పెదాల తీరం మీద ఒక ముద్దు

images92AXZ2FU

 images92AXZ2FU

-రవీంద్రనాథ్ ఠాగూర్

రెండు జతల పెదవులు

ఒకదాని చెవిలో మరొకటి

గుసగుసలాడుతున్నట్టు

ఒకదాని హృదయాన్ని

మరొకటి జుర్రుకుంటున్నట్టు

స్వస్థలాల్ని వదిలి

తెలియని ఏ లోకాలకో

పయనం ప్రారంభించిన

రెండు ప్రేమలు

పెదాల కూడలిలో కలుసుకున్నట్టు

అనుబంధపు ఉధృతిలో

ఎగసిన రెండు కెరటాలు విరిగి పడి

పెదాల తీరం మీద కలుసుకున్నట్టు

ఆకలిగొన్న రెండు మోహాలు చిట్టచివరికి

దేహపు అంచున కలుసుకున్నట్టు

చిత్రలిపిలో లలిత శబ్దాలతో

పెదాల ముద్దుల పొరల మీద

ప్రేమ గీతం రచిస్తున్నట్టు

ఇంటికి తీసుకువెళ్లి దండ గుచ్చడానికి

ఆ రెండు జతల పెదాల నుంచి

ప్రేమ పుష్పాలను ఏరుకుంటున్నట్టు

వర్ణవిలాసాల శయ్య మీద

ఎంత మధురమీ కలయిక

 

ప్రస్తుతం ముద్దు మీద జరుగుతున్న చర్చనూ రచ్చనూ నిర్బంధాన్నీ సంప్రదాయం పేరుమీద మొరటుదనాన్నీ చూస్తుంటే నూటముప్పై సంవత్సరాల కింది ఈ కవితను పరిచయం చేయాలనిపించింది. 1886లో అచ్చయిన ఠాగోర్ కవితాసంకలనం కోరి ఒ కోమల్ లోని చుంబన్ అనే ఈ కవితకు కనీసం మూడు ఇంగ్లిష్ అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఒకటి బహుశా ఠాగూర్ స్వయంగా చేసుకున్నది కాగా, మిగిలినవి కుముద్ బిశ్వాస్, ఫక్రుల్ ఆలమ్ చేసినవి. ఈ అనుసృజనకు ఆధారం ఆ మూడు అనువాదాలు, అనుసృజనలు.

- ఎన్. వేణుగోపాల్

Download PDF

3 Comments

  • ముద్దంత తీయగా ఉంది :-)

  • ప్రేమికుల హ్రుదయస్పందనకు కలిగిన మోహావేశానికి సంకేతం పెదాల కలయికగా వ్రాసినట్లు కనపడుతోంది , కాని దీనికి ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు , చర్చకు సంబంధం లేదేమోకదా !

    • Manjari Lakshmi says:

      బహిరంగ స్థలాలలో కదా ఆ పనులు చెయ్యద్దంది. ప్రేయసి, ప్రియుల గురించి కదా ఈ కవిత్వం లో రాసింది. ఈ వస్తువు మీద కవితలు కూడా చాలానే ఉండి ఉంటాయోమో కదా!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)