గమ్యం దగ్గిరే అని చెప్పే చిత్రం “ఎంతెంతదూరం ..?”

poster_ed

poster_ed

వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూసాను. ఇది చాల చక్కగా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నపుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చినది. నేను కూడా గ్రామీణ ప్రాంతములో తెలంగాణా ప్రాంతములో పుట్టి పెరిగాను. అవే గుడిసెలు అవే మిద్దెలు- వాటన్నిటి మధ్యలో పుట్టి పెరిగాను . దాని తరువాత ఈ పిల్లలు ఏ పరిస్థితులలో అక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏ పరిస్థితులలో పిల్లలని పోషిస్తున్నారు, వాళ్ళకుండే అలవాట్లు ఏంటి ? వాళ్ళకుండే సాధకభాదకలేంటి? తరవాత భార్యా భర్తల మధ్య ఒక సంఘర్షణ ఒక విద్యార్థికి తల్లితండ్రులకి మధ్య సంఘర్షణ, తరువాత ఒక దొరకు ఒక పాలేరుకు మధ్య సంఘర్షణ . తరువాత బానిసత్వము దాని తరువాత ఈ దొరతనము అవ్వన్ని కూడా చాల చక్కగా దర్శకుడు వివరించారు.

పేదరికం అనేది చదువులో మార్కులు సంపాయించడంలో కాని లక్ష్యానికి ఎక్కడ కూడా అడ్డం కాదు, ఆ పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాదించవచ్చు అనేది ఆ అబ్బాయి పాత్ర ద్వారా చూపించారు . తరువాత రెండవది తల్లి పాత్ర చాల చక్కగా చూపించారు దర్శకుడు. బాధ్యతరహితంగా తిరిగే ఒక తండ్రి వున్నప్పుడు , ఆ ఇంటి ఇల్లాలు బాధ్యతగ తన కొడుకు ను ఎలా చదివించు కోగలిగింది ?తరువాత తల్లికి తండ్రికి మధ్య ఎలాంటి సంఘర్షణ చక్కగా వివరించారు ఈ చిత్రంలో .

పేద వారిలో తండ్రి కొడుకుల బంధం, ఉన్నత చదువుల కోసం కొడుకు తండ్రి తో ఘర్షణ చాల అద్భుతంగా చిత్రీకరించారు. భూస్వాములు ఎలా బ్రతుకుతారు గ్రామీణ ప్రాంతాలలో, ఒక్కపుడు ఏవిదంగా బ్రతికేవారు తరువాత వాళ్ళు చేసుకునే పండగలు వారి పబ్బాలు అలాగే వాళ్ళకుండే ఆలోచనా విధానంఏంటి? అలాగే పాలేర్ల పిల్లలని ఏ విధంగా చూస్తారు , తెలంగాణా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈ సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకులు . అందులో నటించిన నటీ నటులు చాల చక్కగా నటించారు, వాళ్ళు మన కళ్ళకు కట్టినట్టుగా మన గ్రామీణ సమాజాన్ని మన ముందుంచారు నిజం చెప్పాలంటే జీవించేసారు వాళ్ళ పాత్రలలో. ఒక పేద తండ్రి పాత్ర లో , మాభూమి, కొమరం భీమ్ , దాసీ లాంటి ఎన్నో ఆణిముత్యల్లాంటి చిత్రాల్లో నటించిన డాక్టర్ భూపాల్ రెడ్డి నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ప్రముఖ టీవీ సినీ నటి , నంది అవార్డు గ్రహీత మధుమణి చక్కగా తల్లి పాత్రలో ఒదిగి పోయారు . వీరిద్దరికి దీటుగా వూరి పెత్తందారు పాత్ర లో జి.ఎస్ నటన కూడా చెప్పో కో దగ్గది. ఇంకా కొన్ని ఒకటి , రెండు సన్నీ వేషాల్లో కన పడ్డ చిన్న పాత్రలు అయినా , మురళి గోదూర్, చాయ తమ పాత్రలకి చక్కగా సరి పోయారు .

ఈ సీక్వెన్స్ అఫ్ ఈవెంట్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టినట్టుగా అనిపించదు చాల గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి క్షణం కూడా మనకి ఈ అబ్బాయి నిజంగా చదువు కుంటాడ చదువుకోడా అని ఈ భూస్వామి ఇతన్ని కొడతాడ లోకపోతే ఈ పిల్లవాడికి మార్కులు ఎక్కువగా వచ్చినయని భూస్వామి బిడ్డకి తక్కువ వచ్చినయని ఈ పిల్లవాడిని కానీ అతని తండ్రిని కానీ నిలతీస్తడా అన్న విషయాలన్నీ చాల చక్కగా వివరించారు దర్శకుడు . తండ్రికి కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంత పేదరికంలో కూడా ఎన్ని భాదలున్న కూడా పిల్లవాడు మంచి పనిచేసాడని పిల్లవాన్ని అక్కున చేరుచుకోవడం అనేది చాల బాగా చిత్రీకరించారు. చివరగా ఈ పేదరికంలో ఉన్న కూడా మద్యం అనేది ఎలా వీళ్ళని కబలిస్తుంది అనేది కూడా చక్కగా చూపించారు . మా చిన్నతనం నుంచి ఉన్న సమస్యలే ఇప్పటికి ఉన్నాయి కాకపోతే సమస్యలు ఇంకా ఎక్కువయినవి. పేదరికంతో పాటు మధ్యంపానం కూడా తోడయినది కాబట్టి బ్రతుకులన్ని బజారున పడుతున్నాయి , దీని గురించి కూడా చక్కగా వివరించారు

still3_ed

ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రాణం డాక్టర్ పసునూరి రవీందర్ కథ, దాన్ని దృశ్య రూపకం లో మలచడం లో దర్శకుడు వందకు వంద శాతం న్యాయం చేయకలిగాడు అనటంలో ఏ సందేహం లేదు. శరత్ రెడ్డి కెమరా మ్యాజిక్ కూడా దీనికి తోడయ్యింది . ఇక పోతే ఈ చిత్రం మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు , అందరిని ఎలాంటి ఆధునిక సంగీతపు పోకడలకు పోకుండా గ్రామీణ వాతావరణంలో విహరిస్తున్నట్టు గా ఒక అనుభూతికి లోనయ్యే చక్కటి సంగీతాన్ని విష్ణు కిశోర్ అందించగా , ఏ ఒక్క పది సెకండ్ల ఫ్రేమ్ కూడా మనకు అవసరం లేదు అనడానికి వీలు లేకుండా తన కత్తెరకు పని చెప్పాడు ఎడిటర్ అమర్ దీప్ నూతి .

సినిమా అంటే టీం వర్క్ , ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో అంత వరకే వుపయోగించు కొని ఒక చక్కటి చిత్రాన్ని అందించడం లో వేణు నక్షత్రం దర్శకునిగా వంద శాతం సక్సెస్ కాలిగాడు ఈ చిత్రంతో .
ఆయనకు మంచి ఫ్యూచర్ వుంది . కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించే ఒక కళ ఆయనకు అబ్బినట్టుగా వుంది అని నాకు అనిపిస్తుంది . రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారని నేను ఆశిస్తున్నాను .

Video:

Enthentha dooram Trailer:

-డాక్టర్ ప్రవీణ్ కుమార్

PraveenKumar-IPS.1jpg

Download PDF

3 Comments

 • sangishetty srinivas says:

  పసునూరి రవీందర్ కథ మొదట తుర్రుం ఖాన్ పేరిట వచ్చింది. ఈ కథ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లో ఒకరి స్వీయ జీవితం. దీన్ని చక్కగా తెరకెక్కించిన నక్షత్రం వేణు కు అభినందనలు. మేమూ చరిత్రకెక్క దాగిన వారమే అని ఈ కథ తేల్చి చెప్పింది. ఆత్మ గౌరవ కేతనమై నిలిచింది.

 • వి. శాంతి ప్రబోధ says:

  వృత్తి రీత్యా ఎంతో బిజీగా ఉండే ప్రవీణ్ కుమార్ గారు ఒక మంచి చిత్రాన్ని పరిచయం చేయడం బాగుంది. ‘ఎంత దూరం ‘ టీం కి అభినందనలు.

 • Dr.Pasunoori Ravinder says:

  ఎప్ప‌టినుండో ప్ర‌వీణ్ సార్‌ని కల‌వాల‌నుకున్నా…
  ఈ లోపే ఆయ‌న మా సినిమాను సారంగ‌లో ప‌రిచయం చేశారు…
  థ్యాంక్స్ ఏ లాట్ టూ ప్ర‌వీణ్ కుమార్ సార్‌….
  -డాక్టర్ పసునూరి రవీందర్

Leave a Reply to వి. శాంతి ప్రబోధ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)