రోజ్ మేరీ

MythiliScaled

ఒకానొకప్పుడు ఒక తండ్రీ కూతురూ ఉండేవారు. వాళ్ళకి కొంచెం పొలం ఉండేది. అమ్మాయి కి రోజ్ మేరీ మొక్క  సువాసన చాలా ఇష్టం. తన గౌన్ లో ఎప్పుడూ  ఆ రెమ్మలు దాచుకునేది. అవి వాడిపోతే మళ్ళీ తెచ్చుకునేది. అసలు పేరు ఏదో కాని అంతా తనని అదే పేరు తో పిలిచేవారు. కష్టపడి ఇంటి పని అంతా చేసేది. ఒక సాయంత్రం పని ముగిసిన తర్వాత తండ్రి ఆమెని అడవి లోకి వెళ్ళి చితుకులు ఏరుకు రమ్మని పంపించాడు, మర్నాడు పొయ్యిలో పెట్టటానికని. తను వెళ్ళి కట్టె పుల్లలు ఏరి పెద్ద మోపుగా కట్టింది. పక్కనే  రోజ్ మేరీ మొక్క కనిపించింది. దాన్ని పెకలించి ఇంటికి తీసుకువెళదామనుకుంటే  అది అంత తేలికగా  రాలేదు. బాగా బలంగా లాగేసరికి ఊడి వచ్చింది.

ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ” నా కట్టెలు  దొంగిలిస్తున్నావెందుకు ? ” అని గద్దించి అడిగాడు.

అమ్మాయికి భయం వేసింది. వాళ్ళ నాన్న తెమ్మన్నాడని మెల్లిగా గొణిగింది.

రోజ్ మేరీ మొక్క ఉన్న చోట భూమిలో ఒక సొరంగం ఏర్పడింది. ” సరే అయితే. నాతో రా ఇలాగ ” అని యువకుడు పిలిచాడు. అమ్మాయి భయం భయంగా అతని వెంట వెళ్ళింది. సొరంగం లోకి దిగి  చాలా దూరం నడిచాక ఒక  గొప్ప భవంతి  వచ్చింది. లోపల చాలా వైభవంగా ఉంది.  చుట్టూ అందమైన తోట. ఇద్దరూ లోపలికి వెళ్ళాక అతను ” నీ అంత సొగసైనదాన్ని ఎప్పుడూ చూడనేలేదు. నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోతావా ? ” అని అడిగాడు.

తనకీ అతను నచ్చాడు. ఆనందంగా ఒప్పుకుంది. వాళ్ళు పెళ్ళి చేసుకుని అక్కడ కొంతకాలం హాయిగా ఉన్నారు.

 

moon

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది

ఆ ఇంటి బాగోగులు చూసేందుకు ఒక పెద్దావిడ ఉంది. ఆవిడ పెద్ద తాళం చెవుల గుత్తిని రోజ్ మేరీ కి ఇచ్చింది. వాటిలో ఒక్క తాళం చెవిని మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదనీ అలా చేస్తే ఆ భవనం కూలిపోతుందనీ  తన భర్త తనని మరచిపోతాడనీ హెచ్చరించింది. రోజ్ మేరీ సరేనంది. కాని ఆ మాటలని అంతగా నమ్మలేదు

ఏ పని చేయకూడంటారో అదే చేయబుద్ధి వేస్తూ ఉంటుంది. ఆ తాళం చెవి దేనికి సంబంధించినదా అని వెతికితే అదొక పెద్ద భోషాణానిది అని తెలిసింది.అందులో ఏముందా అని ఆరాటం. ఒక రోజు తోచీ తోచకుండా ఉండి ఆ భోషాణాన్ని ఆమె తెరవనే తెరిచింది. లోపల  ఏమీ లేదు. కాని ఆ వెంటనే తన కాళ్ళ కిందన  నేల దడదడలాడింది .భవనం ఒక్కసారిగా మాయమైంది. ఏమవుతోందో తెలిసేసరికి ఒక పొలం మధ్యలో నిలబడి ఉంది. ఎక్కడుందో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆమె పెద్ద పెట్టున ఏడ్చింది- తప్పు చేశానని, తను ఎంతో ప్రేమించే భర్త కనిపించడని.

కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

rosemary

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

” మా యజమాని చంద్రుడు. ఆయనకి చెబుతాను ఉండు ” అని ముసలావిడ చంద్రుడిని పిలుచుకొచ్చింది. చంద్రుడికీ ఆమె భర్త సంగతి తెలియదు. అతనూ ఇంకొక కాయని ఆమెకి ఇచ్చి ఆపద కలిగినప్పుడు బద్దలు కొట్టమన్నాడు. అది తెల్లగా పాలరాయిలా ఉంది.

ధన్యవాదాలు చెప్పుకుని ఆమె మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సారి గాలి దేవుడు ఉండే కోటకి చేరుకుంది. గాలి దేవుడు  తనకీ ఆమె భర్త ఆచూకీ తెలియదనే అన్నాడు. మట్టి రంగులో ఉన్న  అక్రూట్ కాయని ఇచ్చి సూర్యుడూ చంద్రుడూ చెప్పినట్లే చెప్పాడు.

అయితే ఈ సారి ఆమె కదలలేదు. విపరీతంగా అలిసిపోయి ఉంది. పైగా పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఆ కోట మెట్ల దగ్గరే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

గాలి దేవుడికి పాపం అనిపించింది. ” భయపడకు. ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి అంతా వెతుకుతాను. ” అని పెద్ద శబ్దం చేసుకుంటూ తేలి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు.

” తెలిసిందమ్మా అంతను ఎక్కడున్నాడో. ఒక రాజు గారి దగ్గర బంధించి ఉంచారు. ఆ రాజు కూతురికి ఇతను నచ్చాడట. ఇతను వద్దన్నా బలవంతంగారేపు పెళ్ళి చేయబోతున్నారు

” అని ఆ రాజ్యం ఎక్కడో చెప్పాడు.

అమ్మాయికి చాలా నిరాశ. ధైర్యం తెచ్చుకుని గాలి దేవుడిని అడిగింది ” ఒక్క రెండు మూడు రోజులు ఆ పెళ్ళిని ఆపగలరా ? నేను అక్కడికి వెళ్ళేందుకు అంత సమయం పడుతుంది కదా ‘’

” ఓ. అదెంత పని ! ” అని గాలి వెళ్ళాడు.

పెళ్ళికూతురు బట్టలు కుట్టే పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి మహా విసురుగా వీచాడు. ఆ గౌన్ ల లేస్ లూ అంచులకి కుట్టే  ముత్యాలూ రత్నాలూ చెల్లా చెదురై పోయాయి- చెట్ల మీదికి, నది లోకి, పొలాల్లోకి. కుట్టుపనివాళ్ళు హడావిడిగా వాటిని పట్టుకునేందుకు ఎంతగా  కిందా మీదా పడ్డా ఏమీ లాభం లేకపోయింది. లేస్ లు చిరిగి  పోయాయి. పట్టు బట్టలన్నీ బురద కొట్టుకు పోయాయి. ముత్యాలూ రత్నాలూ గుప్పెడు  కూడా దొరకలేదు. మళ్ళీ బజారుకు వెళ్ళి కొత్తవి కొనుక్కు రావాలి అంతే. రాజు చిరాకు పడ్డాడు.” ఏదయితే అదే అయింది. ఆ గౌన్ లోనే అలంకరించండి ” అని ఉత్తరువు ఇచ్చాడు. దర్జీ లు కూర్చుని  ఏదో కుట్టారు. కాని కూతురిని ఆ చిరిగి మాసికలు వేసిన , మాసిపోయిన  గౌన్ లో చూసేసరికి ” బాగాలేదు, వద్దులే ” అనిపించింది రాజుకి.

కొద్ది గంటలలో అంతా మళ్ళీ సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు గడిచిపోయింది.

చాలా వేగంగా నడిచిన  రోజ్ మేరీ తెల్లారేసరికి రాజభవనం వాకిట్లోకి వచ్చింది.

సూర్యుడు ఇచ్చిన కాయని  పగలగొట్టింది . అందులోంచి తళతళలాడుతూ లాడుతూ తెల్లటి పొడుగాటి శాలువా  వచ్చింది. దాన్ని పెళ్ళప్పుడు భుజాల మీదినుంచి వెనక్కి జారేటట్లు వేస్తారు.

అది తీసుకుని రాకుమారి చెలికత్తెలకి చూపించి ” మీ రాకుమారికి ఇది కావాలా ? ఆమె పెళ్ళి ట కదా ? ” అని అడిగింది.

రాకుమారి కి విషయం తెలిసి బయటికి వచ్చింది. పిడికెడు బంగారు కాసులు ఇచ్చి ఆ శాలువా కొనుక్కుంది. రాకుమారి అటు తిరగగానే చంద్రుడు ఇచ్చిన పాలరాయి కాయని రోజ్ మేరీ  పగలగొట్టింది. ఈ సారి  మిలమిలలాడుతూ వజ్రాలు  కుట్టిన మేలి ముసుగు వచ్చింది.  రాకుమారి ఇంకా ఎక్కువ బంగారం ఇచ్చి దాన్నీ  కొనుక్కుంది. రెండుసార్లూ ఇచ్చిన బంగారు కాసులని రోజ్ మేరీ జాగ్రత్త గా దాచుకుంది .

మెట్లుదిగి పక్కకి వెళ్ళి రోజ్ మేరీ అక్రూట్ కాయని కూడా బద్దలు కొట్టింది. పొరలు పొరలుగా ,గాలి అలల లాగా కదిలే చక్కని పెళ్ళి గౌన్ వచ్చింది.రాకుమారి అదీ కావాలంది. దర్జీలు కొత్త గౌన్ ని ఇప్పట్లో తయారు చేయలేరని ఆమెకి తెలుసు.

ఈ సారి రోజ్ మేరీ బంగారం వద్దంది. ” ఒక్కసారి నేను పెళ్ళికొడుకుని చూడాలి. అలా అయితేనే ఈ గౌన్ ఇస్తాను మీకు ”

ఇది రాకుమారికి పెద్ద నచ్చలేదు. అయినా చూసినంత మాత్రాన ఏం మునిగిపోతుందిలే అని ఒప్పుకుంది.

రోజ్ మేరీ ని ఆమె భర్త ఉన్న చోటికి తీసుకు వెళ్ళారు. అతను ఆమెని గుర్తు పట్టలేదు.  ఆమె దగ్గరగా వెళ్ళి తన దగ్గర ఉన్న రోజ్ మేరీ రెమ్మ తో అతన్ని తాకింది. అతనికి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కళ్ళనీళ్ళతో తన తప్పుకి  క్షమాపణ అడిగింది. అతను ” కలుసుకున్నాము గా. ఏమీ పర్వాలేదు ” అని ఓదార్చాడు.

అక్కడికి వచ్చిన  రాజుతో ” నాకు ఇదివరకే పెళ్ళైంది. ఈమె నా భార్య. నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేను ” అని చెప్పాడు. రాజుకి కోపం వచ్చి ఆమె ని చంపేయాలనుకుని బంధించబోయాడు.

ఈ లోపు గాలి దేవుడు భార్యా భర్తలిద్దరినీ ఆకాశం లోకి ఎగరేసి రోజ్ మేరీ ఇంటికి చేర్చాడు. వాళ్ళ నాన్న ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు దుస్తులు అమ్మితే వచ్చిన బంగారు కాసులతో ఇంకొంత పొలం కొనుక్కుని, ఇల్లు బాగు చేసుకున్నారు. ఇదివరకులా వైభవంగా కాకపోయినా  వాళ్ళిద్దరూ  జీవితాంతం సుఖంగా గడిపారు.

[ రోజ్ మేరీ అనేది మూలిక వంటి మొక్క. వంటలలో, సుగంధద్రవ్యం గా, వైద్యం లో దీన్ని ఉపయోగిస్తారు.  Shakespeare రచించిన Hamlet నాటకం లో Ophelia కి మతి స్థిరంగా లేనప్పుడు ఆమె అన్న“There’s rosemary, that’s for remembrance; pray, love, remember.” ’’ అంటాడు. “Rosemary for remembrance’’ .అనేది నానుడిగా ఉండిపోయింది. జ్ఞాపకశక్తిని రోజ్ మేరీ నిజంగానే మెరుగు పరుస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది]

 

     స్పానిష్ జానపద కథ. సేకరణ -Dr. D. Francisco de S. Maspons y Labros , Andrew Lang

 అనువాదం: మైథిలీ సుబ్బరాజు

Download PDF

11 Comments

  • harikrishna mamidi says:

    చాలా బాగుంది. అయితే ప్రపంచ సాహిత్యం లోని అన్ని జానపద, నాగరిక కథలు ఆయా జాతుల ఇతిహాసిక కథలకి ADAPTATIONS గా ఉంటాయనడానికి ఈ కథ ఓ ఉదాహరణ గా అనిపిస్తోనిది. మరుపు అనే కాన్సెప్ట్ మన శకుంతల-దుష్యంతుల ఎపిసోడ్ లో కూడా ఉంటుంది కదా. అది స్ఫురణకు వచ్చింది.

    ఈ జానపద కథని పరిచయం చేసినందుకు మైథిలి గారికి ధన్యవాదాలు

    • మైథిలి అబ్బరాజు says:

      సంతోషం హరికృష్ణ గారూ. అవును, మీరు అన్నది పూర్తిగా నిజం. చదువుతూ పోయే కొద్దీ చాలా కథల మధ్య పోలికలు కనిపిస్తాయి.

  • suresh says:

    హాయీగా ఉందండి చదువుతుంటే. వరాలిచ్చే సూర్యుడు, చంద్రుడు, గాలి దేవుడు, రోసేమరి హెర్బ్, వజ్రాల మేలిముసుగు, తళ తళలాడే సాలువ….ఒక కథ కి కావలసిన దినుసులన్నీ ఉన్నాయిగా….హాయిగా చదువుకొని ఆనందించటమే!!

  • y.padmaja says:

    రోజ్ మేరీ అనేది మూలిక వంటి మొక్క. వంటలలో, సుగంధద్రవ్యం గా, వైద్యం లో దీన్ని ఉపయోగిస్తారు. జ్ఞాపకశక్తిని రోజ్ మేరీ నిజంగానే మెరుగు పరుస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఇదే వినటం .చాలా బావుంది.

  • alluri gouri lakshmi says:

    మంచి కధ చెప్పి అందర్నీ ఎలిమెంటరీ స్కూల్ పాపల్ని చేసారు. థాంక్స్ మైథిలీజీ !

  • బాగుంది మైథిలి గారూ, పుస్తకం వేయించి నాకు ఓ కాపీ ఇవ్వాలి ప్లీజ్……

  • మైథిలి అబ్బరాజు says:

    తప్పకుండా రాధ గారూ. అన్ని కథలు రావాలి కదా …మొదటి కాపీ మీకే నండీ !

Leave a Reply to harikrishna mamidi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)