆ ప్రశ్న కు తెలియనిది ఏంటి అంటే ఆ ప్రశ్న పుట్టక ముందు నుండే నాకు ఆ ప్రశ్నకు జవాబు తెలుసు. కాని ఆ జవాబు ను అక్షర బద్దం చేసే అవకాషం నాకు రాలేదు. ఇప్పుడు ఇలా నా ముందు ప్రశ్నను కుర్చొపెట్టిన హెచార్కే గారికి ధన్యవాదాలు.

  ఇంటర్నెట్టు ఒక గొప్ప సాధనం. ఇరవయ్యేల్ల ముందు లేదు ఇలాంటిది. ఇప్పుడు ఒక్క క్లిక్కు తో ప్రపంచం మన ముందు తెరుచుకుంటుంది. నిజానికి మన టెక్నాలజీ ఒక అడుగు ముందుకు వేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ఒక్క సారిగా మిమ్మల్ను 1848 కాలానికి వెల్దాం. ఆ కాలంలో కుడా టెక్నాలజి, సైన్స్ శరవేగంగా అభివృద్దిచెందాయి. సామ్రాజ్యవాద దేశాలు కాలనీలు స్ఠాపించాయి. మార్కెట్లు విస్తరించుకున్నాయి. ఎక్కువ ఉత్పత్తి చేయాల్సిన అవసరం వొచ్చింది. టెక్నాలజి, శాస్త్రం అభివృద్దిచెందాయి. ప్రింటింగ్ మషిన్ ని కనుగొన్నారు. సాహిత్యం చర్చు, రాజుల చేతి నుండి ప్రజల చేతిలోకి వొచ్చింది. అప్పట్లో అభివృద్ది చెందిన ఇంకొక ముఖ్యమైనది ఎంటి అంటే రవాణా మరియూ కమ్యునికేషన్. కొన్ని సంవత్సరాలలో జరగాల్సిన విషయాలు కొన్ని రోజులలో జరిగిపోవటం చూసి మానవుడు ఆశ్చర్య పోయాడు.

  కచ్చితంగా 1848 కే వెల్దాము అని ఎందుకు ఆడిగాను అని సందేహం వొచ్చుండొచ్చు. ఎందుకంటే అప్పుడే మర్క్సు “ప్రపంచం లోని కార్మికులందరూ ఏకం కండి” అని పిలుపునిస్తూ తన “కమ్యునిస్టు మేనిఫెస్టో” ను విడుదల చేసాడు. విప్లవానికి అది సరి అయిన సమయం అని మర్క్సు అప్పట్లో గుర్తించాడు. ప్రజలందరికీ సమాచారం అందుబాటులో ఉండటం, రవాణ మరియు కమ్యునికేషన్ వ్యవస్తలూ కనీ వినీ ఎరుగని స్ఠాయిలో అభివృద్ది చెందటం వల్ల కార్మికులందరినీ ఒక్కటి చేయటం సులభమయ్యింది అనుకున్నాడు విప్లవానికి.

  ఇప్పుడు మల్లీ మన సమయంలోకి వొద్దాం. గ్లొబలైజేషన్ ప్రపంచాన్ని మన కాలపు సామ్రాజ్యవాదులకు దొచుకోవటనికి అనుగునంగా చేస్తున్న సమయం. ఇంటర్నెట్టు కుడా మొదట్లో దీనిలో భాగంగానే వొచ్చింది. కాని గతంలో జరిగినట్టు మల్లీ టెక్నాలజీ వల్ల సమాచారం ఇంకా సులభంగా అందుబాటులోకి వస్తోంది. కమ్యునికేషన్ ఇంకా సులభంగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో మర్క్సు అప్పుడు కలగన్న సామ్యవాద సమాజం గురించి, దానికోసం రావాల్సిన విప్లవం గురించి ఇంకొక ఆలోచించాలి అనిపించింది. తొందర్లో సమాజం మారిపోతుంది, ప్రపంచం అంతా సొషలిసం వ్యాపిస్తుంది అని చెప్పటం ఆశావాదమే అయిన, అనుకునేకి బాగుంటుంది. నా లాంటి వాల్లను ఈ ఆశావాదమే బ్రతికిస్తుంది.

  వికీలీక్స్ లాంటి హేకింగ్ సంస్థలు అమేరికా లాంటి శక్తివంతమైన దేషాలను కేవలం “నిజం” చెప్పటం వల్ల వనికిస్తున్న రోజులు ఇవి. కాని నిజంగా “నిజం” చెప్పాలి అంటే ముసుగు వెనకాలనుండి చెప్పాలి. వికీలీక్స్ లాగా. అందుకే ఈ ముసుగు. ఎటువంటి సంకెల్లచేతా బందింపబాడని “నిజం”. “నిజం” చెప్పటానికి కావలసినంత స్వెచ్చనిచ్చే ముసుగు. నా వ్యక్తిగత జీవితం కుడా నాకు అడ్డురాకుడదు అని వొచ్చిన నిస్వార్థ ముసుగు. ఎటువంటి బంధాలూ కట్టిపడేసే అవకాషం ఇవ్వని ముసుగు. మన మారుతున్న సమయాల్లో ఎదో ఒక ప్రయోగం చెస్తూ ఉండటం చాలా అవసరం. అలాంటి ప్రయోగమే ఈ ముసుగు.

  ముసుగు లేకుండా రాస్తే ఎం అవుతుంది అని అంటారేమో…నాకు అది నక్సలైటులు అరణ్యాలలోనే ఎందుకు పోరాడుతారు అనో, వికిలీక్స్ లో పని చేసే హేకర్ల పేర్లు అంత రహస్యంగా ఎందుకు పెట్టాలి అనో వినిపిస్తుంది. కాని వల్లందరితో నన్ను పోల్చుకోవటం అంత సమంజసం కాదు. కాని ఎదో నాకు దొరికిన ఈ ముసుగు వేసుకొని నేను చెప్పగలిగే నిజం నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టే ఈ ముసుగు. ఈ మారుపేరు. ఈ ప్రయత్నం.

 • Thirupalu says:

  సి.రా మ్యాం గారు ,
  పాబ్లో నెరూడా గురించిన పరిచయం, ఆయన కవిత తెలుగీకరణ చాలా బాగున్నాయి. అభినందనలు.

 • మణి says:

  పాబ్లో నెరూడా గురించిన పరిచయం, మీరు అనువదించిన ఆయన కవిత చాలా బాగున్నాయి. ముఖ్యంగా తెలియని ఎంతోమంది ప్రపంచ కవులు గురుంచి తెలిసుకోవడం చాలా ఆనందంగా ఉంది సి రా గారు. కాని
  హెచార్కే గారి కి మీరు ఇచ్చిన జవాబు చదివాను. కానీ అందులో కొంత ఏకీభవించలేక పోయాను.

 • కోడూరి విజయకుమార్ says:

  నెరూడా గురించి మీరు రాసిన వ్యాసం బాగుంది సి రా గారు
  ఆ వ్యాసం కన్నా ‘సిరా కి స్వచ్చంగా నవ్వటం తెలుసు. అన్యాయం జరుగుతుంటే ఖండించటం తెలుసు. మౌనంగా కుర్చోని రోజులు గడపటం తెలుసు’ అంటూ మీ గురించి మీరు చెప్పుకున్న వివరాలే ఎక్కువ ఆసక్తిని సృష్టించాయి (మరీ ముఖ్యంగా, హెచ్చార్కె గారి ప్రశ్నకు మీరు యిచ్చిన సుదీర్ఘ సమాధానం తో ) :-)

 • హెచ్ ఆర్ కె గారు అడిగిన ప్రశ్నకు మీరిచ్చిన సమాధానానికి సంబంధం అర్థం కావడంలేదండి, వివరిస్తారా , వీలైతే,..

 • సిరా వ్యాసం మొదట్లో కృత్యాద్యవస్థగా, యాదాలాపంగా చెప్పిన మాటల్ని నేను సీరియస్ గా తీసుకుని ప్రశ్న అడగడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. మన్నించాలి.

  నేను అడిగింది ఇదీ: వ్యాసం మొదటి రెండు పేరాల్లో… చాల ఎక్కువ రాసి అదంతా పడేసి ‘ఏవో పది వాక్యాలు రాద్దామ’ని యత్నిస్తున్నాననీ, ‘కవిత్వం రాయకుండా కేవలం వాస్తవాలను రాద్దామ’ని యత్నిస్తున్నాననీ సిరా అన్నారు. ప్రత్యేకించి అలాగే రాయాలని సిరా ఎందుకు అనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఆ ప్రశ్న అడిగాను. అజ్ఙాతనామం(ల)తో లేదా రాస్తే నాకెలాంటి ప్రాబ్లం లేదు. నేను అడిగింది అది కానప్పటికీ, దానికి జవాబుగా సిరా రాసింది కూడా బాగుంది. :-)

 • Sira says:

  డియర్ సర్,

  I am sorry for my ridiculously inappropriate answer.

  ఆ జవాబు నా లో ఎక్కువ రోజులు ఉన్నందు వాళ్ళ అనుకుంట ఏదో ఒక సాకు పెట్టుకొని అది బయటకి vochesindi. క్షమించాలి.

  neru

 • Sira says:

  నెరుడా లాంటి కవిని పరిచయం చేసే తప్పుడు, అలాంటి Kavi గురించి రాయాల్సి వొచ్చినప్పుడు నా లాంటి పిల్ల కవులు కేవలం వాస్తవాలకు పరిమితం అవ్వటం కరెక్ట్ అని పించింది. అందుకని…

 • ‘వికీలీక్స్ లాంటి హేకింగ్ సంస్థలు అమేరికా లాంటి శక్తివంతమైన దేషాలను కేవలం “నిజం” చెప్పటం వల్ల వనికిస్తున్న రోజులు ఇవి. కాని నిజంగా “నిజం” చెప్పాలి అంటే ముసుగు వెనకాలనుండి చెప్పాలి. వికీలీక్స్ లాగా. అందుకే ఈ ముసుగు. ఎటువంటి సంకెల్లచేతా బందింపబాడని “నిజం”. “నిజం” చెప్పటానికి కావలసినంత స్వెచ్చనిచ్చే ముసుగు. నా వ్యక్తిగత జీవితం కుడా నాకు అడ్డురాకుడదు అని వొచ్చిన నిస్వార్థ ముసుగు. ఎటువంటి బంధాలూ కట్టిపడేసే అవకాషం ఇవ్వని ముసుగు. మన మారుతున్న సమయాల్లో ఎదో ఒక ప్రయోగం చెస్తూ ఉండటం చాలా అవసరం. అలాంటి ప్రయోగమే ఈ ముసుగు.’ Si Ra I agree with it and appreciate your idea behind the experiment.

 • సిరా గారు,
  నవ్వడం నుంచి మొదలు పెట్టి కవిత్వం రాయడం దాకా అది ముసుగుకి సంబంధించిన వ్యవహారం కాదు కదా,. అది పూర్తిగా వ్యక్తిగతమైనది,. ముసుగు పేరుతో మిమ్మల్ని మీరు గ్లోరిఫై చేసుకున్నవిధానం తమాషాగా వుంది, హెచ్ ఆర్ కె సార్ కి ఇచ్చిన మీరు చెప్పినట్లు ridiculously inappropriate ఆన్సర్ లాంటివి చూసినప్పుడు. మళ్లీ ఒక్కసారిగా పిల్లకవులుగా అభివర్ణించుకోవడం కూడా అదే కోవలో వుంది. తప్పనిసరి పోరాట పరిస్థితులలో ముసుగులను ఆమోదించుకోవచ్చు, సాహిత్యానికో జీవితం అంటూ ముసుగును ఎలా మీరు సమర్థించుకుంటారు. నిజం చెప్పాలంటే ముసుగు అవసరం అనేంత పరిస్థితి తెలుగు సాహిత్వంలో వుందంటారా,. ప్రశ్నను పట్టించుకోకుండా తయారుగా వుంచుకున్న సమాధానాన్నిచెప్పడంలో మీ ముసుగుపట్ల మీరెంత ఆరాధనగా వున్నారో తెలియచేస్తుంది,. అదెప్పడు మీరెంచుకున్న లక్ష్యానికి దూరంగానే వుంచుతుందేమో మిమ్మల్ని.

 • sira says:

  నిజానికి తప్పనిసరి పోరాట పరిస్తుతులు తెలుగు సాహిత్యంలో వుంది అండి. నిజానికి సాహిత్యానికీ మన సమాజానికి ఎప్పుడూ సమబంధం ఉంటుంది. కాబట్టి తప్పనిసరి పోరాట పరిస్తుతులు సాహిత్యంలో ఉందా అనే దానికంటే తప్పని సరి పోరాట పరిస్తితి సమాజంలో ఉందా అనటం సమంజసం ఏమో. కాని విప్లవానికి కావలిసిన భౌతిక పరిస్తుతులన్నీ సమకూరకుండానే ఇలా మాట్లాడటం అదేదో కుక్క మొరిగినంత అర్ధాంతరంగా ఉంటుంది. కానీ నిజానికి ధిక్కారన స్వరం ఎప్పుడూ చాలా అవసరం.

  • ఈ సిరా ముసుగు సాహిత్య ప్రక్షాళనకా, సామాజిక విప్లవానికా లేకా రెండూ సహసంబంధ ప్రక్రియలా., మాట్లాడటం అనేది కుక్కలు మొరగడంగా భావించడాన్ని ఏమనుకోవాలి, అది మీరైనా సరే లేదా నేనైనా.,,

 • Sira says:

  నేను సాహిత్యాన్ని సమాజాన్ని వేరు చేసి చూడలేను.

  Kukka lu మొరగటం అపరాధం గ మీకు అర్థమైతే నన్ను క్షమించాలి. న ఉద్దేశం ‘అర్థం కాని భాష మాట్లాడటం’ లాంటిది అని అర్థం

 • మీ ధిక్కార స్వరం మరంత ప్రవర్థితమై వెలగాలని ఆశిస్తూ,

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)