మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”.

-రాల్స్ ఫాక్స్ “నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు, సామాన్యులు, కళాకారులు తమ అవగాహనను అభివ్యక్తం చేయడంలో బేధాలుంటాయి. చూచిన దానిని చెప్పటంలోనూ తేడాలుంటాయి. అందుకనే మామూలు సంభాషణకన్నా, వార్తకన్నా, సాహిత్య రచన భిన్నంగా వుంటుంది. అందువల్ల రచయితలు సమాజాన్ని చూడటంలోనే దృష్టి బేధాన్ని దానివల్ల వాళ్ళ సాహిత్య సృష్టిలో వచ్చే భేదాలను రచయితల సాహిత్యాన్ని పరిశీలించే ముందు తెలుసుకోవాల్సి వుంటుంది.

రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు. అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు. పాఠకులను చెడుకు వ్యతిరేకంగా, మంచికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు. రచయితలు ఇంత పని చేయాలంటే ఒక దృక్పథం లేకుంటే సాధ్యం కాదు. సమాజ పరివర్తనలో రచయితలు క్రియాశీల సృజనాత్మక పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు సహకరించేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే. అయితే, అందరు రచయితల ప్రాపంచిక దృక్పథం ఒకటి కాకపోవచ్చు. అలానే అన్ని కాలాల ప్రాపంచిక దృక్పథమూ ఒకటి కాకపోవచ్చు. రచయిత నేపథ్యాన్ని బట్టి సమాజంలో ప్రచురంగా వుండే భావజాలాన్ని బట్టి రచయితల మీద సమాజ, ప్రభావాల్ని బట్టి ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. రచయిత రచనకు పూనుకునే ముందు తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్ధారించుకొని రచన ప్రారంభిస్తాడు.

విమర్శకులు ఏ రచయితనైనా అధ్యయనం చేసేటప్పుడు మొదట ఆ రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకుంటే తక్కిన సాహిత్యాంశాలు వాటంతట అవే విశదమైపోతాయి. విమర్శకులు ఈ పని చేయాలంటే విమర్శకులకే మొదట స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుండాలి. ఆధునిక సాహిత్య రంగంలోనూ, సాహిత్య విమర్శరంగంలోనూ ఈ కారణంగానే ప్రాపంచిక దృక్పథం ప్రధానాంశంగా వుంది. అయితే అనేక మంది విమర్శకులు ఈ ప్రధానాంశాన్ని ఇంకా జీర్ణం చేసుకొకుండానే విమర్శ రాస్తున్నందువల్ల గందరగోళం రాజ్యమేలుతోంది. విమర్శకుడు తమ ప్రాపంచిక దృక్పథమేమిటో స్పష్టంగా, నిర్ధిష్టంగా ఏర్పడక ముందే తమ అజ్ఞానాన్ని దాచుకొని, అరకొర కొలమానాలతో విమర్శకు పూనుకుంటే, నమ్మకంలేని వాటిని గురించి బలంగా మాట్లాడే ప్రమాదం వుంది. పైగా సాహిత్య విమర్శ అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం కలుగుతుంది.

రచయిత సామాజిక చలన సూత్రాలను స్పష్టం చేసే పనిని నెత్తికెత్తుకున్నాడు. సంస్కర్తగా, జాతీయవాదిగా, అభ్యుదయ, విప్లవవాదిగా దిగంబరుడిగా, దళిత, స్త్రీ, మైనారిటీవాదిగా, ఆర్థిక, సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వ్యాఖ్యాతగా మారాడు. రచయితలు గుర్తింపబడని శాసనకర్త అని ఒక నాడు మాథ్యూఆర్నాల్డ్ అన్నాడు గానీ ఇవాళ రచయితలు గుర్తింపబడిన శాసన కర్తల్లో ఒకడయ్యాడు. రచయిత దృష్టికి, రచయితలుకాని వారి దృష్టికి తప్పకుండా తేడా వుంటుంది. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసిన, ఒక సామాజిక సంఘటనను చూసినా, ఒక సామాజిక పరిణామాన్ని పరిశీలించినా రచయిత దృష్టి నిశితంగా సృజనాత్మకంగా వుంటుంది. అయితే అందరి రచయితల దృష్టికోణం కూడా ఒకటే కాదు కనుక దృష్టి వైవిధ్యం కనిపించినా, దృష్టి వైచిత్రి మాత్రం అందరిలోనూ వుంటుంది. పారిశ్రామిక నాగరికత బలిసిపోయి మానవ సంబంధాలు కృత్రిమంగా తయారైన పాశ్చాత్య నాగరికత వల్ల ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది వుంటారు కానీ టి.ఎస్. ఇలియట్‍కు మాత్రమే అది ‘ఊసర క్షేత్రం’గా (waste land)గా కనిపించింది.

భారతీయ సామాజిక వ్యవస్థ, సంస్కృతులు విశ్వనాథ సత్యనారాయణకు వేయిపడగలుగా కనిపించాయి అదే వ్యవస్థ, అదే సంస్కృతి గుర్రం జాషువాకు నాల్గుపడగల నాగరాజుగా కనిపించాయి. విశ్వనాథ సత్యనారాయణ ’వేనరాజు నాటకానికి ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి ’ఖూనీ’ నాటకం రాశారు. దృష్టి బేధమే ఇందుకు కారణం. సంప్రదాయవాదికి అమ్మ ’మాతృదేవోభవ’ అవుతుంది. స్త్రీవాదికి అమ్మ ’మండుతున్న పొయ్యిలా’ (విమల-వంటిల్లు) కనిపిస్తుంది. ఇంకాచెప్పాలంటే ’మసిగుడ్డ’గా(కుప్పిలి పద్మ) కనపడుతుంది. మరొకరి దృష్టికి ’త్రీ ఇన్ వన్‍గా’ (సి.సుజాత) కనపడుతుంది. అందువల్ల సాహిత్యాధ్యయనంలో రచయిత దృష్టి ప్రాపంచిక దృక్పథమంత ముఖ్యమైంది.

మామూలు మనిషి దృష్టి కన్నా రచయిత దృష్టి విశిష్టంగా వున్నప్పుడు రచయిత సృష్టి కూడా విశిష్టంగా వుంటుంది. మరి దాన్ని అందుకునే స్థాయి విమర్శకులకు కూడా అవసరం. మల్లీశ్వరి ఆ దృష్టి వైవిధ్యాన్నిఎంత బాగా అవగహన చేసుకుందో వర్తమాన కథకులైన గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని తీసుకొని ఇద్దరినీ ఒకే గాట కట్టారు. గౌరునాయుడు ఆదర్శవాది, అప్పలనాయుడు విప్లవాచరణవాది. వాళ్ళిద్దరి కథా సాహిత్యాన్ని చదివిన సాధారణ పాఠకులకు సైతం ఇది అర్థమయ్యే విషయం. గౌరునాయుడికి గ్రామాలపట్ల, గ్రామీణప్రజలపట్ల, గ్రామీణవ్యవస్థపట్ల వర్తమానంలో చూస్తున్నదానిమీద వ్యతిరేకత వుంది. ఆవ్యతిరేకతతో ఒక ఆదర్శపూరిత గ్రామీణజీవనాన్ని ఆకాంక్షిస్తాడు. అదెలా సాధ్యమన్నది అతనికి పట్టని విషయం. ఇక సాధ్యాసాధ్యాల చర్చ వస్తే, అదే అతని కథలకు పరిమితి. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఆయనకు వర్గాతీత భావన వుంది. కానీ అప్పలనాయుడు సమాజాన్ని భౌతికవాద దృష్టితో చూస్తాడు. సామాజికంగా జరిగే చలనాలను, ఘటనలకు వర్గదృక్పథం వుందని అతని కథలు చెబుతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మార్క్సిస్ట్ దృష్టికోణమతనిది.

దాదాపు అతను కథారచన ఆరంభించిన ’పువ్వులకొరడా’ కాలం నుండి ఇప్పటి ’సంధిగ్ధాకాశం, వికృతి’ కథల వరకు సామాజికంగా, ప్రాకృతికంగా జరిగే అనేక మార్పులను, సంఘటనలను ఉత్తరాంధ్ర స్థానిక జీవితాన్ని నిర్ధిష్టంగా చిత్రించినా కొంచెంకొంచెం తేడాలతో, అన్ని ప్రాంతాల జీవితానుభవాల వ్యక్తీకరణ రూపాన్ని తన కథల్లో చిత్రించారు. ’క్షతగాత్రగానం’ (వంశధార కథలు-21ఫిబ్రవరి1999) ’షా’ (ప్రజాసాహితి నవంబర్ 2005) ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలనేకాక తెలుగు నేల నాలుగు చెరుగుల విస్తరిస్తున్న సామ్రాజ్యవాద సాంస్కృతిక ప్రతిరూపాలుగా అలరారుతున్న నగరాలు మొదలుకొని పల్లెసీమల వరకు ఈ విషవలయంలోనే చిక్కుకున్నాయని నమ్మడం ఎంత వాస్తవమో అట్టాడఅప్పలనాయుడి కథలకు సార్వజనీన లక్షణం వుండడం కూడా అంతే వాస్తవం.

560804_290376897745258_1563925822_n’క్షతగాత్రగానం’ కథ గురించి మల్లీశ్వరి ’పెద్ద రైతు నేపధ్యంలో రాసినప్పటికీ వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్, అర్థఫ్యూడల్ దోపిడీకి, వర్తమానంలోని పెట్టుబడిదారీ దోపిడీకి మధ్యనున్న తేడాగా మార్పుల్ని అర్థం చేస్తున్న కథ’ అన్నారు. నిజానికింతే కాదు ఇంకా అప్పటికి(1998) యెరుకలోకే రాని కార్పొరేట్ వ్యవసాయీకరణ ప్రవేశాన్ని చింత్రించిన కథ ఇది. ఈ అంశాన్ని గ్రహిస్తే, అది పెద్ద రైతుల పక్షాన మాత్రమే చెప్పిన కథగా కనిపించదు. ఈకథలోని రైతు పెద్ద రైతు కాదు. భూమి కోసం పడరాని పాట్లు పడి, తాతల తరం పొట్టచేతబట్టుకొని పరాయి దేశానికి(బర్మా) వలసపోయి, సంపాదించిన భూమిని, industrialized transformation జరిగిన తరవాతి తరం హరించేస్తుంది. దానికి కారణాలుగా రచయిత సామాజిక ఆర్థిక రాజకీయ భూమికలను కథలో అనేకచోట్ల చూపిస్తారు.

ఉదాహరణకు “వ్యవసాయంలో….వ్యాపార పంటలొచ్చాయి. షుగర్, జూట్ మిల్లు లొచ్చేయి. ఆ పంటల మార్కెట్ యెగుడూ దిగుళ్ళతో అప్పుల్తో మిగిలేరు”…
“పడమర దోవలో యెవరిదో మోడ్రన్ రైస్ మిల్లోకటి-పరాయిదేశ చక్రవర్తి స్థాపించిన విజయస్తంభంలా కన్పిస్తోంది. తూర్పుదారిలో-కాఫీ,టీ దుకాణాలు! కొత్తవీధి గుండా ఆటో-బలసిన పెనుమృగంలా నిల్చిన శంకర్రాజు ఎరువుల గోడాంని దాటింది. వీధులు, రోజ్ గార్ నిధుల కంకర రోడ్డుతో విశాలమయినట్లున్నాయి. వీధి మలుపులో “స్నోవైట్” కాన్వెంట్- చిలుకలను బొధించిన పంజరంలా వుంది!ఆటో ఆగిపోయింది”.(పే.నెం.282 అట్టాడ అప్పలనయుడు సాహిత్యం మొదటి సంపుటం కథలు కొన్ని 2013)

ఒకరకంగా, విద్యాసాగర్ గారి పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలను, మల్లీశ్వరి వ్యాసాంతంలో చెప్పిన ’జీవితాలను అర్థంచేసుకొని అక్షరబద్ధం చేసిన బాధ్యతాయుత రచయిత’కథగా దీన్ని ఉదహరించవచ్చు. గానీ మల్లీశ్వరి….ఇందులో వైరుధ్యాన్ని ఇటీవలి కథల్లో అప్పలనాయుడుగారు అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇందులోగల వైరుధ్యమేమిటో, దాన్ని ఆయన ఏకథల్లో ఎలా అధిగమించారో చెప్పలేదు. క్షతగాత్రగానం-మారిన గ్రామీణ పరిస్థితులను 1999 నాటికే ఎత్తిపట్టి చూపించిన గొప్పకథ. కార్పొరేట్ వ్యవసాయీకరణ, యాంత్రీకరణ, హైటెక్నాలజీ, కొత్తతరం జీవన విధానం, వారి ఆలోచనలు…….కోటేశ్వరరావు, పురుషోత్తం, భుక్త, ప్రవీణ్, తాత….సుభద్ర, పాలేరు…..అందరి జీవితాల్లోంచి విధ్వంసాలనెన్నింటినో చింత్రించిన కథ. పర ప్రాంత పెట్టుబడి, దాని విశ్వరూపం, అది నిర్ధిష్ట ప్రాంతపు రాజకీయ, ఆర్థిక రంగాలనెలా శాసిస్తుందన్న వస్తువుతో వచ్చిన కథ. ’షా’కథను మల్లీశ్వరి అర్థం చేసుకున్నట్టు……’పెట్టుబడి దారులందు స్థానిక పెట్టుబడిదారులుమేలయా’ అని కథలో ఎక్కడా రచయిత చెప్పలేదు. కథ కూడా అలాంటి భావనలకు ఎక్కడా ఊతమియ్యదు. ఈమె అపార్థంచేసుకుందనడానికి…..ఈ రెండు కథలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలే ఉదాహరణలు.

పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యముంటుంది. స్థానిక స్థానికేతర వైరుధ్యమది. ఆవైరంలో స్థానికులు ఓడిపోతారు. పెట్టుబడిని ఓడించేది, జనసమూహమే తప్ప వేరొకరుకాదన్నది ఈ కథ సారాంశం. ‘షా’ కథ పేరే దాన్ని సూచిస్తుంది. చదరంగం ఆటలో బంటుల్తో రాజును ముట్టడించటాన్నే ‘షా’ అంటారు. ఈ కథలో ముట్టడికి నాయకత్వం వహిస్తున్న రైతుకూలీ సంఘం నాయకుడు రైతుకూలీ సంఘం డిమాండ్లను స్థానిక పెట్టుబడి దారుడుగా ఎదిగిన శంభునాయుడు విని శభాష్ అనుకుంటాడు. శంభునాయుడి తండ్రి వ్యవసాయకూలీ ఉద్యమకారులతో పాటూ గొంతు కలుపుతాడు. కథలో ఎక్కడా స్థానిక పెట్టుబడిదార్ల మద్దతుగా వాక్యంగానీ, సంఘటనగానీ లేదు. అయితే మల్లీశ్వరి పొరబాటు ఎక్కడపడుంటుందంటే శంభునాయుని వైన్ షాప్‍లో పనిచేసే సేల్స్‍మేన్ తన అంతరంగం నుంచి శంభునాయుడి ఎదుగుదలని, బతుకు అవకాశాల్ని పాఠకులకు ఇలా వినిపించారు. ‘ఇతగాడంటే మోతుబరోడు…..తండ్రిని కాలవ భూముల ఊరిలో దించి, యితగాని పట్నంలో దిగేడు’. అని శంభు నాయుడి స్థానాన్ని అంచనా కడతాడు.

స్థానికులు స్థాపించిన మోడరన్‍రైస్‍మిల్లును, శంకర్రాజు ఎరువుల గోడౌన్‍ని ‘బలిసిన మృగంలా, స్నోవైట్ కాన్వెంట్‍ను చిలుకలను బంధించిన పంజరంతోనూ అప్పలనాయుడు పోల్చడం జరిగింది. మరి స్థానికులేర్పాటు చేసిన ఇంత చిన్న పెట్టుబడులను కూడా బహుళజాతి పారిశ్రామిక పెట్టుబడులకు ఉపయోగించాల్సిన ఉపమానాలనే ఎందుకు వాడారు? ఈ ఉపమానాల వాడకాన్ని బట్టి స్థానిక, స్థానికేతర పెట్టుబడుల వ్యత్యాసాలను పాటించినట్లుగా అనిపిస్తుందా మల్లీశ్వరి.

కథ ముగింపులో కూడా, నదీ జలాల వినియోగానికి సంబంధించిన డిమాండ్‍ను రైతు కూలీ సంఘం పెడుతోంది తప్ప స్థానిక పెట్టుబడిదారుడు కాదు. అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది. ముగింపులో ఇంత స్పష్టంగా బోధపడుతుంటే, మల్లీశ్వరికెందుకు బోధపడలేదు చెప్మా!

‘కథంతటిలో కార్పొరేట్ పెట్టుబడి విశ్వరూపాన్ని చూపిన అప్పలనాయుడు దానిని ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని విశ్వసించారు. తమ ప్రాంతానికి చెందని ఏ పెట్టుబడినైనా వ్యతిరేకించటం కోసం స్థానికంగా వుండే అన్ని వర్గాలవారు కలిసి పనిచేయడాన్ని ఈ కథ ద్వారా ప్రతిపాదించారు.’ అని మల్లీశ్వరి అట్టాడచేసిన ప్రతిపాదనలుగా ప్రతిపాదించడం ఆమె అవగాహనాలేమిని తెలియజేస్తుంది. ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం.

అప్పలనాయుడు తన కథలో కిరణ్ పాత్రద్వారా ఈక్రమాన్ని చిత్రించారు తప్ప మల్లీశ్వరి ఆశించినట్లు, అర్థంచేసుకున్నట్లుగా, ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని చెప్పారె తప్ప, స్థానికవాద, ప్రాంతీయఉద్యమ ప్రబోధకంగా కథనం చేయలేదు. స్థానిక పెట్టుబడిని రక్షించుకోవాలి లేదా నిలుపుకోవాలనే ప్రయత్నం కథలో ఎక్కడా ప్రస్థావించలేదు. ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు. ప్రజలనాయకత్వాన్ని శంభునాయుడు మెచ్చుకుంటాడు, ఆశ్చర్యపోతాడు కూడా. అతని తండ్రికి మరోమార్గంలేక నాయకత్వం వెంట నడుస్తాడు. శంభునాయుడి తండ్రిది భూస్వామ్య మనస్తత్వం. తన రాజ్యంలో ప్రవేశించిన శత్రు సైన్యంలాగానే బహుళజాతి కంపెనీల వాహనాలను, వర్కర్స్ ను చూస్తాడు. మరి అతడు ప్రజాసంఘాల నాయకత్వంలోకి రావడానికి ప్రజా ఉద్యమాలపట్లగల మమేకత్వంతో కాదు.

స్వతహాగా భూస్వామికి స్థానిక ఉత్త్పత్తివనరులైన భూమి నదులపట్లగల ప్రేమతోనే. శంభు నాయుడు దూరమవుతున్న అతని మూలాల్ని గుర్తుచేస్తాడు. స్వతహాగా శంభునాయుడిది మోతుబర్ల కుటుంబం. అందుకే అతనిమూలాల్ని గుర్తుచేసే ఎరుకలో ఏమాయా మర్మం కనిపించలేదు. తననుతాను స్వఛ్చందంగానే ఆవిష్కరించుకుంటాడు. ఆ ఆవిష్కరణే శంభునాయుడ్ని తనతండ్రికి ప్రకృతి వనరులపట్లగల ప్రేమ అతన్ని ద్రవీభూతం చేస్తుంది. అతను తండ్రి ఆలోచనలపట్ల ఎప్పుడు? ఎందుకు? మూవ్ అవుతున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే, తన రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లిందనుకున్నప్పుడే శంభునాయుడు తండ్రిని గుర్తించగలుగుతున్నాడు, భూస్వామి మనస్తత్వం ,పెట్టుబడిదారీ మనస్తత్వాలలో కొద్దికొద్ది తేడాలున్నప్పటికి, ఇద్దరి లక్ష్యం ప్రజావ్యతిరేక పథాయే. అయితే, తమ ఉనికికే భంగం కలుగుతున్నప్పుడు శంభునాయుడు,అతని తండ్రిలాంటి వాళ్ళందరూ ప్రజాఉద్యమంలో కలవాల్సిన అనివార్యతను ‘షా’కథలో అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. అంతమాత్రంచేత అది ప్రజాపోరాటం కాకుండా పోదు. వీళ్ళందరూ తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినంత మాత్రాన, అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాకుండాపోదు. అంతే తప్ప, ఒక ప్రాంతంలో వచ్చినంత మాత్రాన అది స్థానిక ఉద్యమం కాదు. ఏ ఉద్యమమైనా ఎక్కడో ఒకచోట మొదలుకాక తప్పదు. స్థానికత నుండే సార్వజనీనతను పొందుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను. మరి అట్టాడ అప్పలనాయుడి కథల్లో మల్లీశ్వరి అస్థిత్వవాదమెందుకు తెచ్చిందో అర్థంకాదు.

ఈమే స్వయంగా పాలపిట్టమాసపత్రిక, ఆగస్టు, 2013. సంచికలో అట్టాడ అప్పలనాయుడుతో చేసిన ఇంటర్వ్యూలో కూడా రచయితను అస్థిత్వవాదంపై వేసిన ప్రశ్నకు జవాబుగా అట్టాడ ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రాంతీయ, వర్గ దృక్పథాల పట్ల తనకుగల అభిప్రాయాలను స్పష్టీకరించిన దాన్ని అక్షరబద్ధం చేసింది. వాళ్ళ మాటల్లోనే గమనిద్దాం!

“వర్గచైతన్యం నుంచి ప్రాంతీయ అస్థిత్వవాదిగా మీ పరిణామం కేవలం సాహిత్య సంబంధమైనదేనా?” అనే ప్రశ్నకు అట్టాడ జవాబుగా, “నిజానికి మీరన్నట్లు నేను కేవలం ప్రాంతీయ అస్థిత్వవాదిని కాను. ప్రాంతీయ ప్రజాపొరాటాలనేవి రూపంలో అస్థిత్వ ఉద్యమాలలాగా కనిపిస్తాయిగానీ సారంలో అవి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలుగా అభివృద్ధి కాగలవు. ఆ భావనతోనే ప్రాంతీయ ఉద్యమాలను అర్థం చేసుకుంటాను. కనుక నిర్ధిష్ట ప్రాంతీయ పోరాటాలను అక్షరీకరిస్తున్నాను. వర్గచైతన్యానికి పోటీగానూ, ప్రత్యామ్నాయంగానూ ప్రాంతీయ అస్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. కాకపోతే వర్గ చైతన్యమనేది, నేడు అస్థిత్వ పోరాటాలను భూమికగా తీసుకొని అభివృద్ధి కావాలన్నది నాభావన.”

190291_290372241079057_1667688954_n

మల్లీశ్వరే స్వయంగా అట్టాడ అప్పలనాయుడి సమాధానాన్ని అక్షరాలా సాక్షీకరించింది. మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో కానీ మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడ్ని ప్రాంతీయవాదిగా ముద్రవేసే విఫలయత్నం చేసింది.ఇలా తన అజ్ఞానాన్ని ‘వివిధ’ లాంటి ప్రతిష్టాత్మక సాహిత్య పేజీలో నలుగురితో పంచుకోవడమేకదా! దయచేసి ఇప్పుడైనా అప్పలనాయుడి ముఖచిత్రంతో వచ్చిన పాలపిట్ట ప్రత్యేక సంచికను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది.

విద్యాసాగర్ ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రామీణ పరిశోధన గ్రంధం ఆధారంగా వర్తమాన కథను పరిశీలించదలచి, గౌరునాయుడు, అప్పలనాయుడుల రెండు కథలను మాత్రమే గ్రహించి, (తిరుగుడు గుమ్మి, నీటిముల్లు, ఒకరాత్రి రెండు స్వప్నాలు-గౌరునాయుడు; మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత- అప్పలనాయుడు కథలిన్ని ఉండగా)ఒకటి రెండు కథల్లో రచయిత దృక్పథాన్ని పోల్చడం, అంచనా కట్టగలగడం అంత సరైన పద్ధతీ కాదు. సాధ్యంకాదు. మల్లీశ్వరి ఈ వ్యాసాన్ని విద్యాసాగర్ పుస్తకాన్ని సమీక్షగా చేసుకొని తన వ్యాసాంతంలో రచయితల బాధ్యత గురించి, గ్రామాలలో మారిన పరిస్థితులను అర్థంచేసుకోవడానికి రచయితలు తప్పక చదవాల్సిన గ్రంధంగా చెప్పింటే ప్రయోజనముండేది. విద్యాసాగర్ అభిప్రాయాలకు- అప్పలనాయుడు, గౌరునాయుడు కథలకు గల సహజాత వైవిధ్యాన్ని ఒక లోపంగా, పొరపాటుగా చెప్పడం వలన అటు విద్యాసాగర్ పుస్తకానికీ న్యాయం జరగలేదు. ఇటు ఈ ఇద్దరి రచయితల కథలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, విద్యాసాగర్ పల్లెల్లోకి ప్రవేశించిన పెట్టుబడి విశ్వరూపాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేకరించిన గణాంకాలను ప్రచురించారు.

ఒకప్పటి పల్లెల్ని చూసిన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మేధో వ్యవసాయం చేసేవారికి, మారిన పల్లెల్ని చూడని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ పరిశోధన గ్రంథం కళ్లు తెరిపిస్తుంది. అయినా, ఇది 2013సంవత్సరంలో వచ్చిన గ్రంథం. ఒక దశాబ్ధమున్నర ముందుగానే “క్షతగాత్రగానం”(1988) దానికి ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన ‘షా’ (2005)కథలు అప్పలనాయుడు రాశారు. విద్యాసాగర్ ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు. విద్యాసాగర్ పరిశోధించి ఆవిష్కరించిన సత్యాలను అట్టాడఅప్పలనాయుడు తన కథల్లో ఇంతకుముందే చిత్రీకరించారు. ఈ అంశాన్ని డా.మల్లీశ్వరి పరిశీలించలేకపోయారు. దృష్టిలోపమా? దృష్టికోణంలోనిలోపమా?.

– డా. కె. శ్రీదేవి

 అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు శాఖ

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం .

Download PDF

60 Comments

  • ‘షా’ కధ చదివినపుడు రఘోత్తమరెడ్డి ‘చావు విందు ‘ కధ గుర్తుకు వచ్చింది. ‘చావు విందు’లో ఫ్యూడలిజం బీటలు వారే సందర్భాన్ని భూసామ్య కుటుంబీకులు ఎలా తీసుకొంటారో ఒక చావు విందులో చిత్రీకరిస్తారు రచయిత. అయితే అందులో వారు భయపడేది విప్లవశక్తులకు. అందులో ప్రధాన పాత్రధారి కూడ చివర్లో ఏడ్చేస్తాడు.
    కొత్త బడా పెట్టుబడీదారీ శక్తులు ప్రవేశించిన దశను ఒక స్తానిక చిన్నపెట్టుబడిదారుని దృష్టిలో నుండి షా కధ చిత్రీకరించింది. ఈ పెట్టుబడులను ఎదుర్కోవటానికి జరిగే పోరాటాలు ఓడిపోయిన స్థానిక పెట్టుబడీదారులకు ఆనందాన్ని ఇస్తారు. కొండొకచో ఐడెంటిఫై అవుతారు. ఇది ఒక అనివార్య పరిణామం. భారతదేశంలో సామ్రాజ్య వాదులు, దేశీయ బడా పెట్టుబడీ దారులతో మిలాఖత్ అయ్యారు కాబట్టి ఈ ప్రజాయుద్దం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమమే. ఆ ఉద్యమంలో స్తానిక పెట్టుబడీ దారులు తప్పక కలుస్తారు. ఈ చారిత్రిక అవసరాన్ని అప్పలనాయుడుగారు ఈ కధలో రాసినట్లు నాకు అనిపించింది.

  • raghava says:

    శ్రీదేవి గారూ! చాలా బాగా చెప్పారు.

  • Thirupalu says:

    చిక్కటి సాహిత్య విశ్లేషణను చదివిన సంతృప్తి.చాలా బాగుందండి!

    • k.sreedevy says:

      థాంక్స్ తిరుపాలుగారు, చూసుకోలేదు. regulargaa ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు !

  • ari sitaramayya says:

    “రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు.”

    అంత వరకు బాగానే ఉంది.

    “అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు.”

    విశ్లేషణ వ్యాసాలకూ విమర్శలకు మాత్రమే పరిమితమై ఉంటే, సృజనాత్మక సాహిత్యానికి దూరంగా ఉంటే, తెలుగు సాహిత్యం ఆరోగ్యంగా ఉంటుంది.

    “చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు.”

    ఈ బాధ్యత శాస్త్రజ్ఞానం ఉన్న సామాజిక శాస్త్రవేత్తలది. రాజకీయ నాయకులదీ. సృజనాత్మక రచయితలది కాదు. ఈ విషయం మర్చిపోతే కథల్లో నవలల్లో రాజకీయాలు ఎక్కువ, సాహిత్యం తక్కువగా ఉంటాయి.

    • సీతారామయ్యగారు, Sorry for Differing with you . సమాజ ఉన్నతిని కోరేవారు సృజనకారులు. బాధ్యతగలిగిన రచయితలు మంచి వైపు దారి చూపే రచనలు చేయాలి అనుకొంటాను. ఒక్కో సారి సమాజం ఇలా ఉంది అనే ఆవిష్కరణలో ఎలా ఉండకూడదో వారు చెబుతారు. (రావి శాస్త్రిగారు, పతంజలి, నామిని). ఇంకోసారి ఎంతో నైపుణ్యంగా పాఠకులను ప్రభావితం చేసేవిధంగా అర్ధవంతమైన పరిష్కారాలు ఇస్తారు. (కారా మాష్టారు, రఘోత్తమరెడ్ది). ప్రతిపాదనలు చేయటానికి వారిలో రచయిత కళాత్మకంగా వెయ్యి తలలతో లేవాలి అని నేను అనుకొంటాను. సామాజిక శాస్త్రవేత్తల వ్యాసాలను హృదయానికి హత్తుకొనే విధంగా కధలు రాయగల నేర్పరులు రచయితలు అని నేను అనుకొంటాను.

    • k.sreedevy says:

      సీతారామారావుగారు,
      రమాసుందరిగారు స్పందించిన తరువాత నా వివరణ అవసరం లేదనిపించింది. మీరు రమాసుందరిగారు చేసిన ఆరోగ్యకరమైన చర్చలో పాటించిన సంయమనానికి, మీ ఇద్దరికి కృతజ్ఞతలు.

  • ari sitaramayya says:

    రమాసుందరి గారూ, నాతో విభేదించినా మీ అభిప్రాయాలను చాలా చక్కగా రాశారు. అభినందనలు. ధన్యవాదాలు.

    “ఒక్కో సారి సమాజం ఇలా ఉంది అనే ఆవిష్కరణలో ఎలా ఉండకూడదో వారు చెబుతారు.”
    ఇందులో ముఖ్యమైన విషయం – ‘ఇలా ఉంది’ అన్న విషయం పాఠంలాగా చెప్పకుండా, పాత్ర చిత్రణ ద్వారా సన్నివేశ కల్పన ద్వారా తెలియ జెయ్యటం. ‘ఎలా ఉండ కూడదో’ అనేది పాఠకుడి ఆలోచనకు వదిలెయ్యాలి, రచయిత తన అభిప్రాయంగా చెప్పకూడదు. సమాజాన్ని మార్చాలి అనే తాపత్రయంలో ఈ తేడాలను రచయితలు పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోతే కథలు వ్యాసాల్లా ఉంటాయని మాత్రమే నా విన్నపం.

    “ఎంతో నైపుణ్యంగా పాఠకులను ప్రభావితం చేసేవిధంగా అర్ధవంతమైన పరిష్కారాలు ఇస్తారు. (కారా మాష్టారు, రఘోత్తమరెడ్ది).”
    ‘ఎంతో నైపుణ్యంగా పాఠకులను ప్రభావితం చేసేవిధంగా’ రాస్తారు. అంత వరకూ బావుంది. రచయితలు చెయ్యాల్సిన పని అదే. ‘పరిష్కారాలు ఇవ్వటం’ తోనే సమస్య అంతా. ఒక్కో సమస్యకు రకరకాల పరిష్కారాలు ఉండవచ్చు. అందులో ఒక దాన్ని ఎంచుకోవటం వల్ల రచయిత తనలాగా ఆలోచించే వారికి మాత్రమే దగ్గరవుతున్నాడు. అలా కాకుండా సమస్యను నిజాయితీతో ఆవిష్కరించి పరిష్కారం పాఠకులకు వదిలెయ్యాలని నా అభిప్రాయం. యజ్ఞం లో కారా మాష్టారు పరిష్కారం ఇవ్వలేదు. అలాంటి సమశ్య ఎదురైతే బిడ్డలను చంపేసుకోండి అని కాదుకదా మాష్టారి సూచన.

    మీ అభిప్రాయాలకు నా అభిప్రాయాలకు చాలా దూరం లేదు. రచయితలు ‘ఎలా ఉందో’ మీద ఎక్కువ దృష్టి పెట్టాలనేది నా గొడవ. ‘ఎలా ఉండాలో’ వైపు పాత్రలను చెవులు పట్టుకుని లాగ కూడదని నా అభిప్రాయం. చెప్పటం మానేసి చూపటం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలని నా మనవి.

    • సీతారామయ్య గారు,
      నిజమే మీ అభిప్రాయాలకు, నా అభిప్రాయాలకు ఎక్కువ దూరం లేదు. అయితే ఒక్కోసారి రచయిత చూపిన పరిష్కారం వైపు మెజారిటీ పాఠకులు తలవంచే ప్రతిభ కూడ వారికి ఉంటుంది. కారా మాష్టారి ఇంకొక కధ “హింస” తీసుకొంటే వ్యభిచారం లోకి బలవంతంగా దించబడి తమ కుటుంబానికి దూరమైన ప్రియమైన అక్క గురించి ఆలోచిస్తుంది పదమూడేళ్ళ కధానాయకురాలు. అక్క స్థితికి కారణం అయిన తమ పేదరికం, దుర్మార్గమైన సమాజం మీద కసి ,,,తిరగబడాలనే కోపం…చివర్లో ఒక మేకను చంపిన నక్కను రాళ్ళతో వెంబడిస్తూ తన సహజ భావోద్వేగాలను ప్రకటిస్తుంది. ఈ వెంబడింపులోనే పరిష్కారాన్ని కూడ సూచిస్తారు రచయిత.
      మీరన్నట్లు పరిష్కారాలు ప్రభోదాల రూపంలో ఉండకూడదు. కాని కళాత్మకంగా, కధాత్మకంగా పాఠకులకు ఎక్కించవచ్చు. అయితే ఈ పరిష్కారాలు నచ్చని పాఠకులు కూడ ఉండొచ్చు మీరన్నట్లు. మెజారిటీ పాఠకులు ఒక సమస్యకు ఎలాంటి ఉద్వేగాలకు గురవుతారో రాయగలిగిన రచయితలు క్లాసిక్ రచయితులు అవుతారని నా అభిప్రాయం. మంచి అభిప్రాయ మార్పడికి సహకరించినందుకు మీకు నా మప్పిదాలు.

  • E sambukudu says:

    యాభయ్యవ దశాబ్దం నాటి చర్చలెన్దుకండి.రామాయణంలో పిడకల వేట లాగ (అయ్యో యిదికూడా శతాబ్దాలనాటిసామెతే కదా….చ చ ..కూడదు..కూడదు )
    యిక్కడ చర్చ నీయ అమ్శము:: “విమర్శ్కులకుండవలసిన జ్ఞానము -మల్లీశ్వరి అజ్ఞానం ” (లేదా)
    “విద్యాసాగారుగారా -అప్పలనాయుడుగారా ఎవరుముందు..ఎవరు వెనక ? యిది వీలైతేచర్చిMచ వలసినదిగా విజ్ఞప్తి.

    • nirmal swaagath says:

      శంబూకుడుగారు …పాత సామెత వాడక తప్పలేదు మీకు,అలాగే యాభైల నాటి చర్చ ముగియ లేదండీ.సీతారామయ్య గారూ,రామాసుందరి గారూ మంచి విషయాలే చర్చించారు.మాలాంటి వారికి ఇది పిడకల వేట కానే కాదు.(అసలు,ఆ సామెతను వివరించరా,నాకు తెలీదు).ఎవరేమి చర్చించాలో మీరు ,నిర్దేశించే బదులు మీరే చర్చించ వచ్చు.ప్రభువులు లా నిర్దేశాలేమిటండీ?

      • E sambukudu says:

        nirmal swaagath గారూ, మీ అభిప్రాయానికి ధన్యవాదాలండి, (ఆలస్యం గా చూసినందుకు మన్నించాలి.)నేను రాసి నా అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం నాకిష్టం లేదండి.(అజ్ఞానములో చాలా సుఖముందండిబాబూ)పెద్దవాళ్లు చర్చిస్తే తెలుసుకోవాలనే కుతూహలమే తప్ప మరేమీ కాదండి.
        మీరు గానీ మరొకరు గానీ ఆ చర్చ(సీతారామయ్యగారు,మరియు రమాదేవిగారూ చేస్తున్నచర్చ) ప్రత్యేకంగా మరొక దగ్గర చర్చించు కోవచ్చు( యిది నిర్దేశం కాదండోయ్ ..సూచన మాత్రమే).మీరన్నట్టు ఆ చర్చ ముగయలేదు అనుకున్న వారు వుంటే వుండవచ్చు.వుండకూదదని నేననను.అది ముగిసిపోయిందనుకున్నవాళ్లూ చాలామందే వున్నారు.నేను ఎక్కువగా వాళ్లనే చూసాను.
        కాక పోతే నేననేదేమిటంటే శ్రీదేవిగారు రాసిన వ్యాసం మీద చర్చ జరగాలని.యిక్కడి సందర్భం అది.అని మాత్రమే.

        యిక మీరడిగిన దానికి అర్ధమేమిటంటే యిదిగో యిదే.మీరడగడం దానికి నేను మళ్ళీ సమాధానం చేప్పాలనుకోవడం.

        పాతదైనదల్లా పనికి రానిదీ కాదు,పనికొచ్చిందల్ల పాతదీ కాదు. సమయము సందర్భమూ ముఖ్యమని చెప్పటమే నావుద్దేశము.అదీ విజ్ఞప్తిగానే..

      • nirmal swaagath says:

        సంబూకుడు గారూ , మీరు గొప్ప గ్యానులనీ,ఆవలివైపు వారు అగ్యానులనీ ..మీ మీద మీకు ధృడ నమ్మకం లా వుంది..ఆ నమ్మకం మీకు ఆయురారోగ్యలను ఇస్తుంది లెండి.రాసి అగ్యానాన్ని,బయట పెట్టుకోకుండా సుఖంగా వుండండి. మీ చిన్ని బొజ్జకు శ్రీ రామ రక్షా.మళ్ళీ ఎవరి చర్చలో చదివీ ,వినీ ,ఎందుకు ప్రాణాన్ని బాధ పెట్టుకుంటారు?రమాసున్దరి గారు గానీ,సీతారామయ్య గారు గానీ, శ్రీదేవి గారి వ్యాసం ఆధారంగా చర్చించారు .మీకు కావలసింది ఇంకొకటి …రామాయణమంతా విని..రాముడికి సీత యేమవుద్దని ప్రశ్న మీ లాంటి గ్యానే వేసి ఉంటాడు …కదండీ…మీరిపుడు వేసిన ప్రశ్నల లా ?(వ్యాసంమీద ప్రశ్నలు )

  • ప్రొ.శ్రీదేవి గారు అప్పలనాయుడు గారి కథను వివరంగా పరిచయం చేయడం బాగుంది. కానీ, మల్లీశ్వరి గారిది దృష్టి లోపమా దృష్టి కోణంలో లోపమా అన్నారు కదా. ఇది వ్యక్తిగత విమర్శగా అనిపిస్తోంది నాకు. ఇక్కడ మల్లీశ్వరి గారిని టార్గెట్ చేసేకంటే ఆమె రాసిన వ్యాసంలోని దృక్పథాన్ని లేక దానిలోని లోపాన్ని మరింత వివరంగా చెప్పి ఉంటే బాగుండేదని.

    • k.sreedevy says:

      కెక్యూబ్ వర్మగారు,
      మల్లీశ్వరి వివిధ సాహిత్య పేజిలో రాసిన వ్యాసానికి స్పందన వ్యాసం ఇది. సాహిత్య విమర్శే తప్ప వ్యక్తిగత విమర్శ కాదు. (ఏదైన అక్షరబద్ధమైనంత వరకే వ్యక్తిగతం. ప్రచురించిన ప్రతి అక్షరం సామాజగతమే). వర్మగారు గమనించగలరు.

  • E sambukudu says:

    అయ్యా!nirmal swaagath గారూ నాపేరు శంబూకుడు,సంబూకుడు కాదు.(అందులొ వెటకారమా!..అయితే ఓ కే)సహజంగా పేరు తప్పుగా కనపడితే కొంచెం యిబ్బందిగా ఉంటుంది అంతే.

    నేను గ్యానినేటండి బాబూ!నాది అగ్గేనం.యిది ఈనాటిదికాదండి యాభై యేళ్ళగా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నాను.నేనేక్కడా ఏ రచనలూ చేయ్యకపోవడానికి కారణం నాకు నా అగ్గేనం మీదున్న గట్టి నమ్మకమే సుమండీ.దాన్ని కాదనీసి నేను “గ్యాని”నంటే నాకు కుసింత డౌటొస్తంది.గేనానికి అగ్గేనానికి అట్టే తేడాలేదోటోననీసి.

    నిజం చెప్పారు,నాకు కావల్సింది యింకోటి.మీకు కావల్సింది మరోటి. ఎవరికి ఏదికావాలో అదే ఎతుకుతారు కదా!కాపోతే రచనలో ప్రధానాంశం.ఉపాంశము అనిరెండుంటాయని పెద్దవాళ్ళు చెప్పగా విన్నాను.(అబ్బో…నాకూ “గ్యానం” అంటుకుంటోంది వద్దులెండి)

    మాబాగా గుర్తు చేసారు. యింతకీ రాముడికి సీతేటౌద్దంతారూ!?అన్నిటికీ పురాణమే ప్రమాణమంతారూ,మళ్ళీ ఒక పురాణమే నమ్మమంతారు.(ఈ గ్యానమంతులతో గొప్ప సిక్కండి బాబూ)

    మీ ఆశీర్వచణం ఫలించి నా అజ్ఞాణం సదా వర్ధిల్లాలని కోరుకుంటూ ..సెలవ్

    • nirmal swaagath says:

      శంబూకుడు టైపు చేయగా తప్పు పడిందండీ…పచ్చ కామెర్ల వాడిలాగా మీకు…వెటకారమే అలంకారమయిపోయి,ఆ మాత్రానికే ఇబ్బంది పడిపోతే ఎలాగండీ?మీకు కావలసింది మీరన్నట్టు మీరే వెతుక్కోవాల.వేరోకరెందుకు పూనుకుంటారు?అయినా,మీరు కోరుకున్న విధంగా ,సదా అగ్యానం వర్ధిల్లుతుంది లెండి,మీరు దానినే పోషించు కుంటున్నారుగా,ఎవరి ఆశీర్వచనాలూ అఖర్లేదు…పురాణాలు మీరు తొలుత మాటాడేరు,అందుకే అలా వచ్చింది.పోలీస్ వారూ,రాజ్యాలు ఏలే ప్రభువులూ ప్రశ్నలు జవాబు కోసం వేయరు….మీ ప్రశ్నలు అలా తోస్తున్నవి….మంచిదండీ,వుంటానండీ….

  • suresh says:

    శ్రీదేవి గారు వ్యాసం చదివాను బావుంది.’ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం’. అన్న మీ వ్యాసంలోంచి కొన్ని వాక్యాలను ఇక్కడ ఉటంకిస్తూ నాకున్న సందేహాలను మీముందుంచుతున్నాను.

    1. ‘ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు’. అని అన్నారు. మరి రచయిత కథలో శంభునాయుడిని ప్రధాన పాత్రను చేయడం మరియు కథ చివరిలో శంభునాయుడు తండ్రి తలపాగాను జెండాగా చూపడంలో ఉద్దేశ్యమేమిటి?

    2. ‘అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది’. మీరు రాసిన ఈ వాక్యాన్ని బట్టి అసలు పెట్టిబడికి ప్రాంత భేదమంటూ వుందా? వుంటే స్థానికతను ఎలా నిర్ణయిస్తాము? గోదావరి ప్రాంతపు పెట్టుబడిదారులు పరాయి వాళ్ళా? శ్రమజీవులు పెట్టుబడిని అడ్డుకోవాలంటారా? పెట్టుబడిని సామాజికం చేసేపనిలో ముఖ్య పాత్ర పొషించాలంటారా?

    3. రచయిత మదిలో వున్నంతవరకే అది వ్యక్తిగతం రాసిన తరువాత అది సామాజికం అని అన్నారు.’మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో’ అని మళ్ళీశ్వరి గురించి మీరు వాడిన ఈ వాక్యాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.

    • k.sreedevy says:

      సురేష్ గారు వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు!
      1.శంభునాయున్ని ప్రధాన పాత్ర చేసినంత మాత్రాన కథ ఆపాత్ర ప్రయోజనాల కోసం ఉద్దేశించి రాసినట్టవుతుందా? ”చావు విందు” కథ కూడా రఘు భూస్వామినే ప్రధాన పాత్ర చేసి నడిపారు కానీ రచయిత కథ చివర వ్యక్తం చేసిందేమిటో (నిజాయితీగా) ఆలోచిస్తే మీకైనా తెలుస్తుంది. ‘షా’ కథలో పెట్టుబడి వ్యతిరేక పోరాటంలో కిరణ్ ప్రధానపాత్ర పోషించాడు . శంభునాయునిది భూస్వామ్య మనస్థత్వం. అందుకే తన పెత్తందారీతనాన్ని లెక్కచేయని కంపెనీ సిబ్బంది గానీ, వాళ్ళు నడిపే నాయకులుగానీ,.. ఏవి కనబడినా చిటపటలాడి పోయేవాడు . తన భూస్వామ్య దర్పానికి ప్రతిగా లేదా ప్రత్యామ్నాయంగా ఆఊళ్ళో ప్రవేశించిన పెట్టుబడిదారి వర్గాన్ని సహించలేక పోయాడు . ఐతే గియితే తానే రాజుగా వుండాలనుకుంటాడు తప్ప మరొకడ్ని ఆస్థానంలో సహించలేడు. అందుకే తనతో పాటు ఆ కంపెనీలను వ్యతిరేకించేవాడు తన ప్రత్యర్థి, ప్రజా పోరాటాల ప్రతినిధి కిరణ్, అతను నడిపించిన ఊరేగింపు వచ్చి వాళ్ళను చుట్టుముట్టగానే, అంతవరకు తననావహించిన నిస్సహాయతకు remidy గా ఊరేగింపు పనిచేసింది . గ్రూప్ dynamicanism ఇచ్చిన ఉత్సాహంతో , ఆవేశంతో, ఆనందంతో తలపాగా ఎగురవేస్తాడు.
      నదులు, గనులు, అడవులు లాంటి ఊరుమ్మడి సహజ వనరులపైన ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, సాధారణ ప్రజాసమస్యలపైన ఉద్యమాలు నడిపేటప్పుడు అనేక శక్తులు వచ్చి కలుస్తాయి . వీలైతే ఆఉద్యమాలను కైవసం చేసుకోవాలని కూడా చూస్తాయి . అంతెందుకు మొన్నమొన్న జరిగిన సారా ఉద్యమాన్నే తీసుకుందాం. అందులో పేద నిరక్షరాస్యులైన మహిళలే పాల్గొన్నారా? ఎన్ని ప్రజా సమూహాలు వాళ్లకు మద్దతుగా నిలబడ లేదూ? ఎంతమంది బడా బడా భూస్వాములొచ్చి కలవలేదు చెప్పండి. నా సొంత అనుభవమే చెప్తాను. కడపలో నేను,కార్మిక నాయకుడు సి. హెచ్ చంద్రశేఖర్ రెడ్డి మిగిలిన ప్రజా సంఘాల నాయకులు ఊరేగింపులు, ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తుంటే . చిన్నగా కాంగ్రెస్ వాళ్లు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చీప్ లిక్కర్ అమ్మేవాళ్ళు కూడా మాలో వచ్చి కలిసారు. ‘ఏమిటిది సి. హెచ్’ అంటే, అంతే శ్రీ దేవి! తప్పదు. ఇది ప్రజా ఉద్యమం . వర్గపోరాటం కాదు అన్నారు. ( అలా కలిసిన కాంగ్రెస్ నాయకులు , సి. హెచ్, నేను అందుకు సజీవ సాక్షులం.) మరి నిన్న జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోని భాగస్వామ్యం, విజయోత్సాహల మాటో…….
      కాబట్టి, శంభునాయుడు తండ్రి తలపాగా ఎగురేసినంత మాత్రాన, ఆయనే ప్రజా సమూహానికి నాయకత్వం వహించినట్లవుతుందా సురేష్!. తలపాగా ఎగురేసి ఒక సమూహం వెంట నడిచేందుకు సిద్ధమయ్యేడని కదా? మీ సందేహం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ధనికులు, పెద్దరైతులూ, మధ్యతరగతి కలుస్తుంది. నాయకత్వంవిషయం వచ్చే సరికి కిరణ్ లాంటి శ్రామిక వర్గ నాయకులే నాయకత్వ బాధ్యతను వహిస్తారు .

      మరి, కథ మొదలుపెట్టినపుడు శంభునాయుడుతోనే మొదలుపెట్టి….చివరికి శంభు నాయుని విజయోత్సాహంతోనే ముగించాడు కదా…అనేది కదా! మీ సందేహం. ఒక సంఘర్షణను, సంఘటనను లేదా సన్నివేశాన్ని మాత్రమే కథ చేయలేరు .ప్రతి సంఘటనకు నేపథ్యంగా ఒక సామాజిక చరిత్ర వుంటుంది. ఆ చరిత్రను కూడా చెప్పగలిగితేనే అది కలకాలం నిలిచే కథవుతుంది. ఉదాహరణకు కాళీపట్నం రామారావుగారి “ఆర్తి’, ‘చావు’, ‘కుట్ర’, ‘జీవధార’ కథలకు ఎంత సామాజిక చరిత్రను అందించారు. ఉత్తరాంధ్ర కథకులకున్న గొప్ప గుణం (క్వాలిటీ) అది. ఆ వారసత్వమే “షా” కథలోనూ కనిపిస్తుంది.

      2. పెట్టుబడికి ప్రాంతీయ బేధామేమీ వుండదు. అది బంగారపు కత్తయినా కుత్తుకలు కోయకుండా వదిలిపెట్టదు. కానీ దానికి ప్రాంతీయత వుంటుంది. తెలంగాణ మిత్రులు , ఇన్నిరోజులూ ఆంధ్రా పెట్టుబడిదారులు , తమను దోచుకున్నారని అన్నారు గదా? గోదావరి ప్రాంత పెట్టుబడి కళింగాంద్రకు పరాయి పెట్టుబడి కాకుండా, కళింగాంద్ర పెట్టుబడి ఎలా అవుతుందో, మీరే చెప్పాలి. శ్రమ జీవులు పెట్టుబడిని అడ్డుకోవాలంటారా? అని ప్రశ్నించేరు. వాళ్లుగాక మరి ఇంకెవరు అడ్డుకుంటారు. పెట్టుబడి ఇనుప రక్కసి ఉక్కు పాదాల కింద నలిగిపోయే శ్రమజీవులే పెట్టుబడికి అంత్యక్రియలు చేస్తారని మార్క్సిజం చెప్పినట్లు నా అవగాహన. ఇంకా చెప్పాలంటే, విప్లవ పోరాట శక్తులు వాళ్ళేనని నా అవగాహన. పెట్టుబడిని శ్రమజీవులు వ్యతిరేకించకుండా, సామాజికీకరణ ఎలా చేయగలరు ?.
      . ..

      3. ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో’ అని మళ్ళీశ్వరి గురించి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే , మల్లీస్వరి “చినుకు’ పత్రికలో అట్టాడ అప్పలనాయుడి రచనల పైన రాసిన వ్యాసంలోను, ఆ తరువాత పాలపిట్టలో వచ్చిన ఇంటర్వ్యు లోనూ , అట్టాడ కథల పుస్తకావిష్కరణ సభ లోనూ ,ఈవిషయం చర్చలో కొచ్చింది మరి అన్ని పర్యాయాలు వచ్చిన తరువాత కూడా అదే అభిప్రాయాన్ని తిరిగి తిరిగి రాస్తుంటే, ఏమనాలి మిత్రమా!

      రచయితలకుగానీ, విమర్శలకుగానీ సామాజిక కార్యకలాపాల్లో నిమగ్నులైనా వారి ప్రైవేటు లైఫ్ అయితే సరే, కానీ పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటారని శ్రీ, శ్రీ అందుకే అన్నారు. అట్లని ఏదిబడితే అది అనొచ్చని కాదండీ! నేను బాధ్యత కలిగిన విమర్శకురాలిగానే, ఆమె రాతలు అక్షరబద్దమై, సామాజికాంశమైన తరువాతే అలా రాసాను . మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడిని ఇంటర్వ్యూ చేసినపుడు,( అయన సమాధానాన్ని పేజీ నెంబర్లతో సహా ఉదహరించాను.) తాను సొంతంగా అట్టాడ అభిప్రాయాలను చెప్తుంటే, రాసుకున్నట్లయితే, ఆమె ప్రాంతీయవాదికాదని స్వహస్తాలతో నమోదు చేస్తే మరలా ముద్ర వేసేందుకు ప్రయత్నించడమెందుకు?.
      ఆ ఇంటర్వ్యూలో వాక్యము, వాటి నిర్మాణ శైలి చూడండి. అది అట్టాడ అప్పల నాయుడిదని ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే మళ్లీస్వరాన్ని పాలపిట్ట ఇంటర్వ్యు శకలాన్ని ఒక దాని పక్క ఒకటి పెట్టి సరిపోల్చండి.
      మల్లీశ్వరి వ్యాసంలోరాసిన తర్వాత ఆమె వ్యాసాంశాల్ని వ్యతిరేకిస్తూ చెప్పడం కోసం ఆమె పేరు పెట్టాను. వ్యాసాన్ని, వ్యాసకర్తను ఉటంకిచడం వ్యక్తిగాతమా మిత్రమా?
      ఆమె వ్యాసానికి, నా వ్యాసం స్పందన వ్యాసం కాని పక్షంలో ఆ ఇంటర్వ్యూ ఆమె రాసినా, మరెవరైనా రాసినా నాకుగానీ లేదా మరొకరికిగానీ, ఆమె పేరు (మీబాషలో వ్యక్తిగతంగా) ఎత్తాల్సిన అవసరం వుండదుకదా మిత్రమా!.

  • suresh says:

    శ్రీదేవి గారు నా సందేహాలకు వివరాణాత్మకంగా సమాదానమిచ్చినందుకు ధన్యవాదాలు. మరికొన్ని సందేహాలు!

    1. మీరన్నట్టు పరప్రాంత పెట్టుబడిని అడ్డుకునే క్రమంలో స్థానికులు (భూస్వామ్య, స్థానిక పెట్టుబడిదారులు) అందరూ ఏకమవుతారు బాగానే వుంది. మరి ప్రళయావతి నదీ ప్రాంతం నుండి విశాఖకు వ్యాపార విస్తరణకై తరలి వచ్చి తిరిగి తన ప్రాంతంలో పెట్టుబడి పెట్టిన శంభునాయుడిని ఏమనాలి? స్థానిక పెట్టుబడిదారుడా? పరప్రాంత పెట్టుబడిదారుడా? కళింగాంధ్ర అంటే ఏ ఏ ప్రాంతాలను పరిగణలొనికి తీసుకోవాలి?

    2. ‘పెట్టుబడికి ప్రాంతీయ బేధామేమీ వుండదు. కానీ దానికి ప్రాంతీయత వుంటుంది’ . ఇది నాకు అర్ధం కాలేదు వివరించగలరు?

    3. మీకున్న మార్కిస్టు అవగాహన మేరకు పెట్టుబడికి అంత్యక్రియలు చేసేది శ్రమజీవులే అన్నారు బావుంది. మరి మీరే మీ వ్యాసంలో పెట్టుబడిని అడ్డుకునేది శ్రమజీవులే అని సెలవిచ్చారు. మరి పెట్టుబడి రాకుండా ముందుగానే అడ్డుకుంటే దాని అంత్యక్రియలు ఎలా సాద్యం.

    4. ‘విద్యాసాగర్ గారు ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు’ అని అన్నారు. ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రంధం మెదటి పేజీలో French Writer- ‘Andre Paul’ quotation ఒకటుంటుంది ‘Everything has been said before, but since nobody listens, we have to keep going back and begining all over again’ కాబట్టి ఎవరైనా ఆ విషయాన్ని ముందుగా చెప్పుండొచ్చు. నేనే ముందు చెప్పాను అని సాగర్ గారు పుస్తకంలో ఎక్కడా చెప్పలేదన్నది నా ఎరుక

  • Bapiraju says:

    సురేష్ గారూ,మీతోపాటు నెనూ కొన్ని సందేహాలడుగుతానండీ….అడగ వచ్చు కదండీ?దానికేటి లెండి,అడిగీ వాడికి చెప్పీ వోడు లోకువ లెండి.మనము ఏదయినా అడిగీవోచు లెండి?
    శ్రీదేవి గారూ,ఒకటో ప్రశ్న-(సురేష్ గారి లాగే ఇవే ఆఖరి సందేహాలనుకో మాకండి) మార్క్సిజం చెప్పినట్టు (పెట్టుబడికి అంత్యక్రియలు ) మీ భావన అని వివరణ ఇచ్చారా?సురేష్ గారన్నట్టు సెలవిచ్చార?(మీరు వివరణ అన్నా,ఆయన సెలవే అనుకుంటాడని అనకండి)
    నెంబర్ రెండు – అంతం చేయాలంటే ముందు, దాన్ని రానివ్వాల,బలపడనివ్వాల,ఊడ లు దన్నీయాల…అంతేగాని ముందే అడ్డితే ఎలాగండీ?దొంగతనం జరిగిన తర్వాత,దొంగను పట్టుకొని శిక్షించాల గాని,ముందే శిక్షిస్తే ఎలాగండీ?హత్య జరిగిన తర్వాత నేరస్తుడని ఉరిదీయాల గానీ ముందే తీసేస్తారా?
    నెంబర్ త్రీ _శంబునాయుడుకి కళింగమంతా తిరిగే హక్కు ఉన్నపుడు,గోదావరి పెట్టుబడిదార్లకి హక్కు ఉండదా?కళింగ ప్రాంత మంటే ఒక్క శంబునాయుడు తిరుగాడిన ప్రాంతమే అనుకున్నారా?గోదావరి పెట్టుబడిదార్లు తిరుగాడేదంతా కఌంగమె కదండీ సురేష్ గారూ?కాదంటారా శ్రీదెవిగారూ?
    నెంబర్ ఫోర్ – సాగర్ గారు రాసిన పుస్తకం లో అంశాలు ,ముందే కథలుగా అప్పలనాయుడు రాసాడని అంటారా?ఎవరు మున్దోచ్చా రని కాదన్నయ్యా ,బులెట్ దిగిందా లేదా,మహేష్ బాబు డైలాగు వినలేదా మీరు?
    నెంబర్ ఫైవ్ – పెట్టుబడికి ప్రాంతీయ భేదమంటే…ఒక ప్రాంతాన్ని ప్రేమించి అభివ్రుది చేసి,మరో ప్రాంతాన్ని దోచు కోవడమనే భేదం ఉండదు అన్నారను కున్నాను,అలాగే .ప్రాంతీయతంటే,అమెరిక,జపాన్,ఇంకా దేశీయంగా గుజరాత్,తమిళ్ ,ఇంకా రాష్ట్రీయంగా గోదారి,కృష్ణ ఇలా వివిధ ప్రాంతాలకు చెందిన పెట్టుబడి అని మీ జవాబు చదివి అనుకున్నాను,గాని సురేష్ గారి మాటలతో అనుమానం వచ్చింది,చెప్పరా?కాదు కాదు సెలవివ్వరా?
    ఇప్పుడికివి…మళ్ళా,మళ్ళా అడగతా ఉంటానే ఉంటానండీ…అనుమానం పిశాచి ననుకోకండి.వొదిస్తన్నాననుకొకన్ది…తెలిసే,భేతాలుడి కథ లాగ అని అనుకోకండి…మీరు సెలవిస్తానే వుండండి …నమస్తండి.
    సురేష్ గారూ…నా డౌట్లు నీనూ అడిగీసానండే,మీ ధర్మం వలన…

  • P.suneeta says:

    శ్రీ దేవిగారికి నమస్కారం.
    నేను ఒక సాధారణ పాఠకురాలిని.మీ వ్యాసం చదివాను.’మళ్లీశ్వరి చూడలేని చేదు నిజం’ పై సీరియస్ గా చర్చ జరిగితే బాగున్నని అనుకున్నాను.ఎందుకంటే వివిధలో మళ్లీశ్వరిగారి వ్యాసము,దానిపై అప్పలనాయుడి గారి వ్యాసము చదివేక ఆకధ చదవాలని అనిపించి సంపాదించి ఆ ‘షా’ కధను చదివేను.
    నిజం చెప్తున్నాను ఆకధ ఒకంతట చదివించలేదు.ఒకటికి మూడుసార్లు చదివితే గానీ నాకు కధ ఏమిటో అర్ధం కాలేదు.బహుస నేనెక్కువగా యిలాంటి కధలు చదవక పోవడం కారణమై ఉంటే ఉండొచ్చు.కధ వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెళ్లి రావడం చాలా కన్ ఫ్యూజన్ గా ఉంది. అది ఒక పాత్ర మానసిక సంఘర్షన కనక బహుస అలాఉందని సమాధానపడ్దాను.
    రెండవది కధంతా శంభునాయుడే ఉన్నాడు. నిజానికి ఆపాత్ర ని బాగా సృస్టించారు అప్పలనాయుడుగారు ఒక బలమైన పాత్రగా కనపడుతుంది. అంతేకాదు ఆ కధని ఎప్పుడు గుర్తు చేసుకున్నా శంభునాయుడే గుర్తుకు వస్తున్నాడు తప్ప వేరే పాత్రలు అంతగా గుర్తుకు రావడం లేదు.రచయిత ఏ వుద్దేశంతో రాసినా పాఠకులకు శంభునాయుడిపట్ల ప్రేమ ,సానుభూతి కలుగు తున్నట్టుగా వుందే తప్ప అందులో కిరణ్ పాత్ర గుర్తింపులేనిదిగానే ఉంది. అసలు ఆ పాత్ర సరిగ్గ పోషింపబడలేదని నాకనిపిస్తోంది.

    యిక మీ వ్యాసం విషయానికి వస్తే మీరు చాలా మంచి విషయాలు రాసారు.మంచి వ్యాసం అని అనుకున్నాను.దానిపై చర్చ జరిగితే నా సందేహాలకు (పైన పేర్కొన్న)సమాధానాలు దొరుకు తాయేమో అని అనుకున్నాను.
    కానీ చర్చ ఈరోజు వరకు సరైన విధంగా లేదు.వ్యంగ్యాలు వెటకారాలతొ ఎవరికి వారు తామేమి తాక్కువ కాదన్నట్టు రాసుకొస్తున్నారు.

    ఎందుకిలా జరిగుతోందని ఆలోచించినపుడు నాకొకవిషయమనిపించింది.తప్పయితే మన్నించండి.అన్ని మంచి విషయాలు రాసినమీరు మళ్లీశ్వరి గారి పేరు వచ్చేసరికి ఒకింత అసహనానికి గురై రాసినట్టనిపించింది.ప్రతి సందర్భములోనకూడా, ‘మళ్లీశ్వరి అజ్ఞాణం తో’ అని ,’రాసిందో రాయించిందో’ అని.మీరు ఒక ప్రొఫెసర్.మీరుకూడా సంయమనం పాటించకపోతె ఎలా!అసలు ఒక మళ్లీశ్వరి గాని మరో పరమేశ్వరి గాని ఎదో అన్నంత మాత్రాన ఏమైపోతుంది.ఎదురుగా కధ ఉంది.కధ చదువుకున్న పాఠకుడు తనే అర్ధం చేసుకుంటాడు గదా.

    ఏదేమైనా చర్చ బాగాజరిగితే బాగున్ను, జరగాలని ఆశిస్తున్నాను

    • nirmal swaagath says:

      సునీత పి గారికి నమస్కారం…శ్రీదేవి గారికి మీరు రాసిన స్పందన చూసాక,ఇది రాయాలన్పించింది.నిజానికి నేను కూడా పాటకున్నె.(సాధారణ…అసాధారణ..పాటకులని ఉండరు…పాతకులన్దరూ సమానమే..)షా కథ మీద మీరు వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను విభేదిస్తాను గానీ,మీరు అభిప్రాయం ఏర్పరచుకోడానికి మీరు వేసుకున్న బేస్,ఆ థాట్ ప్రాసెస్ ,(ప్రధాన పాత్రా,గుర్తున్దిపొవదాలూ,వెనకా munduu . ..)ఇవి ముచ్చట వేసాయి.ఇక కథల మీద జిహ్వకో రుచి లాగ…ఎవరిష్టం వారిదీ.రావిశాస్త్రి గారి పిపీలికాన్ని జానపదమనీ,కారా గారి నో రూం ని సెక్స్ కథ అనీ ఒక పెద్దాయనే భావించాడు,ప్రకటించాడు…గనక,మీకు షా ను అలా పోల్చుకొనే అధికారమున్దండీ.
      ఇక,చర్చ బాగా జరిగితే బాగుణ్ణు,జరగాలని ఆశిస్తున్నానని రాసారు గదా…..
      ముందుగా…ఆ ఆకాంక్ష ఉన్నవాళ్ళు,చర్చ ఎపుడు,ఎవరు వెటకారాలతో సరయిన విధంగా నడవకుండా చేసారో తెలుసుకోండి.శ్రీదేవిగారి వ్యాసం ఆధారంగా చర్చ సీతారామయ్య గారూ,రమసున్దరిగారూ చేస్తుంటే మధ్యలో శంబుకుడు గారు …కల్పించుకొని,యాభయిల(దశాబ్దం )నాటి చర్చ యెన్దుకన్తూ ,రామాయణంలో పిడకల వేట అంటూ..వెతకరించారు…దానికి నేను స్పందించి…మాలాంటి వారికి ఆ చర్చ ఉపయొగమన్దీ అంటే,ఇంకెక్కడో చెయ్యమన్తూ,అటువంటి చర్చ ముగిసిపొయిన్దన్తూ,రెండు ప్రశ్నలు వేసి,వాటిమీద చర్చ చేయమన్నారు….ఆయనే,ఆ చర్చ చేయవచంటే,అగ్యాని నంటాడు,అప్పుడు గదా చర్చ మారింది…ఇదేదో శ్రీదేవి గారి నేరమన్నట్టు,ఆమె కేమో అసహనమన్నట్టు మీరు..ఇపుడు వ్యాసంలో మంచి విషయాలు రాశారన్తూనె …ప్రొఫెసర్ కదా సంయమనం పాతిన్చాలంటారు …(ఆమె వివరణ ఇచ్చాక కూడా…)ఇటువంటి మాటలూ ,వాక్యాలే చర్చ ను పాడుచేస్తున్నాయి.మంచి వ్యాసమంటారు,మంచి విషయాలు చెప్పారని ,అంటూనే యేవో కొర్రీలు,లోపాలు ,చెప్తారు…(మంచి విషయాలేమిటో చెప్పి,లోపాలు కొర్రీలు ఏమిటో చూపడం సరయిన విధానం తప్ప,ఇలా యెవరూ అనరు.ద్వందాలుగా లేవా మీ వాక్యాలు…ఆలోచించండి.
      అసలు శంబుకుడుగాని,సురేష్ గాని,మీరు గాని చర్చించటం లేదు,వాదిస్తున్నారు.వాదన వేరూ ,చర్చ వేరూ …ఇది అంగీకరిస్తారని భావిస్తూ ,ఇక ఉంటానండీ,మరి మాటాడ దలచుకోలేదీ విషయంలో…

    • ari sitaramayya says:

      సునీత గారూ,

      మీరు కథ సంపాదించి చదివాను అన్నారు. నేను షా గాని మల్లీశ్వరి గారూ, శ్రీదేవి గారూ ప్రస్తావించిన ఇతర కథలు గాని చదవలేదు. ఎప్పుడో చదివినా ఇప్పుడు గుర్తులేవు. అవి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో ఎవరైనా చెప్తే బాగుంటుంది.

      “నిజం చెప్తున్నాను ఆకధ ఒకంతట చదివించలేదు.ఒకటికి మూడుసార్లు చదివితే గానీ నాకు కధ ఏమిటో అర్ధం కాలేదు.బహుస నేనెక్కువగా యిలాంటి కధలు చదవక పోవడం కారణమై ఉంటే ఉండొచ్చు.కధ వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెళ్లి రావడం చాలా కన్ ఫ్యూజన్ గా ఉంది. అది ఒక పాత్ర మానసిక సంఘర్షన కనక బహుస అలాఉందని సమాధానపడ్దాను.
      రెండవది కధంతా శంభునాయుడే ఉన్నాడు. నిజానికి ఆపాత్ర ని బాగా సృస్టించారు అప్పలనాయుడుగారు ఒక బలమైన పాత్రగా కనపడుతుంది. అంతేకాదు ఆ కధని ఎప్పుడు గుర్తు చేసుకున్నా శంభునాయుడే గుర్తుకు వస్తున్నాడు తప్ప వేరే పాత్రలు అంతగా గుర్తుకు రావడం లేదు.రచయిత ఏ వుద్దేశంతో రాసినా పాఠకులకు శంభునాయుడిపట్ల ప్రేమ ,సానుభూతి కలుగు తున్నట్టుగా వుందే తప్ప అందులో కిరణ్ పాత్ర గుర్తింపులేనిదిగానే ఉంది. అసలు ఆ పాత్ర సరిగ్గ పోషింపబడలేదని నాకనిపిస్తోంది.”

      చర్చ ఇంతవరకు ఎక్కువగా వస్తువు మీదే జరిగింది. కథనం మీదా, పాత్ర చిత్రణ మీదా ఒక స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసింది మీరే. కథ సఫలం కావటానికి కథనం, పాత్ర చిత్రణా ముఖ్యమైన అంశాలని అనిపిస్తుంది నాకు. విమర్శకులు కూడా వస్తువునే కాకుండా కథకు ముఖ్యమైన మిగతా విషయాలను కూడా పట్టించుకుంటే బాగుంటుంది. లేకపోతే చర్చలు రాజకీయాలమీదా ఆర్ధికవ్యవస్త మీదా మాత్రమే జరిగిన చర్చల్లాగా ఉంటాయి. మల్లీశ్వరి గారు జ్యోతిలో రాసిన వ్యాసం మొదటి ఖండంలో “శిల్పము, మానవోద్వేగాల వంటి వాటి జోలికి పోలేదు” అని రాశారు. అది చదివి నిరాశ పడి నేను మిగతా వ్యాసం చదవలేదు. ఆ తర్వాత, ప్రస్తుతం జరుగుతున్న చర్చలో, మీ వ్యాఖ్య దాకా పాత్ర చిత్రణా, కథ మీద దాని ప్రభావం గురించీ ఇంతగా ఎవ్వరూ ధ్యాస పెట్టలేదు. మీకు కృతజ్ఞతలు. అభినందనలు.

      • సీతారామయ్యగారు,
        షా కధ ‘కధా పార్వతీపురం’ సంకలనంలో దొరుకుతుంది. ‘చావువిందు’ తుమ్మేటి రఘోత్తమరెడ్డి కధా సంకలనంలో దొరుకుతుంది.
        ‘షా’ ఒక ప్రాంతీయ పెట్టుబడి దారుని వాయిస్ నుండి చెప్పినా మనకు కధలో కధానాయకుడు ప్రజాఉద్యమ నాయకుడు అనే విషయం అర్ధం అవుతుంది. ఈ రకమైన ప్రయోగాలు గతంలో కూడా జరిగాయి.
        ఇక వస్తువు, శిల్పం విషయానికి వస్తే కాళీపట్నం రామారావు గారి ఈ క్రింది మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
        ” తాజ్ మహల్ వాస్తునైపుణ్యం, పక్కనే యమునా నది, ఇవన్నీ కలిస్తే వచ్చిన సౌందర్యం కేవలం రూపంలో ఉంది. కాని నాకు ఒక డామ్ తాజ్ మహల్ కంటే సుందరంగా కనిపిస్తుంది. డామ్ సౌందర్యం ప్రజలకు అందించే తిండిలోనూ, నీళ్ళలోనూ ఉంది. కుటుంబరావు గారి కధల్లో ఉన్నది తాజ్ మహల్ సౌందర్యం అందం కాదు, డామ్ అందించే ప్రయోజనం. ఆయన కధల్లో ప్రయోజనమే సౌందర్యం.తాజ్ మహల్ అందం, డామ్ ప్రయోజనం రెండూ ఉన్నది రావిశాస్త్రి కధ.”

  • లక్ష్మణరావు says:

    శ్రీదేవి గారికి నమస్సులు. మీ వ్యాసం చదివాను. మొత్తానికి ఈ దేశంలో 1988 నాటికే పెట్టుబడి వచ్చిందన్న మా అప్పలనాయుడు బావు చేసిన నిర్ధారణను మీరు కూడా అంగీకరించినందుకు కృతజ్ఈతులు. ఎవరు ముందు రాశారు, ఎవరు వెనక రాశారు అన్న చర్చ జరగడం నిజంగానే బాధాకరం. ఎదురుగా ఉన్న పదార్ధాన్నే సైద్ధాంతిక అవగాహనతో తెరపార చూసి అద్దంలో అందరికీ వారిద్దరూ చూపారు. వారిద్దరి లక్ష్యం పెట్టుబడికి వ్యతిరేకంగా అందరూ నిలవాలన్నదే సారాంశం. మీరన్నట్లు “శ్రమ’ జీవులే పెట్టుబడికి అంత్యక్రియలు చేయరనుకుంటాను. పెట్టుబడి దారులకి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెట్టుబడి లేకుండా శ్రమ జీవి పుట్టక ఉండదని అనుకుంటున్నాను. అది పొలంలోనైనా, కార్కానాలోనైనా. మీరన్నట్లుగానే ఏ పెట్టుబడి అయినా కూడా దాని “జలగ’ స్వభావం ఒకటే. రక్తం పీల్చడం ద్వారానే దాని జీవిక ఉంటుంది. అదే సమయంలో ‘స్థానికత’ అనేది స్థానిక పెట్టుబడిదారులు లేవనెత్తే అంశంగానే మనం చూడాల్సి ఉంటుందేమో. ఎందుకంటే పెట్టుబడి అనేది పుట్టుకే వివిధ శ్రామిక శ్రేణుల శ్రమలోంచి ఉద్బవిస్తుంది. వివిధ ప్రాంతాల వాళ్ల వినియోగంలోంచి ఆదాయం రాబడుతోంది. అంటే సరుకు ఉత్పత్తి గాని, సరుకు వినియోగం గాని ఒక పరిధిలో జరిగే విషయాలు కావన్నది మనందరికీ ఎరుకే. ఈ విషయాన్ని మరోసారి మీరు పరిశీలించగలరు. మీరిచ్చిన వివరణలో నాకు బాగా నచ్చిన విషయం శ్రామిక( కార్మిక) వర్గ నాయకులే విప్లవానికి నాయకత్వం వహిస్తారన్నది. అందుకు కృతజ్ఈతులు. ఈ చర్చలో నేను గమనించింది, నాకు సంతోషం కలిగించింది కూడా రమాసుందరిగారి వివరణ. “భారతదేశంలో సామ్రాజ్య వాదులు, దేశీయ బడా పెట్టుబడీ దారులతో మిలాఖత్ అయ్యారు కాబట్టి ఈ ప్రజాయుద్దం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమమే” అన్నందకు. ఎందుకంటే విద్యాసాగర్ గారి పుస్తకం మీద ఇదే సారంగలో జి.ఎస్.రామ్మోహన్ రావు గారు “నేల మీద నమ్మకం ఉంటే ఈ పుస్తకం తప్పక చదవండి” అన్న వ్యాసంలో రమాసుందరి గారికి ఈ పుస్తకంతో ఏ మాత్రం ఏకీభావం లేదన్నది ఆ సందర్భంగా లెవనెత్తిన అంశాలు స్పష్టం చేశాయి. కాని, ఇక్కడ మా అప్పలనాయుడు బావు పుణ్యమా అని ఆమె కూడా ఇక జరగాల్సిన ప్రజాయుద్ధమంతా సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమమే అన్న అభిప్రాయానికి ఏకీభవించడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మార్పు సహజమని విశ్వసించే వాళ్లు ఎవరైనా గాని సమాజం మారిందని అంగీకరించకుండా ఎలా ఉండగలరు. మేము కూడా మా అప్పలనాయుడు బావు కథలతో పెట్టుబడి మా పల్లెల్లోకి వచ్చిన విషయాన్నితెలుసుకున్నాం. అందుకు గల సామాజిక చలన సూత్రాలను విద్యాసాగర్ గారి పుస్తకం ద్వారా అవగాహన చేసుకోగలిగాం. మారిన ఉత్పత్తి విధానానికి అనుగుణంగా మారాల్సిన విషయాలు గురించి ఇలాంటి చర్చ ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ మేరకు మరోసారి మీకు కృతజ్ఈతులు. చివరిగా మీకు సూచించేంత స్థాయి నాది కాదు గాని, ఒక విజ్ఈప్తి. విమర్శపై విమర్శ చేసినప్పుడు ఏ అంశాలనైతే మీరు తప్పుపట్టారో అదే తప్పు మీరు కూడా మల్లీశ్వరీ గారు మీద వ్యక్తిగతంగా చేయడం అంత భావ్యం కాదేమో అనుకుంటున్నాను.

    • లక్షణరావు గారు,
      “పల్లెను మింగిన పెట్టుబడి” పుస్తక ఉద్దేశ్యాన్ని నేను అంగీకరించక పోవటానికి కారణం, ఆ పుస్తకంలో పరిణామ క్రమంలో ఒక దశను వారు ఎత్తి వేయటమే. నూతన ప్రజాస్వామిక విప్లవం ఇక అవసరం లేదనీ, పెట్టుబడీ దారి సమాజం వచ్చేసిందనే వారి ప్రతిపాదనకు నేను అంగీకరించను. అంతిమ యుద్దం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినా మధ్యలో వచ్చే దశలను మాపు చేసే ప్రతిపాదనల వలన వచ్చే నష్టం గురించి పీడిత ప్రజలే భరించాల్సి ఉంటుందని నా ఉద్దేశ్యం. వ్యవసాయ రంగంలో, పల్లెల్లో పెట్టుబడి ప్రవేశం ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు.స్వాతంత్ర్యం వచ్చే సరికి మనది అర్ధ వలస, అర్ధ భూసామ్య వ్యవస్థ అని మీరు అంగీకరిస్తే దేశీయ పెట్టుబడి, సామ్రాజ్య వాదులతో అప్పుడే రాజీ పడిందనే విషయం అర్ధం అవుతుంది. దేశంలో పెట్టుబడీదారీతనం వ్యవస్థీకరించకబడక పోవటానికి అదే కారణం. భారత దేశంలో సామాజిక చలన సూత్రాలు అర్ధం చేసుకోవటానికి ఈ విషయం అర్ధం చేసుకోవాలని నా మనవి. భారతదేశంలో పూర్తిగా పెట్టుబడి దారీ సమాజం వచ్చిందని చెప్పటానికి ఆ పుస్తకం చేసిన ప్రయత్నం నా దృష్టిలో హేతుబద్ధంగా లేదు.
      ఇక షా కధలో వచ్చేలాంటి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. వాటిని ఆపలేము. వాటి గమ్యం, వాటికి ఎవరు నాయకత్వం వహించాలి లాంటి విషయాలలో స్పష్టత ఇచ్చే బాద్యత ఉన్న శక్తులు బలహీనంగా ఉన్నాయి ప్రస్తుతం అని నా అభిప్రాయం.

      • లక్ష్మణరావు says:

        రమాసుందరి గారికి నమస్సులు. విద్యాసాగర్ గారి పుస్తకంలో హేతుబద్ధత లేదని, ఇప్పటికీ అర్ధ భూస్వామ్య వ్యవస్థ ఉందన్నది మీ అభిప్రాయంగా నేను అర్ధం చేసుకున్నాను. ఏ ప్రాతిపదికన హేతుబద్ధత లేదు అన్నది వివరిస్తే మరోసారి మేము ఆ కోణంలో చదవడానికి తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఆ సూచనలు చేయగలరు. ఆ పుస్తకం మాట అలా ఉంచితే…మా అప్పలనాయుడు బావు రాసినట్లు ‘“భారతదేశంలో సామ్రాజ్య వాదులు, దేశీయ బడా పెట్టుబడీ దారులతో మిలాఖత్ అయ్యారు కాబట్టి ఈ ప్రజాయుద్దం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమమే” ఈ వ్యాఖ్య సరైందని మీరు భావిస్తున్నట్లు నేను అనుకోవచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీని మీద మీకు భిన్నాభిప్రాయం ఉంటే వెంటనే అక్కడే లేవనెత్తేవారు కాబట్టి. అలా లేదు అంటే దేశీయ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు దేశాన్ని దోచేస్తున్నారన్నది ఓ వాస్తవంగా, ఆ దశ దేశీయంగా చోటుచేసుకున్నట్లుగా మీరు గుర్తించారని నేను అనుకుంటున్నాను. అంటే మీరన్నట్లుగా ఆ దోపిడీ శక్తులకు (సామ్రాజ్యవాదశక్తులకు) వ్యతిరేకంగా ప్రజలు పోరాడే సమయం ఆసన్నమైందనే కదా మీ అభిప్రాయం. ఇక అలాంటప్పుడు అర్ధ భూస్వామ్య సమస్య ఎలా ఉత్పన్నమవుతుందన్నది నా సందేహం. మీ వివరణ కోరుతూ..

  • లక్షణ రావుగారు,
    నమస్తే. “పల్లెను మింగిన పెట్టుబడి” పుస్తకంలో “భారతదేశంలో పెట్టుబడీ దారీ వ్యవస్థ ఉనికి” అనే ప్రతిపాదనలోనే హేతుబద్దత లేదని నా అభిప్రాయం. పల్లెల్లో ఉత్పత్తి విధానం (మోడ్ ఆఫ్ ప్రొడక్షన్) మారకుండా వ్యవస్థ మారింది అని ప్రతిపాదించటంలోనే నా అభ్యంతరం. అయినా ఈ పుస్తకానికి సంబధించిన చర్చకు ఇది వేదిక కాదనుకొంటాను.
    ఇక సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు అన్ని పెట్టుబడికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు అని నేను అనుకోవటం లేదు. అలా అయితే ఇవ్వాళ రేపు జరగబోతున్న పోలవరం వ్యతిరేక ఉద్యమం కూడ కేవలం పెట్టుబడి వ్యతిరేక ఉద్యమంగా మీరు గుర్తిస్తే అది దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది. అది ఆదివాసులు వారు కోల్పోబోతున్న భూమి కోసం, భుక్తి కోసం జరప దలిచిన పోరాటం. ఇక్కడ (భారతదేశంలో) భూసామ్య వర్గం సామ్రాజ్యవాదులతో రాజీ పడిపోయిందనే వాస్తవాన్ని గ్రహిస్తే, ఆ భూసామ్య వర్గ ప్రయోజనాలను కాపాడుతున్న ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తారు. స్థానిక చిన్నపెట్టుబడీదారులు వారి ప్రయోజనాలు నెరవేరే మేరకు ఈ ఉద్యమాలకు మద్దతు ఇస్తారు. భూసామ్య వర్గం ఇక్కడ సామ్రాజ్య వాదుల చేతిలో కీలుబొమ్మ. ఇప్పుడు ప్రజలు నేరుగా చూస్తున్నది భూసామ్య వర్గాన్నే అని నా అభిప్రాయం.

    • లక్ష్మణరావు says:

      రమాసుందరి గారికి కృతజ్ఈతులు. కోరిన వెంటనే వివరణ ఇచ్చినందుకు. ఆ పుస్తకాంశాల మీద చర్చకు ఇది వేదిక కాదని మీరన్నందున ఆ చర్చకు ఇక ఇక్కడ ఆపేద్దాం. మీరు చెప్పిన విధంగా ప్రజలు నేరుగా భూస్వామ్య వర్గాన్ని చూస్తున్నారని అన్నారు. మీ ఎరుకలో అలా చూసిన ఉద్యమం ఒక్కటైనా ఇటీవల కాలంలో మన తెలుగునాట చూపిస్తే బాగుంటుంది. ఇక పోతే పోలవరం వ్యతిరేక పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటమన్నారు. ఆ భూస్వామ్య ఎవరో చెప్పగలరు. అదే సమయంలో 1988లోనే ఈ దేశంలోకి అనేకన్నా వెనకబడిన మా శ్రీకాకుళం పల్లెల్లోకి పెట్టుబడి కమ్మేసిందన్న మా అప్పలనాయుడు బావు చెప్పిన విషయాన్ని సమర్ధించిన మీరే పెట్టుబడిదారీ వ్యవస్థ రాలేదని మరో పక్క అంటున్నారు. ఈ చిక్కుముడి వీడే విధంగా కాస్త వివరంగా చెప్పగలరు.

      • 1) భారతదేశంలో పెట్టుబడి రాక 1988 నుంచే కాదు, అధికార మార్పిడి జరిగినప్పటినుండీ వచ్చింది. పెట్టుబడి రాక, పెట్టుబడిదారీ సమాజం ఏర్పడటం రెండూ ఒకటి కాదని మీకు తెలుసుననుకుంటున్నాను నేను.

        2) భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు చూపించమంటున్నారు. ఈ రోజు విప్లవ పార్టీల చుట్టూ ఉన్న ప్రజలు ఏ పోరాటాలు చేస్తున్నారు? సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు ఇస్తున్నంత ప్రాముఖ్యత ఈ పోరాటాలకు ఇవ్వటం లేదని నా అభియోగం.

        3) భూస్వామి ఒక వ్యక్తిలోనే దర్శనమివ్వడని నేననుకుంటున్నాను. భారతదేశానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు అర్థం చేసుకుంటే ఇక్కడ భూస్వామ్య వర్గం సామ్రాజ్యవాదంతో లాలూచీ పడింది. నాకర్థమైనంతవరకు ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఇక్కడి దేశీయ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులతో కుమ్మక్కయ్యారు. భూస్వామ్యవర్గ ప్రయోజనాలకు భంగం కలగకుండా సామ్రాజ్యవాదం దాని ప్రయోజనాలు కాపాడుకుంటుంది. భూస్వామ్య వర్గానికి ప్రతినిధిగా ఉన్న భారత ప్రభుత్వంతోటి ఇప్పుడు పోరాటాలు జరుగుతున్నాయి.

        భారతదేశ సామాజిక చలన సూత్రాలను నేను ఇలాగే అర్థం చేసుకుంటున్నాను. అలా కాదు, భారతదేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చేసింది అని చెప్పదల్చుకున్న పుస్తకం ‘పల్లెను మింగిన పెట్టుబడి’, ఆ మార్పుకు సంబంధించిన డైనమిక్స్ అర్థం చేయించటంలో విఫలమైంది. సర్వేల నుండి ఒక అభిప్రాయానికి రావాలంటే సర్వేకి ఉపయోగించిన ప్రశ్నల జాబితాని ఆ పుస్తకంలో పొందుపరిచినట్లయితే ఆ సర్వే ఎక్కువ విశ్వసనీయత సంతరించుకునివుండేది.

        ఈ పుస్తకానికి సంబంధించి నా అభిప్రాయాలు ఇవి. ఇక చర్చను ఈ సందర్భంగా ఇంక కొనసాగించకూడదని నిర్ణయించుకున్నాను.

      • లక్ష్మణరావు says:

        రమా సుందరి గారు. మీ వివరణకు కృతజ్ఈతులు. నేర్చుకునే వారికి, తెలుసుకోవాలని అనుకునే వారికి సందేహాలు అధికంగా ఉంటాయి. నా గందరగోళాన్ని తగ్గించుకునేందుకే మీతో నా అభిప్రాయాలను పంచుకుంటున్నాను. మీ స్పందనను తప్పనిసరిగా తెలియజేయాలని కోరుతున్నాను.

        1) స్వాతంత్ర్యానికి పూర్వమే పెట్టుబడి వచ్చినప్పుడు, ఇప్పటి వరకూ పెట్టుబడి దారీ సమాజం రాకుండా ఎలా ఉంటుందో అర్ధం కావడం లేదు. మీరన్నట్లుగానే ఇప్పటికీ అర్ద భూస్వామ్య సమాజం ఉందని అనుకుంటే దాని లక్షణాలు ఏమిటి? అది ఏ రూపంలో ఉందో కాస్త వివరంగా తెలపగలరు.

        2) విప్లవ పార్టీలు చుట్టూ చేరిన ప్రజలు ఏ పోరాటాలు చేస్తున్నారని ప్రశ్నవేశారు తప్పా ఫలానా దగ్గర జరుగుతున్న పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటమే కదా అని వివరిస్తే బాగుంటుంది.

        3)పెట్టుబడి దారీ సమాజం ఇప్పట్లో రాదని సూత్రీకరించగలిగిన మీరు దేశీయ పెట్టుబడిదారులు ఎక్కడ నుంచి పుట్టుకుని వచ్చారో చెప్పడం లేదు. సురేష్ గారికి శ్రీదేవిగారు ఇచ్చిన వివరణ ప్రకారమైతే ‘ శంభునాయునిది భూస్వామ్య మనస్థత్వం. అందుకే తన పెత్తందారీతనాన్ని లెక్కచేయని కంపెనీ సిబ్బంది గానీ, వాళ్ళు నడిపే నాయకులుగానీ,.. ఏవి కనబడినా చిటపటలాడి పోయేవాడు . తన భూస్వామ్య దర్పానికి ప్రతిగా లేదా ప్రత్యామ్నాయంగా ఆఊళ్ళో ప్రవేశించిన పెట్టుబడిదారి వర్గాన్ని సహించలేక పోయాడు . ఐతే గియితే తానే రాజుగా వుండాలనుకుంటాడు తప్ప మరొకడ్ని ఆస్థానంలో సహించలేడు” అని స్పష్టంగా భూస్వామ్య మనస్తత్వాన్ని ఆవిష్కరించారు. ఆ ప్రకారం చూసినట్లయితే వాళ్లు ఉన్నమాట నిజమే అయితే పెట్టుబడి రాకే అసాధ్యం కావాలి. వచ్చినా అది బతికి బట్టకట్టే పరిస్థితి లేకుండా పోవాలి. అదే జరిగి ఉంటే దేశీయ పెట్టుబడిదారీ వర్గం తలెత్తే ప్రశ్నే ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఇందులో ఏది నిజమంటారు. మేడం. మన పార్లమెంట్ భూస్వామ్య వర్గ ప్రతినిధి అంటున్నారు. ఆ పార్లమెంట్ లో ఎంతమంది భూస్వామ్యులు ఉన్నారో వారి సంఖ్య ఇవ్వగలరా?

      • nirmal swaagath says:

        లక్ష్మనరావు గారు,
        రమాసుందరి గారు ఎంతగా వివరణ ఇచ్చినా ,మీరు కొండీలు వేస్తున్నారు తప్ప,మీరనుకున్నట్టు,మీ వాదనకు ఆధారాలు చెప్పటం లేదు.ఆమెను చెప్పమంటున్నారు.
        పెట్టుబడిదారీ సమాజం,సామాజిక విధానం అమలవుతోందని ,మీరు వివరాలు ఇవ్వండి.ఫలానా గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్యం వోడిపోయి ,పెట్టుబడి వచిందని వివరాలు ఇవ్వండి.శ్రీకాకుళ రైతాంగ పోరాటం భూస్వామ్య వ్యతిరేఖ పోరాటమా,పెట్టుబడిదారీ వ్యతిరేఖ పోరాటమా మీరు వ్యాఖ్యానించండి.రమాసుందరి గారిని పార్లమెంటులో ఎందరు భుస్వాములున్నారని ప్రశ్నించారు గదా,గ్రామాల్లో,మీ ఉతరాంద్రాలో ఎందరు పెట్టుబదిదారులున్నారో చెప్పండి.మీ ప్రాంత నాయకులు సత్తిబాబు,ఆనందగజపతి,ధర్మాన,కింజరాపు…వగైరాలు భుస్వాములా,పెట్టుబదిదారులా ఆలోచించండి.కొండీలు,కొర్రీలు …వాదనలన్పించు కుంటాయి.చర్చలన్పించు కోవు.చర్చకు వివరాలు అడుగుతారు,ఇస్తారు…మీరు అడగడమే పనిగా పెట్టు కున్నట్టుంది….
        అసలు,సాహిత్యానికి రాజకీయాలే వద్దంటూన్న సీతారామయ్య గారితో వాదించకుండా,స్వల్ప విభేదాల మీద ఎక్కు బెడతారేమితఅండీ బాణాలు?
        మీ లాంటి వాదనలను విన్నారేమో ,పరువాడ లక్ష్ము నాయుడు గారు …యేసు దేవుడని ఒప్పుకుంటారు గానీ,యేసు ఏమి చెప్పెను అన్న దగ్గర చీలి పోయారు క్రైస్తువులు …అలా కమునిస్టులు మార్క్స్ ఏమి చెప్పెను అన్న దగ్గర కొట్టుకున్తారని జోక్ చేసేవారు….
        అసలు రాజకీయాలు వద్దన్నా వారిని,వారు కూడా మన మిత్రులే వారిని ఎడ్యుకేట్ చేయండి….
        రమాసుందరి గారి బదులు నేను జవాబిచినందుకు మన్నించండి.వారు బహుశా ఈ కోస్చేనీర్ పద్దతికే విసిగి చర్చనుండి తోలగుతున్నట్టు ప్రకటించారు.ఎవరితో వాదించాలో,దేన్నీ ఖండించాలో కొద్దిగా ఆలోచించి,చర్చ రూపానికి గౌరవమిచ్చి ,కొనసాగండి.ఏదో ఆందోళనతో,మీకు మీరే ప్రశ్నలు శ్రుష్టించుకొని గందర గోళం పడి,నేర్చు కోవడానికి అని మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోకండి.ఇక్కడ ఎవరికి యెవరూ నేర్పరు.ఒకరి అభిప్రాయాలు ఇంకొకరు పంచు కుంటారు…మీరూ ఆ ప్రాసెస్ లో పంచండి మీ అభిప్రాయాలను….
        ఈ వివరనకూ ప్రశ్నలు వేస్తె ఇంకేమీ చెప్పలేను…

      • లక్ష్మణరావు says:

        నిర్మల్ స్వాగత్ గారు. కృతజ్ఈతులు. రమాసుందరి గారి తరుపున బదులు ఇచ్చినందుకు.

        1. పెట్టుబడిదారీ సమాజమే మా పల్లెలను ధ్వంసం చేస్తున్నాయని ఇప్పటికే మా అప్పలనాయుడు బావు తమ కథల్లో విస్తారంగా వివరించారు. మీరు ఆ కథలు చదివితే అది ఏ రూపంలో సామాజీకరణ జరిగిందో, అదెలాంటి సంక్షోభాన్ని సృష్టిస్తుందో మీకు అవగతమవుతుంది. మన ఉద్యమం ఎవరి మీద చేయాలో కూడా విడమరిచి చెప్పారని నా భావన. కాబట్టి ఆయన కథల ద్వారా సాధికారికమైన సమాచారం మీకు లభిస్తుంది.

        2. ఉత్తరాంధ్రా గురించి మాట్లాడేటంత వయసు నాది కాదు గాని విజయనగరం వరకూ మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను. బహుశా మీరు కూడా విజయనగరం వారైతే నా అంచనాల్లో లోపాలు ఏమైనా ఉంటే చెప్పగలరు. విజయనగరం జిల్లా ఆవిర్భావం నాటికి జిల్లా రాజకీయాలను కోటలే శాసించేవి. విజయనగరం, సాలూరు, సతివాడ, కురుపాం, చినమేరంగి, బొబ్బిలి ఇవన్నీ కూడా రాజుల చెప్పు చేతల్లోనే ఉండేవి. రాజులు ఎవరో, వారి వర్గమేమిటో నేను చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ అశోక్ గజపతిరాజు, కాంగ్రెస్ పార్టీకి సాంబశివరాజు నాయకులుగా చెలామణి అయ్యేవారు. దాని ఫలితంగా ప్రతీ గ్రామంలోనూ రాజు దాష్టీకం ఏ స్థాయిలో ఉండేదో మా గ్రామాలను సందర్శించి తెలుసుకోగలరు. ఈ రాజకీయాధిపత్యాన్ని ఎదురించడానికి, చేధించడానికి బి.సిలు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ పరిస్థితులను తన పునాదిగా చేసుకుని వ్యాపారాలతో ఆర్ధికంగా బలపడిన బొత్స సత్యన్నారాయణ (కావాలంటే ఎ.బి.ఎన్.లో ఓపెన్ హార్టు విత్ ఆర్కే కార్యక్రమాన్ని (మద్యం సిండికేట్ల వివాదం సందర్భంగా జరిగిన కార్యక్రమం అది. పరిశీలించగలరు) ఆ సత్తువతో రాజశేఖర్ రెడ్డి అండదండలతో జిల్లా రాజకీయాలను గుప్పిటపట్టారు. తెలుగుదేశం పార్టీలోనే కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా ఫ్యూడల్ పెత్తందారీ స్వభావం కలిగిన కొమ్మూరి సంజీవరావు, తాడ్డి వెంకటరావు, పెద్దింటి జగన్మోహనరావు, పి.సాంబశివరాజు లాంటి వాళ్లు సత్తిబాబు దూకుడు ముందు నిలవలేకపోయారు. రాజకీయంగా నేడు విజయనగరం ముఖ చిత్రం నుంచి దాదాపుగా తొలిగిపోయారు. ఫ్యూడల్ సమాజమే బలంగా ఉంటే అశోక్ గజపతిరాజు, అత్యంత బలహీనమైన కులానికి చెందిన వైశ్య స్తుడైన కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం కోట మీద 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించేవాడే కాదు. ఒకప్పుడు అశోక్ గజపతిరాజు, ఆనందగజపతిరాజు కొత్తపేట అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు చీరలు పరిచి పూల నీళ్లతో పాదాలను తడుపుతూ స్వాగతం పలికేవారు. కాని, ఇప్పుడు అశోక్ కుటుంబీకులు యావత్తూ గడిచిన రెండు ఎన్నికల నాటి నుంచి ఇంటింటికీ వెళ్లి అడిగితేనే గాని 3 నుంచి 5 వేల ఓట్ల తేడాతో అశోక్ గెలవలేకపోతున్నారు. ఇంకా వివరంగా చెప్పాలంటే అశోక్ గజపతిరాజు కూడా తన ఆదాయాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఆఫిడ్ విట్ లో కొత్తగా భూమి కొన్నది గాని, భూమి మీద ఆదాయం పెరిగినట్లుగా గాని చూపలేదు. ఆయన సైతం తన మిగులును కంపెనీల్లోనూ, బ్యాంకుల్లోనూ షేర్లు కొనుగోలు చేసుకున్నారన్నదే ఉటంకించారు. కావాలంటే ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ కి వెళ్లి వెతికితే ప్రతీ ఎన్నికల అఫిడివిట్ లో ఆయన పొందుపరిచిన అంశాలలో వచ్చిన తేడాలను మీరు పసిగట్టగలరు.
        3. మీకు కృతజ్ఈతులు. మీరన్నట్లుగానే గందరగోళాలను తొలిగించుకునేందుకే నేను ప్రశ్నలు వేశాను. ప్రశ్నించడం తప్పు అని అన్నవారిని మిమ్మల్నే చూశాను. మీలాంటి పెద్దలు చాలా మంది ప్రశ్నిచండం ద్వారానే వికాసం ఉంటుందని చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు. కాని, మీరు ఎందుకు ప్రశ్నించవద్దంటున్నారో అర్ధంకావడం లేదు.
        4, ప్రస్తుతానికి నేను శ్రీకాకుళం గిరిజనోద్యమం పుస్తకాన్నిచదువుతున్నాను. నేను చదివిన మేరకు యువజన సంఘాలు గాని, గిరిజన సంఘాలు గాని వారివారి మహాసభల్లో రూపొందించుకున్న కర్తవ్యాల్లో శిస్తులు తగ్గించాలని, వడ్డీల పేరిట వేదింపులను లేకుండా చేయాలని, బంజర్లు పంచాలన్న డిమాండ్లే కనిపించాయి. కావాలంటే ఆ సభలు, తేదీలు కూడా ఇవ్వగలను. ఇంకా ఆ పుస్తకం పూర్తి కాలేదు. చదువుతున్నాను.
        5. మీ టోన్ లో ఎందుకో అసహనమే కనిపిస్తోంది. నేనేమీ మభ్యపెట్టుకోవడం లేదండి. కొండీలు, కొర్రీలు వేయడం లేదండి. ఇప్పట్లో పెట్టుబడిదారీ సమాజం రాదని, పోలవరం వ్యతిరేక ఉద్యమం భూస్వామ్య వ్యతిరేక ఉద్యమమని నిర్ధారించినప్పుడు, ఆ నిర్ధారణలకు గల ప్రాతిపదికలను రమాసుందరిగారు ఇచ్చినట్లయితే మాలాంటి వాళ్లు ఆ కోణంలోంచి కూడా వస్తువును పరిశీలించే అవకాశం ఉంటుందని నా భావన అండి. అదే సమయంలో మా అప్పలనాయుడు బావు కథనే ఉటంకిస్తూ ఇక జరగాల్సిన ప్రజాయుద్ధం సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమమని ఆమె అంటున్నారు. ఈ గందరగోళ వివరణ వలనే నేను గందరగోళానికి గురవుతున్నాను. ఆ గందరగోళాన్ని తగ్గించుకునేందుకే ప్రశ్నవేస్తున్నాను. నిజానికి మీరు ఆ ప్రశ్నకు బదిలివ్వగలిగితే మరీ మంచిది.
        6. రమాసుందరి గారు నావి బాణాలు అని భావించి ఉంటే అలా వివరంగా, సావదానంగా సమాధానాలు ఇచ్చే వారు కాదండి. వెయ్యి ఆలోచనలు సంఘర్షించినప్పుడే కదండి నూరు పువ్వులు వికసిస్తాయి. మార్క్ప్ ఏమి చెప్పిన దగ్గర ఘర్షణ జరిగితే కమ్యూనిస్టులు అని చెప్పుకునే వారు ఎప్పుడో చైతన్యవంతులయ్యేవారన్నది నా నమ్మకం. నువ్వేమి చెప్పాం, నేనేమి చెప్పాను అన్న దగ్గర, ఆధిపత్య కాంక్ష వలన మార్క్స్ ఏమి చెప్పెన్ అన్న ముసుగులో వాదులాడుకుని విడిపోయారన్నది ఆయా క్షేత్రాలలో పనిచేసే వారి ఇస్తున్న సమాచారాలు స్పష్టం చేస్తున్నాయి.
        7. పరువాడ లక్ష్మునాయుడుగారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలియదుగాని, మార్క్స్ ఏమి చెప్పిను అన్న దాని మీద కమ్యూనిస్టులు భావ సంఘర్షణ పడితే సగం సమస్యలు పరిష్కారమవుతాయని నా ప్రాధమిక అవగాహనతో చెప్పగలను. ఆ విషయాన్ని మీరు కూడా కాదనలేరని నేను భావిస్తున్నాను.

        ఇక చివరిగా మీరు ఏ ప్రాంతంవారో, మీ వయసు ఏమిటో తెలియదు గాని, మీరు చేసిన సూచనలు మీ పెద్దరికాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అందుకనే నేను చర్చను అగౌరవంగా నిర్వహించలేదు. ఒక వేళ నిర్వహించి ఉంటే మందలించే చనువును మీకు ఇస్తున్నాను. నిర్ధారణలు చేసినప్పుడు వాటిని ప్రశ్నించవద్దని మీరు అనడడం ( రమాసుందరిగారు కాదు) సమంజసం కాదేమో అనిపిస్తోంది.రమాసుందరిగారు కూడా ప్రశ్నించడాన్ని ఆహ్వానిస్తారన్నది, అలాంటి ఆలోచన అభివృద్ధి కావాలని కాంక్షించేవారన్నది ఆమె ఇచ్చిన సమాధానాలు ప్రస్పుట పరుస్తున్నాయి. కృతజ్ీతులు సార్.

  • P.suneeta says:

    సీతారమయ్యగారూ స్పందించినందుకు ధన్యవాదాలు సార్,నేను “ఈ కధను అట్టాడ అప్పలనాయుడు సాహిత్యం మొదటి సంపుటి-కధలు” ఫ్రండును అడిగి తెచ్చుకొని చదివాను. యిందులో యిచ్చిన వివరాల ప్రకారం యిది నవోదయ విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో దొరుకు తుంది.శ్రీదేవిగారు ప్రస్తావించిన అప్పలనాయుడి గారి యితర కధలు “మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత” కధలు కూడా ఉన్నాయి.

    రమాదేవిగారన్నట్టు ప్రయోజనంతో కూడుకున్న సౌందర్యమే నిజమైన అందమని నానమ్మకం కూడా.
    శిల్పము పాత్ర చిత్రణ వాతావరణచిత్రణ మొదలైన.. అంశాలు కధను బలపరుస్తూనే పాఠకునిపై మరింత ప్రభావం కలుగు జేసేస్తాయనేది నిర్వివాదాంశమే.అలాగని విషయ ప్రాధాన్యం లేని శిల్పనైపుణ్యం అడివిగాచిన వెన్నెలే అవుతుందని భావిస్తాను.

    రమాదేవిగారు మీరు..”‘షా’ ఒక ప్రాంతీయ పెట్టుబడి దారుని వాయిస్ నుండి చెప్పినా మనకు కధలో కధానాయకుడు ప్రజాఉద్యమ నాయకుడు అనే విషయం అర్ధం అవుతుంది.. ఈ రకమైన ప్రయోగాలు గతంలో కూడా జరిగాయి”.అన్నారు.కధానాయకుడు ఉద్యమనాయకుడే అవుతాడని అన్నారు.ఎలాగో ..అర్ధం కాలేదు. ఈ కధలో శంభు నాయుడి ఎత్తుగడలు,కార్య దీక్ష,అతని బలము,వెనక బలగము..పాత్ర విస్తరణ అన్నీ అతన్ని నాయకుడిగా కనిపింపజేస్తున్నాయి తప్ప ఏదో ఒకసారి కనిపించిన,లేదా అంతకుముదు ఒకసారి ప్రశ్నించిన కిరణ్ కనిపించటం లేదన్నది నా అభిప్రాయము. నిజంగా రచయిత కిరణ్ ను నాయకునిగా చేద్దామని అనుకొని ఉండవచ్చేమో కానీ అది ప్రతిఫలించలేదన్నది నా అవగాహన.

    యిక ముగింపు చూసుకున్నా మంత్రిని ప్రశ్నించిన కిరణ్ మొదలుగాగల ఉద్యం కారులను.. అడ్డుకోబోయిన ప్రజల్ని పోలీసుల లాఠీలు ఇనుపబూట్లు యీడ్చేసాయి.( నిజానికి మంత్రిగారి ప్రోగ్రాం ముందు నిర్ణయించినదికాదు,ప్రకటించినదికాదు.మరి “నలువేపులనుంచి జనం చేతుల్లో ప్లేకార్డులతో” సహా అక్కడికి ఎలా వచ్చారో అర్ధం కాదు.)
    కధ అక్కడ ముగిసిపోతే ఒకవేళ మీరన్నట్టు కిరణ్ నాయకుడయ్యేవాడేమో..! కానీ రచయిత కధను యింకాముందుకు నడిపేడు..అది ఎలాముగిసిందన్నది మీరు చదివారు.

    పై సందేహాల రీత్యా కిరణ్ కధానాయకుడు కాబోడని,కిరణ్ వాయిస్ పీలగానే మిగిలిపోయిందని నాకనిపిస్తున్నది.

    యిక మీరన్నట్టు వ్యతిరేకపాత్రద్వారా కధ చెప్పినా పాఠకుడికి పాజిటివ్ అవగాహన కలిగించిన రచనలు బహుశా యింతకు ముందు ఉండి ఉండవచ్చు.కానీ అక్కడ వ్యంగ్య ధోరణిలో కధ చెప్పి ఉంటారేమో.. ఈశైలిలో అయితే ఆభావం కలగటం లేదనేది ఒక పాఠకురాలిగా నా ఫీలింగు.
    వీలైతే వివరించగలరు.

    • సునీతగారు,
      ఓపిగ్గా చదివినందుకు ఆనందంగా ఉంది. కధలో కధకుని కంఠస్వరం వేరు, రచయిత ఆత్మ వేరు అనే విషయం మీరు గ్రహించారు అనుకొంటాను. వ్యంగ్యం ఒక్కటే కాదు, చాలా మామూలుగా కూడ వ్యతిరేక పాత్ర ద్వార కధకు వాయిస్ ఇవ్వవచ్చు. శంభునాయుని గతం, అతని స్నేహితుల గతం, వారి తాగుడు వ్యవహారాలు, వాళ్ళు చేస్తున్న లాబీయింగులు ఇవన్నీ రచయిత వివరిస్తున్నప్పుడే రచయిత వారి వైపు లేడని అర్ధం అవుతుంది. (దొంగాట, కౌరవుల విజయం) శంభునాయుని అంత్మధనంలో కిరణ్ పదే పదే గుర్తుకు రావటం…(రైతుకూలీ సంగాన్నిపదే పదే తలచుకోవటం, “ఉన్నాడా ఆ కిరణ్ ఇప్పుడు” అనుకోవటం) కిరణ్ పాత్రకు ఉన్న ప్రత్యేకత ను తెలుపుతుంది. దెబ్బలు తిని రక్తం కార్చిన కిరణ్ తదితరులు ఈ కధకు కధానాయకులు అవుతారు. ఆ ఉద్యమంతో మమేకం అయినా శంభునాయుని తండ్రిది సహాయక పాత్ర. ఎందుకంటే ఆ ఉద్యమ నిర్మాణంలో ఆయని పాత్ర లేదు. అతనికి భూమికి సంబధించిన సెంటిమెంట్, ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి. ఆ ఉద్యమంలో తన ప్రయోజనాలు చూసిన శంభునాయుడు ప్రేక్షక పాత్రలో ఉండిపోతాడు.
      ఇలాంటి కధే రఘోత్తమ రెడ్డి చావువిందు. వీలయితే చదవండి.

      • madumithakoosaraju says:

        రమాసుందరిగారూ నమస్కారం
        మేడం మీరెంత బాగా కథను అర్థం చేసుకున్నారో మీ సమాధానాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. లక్ష్మణ మూర్తి, సార్ మీరు చాలా విడమరచి చెప్పారు. ధన్యవాదాలు. మీరెంత చెప్పిన సునీతగారుగాని, మల్లీశ్వరి గారుగాని కన్విన్స్ కారు . ఎందుకంటే వాళ్ళు నిజంగా కథ అర్థంకాక అడగటం లేదేమోనని నా పరిశీలన.వాళ్ళ వాదనని మీరు గుడ్డిగా అంగీకరించాలేమో. ఏది ఏమైనా మిమ్మల్ని, లక్ష్మణ మూర్తిగారిని కలవాలని వుంది. అంతవరకు మెయిల్ ఐ .డి ఇస్తే బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అందరమూ మిమ్మల్ని అభినందిస్తున్నాం.

    • Thirupalu says:

      // ఈ కధలో శంభు నాయుడి ఎత్తుగడలు,కార్య దీక్ష,అతని బలము,వెనక బలగము..పాత్ర విస్తరణ అన్నీ అతన్ని నాయకుడిగా కనిపింపజేస్తున్నాయి తప్ప ఏదో ఒకసారి కనిపించిన,లేదా అంతకుముదు ఒకసారి ప్రశ్నించిన కిరణ్ కనిపించటం లేదన్నది నా అభిప్రాయము.//
      సునీతా గారు మీరు ఉధాహరించిన లక్షణాలను బట్టి అతను కధనాయకుడిగా కనిపించడం విచిత్రం అనిపిస్తుంది. మీరు సిని మాల్లో రావు గోపాల రావు లాంటి పాత్రల్ని చూసి అతనే హీరో అనేలా ఉన్నారు. అతని ఎత్తు గడలు, కార్య దీక్షను బట్టి అతని ఎవరో అర్ధం కాలేదా?

      • లక్ష్మణరావు says:

        మధుమిత కోశరాజు గారు. నమస్సులు. నా అసలు పేరు కూడా లక్ష్మణరావే. నేను లక్ష్మణ మూర్తిని కాదండి. నా మెయిల్ ఐ.డి. vmklrao76@gmail.com

  • suresh says:

    బాపిరాజు గారు నమస్తే, ‘సెలవిచ్చారు’ అన్న పదం నేను వాడినప్పిటికి, మీరు మంచిగా చాలా పెద్ద సమాధానమే ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు. అలాగే అడిగే వాళ్ళ లిస్టులోకి మీరు చేరినందుకు సంతోషం.

    1. పెట్టుబడి ప్రాంతీయత గూర్చి చాలా బాగా వివరణ ఇచ్చి అమెరికా, జపాన్, గోదావరి, కృష్ణా వంటి ప్రాంతాలను ఉదా||లుగా చెప్పారు. బావుంది. ఏ ప్రాంతపు పెట్టుబడి ఆ ప్రాంతంలోనే వుండే వీలుంటుదంటారా! శంభునాయుడు విశాఖ పోలేదా, గోదావరి వాళ్ళు ఇటువైపు రాలేదా, నేటి మన దేశపు బడా పెట్టుబడిదారులు ఇతర దేశాలలో (ముఖ్యంగా వెనుకబడిన దేశాలలో) పెట్టుబడులు పెట్టటం లేదా? పెట్టుబడికి చలనశీల స్వభావం ఉంటుందా?. వుంటే అది చౌకగా శ్రమశక్తి ఎక్కడ దొరికితే అక్కడికి పోదా? పర ప్రాంతపు పెట్టుబడిని అడ్డుకున్నంత మాత్రాన మన ప్రాంతపు పెట్టుబడి మనల్ని మింగేయకుండా ఉంటుందా? అంతిమ యుద్ధం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరగాలంటారా, లేక ప్రాంతపు పెట్టుబడులంటూ గిరిగీసుకు కూర్చోవాలంటారా? వివరించగలరు.

    2. రమాసుందరి గారు నమస్తే! మీరు సీతారామయ్య గారికి శంభునాయుడి పాత్ర గూర్చి ఇచ్చిన వివరణతో నా చిన్ననాటి ఓ సినిమా గుర్తుకొచ్చింది. ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో N.T.R పోషించిన దుర్యోదునిడి పాత్రపై ఇప్పటికీ నాకు మక్కువ ఎందుకంటే ఆ పాత్ర మలిచిన తీరు అలా వుంటుంది. నేనే కాదు అందరూ బహుశా అలాగే ఫీలయి వుంటారనుకుంటున్నాను. అదే సినిమాలోని అర్జునుడి పాత్ర ఎంతమందికి గుర్తుంది. ‘షా’ కథలో మీరు ప్రదాన పాత్ర అంటున్న కిరణ్ పాత్ర కూడా నాకు అలాగే తోస్తుంది. అది నా ద్రుష్టి లోపమేనెమో మరి.

  • Thirupalu says:

    // ఈ కధలో శంభు నాయుడి ఎత్తుగడలు,కార్య దీక్ష,అతని బలము,వెనక బలగము..పాత్ర విస్తరణ అన్నీ అతన్ని నాయకుడిగా కనిపింపజేస్తున్నాయి తప్ప ఏదో ఒకసారి కనిపించిన,లేదా అంతకుముదు ఒకసారి ప్రశ్నించిన కిరణ్ కనిపించటం లేదన్నది నా అభిప్రాయము.//
    సునీతా గారు మీరు ఉధాహరించిన లక్షణాలను బట్టి అతను కధనాయకుడిగా కనిపించడం విచిత్రం అనిపిస్తుంది. మీరు సిని మాల్లో రావు గోపాల రావు లాంటి పాత్రల్ని చూసి అతనే హీరో అనేలా ఉన్నారు. అతని ఎత్తు గడలు, కార్య దీక్షను బట్టి అతని ఎవరో అర్ధం కాలేదా?

    • P.suneeta says:

      తిరుపాలు గారూ,పైన సురేష్ గారు చెప్పిన ఉదాహరణ చూద్దాం ఎన్.టి.ఆర్ గురించి.రామారావు గారు రావణ పాత్ర ధరిస్తే,ఆపాత్రమీద అభిమానం పెరిగిందే తప్ప వ్యతిరేకత రాలేదు.అలాగని రావణాసురుడు మంచి వాడని అనేస్తారా అందరూ అంటే అనకపోవచ్చు.కానీ ఆసినిమా చూస్తున్నంతవరకూ లేదా ఆకధని గురించి మాట్లాడుకున్నంత వరకూఅతడే నాయకుడు అనిపిస్తాడు.ఎందుకంటే ఆకధ అట్లా నిర్మించబడిందికనక.
      మీరు రావుగోపాలరావు గారి ప్రస్తావన తెచ్చారు.సినిమాలకు సంబంధించి- కొందరు కొన్నిరకాల పాత్రలకే పరిమితం చేయబడడం వలన తరచూ అలాంటి పాత్రలే వేయటం వలన మనం సినిమా చూడకముందే ఎవరు నాయకుడొ ఎవరు ప్రతినాయకుడో తెలుసుకోగలుగుతాం.అందరు కొత్తవారితో సినిమాతీస్తే అప్పుడు ప్రేక్షకునికి ఆకధ మాత్రమే చెపుతుంది ఎవరు నాయకుడో ప్రతినాయకుడో .
      ‘రావూగొపాలరావూ’పేరుతో వచ్చిన సినిమా అయితే నాకు గుర్తున్నవరకూ అతడే కథానాయకుడు.(పాటలకోసం,ఫైట్ల కోసం యెవరో కుర్రాన్ని పెడతారు,మనము ఆకుర్రాడే హీరో అనుకుంటాం.)రొటీన్ కి భిన్నంగా ఉంటుంది అతని పాత్ర.
      అంతెందుకు ‘కన్యాశుల్కంలో కథానాయకుడు ఎవరవుతారు,కాసేపు కథనిపట్టి ఆలోచిద్దాం.మొత్తం నాటకంలో అంతకంటే బలమైనపాత్ర కనిపిస్తుందా,
      కనుక ఎక్కడైనా కధా వస్తువుతో పాత్రకున్న బంధము,రచయిత కంఠస్వరమూ ఆపాత్రమీద ఒక అభిప్రాయన్ని కలుగజేస్తాయనేదే నా ప్రతిపాదన. లేదా ఆరోపన అన్నా ఫరవాలేదు.

      • madumithakoosaraju says:

        సునీతగారు మీకు వందనాలు!

        తిరుపాలుగారు ఎంత స్పష్టంగా రావుగోపాలరావు పాత్ర అని ఎంత స్పష్టంగా చెప్తున్నా మీరు మీకు కావలసినట్లుగా రావుగోపాలరావు సినిమాను ఉదాహరించారు. కావాలంటే ఇక్రింది వాక్యాలను గమనించగలరు.

        తిరుపాలుగారు చెప్పింది …….

        ‘మీరు సిని మాల్లో రావు గోపాల రావు లాంటి పాత్రల్ని చూసి అతనే హీరో అనేలా ఉన్నారు. అతని ఎత్తు గడలు, కార్య దీక్షను బట్టి అతని ఎవరో అర్ధం కాలేదా?’

        సునీతగారు చెప్పింది ……

        ‘రావూగొపాలరావూ’పేరుతో వచ్చిన సినిమా అయితే నాకు గుర్తున్నవరకూ అతడే కథానాయకుడు.(పాటలకోసం,ఫైట్ల కోసం యెవరో కుర్రాన్ని పెడతారు,మనము ఆకుర్రాడే హీరో అనుకుంటాం.).

        మీ అవగాహనా స్థాయికి ఇంతకంటే రుజువులు అవసరమా?
        ఇలా చూపించమనుకోండి, మీలాంటి, లక్ష్మణరావు లాంటి పెద్దలు కూడా వ్యక్తిగతమన్తరూ!

      • P.suneeta says:

        మధుమిత కోసరాజు గారు,నమస్తే : మీరు “తిరుపాలుగారు ఎంత స్పష్టంగా రావుగోపాలరావు పాత్ర అని ఎంత స్పష్టంగా చెప్తున్నా”అన్నారని అంతవరకే చూస్తే ఎలాగండి.ఆపక్కనే “అతనే హీరో అనేలా ఉన్నారు”. అన్నారు.కనుకనే ఆవిషయం రాయాల్సి వచ్చింది.

        యిక రెండవ విషయం: నా అవగాహనా స్థాయి గురించి

        యింతవరకూ మీకు నా అవగాహనా స్థాయి బోధపడలేదా మేడం ,అయ్యో! నా అవగాహనా స్థాయిని పెంచుకోవటం కోసమే యిట్లాంటి చర్చల్లో పాల్గొంటుంటాను.(లేశమాత్రమైనా అంటుతుంది కదా అని)అయినా కథకు దూరమైన చర్చలో నాకు పాల్గోవాలని ఎంతమాత్రమూ లేదు.. ఉంటాను.

      • Thirupalu says:

        సునీత గారు,
        రావు గోపాల రావు గారి విలన్‌ పాత్రలను ఒక ఉదాహారణగా ఉపయోగించాను. ఇక్కడ కధంతా శెంబు నాయుని చుట్టు తిరుగు తుంది కాబట్టి అతనే కధానాయకుడని ఎలా అనుకుంటామండీ? రచయత చెప్ప దలచుకున్న, లేక సాదించ దలచుకున్న అంతిమ న్యాయం లెక సందేశం ఎవరి వైపు ఉందొ వారె కధానాయకులౌతారనుకుంటా! కిరణ్ అనే పాత్ర ఒకమెరుపులా వచ్చి పోయినట్లు కనిపించినా అదే ప్రదాన పాత్ర అవుతుంది. ఇది కూడా శిల్పం లో భాగమే! ఇది మీకు మాత్రమే కాదు ఒక మంచి రచయిత అయిన అదీ కధలో శిల్పము, పాత్రా చిత్రణ ముఖ్యత్వం గురించి చెబుతున్నా ఆరీ సీతారామయ్య గారికి కూడా అర్ధం కాలేదంటె ఏమను కోవాలి?
        ఇక్కడ శెంబు నాయుని పాత్ర, పైన శ్రీ దేవి గారు, రమా సుందరి గారు చెప్పినట్లు, అది ఒక భాస్వంయ పాత్ర మాత్రమే గాక పెట్టు బది ధారి గా ఎదిగే క్రమంలో వెనక పట్టు పడ్దదం వల్ల, తాను గెలిపించిన ఎమ్మేలే ను అతనకు పైన ఉన్న పెద్ద చేపలు ఐజాక్‌ చేసుకొని పోవదం వల్ల, ఆ పెద్ద చేపలతో గత్యంతరం లేక రాజీ పడుతూనే, అతనికి రైతు కూలీ సంఘం, కిరన్‌ చేసిన పనులు గొప్పగా అనిపించడం అతని అవకాశ వాదాన్ని తెలిజేస్తుంది. అతనికి స్తానికిత మీద గానీ, ఆ రైతు కీ సంఘాల మీద గాని ఏ మాత్రం సాను భూతి లేదు. ఉన్నదంతా తనకు దక్కాల్సిన అవకాశాలు పోయినందుకు ఆేడుపు. ఆేడుపు వల్లనే మీకు బహూశా సాను భూతి కలిగి ఉంటుంది. కాదంటారా?

  • ari sitaramayya says:

    ఈ చర్చ నుంచి వేరే కారణాలవల్ల సెలవు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ వెళ్ళే ముందు ఒక మాట.
    లేదు లెండి రెండు మాటలు.

    వస్తువును వదిలేసి మిగతా విషయాలు చర్చించటం తెలుగులో మామూలుగా జరగదు. వస్తువుకు మాత్రమే పరిమితమైన చర్చలు సమగ్రం కావనే నా మనవి. మొత్తానికి పెట్టుబడులతో మొదలయిన ఈ చర్చలో పాత్రచిత్రణ, శైలి, ధోరణి, వాయిస్, రూపం, వ్యంగం లాంటి మాటలు వినబడటం సంతోషం కలిగించింది.

    ఇక పోతే ‘అడవి కాచిన వెన్నెల’….
    అడవి అంటే మీకు అంత చులకనా సునీత గారూ?
    అడవిలో చెట్లకు వెన్నెలంటే ఇష్టం ఉండదా?
    పోనీ అడవిలో ఉండే జంతువులకైనా ఇష్టం ఉండదా?
    నిన్న మొన్నటిదాకా (అదే, యాభైవేల సంవత్సరాల క్రితం దాకా) మనం అడవుల్లో ఉన్న వాళ్ళమే కదండీ.
    పోనీ కనీసం అక్కడ ఉంటున్న విప్లవకారుల కోసమైనా అడవుల్లో వెన్నెల కావాలికదా?
    అవునా?

    • nirmal swaagath says:

      సీతారామయ్య గారూ,మీరు చర్చల నుంచి సెలవు తీసుకున్టాననడం,(కారణాలు ఏవైనా)బాధగా వుంది.మీరూ,రమా సుందరి గారూ చర్చను మంచి రీతిలో,మంచి విషయాలను చర్చిన్చుతున్నారు,కొందరు పక్క దారి పెట్టుతున్నా.కాబట్టి,మీ వంటి వారు చర్చిస్తే మరింత విషయాల పట్ల స్పష్టత వస్తుంది.
      సరే,మీరు రెండు మాటలు చెప్పారు.ఒకటి …వస్తువును వదిలేసి మిగతా విషయాలు చర్చిన్మ్చటం తెలుగులో మాములుగా జరగదని ,వస్తువుకు మాత్రమె పరిమితమై చర్చించటం సమగ్రం కాదని…అది మీకు గల స్పష్టమైన అభిప్రాయం.దాని మీద రమసున్దరిగారూ,(కొంత సునీత గారు)వివరణ ఇస్తున్నారు.దాని మీద మీరు మరిన్ని మీ అభిప్రాయాన్ని బలపరిచే అంశాలు వివరిస్తే,వాటిమీద్ చర్చ కొనసాగితే,అందరం (మీతో సహా )నేర్చుకొనేవి ఏవన్నా విషయాలు వచ్చి ఉండేవి.అందుకని మీరు కొనసాగందని విగ్యప్టి
      ఇక,మీ కథలు కొన్ని చదివాను,మీరు గూడా వస్తువు,దాని ద్వారా వ్యక్తం కావాల్సిన అంశం గురిమ్చే కథలు రాసారు,శిల్ప ప్రదర్శన కోసం రాయలేదు.కాక,వస్తువూ,శిల్పం వేరువేరు కావని,తెలుగనే కాదు,మీరు ఎక్కువ ఇష్టపడే ఇంగ్లీష్ సాహితీ కారులు గూడా చెప్పారు.
      మీ రెండో మాట,అడవిలో వెన్నెల గురించి మాటాడిన మీరు,అక్కడి విప్లవకారుల గురించి మాటాడిన మీరు వారు గూడా సాహిత్యం రాస్తున్నారు(దండకారణ్య కథలు)అవి మీ వంటి వారు చదివితే జీవితం అంటే ఈ ప్రపంచంలో ఎన్నెన్ని విషయాలో ,వ్య్విధ్యాలో తెలుస్తాయి .వాట్ని ఒదిలేస్తే…
      ఇక,సాహిత్యం పాటకుడికి వినోదం కాదు విగ్యనం ఇవ్వాలి,అది నేరం కాదు.ఆ విషయం మీకెందుకు ఇష్టం లేదో,మీకు మీరే ప్రశ్నించుకోండి.
      మిత్రులు ఇటువంటి చర్చ వొదిలేసి,పెట్టుబడి,సామ్రాజ్యవాదం మీద వాళ్ళల్లో వాళ్ళు వాదన చేసుకుంటున్నారు.మీరు తప్పు కుంటున్నారు…

  • P.suneeta says:

    నిజం చెప్పారు నిర్మల్ స్వాగత్ గారూ , మీ ఈ అభిప్రాయంతో ,నాకూ పూర్తి ఏకీ భావం ఉంది.

    • madumithakoosaraju says:

      పి.సునితగారు
      “తిరుపాలుగారు ఎంత స్పష్టంగా రావుగోపాలరావు పాత్ర అని ఎంత స్పష్టంగా చెప్తున్నా”అన్నారని అంతవరకే చూస్తే ఎలాగండి.ఆపక్కనే “అతనే హీరో అనేలా ఉన్నారు” తిరుపాలుగారు అన్నారు హీరో అనేలా అంటే అతను హీరో కాదనేగా అర్థం .
      ఇక రెండో విషయం
      (లేశమాత్రమైనా అంటుతుంది కదా అని)అయినా కథకు దూరమైన చర్చలో నాకు పాల్గోవాలని ఎంతమాత్రమూ లేదు.. ఉంటాను.
      లవలేశమైనా స్థాయి పెంచుకోవటానికి పుస్తకాలు చదవడమే మార్గం.చర్చిస్తే వచ్చేది స్థాయి కాదమ్మా!! స్పష్టత.
      కథపైన ఎంత ప్రేమ మీకు. ఒక ‘షా’ కథపైనేనా ? అన్ని కథలపైన ఇదే ప్రేమేనా ? ఏమి లేదు భవిష్యత్తులో ఎక్కడైనా ఒకనొకచో …..అదాటు పడినపుడు మాట్లాడొచ్చు కదాని . సారి అండి మీలాంటి సీరియస్ చర్చకుల్ని…..

  • madumithakoosaraju says:

    లక్ష్మణరావుగారికి నమస్తే. ఐ డి ఇచ్చినందుకు థాంక్స్ . నేను పొరపాతుగానే అన్నాను. మారుపెరనుకొలేదన్ది మెయిల్లో కలుద్దాం .

  • k.sreedevy says:

    విమర్శకులు – జ్ఞానసంపన్నత

    విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడువాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా నిలిచిపోతుంది. విమర్శ వ్యాఖ్యానానికి రచనలోని అంతర్గత సాక్ష్యాలను ఉపయోగించుకోవాలి. మనం ఎత్తిచూపకపోతే దొరకక పోయేవి అనిపించె వాస్తవాలను పాఠకునికి అందించదం మత్రమే వ్యాఖ్యానం అంటారు టి.ఎస్. ఇలియట్. ఇది చాలా విలువైన అభిప్రాయం. దీనిని బట్టి విమర్శకుడు చెప్పేదంతా వ్యాఖ్యానం కిందకు రాదని తెలుస్తుంది. రచయితను ఆకాశానికెత్తే ప్రశంసలన్నీ వ్యాఖ్యానాలు కాదనిపిస్తుంది. రచనలోని అంతస్సారాన్ని గంభీరంగా వెలిబుచ్చే ప్రామాణికమైన అభిప్రాయం మాత్రమే విమర్శ అవుతుంది.
    విమర్శకుడు రచయితను గురించి రచనను గురించి నేనెంత్ గొప్పవిషయం చెబుతున్నానో అన్నట్లుండకూడదు. రచయిత ఎంత గొప్ప రచన చేశాడో చూదండి అని అంటున్నట్లుగా వుండాలి. సాహిత్య విమర్శలో మాటల దుబారు వల్ల ప్రయోజనం లేదు. పైపెచ్చు గాభీర్యం కూడా చెడిపోయే అవకాశముంది.
    “విమర్శకునికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఉత్తమ పాఠకుడిగా ఉండటం. విమర్శకుడు ఉత్తమ పాఠకుడే కాకుండా ఉత్తమ విద్వాంసుడిగా కూడా ఉండక తప్పదు” (పేజి నెంబర్ ౦౦ వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)
    “రచయితకూ చదువు, నిరంతర చదువు – అవసరమే. కానీ విమర్శకునికి అవసరమైనంత చదువు రచయితకు అవసరం లేదు.” – (పేజి నెంబర్ ౦౦ వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)
    “విమర్శకుడికి తాను ఏ సాహిత్యాన్ని గురించి విమర్శ రాయాలనుకుంటున్నాడో ఆ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన చెయ్యగల అవకాశం ఉన్న సామాజిక మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల పరిజ్ఞానం ఉండాలి.” (పేజి నెంబర్ 26 వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)
    “రచయిత కన్నా విమర్శకుడు రెండాకులెక్కువ చదివి ఉండాలంటారు.”- (కొడవటిగటి కుటుంబరావు – సాహిత్య వ్యాసాలు)
    అందుకే సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంపన్నుడు కావాలి. సాహిత్య విమర్శ జ్ఞాన ప్రధాన ప్రక్రియ. సాహిత్యంలో రచయితలు నిక్షేపించిన జ్ఞానాన్ని సమాజానికి విడదీసి, విశ్లేషించి అందించేది సాహిత్య విమర్శ. సాహిత్యంలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి విమర్శకుడు ఆ జ్ఞానానికి సంబంధించిన సర్వాంశాలు తెలుసుకోవాలి. సాహిత్య విమర్శ ఒక ఆహ్లాదకరమైన ఆట, మరోవైపు కఠిన పరీక్ష. సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంప్పనుడు అయితే విమర్శను ఆటగా మలచుకొంటాడు. అలా మలుచుకోలేని పక్షంలో అది విమర్శకులను ఆడుకుంటుంది. సాహిత్యానికి సమాజానికి మధ్య వారధి సాహిత్య విమర్శ. విమర్శకులు ఎంత జ్ఞాన సంప్పనులు అయితే వాళ్ళు నిర్మించే విమర్శ రూప వారధి అంత పటిష్టంగా ఉంటుంది. సాహిత్య విమర్శకునికి మూడు రకాల జ్ఞానం ఉండాలి.
    1. దృక్పధ జ్ఞానం
    2. శాస్త్ర జ్ఞానం
    3. కళా సాహిత్య జ్ఞానం
    విమర్శకుడు తనదైన దృక్పధాన్ని కలిగి ఉంటూనే తన దృక్పథానికి విరుద్ధమైన దృక్పథాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. భౌతికవాదం దృక్పధం గల విమర్శకునికి భావవాద దృక్పధం స్వరూప స్వభావలు తెలియాలి. అలాగే భావవాదులకు కూడా.
    1910 ప్రాంతాలనుంచి 1964 దాకా భారతదేశంలో శ్రీకాకుళ ప్రాంతంలో వచ్చిన ఆర్థిక రాజకీయ పరిణామాల చరిత్ర తెలిస్తే తప్ప కాళీపట్నం రామారావుగారు రాసిన ’యజ్ఞం’ కథ సమగ్రంగా అర్థంకాదు. అలాగే 1921-22 నాటి గుంటూరు ప్రాంత రాజకీయ సాంఘిక ఆర్థిక పరిణామల జ్ఞానంతో ’మాలపల్లి’ని, స్వతంత్రభారతంలో నాలుగు శతాబ్ధాల జీవితానుభవ జ్ఞానంతో “సొరాజ్జెం’ (అక్కినేని కుటుంబరావు) నవలను సమగ్రంగా అర్థం చెసుకోగలం. సామాజికశాస్త్రాలకు సాహిత్యానికి సంబంధం లేదనుకోవడం అసాహిత్యదృక్పధమే అవుతుంది. సామాజిక శాస్త్రాల జ్ఞానంతో వెలువడే సాహిత్య విమర్శ ఎంత సజీవంగా ఉంటుందో ’విభాతసంధ్యలు’ (సె.వి. సుబ్బారావు. సంపాదకత్వం) ’కథాయజ్ఞం’ (చేకూరి రామారావు సంపాదకత్వం) సాహిత్యంలో వస్తుశిల్పాలు (త్రిపురనేని మధుసూదనరావు,) వంటి గ్రంథాలు రుజువు చేశాయి. ఏ రచనను తీసుకొన్నా ఆ రచనలోని జీవితాన్ని పరిశీలించడం వర్తమాన సాహిత్యవిమర్శలో మొదటి భాగం. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.
    “రచనను ఎవరి దృక్పధం నుంచి విలువకట్టాలి అన్న సమస్య కూడా చాలా కాలంగా వివాదస్పదంగానే ఉంది. రచనను రచయితనుంచి మాత్రమే వివరించి విశ్లేషించాలే కాని విలువ కట్టే బాధ్యతను విమర్శకుడు స్వికరింవకోడరు అనేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రచయితలు వీరి అభిప్రాయం ప్రకారం రచయితకే కాని ఉత్తమ పాఠకుడైన విమర్శకుడికి దృక్పధం ఉండకూడదు. ఈ వాదంలో అర్థం లేదు. ఒక దృక్పధం కలిగి ఉండటానికి రచయితలకు ఎంత అర్హత ఉందో విమర్శాకుడికి కూడా అంతే అర్హత ఉంది. రచనను రచయిత దృక్పధం నుంచి అర్థం చెసుకొని తన సామాజిక ఆర్థిక దృక్పధం నుండి ఆ రచనను విలువ కట్టడం విమర్శకుడు నిర్వహించవలసిన భాధ్యతలలో ప్రధానమైనది.” (పేజి నెం. 26 వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)
    విమర్శకుడు రచయిత ప్రాపంచిక దృక్పధాన్ని తన దృక్పదంతో, రచయితను తన నిబద్ధతతో అర్థం చేసుకొని విశ్లేషిస్తాడన్నది వాస్తవం. చాలా మంది దృష్టిలో విమర్శకుడు రచయిత ఆలోచన ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం మాత్రంతోనే విమర్శకుని పని ముగిసిపోదు. అర్థం చేసుకొన్న దానిని విశ్లేషించాలి. దానిమీద తీర్పును ఇవ్వాలి. వర్తమాన విమర్శ వ్యాఖ్యానం స్థాయిని దాటి చాల కాలమే అయ్యింది. వ్యాఖ్యానం మాత్రమే కాక తీర్పును ఇవ్వటంలో విమర్శకుని ప్రాపంచిక దృక్పధం నిబద్ధతలే అతనికి సహయకారులౌతాయి.
    సాహిత్య విమర్శకునికి ఉండవలసిన జ్ఞానంలో రెండోవది శాస్త్ర జ్ఞానం. శాస్త్రాలు రెండు రకాలు 1. వైజ్ఞానిక సామాజిక శాస్త్రాలు 2. కళాసాహిత్యశాస్త్రాలు. సాహిత్యవిమర్శకుడు ఏ శాస్త్రజ్ఞానమూ లేకుండా విమర్శ రాస్తే ఫలితం పెద్దగీతకు చిన్నగీత.
    సాహిత్యంలోని జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సాహిత్య విమర్శకుడికి సామాజిక శాస్త్రాల జ్ఞానం ఎంత అవసరమో రూప-శిల్ప విశేషాలను తెలుసుకోవటానికి కళా సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం అంతే అవసరం. మనకు మూడు రకాల కళా సాహిత్య శాస్త్రాలు ఉన్నాయి. 1. భారతీయ్య కళా సాహిత్యాలంకారశాస్త్రం 2. పాశ్చాత్య కళా సాహిత్యాలంకారశాస్త్రం 3. మార్కీయా కళా సాహిత్యాలంకారశాస్త్రం. మొదటి రెండు ఆయా భౌగోలిక విభిన్న కాల పరిధిలో పుట్టాయి. మూడవది ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరుచుకొన్న కళా సాహిత్యాలంకారశాస్త్రం. సాహిత్య విమర్శకులు వాళ్ళ దృక్పథాన్ని బట్టి చైతన్యాన్ని బట్టి అభిరుచిని బట్టి దేనిని స్వీకరించిన తక్కిన వాటిని గురించి కూడా తెలుసుకోవటం మంచిది. మూడింటిని అధ్యాయనం చేసి ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరిస్తే కళా సాహిత్యాలను సాధ్యమైనంత సమగ్రంగా అవగాహన చేసుకోగలమో నిర్ణయించుకోవటం ఉత్తమం.
    సాహిత్య విమర్శకులకు కావలసిన మూడో జ్ఞానం కళా సాహిత్య జ్ఞానం. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. 1. సృజన కళా సాహిత్య చరిత్ర జ్ఞానం. 2. కళా సాహిత్య విమర్శ చరిత్ర జ్ఞానం. ఒక కాలం నాటి రచన మీద విమర్శ చేస్తున్న విమర్శకుడు ఆ కాలానికి ముందు వెనకల కాలాల్లో వచ్చిన సాహిత్యాన్ని విమర్శ రాస్తున్న విమర్శకుడు సాధ్యమైనంత వరకు చదవాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం విమర్శకుని సాంస్కృతిక స్థాయిని పెంచటమే కాక సాహిత్య విమర్శ మహోన్నతంగా రూపోంది, రాణిస్తుంది. అలాగే ఒక ఉధ్యమ సాహిత్యం మీద విమర్శ రాస్తున్నపుడు తక్కిన ఉద్యమాల సాహిత్యాన్ని కూడా చదివి తీరాలి.
    ’యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) కథలో సర్పంచి శ్రీరాములు నాయుడు సుందరపాలెంలో చేసిన అభివృద్ధిని గురించి మాట్లాడుతూ పెట్టుబడికి రోడ్లు కావాలి, స్కూల్లు కావలి, కరెంట్ కావాలి. ఇది గ్రామం సరఫర చెయ్యలేదు. అందుకే రాజ్యం (State) పూనుకొని ఆ పాత్ర దరించాలి. ప్రైవేట్ పెట్టుబడిదారి విధానానికి రాజ్యం చేయూతనిస్తుంది. ఈ క్రమంలో శ్రీరాములు నాయుళ్ళు జవహర్ లాల్ నెహ్రులు అలంకార ప్రయంగా అదలం ఎక్కాలి. ఈ గ్రామం ఈ దేశం వాళ్ళవల్లే నడుస్తుందని, బాగుపడుతుందని నాయుడు నెహ్రు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. కాని వాళ్ళు పెట్టుబడి చెతిలో కీలు బొమ్మలు. వాళ్ళు పెట్టుబడి దారులు వెయ్యమన్న వేషం వెయ్యాలి. అడమన్న నాటకం ఆడాలి.’ అని గరికపాటి నిరంజన్ రావు చేసిన మార్కిస్ట్ వ్యాఖ్యానం ఇది. దీని ద్వారా మనకి తెసిందేమిటంటే సాహిత్య విమర్శకుడు రచన మీద వ్యాఖ్యానం లేదా విమర్శ చేసేటప్పుడు అతని భావజాలం ప్రాధాన్యం వహిస్తుంది. మార్కిస్ట్ కాని విమర్శకుడు ఇదే అంశంమీద వ్యాఖ్యానం చేస్తే అది ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉంటుంది.
    అలాగే ఒక కాలంలో ఒక భాషలో ఒక రచన మీద కాని రచయిత మీద కాని లేదా ఉధ్యమ సాహిత్యం మీద కాని విమర్శ రాసే విమర్శకుడు ఆ రచనల మీద ఇతరులు రాసిన విమర్శను అధ్యయనం చేయటం ఎంతైన అవసరం. ఒక భాష విమర్శకునికి తక్కిన ప్రపంచ భాష సాహిత్య విమర్శ చరిత్ర తెలిసుంటే జరిగే మేలు ఎక్కువ. మన ముందు కాలపు విమర్శకులు సాహిత్య విమర్శలో ఏ ఏ పోకడలు పోయారో తెలిసి ఉంటే, మనం వాళ్ళ కన్న భిన్నంగా, ఆధునికంగా, విమర్శ చేయడం ఎలాగో నిర్ణయించుకోవడానికి వీలుకలుగుతుంది. వాళ్ళ విమర్శ అగిన చోటు నుంచే మన విమర్శ మొదలు పెడితే విమర్శ బండి నిరాటంకంగా సాగుతుంది. మాక్సింగోర్కి రష్యన్ యువ రచయితలకు ఒక సలహా ఇచ్చాడు. నేటి కార్మికుడు ఒక వస్తువును తయారు చేసే ముందు, ఆ వస్తువును తన ముందు కాలపు కార్మికులు ఏలా తయారు చేశారో తెలుసుకొంటే వాళ్ళ కన్నా బాగా ఆ వస్తువును తయారు చెయ్యటానికి వీలైనట్లే, నేటి రచయితలు తమ ముందు కాలంలోని సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకుంటే వాళ్ళ కన్నా బాగా రాయడానికి వీలౌతుంది. ఈ సలహా సాహిత్య విమర్శకులకు కూడా వర్తిస్తుంది.
    ఏ కాలంలోనైనా సమాజం తన మనుగడ కోసం ఒక స్పష్టమైన దృక్పథం కలిగి ఉంటుంది. వ్యక్తికైన సమిష్టికైన మనుగడ సాగించటానికి ఒక దృక్పథం అవసరం. ఈ దృక్పథమే మనిషిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది. సమాజానికి ఒక నిర్థిష్టమైన ప్రాపంచక దృక్పథం ఉన్నట్లే సమాజ జీవితాన్ని సాహిత్యంగా మలిచే రచయితలకు కూడా తమదైన ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. తమ అవగాహనను శాస్త్రవేత్తలు సామాన్యులు కళాకారులు అభివ్యక్తం చేయటంలో బేధాలు ఉంటాయి. చూపులోనే(దృష్టి) బేధం ఉన్నపుడు చూచిన దానిని చెప్పటంలోను తేడాలు ఉంటాయి.
    అధ్యయన లోపం సాహిత్య విమర్శ కృషించటానికి వెనుకడుగు వెయ్యటానికి అవకాశం ఇస్తుంది. సాహిత్య విమర్శ ఎదగలేదనే అభిప్రాయం కలగటానికి కూడా అవకాశం కలిపిస్తుంది. సమస్త సాహిత్య విమర్శ పరిజ్ఞానం నుండి తనదైన మార్గంలో విమర్శ రాస్తే దానికి విశ్వసనీయత అధికారికత కలుగుతుంది. సాహిత్య విమర్శకులలో అధ్యాయన లోపం- జ్ఞానలోపం సాహిత్య విమర్శ క్షీణతకు తద్వారా సమాజ క్షీణతకు దారీ తీస్తుంది. ఈ మూడు రకాలైన జ్ఞానం కలిగిన విమర్శకులు ఉత్తమ విమర్శకులు అవుతారు.
    ఒక కథారచన చదివినతరువాత దానిలోని కథ పాత్రలు సంభాషణలు మొదలైన అనేక అంశాలను విశ్లేషించుకుంటాం. ఆరచనలో ఆ పాత్రల ప్రాధాన్యాన్ని ప్రమేయాన్ని వ్యాఖ్యానించుకుంటాం. ఆ రచనలోని కథా నిర్మాణాన్ని , కథాకథనాన్ని, పాత్ర చిత్రణను సభాషణల్ని ఇంకా అనేకాంశాలని ఇతర రచనలలోని అలాంటి అంశాలతో పోల్చి పరిశీలిస్తాం. అన్నీ అయినాక విమర్శకుడు, రచయిత ఈ రచన ద్వారా ఏమిసాధిస్తున్నాడు? అనేదాన్ని నిర్ణయించాలి. సాహిత్యవిమర్శకుడు తీర్పరి( జ్) పాత్రను నిర్వహించవలసింది ఇక్కడే. ఏ నిర్ణయమూ చేయకుండా ముగించే విమర్శ వల్ల ఫలితముండదు. పాఠకుల్ని నడిదారిలో వదిలేసినట్లౌతుంది.
    ఒక రచనలో అన్ని అంశాలు విమర్శకునికి నచ్చక పోవచ్చు. సాహితీలోకంలో చాలా ప్రసిద్ధుడైన రచయిత చేసిన బలహీనమైన రచన మీద విమర్శించి నిర్ణయం ప్రకటించడంలో అనేక పరిమితులు కూడా ఏర్పడవచ్చు. రచనలోని జీవితం మనంచూసిన జీవితంకన్నా భిన్నమైన జీవితానుభావాన్ని చిత్రించి వుండొచ్చు. ఇలాంటివన్నీ… విమర్శకుడు తాను చదివి లేదా విమర్శించే రచన మీద చివరి నిర్ణయాన్ని ప్రకటించడానికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే తాను గ్రహించిన సత్యాసత్య ప్రకటనకు తానుగడించిన అధ్యయన జ్ఞానం అవసరమవుతుంది.
    తెలుగులో సాహిత్యవిమర్శ దీపం చిన్నది. తెలుగులో సాహిత్యవిమర్శ ఎదగలేదు. విమర్శకులు రచయితల అభిప్రాయాల్ని గౌరవించరు. విమర్శను భరించేస్థిలో రచయితలు లేరు. తెలుగులో సాహిత్యవిమర్శ ఉన్నట్టా? లేనట్టా? తెలుగులో సాహిత్య విమర్శ ఉండీలేనట్టే! తెలుగులో సాహిత్యవిమర్శ లేనట్టే. –ఇలాంటి వ్యాఖ్యలు నిరంతరం వినిపిస్తూనే వున్నాయి. ఇందుకు కారణం ఎవరు ? అరాకొర జ్ఞానంతో మిడిమిడి రాతలు రాసే విమర్శల పాత్ర . తెలుగుసాహిత్యవిమర్శలో శాస్త్రీయత లోపించడం. వ్యక్తిగత అభిరుచులు ప్రాధాన్యం వహించి, నిర్మాణాత్మకత లోపించడం.చరిత్రను గౌరవించలేని దౌర్భల్యం. మార్పుల్ని సహించలేని పిరికితనం, దుర్వ్యాఖ్యానాలతో చెలామణి కావాలనుకునే దురాశ వంటి రుగ్మతలు తెలుగు సాహిత్య విమర్శను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. సాహిత్యవిమర్శ ఒక శాస్త్రంగా భావించకుండా, దానిని స్వీయాభిరుచుల ప్రకటన సాధనంగా భావించినంతకాలం తెలుగువిమర్శ గురించి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుంటాయి.
    .

    9441404080

  • ravi says:

    ‘జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు’…. ‘మార్పుల్ని సహించలేని పిరికితనం’, మంచి వాక్యాలు శ్రీదేవి గారు

  • ఆరి సీతారామయ్య says:

    “జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.” అన్నారు శ్రీదేవి గారు.

    ఇవి వినటానికి చాలా సంతృప్తికరంగా ఉండే మాటలు. కాని ఈ ‘సమగ్రంగా’ అన్న మాటను ఊతపదంగా కాకుండా చిత్తసుద్ధితో వాడే మార్కిస్ట్ విమర్శకులు అరుదు. సాహిత్యాన్ని ఒక రాజకీయ వ్యాసంగా కాకుండా సాహిత్యంలాగా చూసే విమర్శకులు ఈ సాంఘిక రాజకీయ శక్తులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అంతే ప్రాముఖ్యత (అంత కాకపోయినా కనీసం కొంత అయినా) సాహిత్య ప్రమాణాలకు కూడా ఇవ్వాలి. అప్పుడు కాని ఆ కథో నవలో సమగ్రంగా అర్థంకాదు.

    “సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు” అని ఎవరైనా అంటే, సాహిత్య ప్రమాణాల మీద చాలా చర్చ జరిగింది అనో, జరగటం మామూలు అనో, అలా జరిగినా అది సమగ్రం కాదు, అందువల్ల రాజకీయ సాంఘిక ఆర్థిక శక్తుల మీద కూడా చర్చ జరగాలి అన్నట్లు ఉంటుంది. కాని నిజానికి ఇక్కడైనా మరోచోటైనా మార్కిస్ట్ విమర్శకులు సాహిత్యాన్ని సాహిత్యం లాగా సమగ్రంగా విమర్శించటం అరుదు.

    • k.sreedevy says:

      మిమాటలు నిజమే!పాక్షిక సత్యమైనా అంగీకరించక తప్పదు.

  • Mauli says:

    శ్రీదేవి గారు ,

    ఈ వ్యాసం ద్వారా మీరొక రచయిత్రి ఉన్నారు అని తెలిసింది, అలాగే మీ ఇంకే రచనలు చూడలేదు కాబట్టి మీ దృష్టి కోణం తెలిసే అవకాసం ఏమాత్రం లేదు . కాబట్టి ఈ ప్రశ్న:

    మల్లేశ్వరి చూడలేని నిజం అని అనకుండా ‘చేదు’ నిజం అనడం లో మీ ఉద్దేశ్యం ? అంటే ఆ నిజం మల్లేశ్వరి గారికి ఇబ్బందికరమైనది అనా ? చూడదలుచుకోనిది అనా ? వారు వ్యతిరేకించే నిజమా అది ..అర్ధం కాలేదు

    • nirmalswagath says:

      మళ్ళీ ఎన్నడో ఆగిన వాదనలను (చర్చ కాదు …చర్చను దారి తప్పించారు)ఇపుడు ఎందుకండీ ఆరంభిస్తారు?మౌలిగారు…శ్రీదేవి గారు రచయిత్రి అని తెలిసిందా?ఇంకేవీ చదవలేదా?చదవకపోతే చదివి తెలుసుకోవాలి గానీ రచయితనే
      అడుగుతామా?రచయిత చెప్పిన దానినే నమ్ముతామా?మనము చదివి,ఒక అభిప్రాయానికి రావాలి గదండీ?
      దృష్టికోణం లాంటి ముఖ్యమైన ప్రశ్న వేసిన మీకు ,దృష్టికోణం ఎలా గ్రహించాలో తెలీదనుకోగలమా?
      ఇదిగో ఇలాంటి రాతలోతోనే …వస్తువు,శిల్పాల గురించిన చర్చ ఆరె సీతారామయ్య లాంటి వారు చేయబోతే,రమాసుందరి లాంటి వారు సీరియస్గా పాల్గొంటే,సంబూకుడు,సునీతలు ,లక్ష్మన్రాఅవులు దిగి వెతకారాలతో,వ్యంగ్యాలతో దారి తప్పించి చాలా మందిని చర్చ నుంచి విరమీంచుకునెత్తు చేసారు…మల్లీస్వరిగారికి ఇబ్బందికరమో,చుదదలచనిదొ,వ్యతిరేకిన్చేదో …ఏ నిజమో మీకు అర్ధం కాలేదా?
      ఇది నిజమా?మీరు రాసినదే మరో సారి చదువుకోండి,ఏ సమాధానం ఆశించి ఈ ప్రశ్న వేస్తున్నారో …ఇవతలి వారికి తెలిసిపోతోందని తెలుసుకుంటారు.వొద్దండి…ఇలాంటివి మీ గ్యానప్రదర్శనకు పనికొస్తాయేమో గాని మరి దేనికీ పనికిరావు..
      రాత్రి రెండు యాభై గంటల వేల నిద్ర మానుకొని ఈ ప్రశ్నలేమిటి …మౌళి గారు ఆలోచించండి….

    • nirmalswagath says:

      మౌళిgaaru chaannaalla tarvaatha mallee aarambhinchaaru,vaadana.idigo ilaanti vaadanala valanane manchi vishayaalu charchinche avakasam poyindi.Are Seetharamayya,Ramasundari marikondaru ilaanti gyanapradarshana vaadanala valanane charchanunchi vydolagaru.
      ipudu meeru ade aarambhincharu.drushtikonam lanti mukhyamaina prashna vesina meeku,rachayithani adigi drushtikonam telusukomani teleedandee?
      malleeswari chudani nijam…chedo,teepo…yedaithe yemandee?chudani nijama kada?

  • Mauli says:

    ఈ పై వ్యాఖ్యలు నేను పట్టించుకోను. శ్రీదేవిగారు ఇష్టం ఉంటె చెప్తారు లేదంటే లేదు. అసలు ఈ వ్యాసంలో ఉన్న ఒకపేరు ఇంకొక రచయిత్రిది అని అర్ధం కావడానికే చాలా సమయం పట్టింది. నేను సారంగ పెద్దగా చూడను ఏదో ఒక వ్యాసం ఆసక్తి కలిగి ఇటువైపు వచ్చాను. శ్రీదేవి గారి వ్యాసం సాధారణ చదువరులకోసం వ్రాసింది కాదు అయితే ఆ మాట ఆవిడే చెబుతారు. మధ్యలో వ్యాఖ్యాతలని బెదిరించే ఉద్యోగం ఇంకొకరు ఎందుకు తీసికొంటున్నారు. లేదా సారంగలో పాత టపాలు ‘చద్దివి’ గా భావించాలి అని అని ఎవరయినా కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ వ్యాఖ్యానించము కదా

    ( సారంగ కి , ఈ మాటను తప్పుగా భావించవద్దు, ఈ వ్యాఖ్యాత బెదిరింపు కు మాత్రమె నా ఈ సమాధానం)

    అలాగే నాకు చర్చించే ఉద్దేశ్యం లేదు.

    గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని ముందొకరు పరిచయం చేసారు, ఇప్పుడు ఇంకో వ్యాఖ్యానం వచ్చ్సింది. ఈ ఇద్దరు రచయితలకి ఆ విలువ ఉంది కాబట్టే తెలుసుకోగోరుతున్నాను. లేదంటే ఆ రచయితలకి ఇక్కడ దక్కుతున్న మర్యాద ‘రచ్చ’ మాత్రమె అని వదిలేస్తున్నాను

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)