హామ్లెట్ నుంచి హైదర్ దాకా…!

images1

ప్రపంచ సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం ఉన్న వారికైనా తెలిసిన షేక్స్ పియర్ ప్రఖ్యాత నాటకం “హామ్లెట్”. అత్యంత విజయవంతమైన విషాదాంత కథ అయిన దీన్ని సినిమా గా మలచటం అంత తేలికైన పని కాదు, దీనికి బహుశా షేక్స్ పియర్ ఆత్మను ఒడిసి పట్టిన విశాల్ భరద్వాజ్ మాత్రమే సరైన వ్యక్తి . ఇంతకు మునుపే “మాక్బెత్” ఆధారంగా “మక్బూల్”, “ఒథెల్లో” ఆధారంగా” ఓంకార” లాంటి చిత్రాలు తీసి అదే దారిలో “హామ్లెట్” ఆధారంగా రూపొందించిన చలన చిత్రం “హైదర్”

విశాల్ భరద్వాజ్, షేక్స్ పియర్ కథల ఆధారంగా నిర్మించే చిత్రాల విషయంలో ఎంచుకొనే నేపధ్యం ఆ చిత్రానికి ఆయువు పట్టు , అలాగే ఈ సినిమాకి 1995 లో కాశ్మీర్ సమస్య ను నేపధ్యంగా తీసుకోవటంతో ఈ సినిమా ను ఒక క్లాసిక్ గా నిలబెట్టింది . మానవ నైజాలు, అధికారం / ఆధిపత్యం కోసం జరిగే కుట్రలు, మోసాలు ఇదే నేపధ్యం, ఈ నేపధ్యం కొత్త కాకపోవచ్చు, కానీ దాన్ని కాశ్మీర్ సమస్యకు ముడిపెట్టటం, దాన్ని హామ్లెట్ ఆధారంగా నడిపించటం ఇది సినిమాని మరింత రక్తి కట్టించేలా చేశాయి,. అదే సమయంలో టెర్రరిజానికి, సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్దంలో సామాన్యులు ఎలా బలవుతున్నారో కూడా మనకు కళ్ళముందు చూపుతుంది ఈ సినిమా . నిజానికి హామ్లెట్ లో ముఖ్యమైన మలుపు ఒక కల రూపంలో ఉంటుంది . ఇలాంటి ఒక ఇల్యూజన్ ని ఇలాంటి మోడరన్ కథలో విశాల్ భరద్వాజ్ చెప్పిన విధానం చాలు, అతను ఎంత ప్రతిభావంతమైన దర్శకుడో చెప్పటానికి, మరో గొప్ప విషయం హామ్లెట్ లో లా ఇందులో హామ్లెట్ తండ్రి చనిపోయాడు అని మనకు ముందుగా తెలియదు, అలా నేరుగా చెప్పాల్సిన పాయింట్ ని ఇల్యూజన్ గా, ఇల్యూజన్ గా చెప్పాల్సిన పాయింట్ ని నేరుగా చెప్పటం ద్వారా హామ్లెట్ కు సరికొత్త రూపు అందించాడు విశాల్ భరద్వాజ్.

images

కాశ్మీర్ తీవ్రవాదులకు కి ఆశ్రయం ఇస్తున్నాడు అనే కారణంతో భారతసైన్యం డా.హిలాల్ మీర్(నరేంద్ర జా) ని మాయం చేస్తుంది, అతని భార్య గజాలా (టాబూ) , తన తండ్రిని వెతుక్కుంటూ వస్తాడు హైదర్ (షాహీద్ కపూర్) , ఆ వెతుకులాటలో అతని తండ్రి మాయానికి తన బాబాయి ( కె కె మీనన్) కారణం అని తెలుస్తుంది, అదే సమయంలో తన తల్లి ని బాబాయి పెళ్ళి చేసుకుంటాడు , అసలు హిలాల్ మీర్ ఏమయ్యాడు, అతని మాయానికి కెకె కి సంబంధం ఉందా ?? తల్లి కి కూడా సంబంధం ఉందా ?? అసలు తండ్రి మాయానికి బాబాయికి సంబంధం ఉంది అని హైదర్ కి ఎవరు చెప్పారు ?? ఆ సమాచారం నిజమేనా ?? ఇన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే హైదర్ ని చూడాల్సిందే

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి ఆంటే, తాబూ ఇంతకు ముందే తన ప్రతిభ నిరూపించుకుంది కాబట్టి కొత్తగా చెప్పేదేమీ లేదు ,ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షాహీద్ కపూర్ గురించి, ఇన్ని రోజులు కేవలం లవర్ బాయ్ గా కనిపించిన షాహీద్ కపూర్ లో ఇంతటి నటుడు ఉన్నాడంటే నమ్మశక్యం కాదు, అంత అధ్బుతంగా నటించాడు, ఎక్కడా మనకు హైదర్ తప్ప షాహీద్ ఎక్కడ మనకు కనిపించడు. నేపధ్య సంగీతం కూడా విశాల్ భరద్వాజే సమకూర్చుకోవటంతో ఎక్కడ ఎంత మోతాదులో ఎలాంటి ఫీల్ ఇవ్వాలో అలాగే ఉంది, పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ కాశ్మీర్ అందాలనే కాదు, దాని వెనుక ఉన్న ప్రమాదాలను, మోసాలను, మాయలను కూడా కళ్ళముందుంచింది.

ఈ సినిమా గురించి చెప్పుకోదగ్గ మరో గొప్ప విషయం, అసలు ఈ సినిమాని విడుదల చేయటానికి భారత ప్రభుత్వం కానీ, సైన్యం కానీ ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చెయ్యకపోవటం. ఒకటి, రెండు సన్నివేశాలు భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని కథలో భాగంగానే చూడాలి తప్ప, అది ఏ ఒక్క వర్గానికో వ్యతిరేకంగా చూడకూడదు, మనకు ఇన్నాళ్ళు కాశ్మీర్ కు సంబంధించి, ఏదో ఒక వర్గానికి సంబధించిన కోణంలో మాత్రమే చూడటానికి అలవాటు పడ్డ మనకు, ఇది కాశ్మీర్ గురించి ఇరు వర్గాల కోణంలో చూపించటం ఒక విశేషం.

-మోహన్ రావిపాటి

mohan

Download PDF

2 Comments

  • రివ్యూ చాల బాగా రాసారు…కీప్ గోయింగ్…..

  • నిజమే మోహన్ మీరన్నది ఇన్నాళ్ళు మనం మణిరత్నం తీసిన రోజాను ఆగస్ట్ పదిహేనుకి రిపబ్లిక్ డేకు చూస్తూ మువ్వన్నెల గుడ్డను కాలిపోకుండా ఆర్పే సీన్ చూస్తూ పళ్ళు పట పట కొరుకుతూ పిడికిలి బిగించేస్తూ లంచ్ టైం లో అన్నమో బిరియానీయో లాగించేసే వాళ్ళం. కానీ అక్కడి సామాజిక నేపథ్యాన్ని వాళ్ళకి ఉగ్రవాదం నుండి విముక్తి పేరుతో నిర్దాక్షిణ్యంగా అమాయక యువకులను మేధావులను చాలా తేలికగా కాల్చిపారేసె ఇండియా సైనికాధికారులను చూపడం గొప్ప విషయం. ఓ కుటుంబం తనకు జరిగిన అన్యాయానికి చివరికి ఎలా ప్రతీకారం వైపు వెల్తుందో అది హింసకాదు ప్రతిహింస మాత్రమే అని మనం ఒప్పుకునేట్టు చూపడంలో దర్శకుని ప్రతిభకు జోహార్లు. నటన విషయంలో పాత్రధారులందరూ మీరన్నట్టు బాగా ఒప్పించారు. హీరోకు హృదయ పూర్వక అభినందనలు. మంచి పరిచయాన్ని రాసిన మీకు అభినందనలు.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)