రవి వర్మ గురించి కొత్తగా…

pacc196_the_unveiling_draupadi

krishna_helps_draupadi_db47

Art is an evolution. చిత్రాలు వెయ్యటం అనేదే మనిషి తన తోటి వారి కంటే లోతు గా భిన్నం గా ఎలా ఆలోచిస్తున్నాడు అనే దానికి ప్రతీక. ఇక్కడ ఎవొల్యూషన్ అనేది డార్విన్ సిద్ధాంత పరం గా కాదు. ఒక మనిషి ఎదుగుదల (ఎవొల్యూషన్) అన్నది అతని పైన పడే ప్రభావాల బట్టి ఉంటుంది. ఎంత మందిని కలిశాడు? ఎన్ని దేశాలు తిరిగాడు? ఎంత నేర్చుకోగలిగాడు? ఆ నేర్చుకున్నదాన్ని ఎంత సమర్ధవంతం గా ఇంకొకడికీ నేర్పగలిగాడు. దీని ద్వారా తాను మరొక stage of evolution కి ఎంత తోడ్పడగలిగాడు? ఇదీ ఎవొల్యూషన్ యొక్క స్వరూపం. కనీసం కళ పరం గా. భారతీయ సంప్రదాయ చిత్రకళ ని సమర్ధించే వారికీ, రవి వర్మ అభిమానులకీ క ఒక శతాబ్దం గా నడుస్తున్న వాదాలకీ మళ్లీ “రంగ్ రసియా” తెర తీస్తోంది.

ఈ నేపథ్యం లో ఇద్దరు చిత్రకారులు తాము కలిసి తయారు చేసిన వ్యాసం లో ఆయనను కొత్తగా దుయ్యబట్టారు. కానీ గమనించ వలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతం లో ఈ చిత్రాలని వ్యతిరేకించటానికి అప్పటి స్వాతంత్ర్య స్ఫూర్తి ఒక ముఖ్య కారణం. యురోపియన్ ఐన ప్రతి విషయాన్ని వ్యతిరేకించటం లో వచ్చే kick .. adrenaline rush .. ఆ కాలానికి నా వరకు క్షమార్హం. కానీ దాదాపు వంద ఏళ్లు గడిచాక కూడా అప్పటి తమ భావజాలానికి ఒక సార్ధకత ఆపాదించే ప్రయత్నం ఇంకా జరుగుతూ ఉండటమే కొంచెం కలవరపరిచింది. భారతీయ చిత్రకళ లో ముఖ్యమైనవి రేఖలు. రేఖలంటే రెండు ప్రదేశాలని విడగొట్టే ఒక సాధనం. ఆ రేఖలు స్ఫుటం గా కనిపించాలి. తప్పదు. దాన్ని మరీ clear గా చూపించేది ఇండియన్ art. గుహాల్లో కుడ్య చిత్రాలు, చిన్న పిల్లల యానిమేషన్ సినిమాలు ,అన్నిటికీ రేఖలే ఆధారం. ఎందుకంటే, వాటిని perceive చెయ్యటం తేలిక కనుక!

రేఖల్నుంచి కొంత ముందుకి వెళ్తే రంగులొస్తాయి.. ఇంకొంచెం ముందుకు వెళ్తే వెలుగు నీడలు వస్తాయి. వీటిని perceive చెయ్యటం, చెయ్యగలగటం కొన్ని వేల ఏళ్ల తపస్సు ఫలితం గా భావిస్తాను నేను. చిన్న పిల్లవాడు ఆపిల్ ఎర్ర గా ఉంటుంది.. గుండ్రం గా ఉంటుంది అని చెప్పగలడు. ఆర్టిస్ట్లు అవ్వబోని వాళ్ళు అక్కడితో ఆగిపోతారు. ఆ పిల్లవాడికే ఆ ఎరుపు ఉదయం వెలుతురు లో ఒక లాగా సంధ్య వెలుతురు లో ఒక లాగా వెన్నెల లో ఒక లాగా కనిపిస్తే? ఒకే రంగు కి ఉన్న వేల వేల రూపాల్ని గుర్తు పడుతూ పో గలిగితే? ఆ పండు ఛాయ తెల్లని టేబల్ పైన ఎలా పడుతోంది? గాజు టేబల్ పై ఎలా పడుతోంది? పసుపు రంగు వేసిన గోడ పై ఎలా పడుతోంది? ఇన్ని రకాల ప్రశ్నలు వేసుకుంటూ పోతే… ఒక రోజు ఆ పిల్లవాడు చిత్రకారుడిగా తన మొదటి శ్వాస తీసుకుంటాడు. ప్రశ్నలు వేసుకుంటూ దానికి సమాధానాలు వెదుక్కుంటూ కొన్ని దశాబ్దాల కృషి తర్వాత ఆర్టిస్ట్ అనిపించుకుంటాడు. Perceive చెయ్యగలగటం పై చాలా గౌరవం ఉంది నాకు. ఒక పెద్ద శిల లో శిల్పా న్ని perceive చేయగలిగే శిల్పి ని చాలా గౌరవిస్తాను.

భారతీయమైనా పా శ్చా త్యమైనా సరే. సులువు గా కనిపించిపోయే వాటి కన్నా ఎన్నో రోజుల mental exercise తర్వాత మాత్రమే అబ్బే color perception , light perception అంటే మరీ గౌరవం నాకు. దాన్ని యురోప్ నుంచి రవివర్మ అప్పు తెచ్చుకు న్నంత మాత్రాన ఆది ఆయనది కాకుండా పోదు గా? నిజమే , రంగు చిత్రాలు, వెలుగు నీడలు ఉన్న చిత్రాలు కళ్ళకి ఇంపు గా ఉంటాయి రే ఖా చిత్రాల కన్నా. వాటిని అంత ఇంపు గా చేయటం కోసం పడ్డ శ్రమ ని తృణీకరించటం తప్పు . Mass appeal ఉన్నంతమాత్రాన అది కళ కాకుండా పోతుందా? కోట్ల మంది జనాల్ని మరో ప్రపంచం లోకి తీసుకెళ్లే సినిమా ఎలాంటి medium మరి? దాన్ని కూడా తప్పు పట్టి తక్కువ స్థాయి గా అనుకోవాల్సిందే నా? ఒక కథ ని తెర పై చూపించటం అనేదే passion గా బ్రతుకుతున్న directors ఎందరో? అలాంటి వారే రవివర్మ కూడాను.

Draupadi_humiliated_RRV

తన ఊహ వందలాది మందికి చేరాలి అనుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. ఆది ఆర్టిస్ట్ లకి ఉండే సహజ లక్షణం. ఏ స్థాయి వారినుంచి మెప్పు కోరుకుంటున్నారు అనేది వారి వారి ఇష్టం. It just does not disqualify them from being great artists. ఇక పోతే కొత్తదనం. రవి వర్మ యురోపియన్ ఇమిటేటర్ అనే విమర్శలు చాలా ఉన్నాయి ఆయన పైన. ఇక్కడ ఆర్ట్ కి క్రాఫ్ట్ కి మధ్య ఉండే ఒక భేదం తెలుసుకోవాలి. Craft can be taught. Its a monotonic pastime of the mind, while art is a limitless expansion of the same capability. Not everyone can be an artist, but everyone can be a crafter with certain amount of practice. A crafter need not dedicate his life to his craft., craft just does not demand you to be so. But art is a fiery monster that artists enjoy being devoured by. తంజావూర్ చిత్రాలని పెయింట్ చెయ్యటం gifted artists కానివాళ్ళు కూడా [ ఇతర చేతి పనుల లాగానే ] నేర్చుకోవటం చూస్తాం. అది వారి జీవితాల్లో ఎక్కువ సమయం తీసుకోదు. ఒక predetermined విధానం లో బొమ్మలు సాగటమే అందుకు కారణం.

Indian art లో so called నూతనత్వం ఎక్కడా ఉండదు. ఆది గురువు నించి శిష్యుడికి వచ్చే ఒక skill అంతే. గురువు వేసినట్టే శిష్యుడు వేస్తాడు. తమ regular జీవితాల్లో కొంత భాగం త్యాగం చెయ్యకుండా యురోపియన్ చిత్రకళ నేర్చుకోవటం సాధ్యమే కాదు. ముఖాల్లో భావాలు, scene setting , composition ఇవన్నీ యురోపియన్ చిత్రకళ పరిధి పెంచుతాయి. దాని లో ఒక కొత్త ఆర్టిస్ట్ తన సొంత మెదడు తో ఆలోచించటం చాలా చాలా అవసరం. రవి వర్మ చిత్రాల్లోనే కొన్ని పురాణ సన్నివేశాల్ని తన మనసు లో వచ్చిన విధం గానే వేశారు. He was indeed a visionary. ఫిల్మ్ డైరెక్టర్ సీన్ ని ఆలోచించుకున్నంత స్పష్టం గా ఎవరి ముఖాల్లోఏమి expression రావాలి అని ఎన్ని రోజులు ఊహించుకుని ఉంటారా అనిపిస్తుంది. దీని పైన పాశ్చాత్య శైలి ప్రభావం ఉంటే ఉండనివ్వండి . అక్కడ ఆయన full bodied emotions తో చిత్రీకరించింది భారతీయ సన్నివేశమే కానీ మరో టి కాదు గా? ఇలాంటి emotions ఇండియన్ ఆర్ట్ లో ఎక్కడ? ద్రౌపది సభ కి వచ్చి తనని కాపాడమని వెడుకునే painting చూస్తే కలిగే రసాను భవం

pacc196_the_unveiling_draupadi

రేఖా చిత్రాల్లో ఎక్కడినుంచి వస్తుంది? కళ్ళ ముందు జరిగినట్టు ఉంటేనేకదా మన empathy పుట్టేది ? ఇలాంటి అనుభవం కలంకారీ చిత్రాలని చూస్తేనో, కాంగ్రా చిత్రాలని చూస్తేనో నిజం గా వస్తుందా? ఒకవేళ వస్తే, వాటి కంటే గొప్ప వాటిని, ( ఇంకా శక్తి మంతం గా convey చెయ్యగలిగే వాటిని) చూశాక కూడా అలాగే వస్తుందా? Here we come back to the question of our evolution. Art has been evolving for several centuries, though not in a unidirectional sense. Realism ని వ్యతిరేకిస్తూ పుట్టిన impressionism , ఆరు బయటి చిత్రాలు ఎక్కువగా వెయ్యాలి అని, brush strokes ప్రస్ఫుటంగా గా తెలియాలి అని, వెలుతురు లోని భిన్నకోణాలు చూడాలని అనుకుంది. అదే సమయం లో పుట్టిన pre raphaelite movement మళ్ళీ roots లోకి వెళుతూ classic భంగిమలని, గ్రీక్ రోమన్ పురాణాల లోని సన్నివేశాలని చిత్రించింది. రెండూ నిలి చాయి.

Monet కి ఎంత పేరుందో John William Waterhouse కి అంతే పేరుంది. కానీ ఇద్దరూ వెలుగు నీడల్ని విస్మరించలేదు. వెలుగు నీడల్ని వదిలేసి మళ్ళీ రేఖ ల్లోకే వెళ్ళాలి అనుకోవటం ఒక obscurantism. Art is a celebration of the heights of human intellect. Artist is limitless. పరిధులు లేని ప్రపంచం లో తన దారి తనే వేసుకుంటూ వెళ్లే బాటసారి చిత్రకారుడంటే. ఇదే కళ, ఇలా ఉంటేనే కళ , ఇంత మందికి మాత్రమే నచ్చటం కళ లక్షణం అనుకోవటం ఆ పరిధుల్లేని ప్రపంచం లో తాము ఒక మూల దాక్కోవటమే ఔతుంది.

రవి వర్మ ఒక perfect artist కాక పోవచ్చు. ఆయన చిత్రాల్లో లోపాలు ఉండొచ్చు. కానీ ఆయన చిత్రాలు నచ్చని వారు కూడా ఒకందుకు ఆయన ని మెచ్చుకోవాలి అని అనిపిస్తుంది. ఆయన అప్పటి వరకూ ఉన్న path of least resistance ని వదిలేసి మంచి పనిముట్లు అరువు తెచ్చుకుని కొత్త బాట వేసుకున్నారు. ఆది చిన్నది సన్నని దీ అయినప్పటికీ తన వెనకాల చాలా మందిని పిలిచి ఆ బాట ని మరింత మెరుగు పరచమన్నారు. ఆ ధైర్యం ఉన్నవారే ఆ పని ఇప్పటికీ చేస్తున్నారు. మనవి అయినవి అన్నీ అన్నిటికన్న గొప్పవి కావు. గొప్పవాటిని మనవి కావు కనుక కాదనటం తప్పు. ఆ గొప్పతనాన్ని మనది చేసే ప్రయత్నాన్ని తప్పు పట్టటం heartless.

- సాంత్వన చీమలమర్రి

S_148220

Download PDF

29 Comments

 • kcubevarma says:

  Chitrakala gurinchi lotaina visleshanato ravi varma krushini marintaga aadarinche vidhamga saagina mee vyaasam abhinandaneeyam swaantana garu..

  • డియర్ అఫ్సర్ జీ ,
   ఈ వ్యాసం లోని క్రింది పదాలు చాలు చిత్రకళకు ,చిత్రకారుడికీ సాదర గౌరవం అందించడానికి. అఫ్సర్ జీ …ఇది గొప్ప విశ్లేషణ. సహజంగా శిల్పం సూటుగా తనకు తానూ వ్యక్తీకరించుకొంతుంది .రచన నాట్యం తమను తాము వ్యక్తపరుచుకుంటాయి . కాని చిత్ర కారుడి మూల భావనలకు భిన్నరీతుల , భిన్న కోణాల్లో విశ్లేషించబడి విభిన్న భాష్యాలు ఆపాదించబడటం చిత్రకళ ద్వారానే సుసాధ్యమయ్యింది. .తద్వారా ఉద్భవించి మూల చిత్రాలకన్నా ప్రసిద్ధికెక్కారు ఎందఱో విమర్శకులు, విశ్లేషకులు .

   “Craft can be taught. Its a monotonic pastime of the mind, while art is a limitless expansion of the same capability. Not everyone can be an artist, but everyone can be a crafter with certain amount of practice. A crafter need not dedicate his life to his craft., craft just does not demand you to be so. But art is a fiery monster that artists enjoy being devoured by …”

   • pavan santhosh surampudi says:

    ఇక్కడ అఫ్సర్ గారి ప్రస్తావన ఎందుకండీ?

   • editor says:

    రాఘవేంద్ర గారు, ఈ వ్యాస రచయిత పేరు సాంత్వన చీమలమర్రి. మీరు పొరపడినట్టున్నారు.

  • Santwana says:

   Thank you sir

 • మణి వడ్లమాని says:

  చిత్రకళ ను,గురుంచి అంత లోతుగా తెలియని నాలాంటి వాళ్ళకి కూడా అర్ధమయ్యే రీతి లో విడమర్చి రాసిన ‘స్వాంతన’కు అభినందనలు.

 • Suresh says:

  నా వరకు నాకు, రవి వర్మ పై వచ్చిన ఆ ఆటో బయోగ్రఫీ, సినిమా ల కన్నా మీ వ్యాసమే “చెప్పాలనుకొన్న మాటలని” చక్కగా చెప్పినట్లు అనిపించింది. ధన్యవాదాలు

 • Suresh says:

  నా వరకు నాకు, రాజ రవి వర్మ పైన వచ్చిన అటోబయోగ్రఫీ, సినిమాల కన్నా, మీ వ్యాసమే బాగా నచ్చింది, “చెప్పాలి” అనుకొన్నది చక్కగా చెప్పారు.

 • డియర్ ఎడిటర్ జి , డియర్ పవన్ సంతోష్ జి, మరియు సాంత్వన చీమలమఱ్ఱి గారు …చిన్న కంఫ్యూషన్ వల్ల… అఫ్సర్ గారి ప్రస్తావన పొరబాటుగా దొరిలింది . కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. . …శ్రేయోభిలాషి : నూతక్కి రాఘవేంద్ర రావు.

 • N Venugopal says:

  సాంత్వన చీమలమర్రి గారూ,

  ‘రంగ్ రసియా’ సందర్భంలో ప్రత్యేకంగా రవివర్మ మీద, మొత్తంగా చిత్రకళ మీద మీ వ్యాసం చాల బాగుంది. అవసరమైన విషయాలెన్నిటినో ప్రస్తావించింది. అభినందనలు. కృతజ్ఞతలు.

  వ్యాసంలోనూ, చర్చలోనూ దొర్లిన కొన్ని అంశాల గురించి చెప్పాలనిపిస్తున్నది. ఇది మీ మీద విమర్శ కాదు. మన రచనా, చర్చా సరళి మీద, రచనలో వ్యక్తమయ్యే అలసత్వం మీద చాల రోజులుగా నన్ను ఆందోళన పరుస్తున్న విషయాలు ఇక్కడ సారంగ పాఠకులతో పంచుకోవడానికి.

  1. మొదటి పేరాలో మీరు చాలచోట్ల కళాకారుల గురించి సాధారణంగా మాట్లాడుతూ — ఆలోచిస్తున్నాడు, అతని, కలిశాడు, తిరిగాడు, నేర్చుకోగలిగాడు, నేర్పగలిగాడు, తోడ్పడగలిగాడు — అని పుంలింగంలో రాశారు. క్రియకు కూడ లింగం ఉండడం అనే తెలుగు సంప్రదాయం ఇబ్బందికరమే కాని దాన్ని బహువచనం చేసి అధిగమించవచ్చు. ఇక సర్వనామం విషయంలో సాధారణ సందర్భాలలో అతడు అని వాడకుండా ఆమె అని వాడుతూ ఇంగ్లిష్ లో కొందరు స్త్రీవాద రచయితలు కొత్త సంప్రదాయం కూడ సృష్టించారు. మనమూ అటువంటి పని చేయవచ్చు.

  2. అలాగే ఆ పేరాలోనే ‘ఇంకొకడికి’ అనే మాట కొంత తప్పుడు ధ్వనికి దారి తీస్తుంది. ‘ఇంకొకరికి’ అంటే బాగుండేది. ఇంతకీ అది అచ్చుతప్పు కూడ కావచ్చు. అలా అయితే క్షమించండి (వ్యాసంలో చాల చోట్ల అచ్చుతప్పులున్నాయి).

  3. రవివర్మను, లేదా ఆయన కళను దుయ్యబడుతూ రాసిన ఇద్దరు చిత్రకారులెవరో, కనీసం ఆ రచన ఎక్కడ అచ్చయిందో చెప్పనప్పుడు ఆ ప్రస్తావన కూడ అవసరం లేదేమో.

  4. కొన్ని వీలయిన పదాలకు ఇంగ్లిష్ మాటల బదులు, తెలుగు మాటలు ఉంటే బాగుండేది.

  ఇవి మీ వ్యాసం విశిష్టతను, ప్రయోజనాన్ని, అందాన్ని ఎంత మాత్రం తక్కువ చేసేవి కావు. ఈ మచ్చలు లేకపోతే ఈ వెన్నెల ఇంకా ప్రకాశించేది గదా అని మాత్రమే.

  తా.క. సాంత్వన అనే పదాన్ని చాల మంది పొరపాటుగా స్వాంతన అని పలుకుతారు, రాస్తారు. ఇక్కడ మీ రచన మీద స్పందిస్తూ మీ పేరును కూడ అలా మార్చడం చూస్తే ఆశ్చర్యం కాదు గాని నవ్వొచ్చింది…

  • Santwana says:

   ధన్యవాదాలండి మీ స్పందన తెలిపినందుకు. ఇది నా మొదటి వ్యాసం. మీరు చెప్పిన అంశాలని దృష్టి లో పెట్టుకుంటాను ఈసారి రాసేటప్పుడు. .

 • నిశీధి says:

  చాలా రోజులకి ఒక మంచి ఆర్టికల్ చదివిన ఫీలింగ్ .

 • Prasuna says:

  సాంత్వన గారూ, మీ విశ్లేషణ/వ్యాసం చాలా గొప్పగా ఉంది. ముఖ్యంగా రవి వర్మ చిత్రాలకు వీరాభిమానిని నేను. అందులోనూ సరిగ్గా రెండు రోజుల క్రితమే మైసూర్ లోని జగన్మోహన్ పేలస్ లో ఉన్న ఆర్ట్ గేలరీలో రవి వర్మ చిత్రాలు చూసి వచ్చిన అనుభూతి నుంచి తేరుకునే లోపే మీ వ్యాసం చదవడం చాలా ఆనందంగా ఉంది.

  రవి వర్మ చిత్రాల్ని కూడా అంతగా దుయ్యబట్టిన వాళ్ళు ఉన్నారని మొదటిసారి వింటున్నాను.

  వ్యాసం మొత్తం ఎంత బావుందో ఈ క్రింది రెండు వాక్యాలు మాత్రం కలవరపరిచాయి.

  “రవి వర్మ ఒక perfect artist కాక పోవచ్చు. ఆయన చిత్రాల్లో లోపాలు ఉండొచ్చు. ..”

  • Santwana says:

   ధన్యవాదాలు ప్రసూన గారూ! పెయింటింగ్స్ పైన నా పిచ్చి కూడా సరిగ్గా మీరు చెప్పిన చోటే మొదలయ్యింది బహుశా ఒక పన్నెండేళ్ళ క్రితం. మా అదృష్టం కొద్దీ ఒక మంచి గైడ్ దొరికారు అప్పుడు. అంతంత పెద్ద చిత్రాలు.. వాటిల్లోని డీటయిల్స్ అన్నీ తెలుసుకునే సరికి ఒక ఉన్మత్తత లాంటి భావన. మీరు కూడా అదే చెప్పటం తొ ఒక నోస్టాల్జియా మొదలయ్యింది. :)

   ఒక ఇంపార్షియల్ స్టాన్స్ తీసుకుని వాదించటానికి ప్రయత్నం చేశాను మేడం ఇక్కడ. రవి వర్మ ను అభిమానించకపోయినా ఆయన ఖచ్చితం గా తీసివేయదగ్గ మనిషి కాదు అని చెప్పే ప్రయత్నం చేశాను. ఇంకా పర్ఫెక్షన్ అనేది ఒక రిలేటివ్ మెషర్. అది విమర్శకుల బట్టి మారొచ్చు. పర్ఫెక్ట్ గా లేనంత మాత్రాన అభిమానించకుండా ఉండక్కర్లేదు అనేది కూడా నా అభిప్రాయం. నేను వెదికేది అది కాదు. ఎంత అభిమానించే వారిలో అయినా పూర్తి పర్ఫెక్షన్ ఉంది అనుకోవటం కొంత నా వైశాల్యం తగ్గిస్తుందేమో అనిపిస్తుంది కూడా. అర్థం చేసుకోగలరని మనవి.

  • Santwana says:

   ” చరిత్రలోకి వెళితే ఏదీ independant or original కాదు. ఈ నేపధ్యం లో మనది ఏదో చెప్పలేని అయోమయం లో, మనది కానిది మంచిది కాదనుకోవడం అసమంజసం.”

   “అలాగే ఎంతటి విశ్లేషనాత్మక విమర్శా కూడా ఆ ఆర్టిస్ట్ ఆలోచనా పరిధిని చేరుకోదు.”

   These are words to treasure sir. Thank you for your kind & encouraging words.

 • Abdul hafeez says:

  చిరంజీవి సాంత్వన ఉద్వేగం అభినందనీయం.చివరి వాక్యాలు నిజంగా హర్షణీయం. ప్రతి కళాకారుడి పనితనం లో ఆ కళాకారుడి ఇష్టాలు pamper అవడం సహజం. Intense కళాకారుడు తను ఇష్ట పడిన శైలికి కొంత మేర లోను కావడమే process of evolution of art. చరిత్రలోకి వెళితే ఏదీ independant or original కాదు. ఈ నేపధ్యం లో మనది ఏదో చెప్పలేని అయోమయం లో, మనది కానిది మంచిది కాదనుకోవడం అసమంజసం. మనం pants shirt తోడుగుతూ పాశ్చాత్య వ్యామోహం లో పడిపోతున్నామని వాపోవడం అవివేకం. ఏది వాడినా ఏది తోడ్డిగినా ఫిర్ భి దిల్ హే హిందుస్తానీ కాగిలిగితే ( మనసా వాచా కర్మణా ), అదే భారతీయం. మన కట్టడాల్లో విదేశి శైలిని, దక్షిణ భారతం లో ఉత్తర నిర్మాణ పోకడల్ని మన్నించి ఆదరించిన మనం మన కళాకారుడి విస్తృతిని ఆమోదించకపోవడం శోచనీయం. నిజమే artist is limitless. అలాగే ఎంతటి విశ్లేషనాత్మక విమర్శా కూడా ఆ ఆర్టిస్ట్ ఆలోచనా పరిధిని చేరుకోదు. Sometimes ఆర్టిస్ట్ కూడా తన పనిని పూర్తిగా translate చేయలేడు. సాంత్వన చెప్పదలచుకున్న ప్రయత్నం బాగుంది. అవసరం కూడా. , thought processing ని చివరివరకు పట్టివుంచ గలిగే నేర్పు , connectivity, ఇంకా అలవాడాలి. వేణుగోపాల్ గారి మాటలు గమనీయం. భావ ప్రకటనలో కొంత స్వాంతన అలవడితే సాంత్వన is a good critic in the making.

 • buchireddy gangula says:

  స్వాంతన — మొదట మీ పేరు చాల భాగుంది -madam—

  యిక ఆర్ట్ గురించి a- b-c- d– కూడా తెలియదు — కాని మీ ఆర్టికల్
  చదివి కొంత అయిన తెలుసుకోగలిగాను — బాగా రాశారు
  ——————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

  • Santwana says:

   క్షమించాలి.. మీ వ్యాఖ్య ఆలస్యం గా చూశాను.. ధన్యవాదాలండీ..

 • buchireddy gangula says:

  సాంత్వన —గారు
  పేరు తప్పుగా raashaanu– సారీ

  ——————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

 • kuppilipadma says:

  ప్రియమైన సాంత్వన, వెలుగునీడల రంగురంగు గీతల్లో మీ అక్షరాల వెంట చూపులు విహరించాయి.

  మీదైన సరికొత్త చూపు విశాలంగా అనిపించింది.

  యిది మీ మొదటి రచన కదండి. Congratulations. మరిన్ని రచనలు మీవి చదవాలని వుంది.యెదురు చూస్తూ…

  • Santwana says:

   Madam !! This is so exciting!! I am so glad you liked it.. మీకు చాలా పెద్ద అభిమానిని నేను..

 • v.v.Bharadwaja says:

  The first time I have an opportunity to read this web magazine of the SARANGI, suitable to sahithi pipasakulaku. Very impressive and impartial selective stories and more informative ,knowledgible, for a good tasteful articles.Just reminding of the BHARATHI..one of the best magazine in the olden days. All the best for the entire team of the Magazine.

 • అకాడమిక్ ఎస్సే లాగా ఆసక్తికరంగా ఉందండీ.. అప్పుడే అయిపోయిందా అనిపించింది I wish it were little longer.
  రవివర్మ గారి పెయింటింగ్స్‌‌ను ‘భారతీయం’ కాదు అనేవాళ్ళున్నారని మీరంటుంటే ఆశ్చర్యమేస్తుంది.

Leave a Reply to Prasuna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)