పన్నెండు రూపాల ప్రేమ!

Mythili
ఒకానొకప్పుడు ఫెయిరీల రాణిని ఎన్నుకోవటానికని పోటీ పెట్టారు. సుక్రాంటైన్, పరిడైమీ ఇని ఇద్దరు ఫెయిరీలు అన్ని విషయాలలో గొప్పవాళ్ళని తేలింది. వాళ్ళలో ఏ ఒక్కరిని రాణిగా చేసినా రెండోవారికి అన్యాయం జరిగేంత సమానం గా ఉన్నారు. అందుకని అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. చలికాలం లో మామిడి పళ్ళు కాయించటం, వానచినుకులకి మల్లెపూల వాసన తెప్పించటం…ఇలాంటి మామూలు ఇంద్రజాలాలు కాకుండా , ఇప్పటివరకూ లేని ప్రత్యేకమైన వింతని సృష్టించాలి. ఎవరి వింత ఎక్కువ విడ్డూరంగా ఉంటే వాళ్ళు రాణి అవుతారు. ఎంత కాలం పట్టినా సరే, చేసి చూపించాలి. ఈ లోపు నలుగురు ముసలి ఫెయిరీలు కలిసి రాజ్యం బాగోగులు చూసే ఏర్పాటు చేశారు.

సుక్రాంటైన్ ఒక రాజకుమారుడిని పెంచుతుంది. అతనికి ఎప్పుడూ ఎందులోనూ కుదురు అన్నదే ఉండకూడదు. పరిడైమీ ఒక రాజకుమారిని పెంచుతుంది. ఆమెను చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడిపోవలసిందే. ఇవీ వాళ్ళు చేసి చూపాలనుకున్నవి. రాజకుమారిని చూసి ప్రేమలో పడని వారెవరైనా ఉంటే పరిడైమీ ఓడిపోయినట్లు. రాజకుమారుడికి కుదురు వచ్చిందా, సుక్రాంటైన్ ఓడిపోయినట్లు పరిడైమీ ఒక రాజూ రాణీ లతో పరిచయం పెంచుకుంది. రాజు బార్డండన్ చాలా మంచివాడు. తన ప్రజలని ఎంతో బాగా చూసుకునేవాడు. రాణి బాలనీస్ కూడా అంతే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గొప్ప ఇష్టం. వాళ్ళకి చిన్న కూతురు ఉంది. తన బుగ్గ మీద చిట్టి రోజా పువ్వు లాంటి పుట్టుమచ్చ ఉండటం తో ఆ పాపని ‘ రోజానెల్లా ‘ అని పిలిచేవారు. తను ఎంత చురుకైనదంటే, ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే రాజసభలో అందరికీ ఆమె మాటలు కంఠతా వచ్చేవి.

ఒక అర్ధరాత్రి రాణి ఉలిక్కిపడి నిద్ర లేచింది. తన చిట్టి పాప గులాబీపూలగుత్తి గా మారిపోయినట్లూ ఒక పక్షి దాన్ని తన్నుకుపోయినట్లూ ఆమెకి పీడకల వచ్చింది. వెళ్ళి చూస్తే రోజానెల్లా నిజంగానే మాయమైంది. ఎంత వెతికినా కనిపించనే లేదు.రాణి ని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. రాజు త్వరగా బయటపడే మనిషి కాదుగానీ ఆయనా దిగులుపడిపోయాడు. రాజధానిని వదిలి ఒక పల్లెటూళ్ళో ఉన్న ఇంటికి వెళ్ళారు ఇద్దరూ , కొంతకాలం ఉందామని.
ఒక చల్లటి సాయంకాలం చెట్లనీడలో కూర్చుని ఉన్నారు అక్కడ. ఆ ప్రదేశం పన్నెండు కోణాల నక్షత్రం ఆకారం లో ఉంది. ప్రతి కోణం లోనూ ఒక కాలిబాట.

ఒక్కొక్క బాట లోంచి ఒక యువతి, నవ్వు మొహంతో నడుచుకుంటూ వచ్చింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లికబుట్ట తో వచ్చారు. ” రాణీ ! మీ పాప కనబడటం లేదు కదా, ఈ పాపను పెంచుకోండి ” అని వాటన్నిటినీ ఆమెకి ఇచ్చారు. మాయమైన రాజకుమారి వయసే ఉన్న పాపలు ఉన్నారు ఆ బుట్టలలో. చూడగానే ముందర రాణి రోజానెల్లా కోసం బెంగ పడింది. మెల్ల మెల్లగా ఆ పాపలు ఆమెకి ముద్దొచ్చారు. ఉయ్యాలలూ వాటిని ఊపేవాళ్ళూ , బోలెడన్ని బొమ్మలూ ఆడించేవాళ్ళూ , రుచి అయిన తినుబండారాలూ తినిపించేవాళ్ళూ ,ఎత్తుకు తిప్పేవాళ్ళూ ఇలా అన్నిటినీ , అందరినీ రాణి పురమాయించింది. ఆ హడావిడిలో ఆమె తన బాధ మరిచిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ పన్నెండు మంది పాపలకీ బుగ్గ మీద రోజా పూవు ఆకారంలో పుట్టుమచ్చ ఉంది. అందరూ ఒక చోట ఉన్నప్పుడు పెద్ద పూలగుత్తిలాగానే కనిపించేవారు. ఒక్కొక్కరికీ ఒక రంగు పేరు పెట్టుకుంది రాణి. వాళ్ళు అందరూ తెలివైనవారే.

అందరూ బాగా చదువుకునేవారు. అయితే అందరూ మంచిపిల్లలే కానీ ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉండేది. అదివరకు వాళ్ళని ” పాటలీ , ఇంద్రనీలా, శ్వేతా ” అని పిలుచుకునే రాణి ఇప్పుడు వాళ్ళు ఎదిగేకొద్దీ స్వభావాన్ని బట్టి ” ఆనందినీ, మధురిమా, సాంత్వనా ” ఇలా పిలవటం మొదలుపెట్టింది. అందరూ పెరిగి పెద్దయి సొగసైన అమ్మాయిలు అయారు. ఆ నోటా ఈనోటా వాళ్ళ కబుర్లు విని వాళ్ళని పెళ్ళాడేదుకు దేశదేశాలనుంచి రాకుమారులు వచ్చేవారు. అమ్మాయిలని కలుసుకుని పొగిడి ఒప్పించాలని చూసేవారు. వీళ్ళు మాత్రం ఎవరినీ ప్రేమించలేదు, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటుండేవారు.

draft_lens18387266module152630148photo_1314117728andrew_lang_fairy_books.j
రాజు బార్డండన్ కి మేనత్త కొడుకు ఇంకొక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు, అతని పేరు మిర్లిఫ్లోర్. రెండో ఫెయిరీ సుక్రాంటైన్ ఈ రాజకుమారుడిని కుదురు లేనివాడిగా చేయాలని నిర్ణయించుకుంది. అందం, ఆరోగ్యం, తెలివి తేటలు, మంచితనం అన్నీ అప్పటికే ఉన్న ఆ అబ్బాయిని చాలా చాలా ఆకర్షణీయమైనవాడిగా తయారుచేసింది. అతను కోపంగా ఉన్నా శాంతంగా ఉన్నా, అలంకరించుకున్నా సాదాసీదా గా ఉన్నా, గంభీరంగా ఉన్నా సరదాగా ఉన్నా – ఎప్పుడూ అందరినీ ఆకట్టుకోగలిగేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కుదురు ఒకటి తప్ప. పద్దెనిమిదేళ్ళు నిండేసరికి రాజ్యం లోని అందరు అమ్మాయిలకీ అతను నచ్చటం, వాళ్ళు ఇతనికి మొహం మొత్తటం కూడా అయిపోయాయి. సరిగ్గా అప్పుడు బార్డండన్ రాజ్యానికి రమ్మని అతన్ని ఆహ్వానించారు.

ఒక్కసారిగా పన్నెండు మంది అపురూపమైన అమ్మాయిలు కనబడ్డారు. అతను ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అందరూ అతనికి నచ్చేశారు, వాళ్ళందరికీ ఇతనూ అంతగానూ నచ్చాడు. అందరూ ఒకే చోట లేకపోతే అతనికి తోచేది కాదు. ఒకరి మాటలు విని నవ్వేవాడు, ఒకరితో తను ముచ్చట్లు చెప్పేవాడు . ఇంకొకరి తో కలిసి కవిత్వం చదివేవాడు, మరొకరితో మౌనంగా ఉండేవాడు. ఒకరితో సంగీతం , ఇంకొకరితోపువ్వులూ పిట్టలు , మరొకరితో ఆకాశం, నీటి మబ్బులు. . గుబులుగా అనిపిస్తే ఒకరు ఊరట, అల్లరి చేసేందుకు ఒకరు తోడు. తన జీవితంలో అతను మొదటిసారి ప్రేమలో పడ్డాడు. అయితే అది ఒక్కరితో కాదు, పన్నెండు మందితో. అతన్ని మార్చిన ఫెయిరీ సుక్రాంటైన్ అనుకుంది, ఇంతకన్న కుదురు లేకపోవటం ఏముంటుందని. పరిడైమీ మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు.

రాజకుమారుడు మిర్లిఫ్లోర్ వాళ్ళ నాన్న అతన్ని ఇంటికి రమ్మని ఎన్నో సార్లు కబురు చెశాడు. ఏవేవో పెళ్ళిసంబంధాల సంగతులు వచ్చిపడుతున్నా మిర్లిఫ్లోర్ తనని కట్టిపడేసిన ఈ పన్నెండుమంది మంత్రగత్తెలని వదిలి వెళ్ళనేలేకపోయాడు.

ఇంతలో ఒక పండగనాడు రాణి ఉద్యానవనం లో విందు ఏర్పాటు చేసింది. అతిథులంతా వచ్చారు. ఆ తోటలో యథాప్రకారం మిర్లిఫ్లోర్ తన సఖులందరితోనూ ఉన్నప్పుడు జుమ్మని తేనెటీగల శబ్దం వినిపించింది. పన్నెండుమంది అమ్మాయిలూ రోజా పూవులో ఏమో , భయపడి దూరంగా పరుగెత్తారు. తేనెటీగలు వెంటపడ్డాయి. చూస్తుండగానే అవి ఇంతింత పెద్దవై రోజా కన్యలని ఎత్తుకు వెళ్ళిపోయాయి. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. అంతా నిర్ఘాంత పోయారు.

మిర్లిఫ్లోర్ ముందు విపరీతంగా దుఃఖ పడ్డాడు, ఆ తర్వాత ఏమీ పట్టకుండా , ప్రపంచం లో లేనట్లుగా అయిపోయాడు. ఏదో ఒకటి అతన్ని కదిలించకపోతే అసలు బ్రతుకుతాడా అనిపించింది. ఫెయిరీ సుక్రాంటైన్ ఓదార్చే ప్రయత్నం ఎంతో చేసింది. సుందరులైన రాజకుమార్తెల చిత్తరువులు తెచ్చి చూపించింది. అతను చీదరించుకున్నాడు. ఫెయిరీకి ఏం చేయాలో తోచలేదు ఇంక.

ఒక రోజు పిచ్చివాడిలాగా అతను అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద కలకలం చెలరేగింది. సూర్యకాంతిలో తళతళ మెరుస్తూ స్ఫటికపు రథం ఒకటి పైనుంచి దిగి వస్తోంది. రెక్కలున్న చక్కటి అమ్మాయిలు ఆరుగురు రోజా రంగు పట్టుతాళ్ళతో ఆ రథాన్ని లాగుతున్నారు. ఇంకా ఎందరో అందగత్తెలు పొడుగాటి పూల హారాలు పట్టుకుని ఆ పైనంతా రంగుల పందిరి వేసేశారు. ఆ రథం లో ఫెయిరీ పరిడైమీ కూర్చుని ఉంది, ఆ పక్కనే ఒక అత్యంత సౌందర్యవతి అయిన రాజకుమారి ఉంది. సరాసరి రాణి బాలనీస్ మేడకి వెళ్ళారు వాళ్ళిద్దరూ, ఆ వెనకే అబ్బురపడే జనం అందరూ.

” మహారాణీ , ఇదిగో మీ అమ్మాయి రోజానెల్లా ” అంది పరిడైమీ.
ఊహించనిది జరిగిన సంతోషం లో రాణి మునిగిపోయింది. అంతలోనే అడిగింది-
” మరి నా పన్నెండు మంది బంగారు తల్లులూ ఏరీ ? ఇంక నాకు కనిపించరా ? ”
పరిడైమీ ఒకే మాట అంది ” త్వరలోనే వాళ్ళందరినీ నువ్వు మరచిపోతావు ”
ఆ అనటం నన్ను ఇంకేమీ అడగవద్దు అన్నట్లుంది. తన రథం ఎక్కి సుక్రాంటైన్ వెళ్ళిపోయింది.

image185
చిన్నప్పుడే తప్పిపోయిన రాజకుమారి తిరిగి వచ్చిందని మిర్లిఫ్లోర్ కి తెలిసింది. ఆమెను చూడాలనే ఆసక్తి ఏమీ అతనికి లేనే లేదు. తప్పనిసరిఅయి, మర్యాద కోసం, ఆమెని కలవటానికి వెళ్ళాడు. ఆమెతో అయిదు నిమిషాలు ఉండగానే అతనికి తాను పోగొట్టుకున్న పన్నెండుమంది లక్షణాలూ ఆమెలో కనిపించటం మొదలెట్టాయి . కాసేపట్లోనే ఒళ్ళు తెలియనంత సంతోషం లో కూరుకుపోయాడు. తనని పెళ్ళాడమని రాజకుమారిని అడిగాడు.

సరిగ్గా అప్పుడే పరిడైమీ ప్రత్యక్షమయింది. విజయగర్వం తో వెలిగిపోతోంది . తను పెంచిన రాజకుమారిని చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడాలి, మిర్లిఫ్లోర్ అలాగే అయాడు. పరిడైమీ తను రోజానెల్లా ని ఎలా ఎత్తుకువెళ్ళిందీ, ఆమె ను పన్నెండుగా విడగొట్టి ఒక్కొక్కరితోనూ మిర్లిఫ్లోర్ ప్రేమలో పడేలా ఎలా చేసిందీ , కథ అంతా చెప్పుకొచ్చింది. పన్నెండుగురూ ఒకటి అయిన రోజానెల్లా ను ఇప్పుడు మిర్లిఫ్లోర్ ప్రేమిస్తున్నాడు, ఆమె పన్నెండు గుణాలకీ విడి విడిగా. అన్నీ ఆమె లోనే ఉన్నాయి కనుక అతనికి మరెవరూ అక్కర్లేదు. సుక్రాంటైన్ కుదురు లేకుండా చేద్దామనుకుంది, ఇతను ఈ రకంగా కుదురుగా అయిపోయాడు, ఆమె ఓడిపోయింది.

అయినా రోజానెల్లా ను ఇష్టపడకుండా సుక్రాంటైన్ ఉండలేకపోయింది. ఆ రాజకుమారి అంత అద్భుతమైనది. మిర్లిఫ్లోర్, రోజానెల్లా ల పెళ్ళివిందుకు సుక్రాంటైన్ హాజరైంది. అందమైన కానుక కూడా ఇచ్చింది. పన్నెండు రూపాలలో తను అతన్ని ప్రేమించిన ప్రేమనంతా రోజానెల్లా , మిర్లిఫ్లోర్ మీద కురిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా , శాంతంగా చిరకాలం జీవించారు.

 

ఫ్రెంచ్ జానపద కథ [ by Comte de Caylus , early 17 th century ] సేకరణ – Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

లోగో: మహీ బెజవాడ

Download PDF

28 Comments

  • Suresh says:

    ఏదో అద్బుతలోకంలో విహరించినంత ఆనందంగా ఉంది ఈ కథ చదువుతుంటే. చిన్నపుడు చదివిన రషియన్ జానపదాలు, చందమామ కథలు అన్నీ గుర్తొస్తున్నాయి మేడం . వీక్లీ రాస్తారు కదూ? ఎక్కడ మంత్లీ అంటారో అని భయంగా ఉంది.

    • pavan santhosh surampudi says:

      అవును మేడం. కడిమి చెట్టు కోసం నేలంతా వెయిటింగ్ చేయాల్సి వస్తోంది. ఇదైనా వీక్లీ రాసేయండి.

    • మైథిలి అబ్బరాజు says:

      థాంక్ యూ సురేష్. రాయాలనే ఉంది…

  • pavan santhosh surampudi says:

    ఇదే సారంగలో కౌమార దశలోని పిల్లలు చదవాల్సిన సాహిత్యం గురించి, బాల సాహిత్యం గురించీ రాసారు గుర్తుందా అండి. ఇన్నాళ్లూ అలాంటి సాహిత్యం తెలుగులో ఉంటే బావుణ్ణు అని బాధపడేవాణ్ని. ఆ లోటూ మీరే తీర్చేసారు. థాంక్యూ.

    • మైథిలి అబ్బరాజు says:

      థాంక్ యూ పవన్ !ఇదొక బాధ్యత , ఎంత మేరకు మోయగలనో చూడాలి :)

  • ఆర్.దమయంతి. says:

    :-)
    బావుంది.
    రాజకుమారి కథలు చదవక చాన్నాళ్లైంది.
    ఇన్నాళ్ళకి..ఇలా చదువుతుంటే.. బాల్యం గుర్తొచ్చింది నాకు.
    చాలా చక్కగా అనువదించారు. అచ్చు తెలుగు కథ లానే వుంది.
    అభినందనలతో..

    • మైథిలి అబ్బరాజు says:

      ధన్యవాదాలు దమయంతి గారూ . ఎంతో సంతోషం !

  • deepthi kodali says:

    Very nice story aunty. .il start reafing them out to my kids..

    • మైథిలి అబ్బరాజు says:

      So sweet of you Deepthi..will gift them a book or two of these by the time they go to school ..:)

  • శరత్కాలపు పూర్ణచంద్రుని చల్లని వెన్నెల్లో విహరించిన అనుభూతి కలిగింది మైథిలి గారి ఈ కథ చదువుతూ ఉంటే. బాల్యం లో చదువుకున్న ఇలాంటి అద్భుతగాథ లన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడే ఐపోయిందా కథ అనిపించింది. ఇలాంటి కథలు వారం వారం కాదు, రోజూ చదవాలనె ఉంటుంది అందరికీ! నేను కూడా అలానే కోరుకుంటాను.

    • మైథిలి అబ్బరాజు says:

      ధన్యవాదాలు, నమస్కారాలు అండీ, మీ ఆశీస్సులతో…

  • Rekha Jyothi says:

    మైథిలీ మామ్, Its so So sweet and delicate. చదువుతూ ఆస్వాదించింది ఒక ఎత్తు , దాన్ని నారేట్ చేస్తూ అనుభూతి చెందింది మరో ఎత్తు . పిల్లలతో కలిసి మరి కాసేపు ఎక్కువగా గడిపేందుకు ఇలాంటి కధ ఒక “మీఠీ బహానా “, వారి ఊహలకు రంగులు అద్దేందుకు దొరికిన “మల్టీ కలర్డ్ పాలెట్ “. ఈ చిన్న కధల అవసరం గుర్తించిన వారికీ, ఇంత సరళంగా ,హృద్యంగా ఆవిష్కరించిన మీకూ అభినందన పూర్వక కృతజ్ఞతలు. Eagerly waiting for the next “తేనె బొట్టు ” TQ Mam
    నిజ్జంగా రోజుకొక బుజ్జి కధ ఇస్తారా! వెన్నతో కలిపి పెట్టేస్తాము :)

  • Prasuna says:

    అద్భుతంగా ఉందండీ. మళ్ళీ బాల్యం లోకి వెళ్ళిపోయి ఇటువంటి కథలు చదువుకుంటూ క్షణాల్ని వెలిగించుకుంటూ గడిపిన అనుభూతి వెనక్కొచ్చింది. వారం వారం తప్పకుండా వ్రాయాల్సిందే మీరు.

    • మైథిలి అబ్బరాజు says:

      ధన్యవాదాలు ప్రసూన గారూ…అలాగే :)

  • బాగుంది మైథిలి గారు. అభినందనలు

  • G.S.Lakshmi says:

    పండువెన్నెట్లో విందుభోజనం చేసినట్లుందండీ..

    • మైథిలి అబ్బరాజు says:

      ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారూ ! తీయటి మాటలు చెప్పారు…

  • naresh sake says:

    మాకు తియ్యటి జానపద రాజరిక కథలు చెప్తున్నందుకు దన్యవాదములు…

  • Rekha Jyothi says:

    మైథిలీ మామ్, Its so So sweet and delicate. చదువుతూ ఆస్వాదించింది ఒక ఎత్తు , దాన్ని నారేట్ చేస్తూ అనుభూతి చెందింది మరో ఎత్తు . పిల్లలతో కలిసి మరి కాసేపు ఎక్కువగా గడిపేందుకు ఇలాంటి కధ ఒక “మీఠీ బహానా “, వారి ఊహలకు రంగులు అద్దేందుకు దొరికిన “మల్టీ కలర్డ్ పాలెట్ “. ఈ చిన్న కధల అవసరం గుర్తించిన వారికీ, ఇంత సరళంగా ,హృద్యంగా ఆవిష్కరించిన మీకూ అభినందన పూర్వక కృతజ్ఞతలు. eagerly waiting for the next “తేనె బొట్టు ” TQ

  • చాలా బాగుందండీ, అప్పుడే అయి పోయిందా అనుకున్నాము . Our best wishes for ur effort and beautiful Telugu wording.

  • రేఖా జ్యోతి says:

    మైథిలీ మామ్, Its so So sweet and delicate. చదువుతూ ఆస్వాదించింది ఒక ఎత్తు , దాన్ని నారేట్ చేస్తూ అనుభూతి చెందింది మరో ఎత్తు . పిల్లలతో కలిసి మరి కాసేపు ఎక్కువగా గడిపేందుకు ఇలాంటి కధ ఒక “మీఠీ బహానా “, వారి ఊహలకు రంగులు అద్దేందుకు దొరికిన “మల్టీ కలర్డ్ పాలెట్ .”. ఈ చిన్న కధల అవసరం గుర్తించిన వారికీ, ఇంత సరళంగా ,హృద్యంగా ఆవిష్కరించిన మీకూ అభినందన పూర్వక కృతజ్ఞతలు. eagerly waiting for the next “తేనె బొట్టు ” TQ

  • BHUVANACHANDRA says:

    హాయిగా బాల్యం లోకి నడిచివెళ్ళి నట్లుంది ………..థాంక్స్ మైధిలి గారూ

    • మైథిలి అబ్బరాజు says:

      చాలా చాలా సంతోషం సర్ ! నమస్కారాలు .

  • nmraobandi says:

    and the award goes to … కాలం నుంచి …
    అనగనగా లోకం లోకి పంపారు …
    చందమామను చేతికందించి మరీ …
    dreams never die …
    thanks ma’m …

  • మైథిలి అబ్బరాజు says:

    Yes, they won’t !!!!! :)

    Happy and most welcome nmraobandi gaaru .

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)