అవును కదా గుల్జారే లేకపోతే –

M_Id_419679_Gulzar

అవును కదా గుల్జారే లేకపోతే –

సంతోషానికి పర్యాయ పదమేదో  తెలిసేది కాదు.
కన్నీటికి వుప్పుతనం వుందనీ  తెలిసేదే కాదు.
ప్రేమకి స్పర్శ వుంటుందనీ  తెలిసేది కాదు.
కోల్పోవటానికి వునికొకటి వుంటుందని తెలిసేది కాదు.

రహస్య స్థావరాల్లో మెలుకువే ఆయువని  తెలిసేది కాదు.

అవును ఆ ‘పూలతోటే ‘ లేకపోతే హృదయం అత్యంత భావరహిత పేదరికాన్ని చవిచూసేదేమో  బహుశా!!!
ఆ ‘మకరంద హృదయమే’ లేకపోతే –
మంచువాలుల్లో పాటల పూలవనాన్ని  విరగబూయించేదెవ్వరు.
ఆకాశాన్న వేలవేల అక్షర తారకల్ని  వెలిగించెదెవ్వరు.
నదీమ ప్రవాహంలో పదాల పడవల తెరచాపల్ని రెపరెపలాడించెదెవ్వరు.
నగర వీధుల్లో రణరణధ్వనులని జలపాతపు సవ్వడిలో నాట్యం చెయించెదెవ్వరు.
పురాత సైధీల్యపు నిశబ్ధంలోంచి రెండు ప్రేమల గొంతుని వెలిగించెదెవ్వరు.
అవును ఆ ‘పరాగ రేణువే’ లేకపోతే నిదురలేని రాత్రులల్లో భగ్న  ప్రేమికులకు ఆలపించేందుకు పాటలు మిగిలేవి కాదు కదా!!!
ఆ ‘శీతాకోకచిలుకే’ లేకపోతే –
ఆకుపచ్చని తోటల గాలినిండా శతసహస్ర రంగుల్ని మరెవ్వరు వెదచల్లేవారు.
అడివి దారుల్లో పేరు తెలియని పువ్వుల సోయగాన్ని వేరెవ్వరు పోల్చుకునేవారు.
లోయల వాలుల్లో మొలిచే గరిక పచ్చదనాన్ని చెవి వొగ్గి వినేదెవ్వరు.
మైదానాల సువిశాల మట్టి దారుల్లోని స్వేచ్చా సుగంధాన్నిశ్వాసించేదెవ్వరు.   
యెడారి చురచుర యెండమావుల్లో అసలుసిసలు వోయాసిస్సుని పట్టించెదెవరు.
గుల్జార్!!!
నువ్వే లేకపోతే పాట వొకే శిఖరం మీద నిలిచి వుండేది. పాటని మహాన్నత సంగీత శిఖరాలని అధిరోహింప చేసావ్.
అరవై వసంతాలుగా మా కవిత్వదాహం తీరుస్తున్న సజల నేత్రాలకవికి యెనభైవ పుట్టినరోజున వేలవేల రంగురంగుల తులీఫ్ పూల శుభాకాంక్షలు.!!!

-కుప్పిలి పద్మ.

Kuppili Padma Photo

Download PDF

5 Comments

 • ruler sadiq says:

  Dil dhoondtaa hai phir wahi…fursat ke raat din.

  • ulchala hari prasada reddy says:

   ఆహా… ఇది కదా గుల్జార్ కి సిసలైన మకుటం. మీ అక్షరాలను నిజంగా గుల్జార్ గాంధర్వం ఆవహించినట్లుంది! అదృష్టవంతులు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటే, కొన్నిసార్లు దాని పిల్లలు ఎక్కడో మరోవైపు ఇసుక తెన్నెలపై తిరుగుతుంటాయి. దూరాన ఉన్నా ప్రేమ దృష్టితోనే బిడ్డలను ఆ తల్లి తాబేలు పోషిస్తుందట. గుల్జార్ కూడా అలాంటి ఓ తల్లి తాబేలే. ఆయన ఆవాహన చేసుకున్న ప్రేమతత్వం.. యెద కనుమలను మీటే కమ్మని పాటల రూపంలో ఎప్పటికీ మనందరి ఆకలి తీరుస్తూనే ఉంటుంది!!!

 • Suryam Ganti says:

  గుల్జార్ లేక పోతే ? నాకు హిందీ పాటల మీద ఇంతమక్కువ ఉండె దే కాదు . చాల బాగా చెప్పారు

 • bhasker.koorapati says:

  పద్మ గారూ.. హైలీ పోఎటిక్ గా ఉంది మీ రచన. మీ నవ్వుకు మల్లేనే!
  కీప్ ఇట్ అప్ ప్లీజ్.
  -భాస్కర్ కూరపాటి.

 • Vijay says:

  భాషకు
  మనసుకు
  భావుకతకు
  బంధాలకు
  అనుబంధాలకు
  అనిర్వచనీయ అవేశాలకు
  ఒకటే వారథి – ఒకే వారథి
  లా అతనే !
  ‘ పద్మ ‘ పుష్పాంజలి
  అతని కలం పాదాలకు !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)