వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ?

images

ఆప్తులని పోగొట్టుకున్న దుఃఖం కలిగించే దిగులు ఏ ఇద్దరిలోనూ ఒకేలాగా ఉండదు. మనకి తెలియకుండానే మనం సిద్ధపరచబడి ఉంటాము. జన్యులక్షణాలకి తోడు , ‘ ఈ స్థితికి ఇది, ఇంత, ఇన్ని రోజులు ‘ అనే లెక్క మనసులో పనిచేస్తూ ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య సామాజికభేదాలు ఇక్కడా వర్తిస్తూ ఉంటాయి. మగవాడు ఏడవకూడదు, దళసరి చర్మం తో ఉండాలి, వీలైనంత త్వరగా రోజువారీ పనులలో పడిపోవాలి అని ఆశించబడుతుంది. [ ఎవరి చేత ? తెలియదు. ] ఒకప్పుడు మగవాడు మాత్రమే సంపాదించి ఇల్లు గడపాలి కనుక, ఉమ్మడి సంసారాలలో స్త్రీ ఏడుస్తూ కూర్చున్నా ఎవరో ఒకరు ఆమె చేయవలసిన పనులు చేసిపెడతారు గనుక – దీనికి కొంత అర్థం ఉందేమో. ఇద్దరే ఉన్నప్పుడు అది సంక్లిష్టం . బిడ్డ పోతుంది- ఆ బిడ్డ ఇద్దరిదీ, దిగులు మాత్రం ఎవరిది వారిదే. అంతే అవకుండా – అవతలివారు ఇట్టే మామూలయిపోయారే అన్న బాధ, నింద ఉంటే ? అనిపిస్తున్నది సరిగా చెప్పగలిగే నేర్పు లేనప్పుడు ? అప్పుడెలా ?   దిగులుకి కొలతలూ గీటురాళ్ళూ ఏవి? ఎవరు నిర్ణయిస్తారు ?

ఇదే దుఃఖం, వాస్తవ ప్రపంచం లో-   అప్పటిదాకా సయోధ్య లేని రెండు జంటలలో -ఇద్దరిని విడదీయటం నాకు తెలుసు, మరో ఇద్దరిని దగ్గర చేయటమూ తెలుసు.

Robert Frost వి Stopping by woods on a snowy evening, The road not taken వంటి పద్యాలే నాకు తెలుసు అదివరకు, సంపుటమేమీ దొరకలేదు . అంతర్జాలం తెలిసిన కొత్తలో చదివిన ఈ పద్యం వెంటపడుతూనే ఉంది. దీన్ని అనువాదం చేయటం లేదు, నిజానికి ఇందులో అర్థం కానిదేమీ లేదు. నాకు అర్థమైనట్లుగా చెబుతున్నానంతే.

కవి తన జీవితం లో అటువంటి దుఃఖాన్ని, పుత్రశోకాన్ని- అనుభవించి ఉన్నారు, ఆ విషయానికి ప్రాధాన్యం ఉందో లేదో నాకు తెలియదు

దారుణమైన Communication gap ని ఇంత తక్కువ మాటలలో చెప్పటం కష్టం- కవి అనాయాసంగా చెప్పినట్లు అనిపిస్తుందే కానీ…

ఈ వేదనా మయమైన పద్యం సంభాషణలతో , కదలికలతో- ఒక నాటిక లాగా నడుస్తుంది. శోకం నుంచి బయటికి రాలేని, రాదలచుకోని భార్య- ఆ దుస్సంఘటన జరిగిన నాడు కూడా తన మనసుని ఏవో లోకసహజమైన మాటల్లో దాచి మటుకే చెప్పగలిగిన భర్త- ఇందులో. అతను ఆమెకి అర్థం కాడు, నచ్చడు. ఆమె అతనికి అర్థమవుతుంది, నచ్చజెప్పలేడు. అనాలనుకోనివి అంటాడు, అనకూడనివి కూడా, అప్రయత్నంగా, అవివేకంతో. ఆమె పోనీలే అని సహించదు , నిరంతరమైన దుఃఖపు జాతరని విడిచి కాస్త పక్కకి రాదు.   ఈ ద్వంద్వం పద్యం చివరలో కూడా విడిపోదు, వాళ్ళిద్దరూ ఒకటి కారు. పద్యానికి ఉంచిన శీర్షిక వారి బంధాన్ని కూడా ఉద్దేశించినదా అని గుండె గుబుక్కుమంటుంది. కాకూడదు, కాకపోతే బావుండును.

ఆమె ఒంటరిగా నిలుచుని మేడ మీది కిటికీ లోంచి చూస్తూ అతనికి కనిపిస్తుంది.ఏదో భీతి ఆమె ముఖం లో. ఆమెది గతాన్ని ఎట్టయెదుట చూడలేని భీతి, చూపు మరల్చుకోలేని యాతన.    ఆమె అలా చూస్తూండటాన్ని అతను తరచు చూస్తూనే ఉన్నా, ఆ రోజువరకూ దేన్నో ఎందుకో అడగాలని స్ఫురించదు. అది అతని స్వభావం – మామూలు మాటలలోకి రానిది ఏదైనా అతన్ని ఇబ్బంది పెడుతుంది. అడుగుతాడు, ఆమె చెప్పదు. తనూ చూస్తాడు. ” ఆమె చూడనిచ్చింది అతన్ని- గుడ్డివాడిని ” అంటారు కవి. నిజం గానే మొదట ఏమీ కనిపించదు అతనికి. మెల్లగా తెలుస్తుంది- అది వాళ్ళ కుటుంబపు స్మశానవాటిక- ఇంటి ఆవరణ లోనే. ఇక్కడా అతను వేరే ఎవరివో సమాధుల గురించి ముందు మాట్లాడతాడు, చివరన తమ చనిపోయినబిడ్డ ని దాచుకున్న మట్టిదిబ్బ గురించి.

images

దీన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు- మొదట అతను నిజంగానే చలనం తక్కువ మనిషి కావచ్చునని, అందుకనే ఆ దృశ్యపు స్థూలమైన స్వరూపమే ముందు కనబడిందని.

రెండోది బిడ్డ సమాధి కనిపించినా ముందే దాని గురించి చెప్పేందుకు నోరు రాలేదని

మూడోది- అతను మనసుని ఎంత సమాధానపరచుకున్నాడంటే , చనిపోయిన బిడ్డ స్మృతి ని ప్రయత్నపూర్వకంగా వెనక్కి నెట్టి ఉంచే అలవాటు చేసుకున్నాడని. అతనితో కవి అనిపించిన మాటలు ” అలవాటైపోయింది, అందుకని గమనించలేదు ” అని.

ఎందుకైనా గానీ, అది ఆమెకి సరిపోదు. ” చెప్పకు, వద్దు ” అనేస్తుంది.

” ఏం ? పోయిన బిడ్డ గురించి ఒక మగవాడు తలచుకోనేకూడదా ? ” అంటాడు అతను. ఈ ప్రశ్న ఆమెనే కాదు, మగవాడు తన మనసు రాయి చేసుకోవాలని బోధించినవారినీ   అడుగుతున్నాడేమో. ఆ  సాధారణీకరణే ఆమెకి నచ్చనిది.

‘’ ఊపిరాడటం లేదు, వెళ్ళిపోతాను ఇక్కడినుంచి ‘’ – బయలుదేరుతుంది .

” వెళ్ళకు- ఈసారి మరొకరి దగ్గరికి ” అంటాడు అతను. ఎవరో పరాయివారి దగ్గర బాధను వెళ్ళబోసుకుంటూ ఉంటుంద న్నమాట.ఆమె వేదనని సరిగ్గా గుర్తు పట్టే ప్రయత్నం లో – నిన్నొకటి అడుగుతాను చెప్పమంటాడు. నీకెలా అడగాలో తెలిస్తే కదా అంటుంది ఆమె.

”తెలియకపోతే చెప్పచ్చు కదా ? ”

ఆమె ఏమీ మాట్లాడదు, పట్టించుకోదు.

” నీతో ఏమన్నా తప్పే. నీకు నచ్చేలా మాట్లాడటం నాకు చేతకాదు. కాని చెబితే నేర్చుకుంటాను కదా ? ” – ఎంతో సాదాగా, పరిచితం గా ఉన్నాయి కదా ఈ మాటలు…మన నాన్నల, అన్నల, భర్తల నుంచి విన్నవి- ఈ పద్యం అందు కూ పట్టి లాగుతుంది.

‘’ A man must partly give up being a man with women-folk. ‘’

ఈ మాటలను మరొకలా చెప్పటం అసాధ్యం.

” మనమొక ఒప్పందానికి వద్దాం- నీకు ఏ విషయం అపురూపమో నేను దాని జోలికి రాను, సరేనా ?

కాని ప్రేమ గల ఏ ఇద్దరూ అలాగ జీవించరాదు

ప్రేమ లేని చోట అలాగే బతకాలి, తప్పదు

ప్రేమే ఉంటే- ఆ అరమరికలు వద్దు-[ఈ మాటలు కవివి కూడా]

నీ దుఃఖం లోకి నన్ను రానీయవూ ? ఈ లోకానికి సంబంధిం చినదే అయితే – నాతో చెప్పకూడదూ ?”

అలౌకికమైనదైతే తన అనుభూతిలోకి రాదనే అతని అనుమానం. మరింకొకరితో మాత్రం పంచుకోవద్దని మళ్ళీ అర్థిస్తాడు.

‘’ వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ? ‘’

అంటూనే – ” నువు కాస్త అతి చేస్తావనిపిస్తుంది అప్పుడప్పుడు ” అని నోరు జారతాడు

” నువ్విలా కుమిలిపోతూ ఉంటే – ఏ లోకాన ఉన్నాడో గానీ, వాడికేమి మేలు, చెప్పు ? ” అని తర్కిస్తాడు.

దుఃఖం ఏనాడయినా తర్కం తో శమించిందా !

ఆమె ముఖం లో తిరస్కారం.   అతనికి కోపం వస్తుంది.

”ఏమి ఆడదానివి నువ్వు ? పోయిన నా బిడ్డ ని నేను తలచుకుంటే- ఇంత రాద్ధాంతమా? ”

” నీకు తలచుకోవటం వచ్చా ? ఏ మాత్రం సున్నితం ఉన్నా నీ చేతులతో నువ్వే వాడిని పాతిపెట్టే గొయ్యి తవ్వుతావా ? నేను చూస్తూనే ఉన్నాను, ఈ కిటికీ లోనుంచే- ఎంత బలంగా తవ్వావు అప్పుడు ! గులక రాళ్ళు గాలిలో కి ఎగిరెగిరి పడేలాగా…అది నువ్వని గుర్తే పట్టలేదు నేను ”

ఆమె దూషించిన ఆ చర్యే- భగ్నతతో, నిస్సహాయమైన క్రోధం తో జరిగిఉండవచ్చని ఆమెకి తట్టదు. అతనికీ వివరణ, సమర్థన తెలియవు .

” తడిబూట్లతోనే లోపలికి వచ్చావు, ఆ మట్టిని ఇంట్లోకి తేగలిగావు . అప్పటి నీ మాటలు బాగా గుర్తు నాకు ” ఆమె అంది, అతనికీ గుర్తున్నట్లే ఉంది. ” దౌర్భాగ్యుడిని నేను దేవుడా, నవ్వొస్తోంది నాకు- దరిద్రపు నవ్వు ” అని నొచ్చుకున్నాడు .

ఆమె అదే ధోరణిలో – ” ఏమన్నావు నువ్వు ? మూడు రాత్రులు మంచు కురిస్తే, ఒక రాత్రి వర్షం వస్తే – మనిషి వేయగలిగిన ఏ కంచె అయినా కుళ్ళిపోతుందనలేదూ ? అవన్నీ మాట్లాడేందుకు అదా సమయం ? ” -ఆరోపించింది.

ఆ మాటలు బిడ్డ విషయం లో మానవప్రయత్నం అంతా వృధా అవటాన్ని సూచించాయని ఆమె అనుకోదు, అతనూ చెప్పడు- నమ్మదేమో అనా ? కవి చెప్పరు.

ఆమె అంటూనే ఉంది ” పోయినవారితో అంత దూరమూ ఎవరూ పోలేరు నిజమే, కాని మరీ అంత కొద్ది దూరమే అయితే అసలు వెళ్ళనే అక్కర్లేదు. అంత తొందర్లోనే బతికిన మనుషుల వైపుకి, తెలిసిన సంగతులలోకి, ఎవరి ప్రపంచం లోకి వాళ్ళువెళ్ళాలనుకుంటారు కదా, మృత్యువెంత ఒంటరిది ! లోకమెంత చెడ్డది…మార్చలేను కదా దీన్ని ”

అతనికి జాలేసింది – ” పోనీలే, అనాలనుకున్నవన్నీ అనేశావుగా, కొంచెం తేలికపడి ఉంటావు. ఏడుస్తూనే ఉన్నావు, వెళ్ళకు ఎక్కడికీ ‘’

” నీకలాగే ఉంటుంది. అంతటితో తీరుతుందా ..నీకేం చెప్పలేను అసలు- ఉండలేను, వెళతాను ”

ఆమె తలుపు తీస్తోంది…అతను కేక పెట్టాడు, వదులుకోలేక – ” ఎక్కడికి ? చెప్పి వెళ్ళు…నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను, వెనక్కి తెస్తాను- బలవంతంగా ”

పద్యం ముగిసింది.

http://www.poetryfoundation.org/poem/238120

He saw her from the bottom of the stairs

Before she saw him. She was starting down,

Looking back over her shoulder at some fear.

She took a doubtful step and then undid it

To raise herself and look again. He spoke

Advancing toward her: ‘What is it you see

From up there always—for I want to know.’

She turned and sank upon her skirts at that,

And her face changed from terrified to dull.

He said to gain time: ‘What is it you see,’

Mounting until she cowered under him.

‘I will find out now—you must tell me, dear.’

She, in her place, refused him any help

With the least stiffening of her neck and silence.

She let him look, sure that he wouldn’t see,

Blind creature; and awhile he didn’t see.

But at last he murmured, ‘Oh,’ and again, ‘Oh.’

 

‘What is it—what?’ she said.

 

‘Just that I see.’

 

‘You don’t,’ she challenged. ‘Tell me what it is.’

 

‘The wonder is I didn’t see at once.

I never noticed it from here before.

I must be wonted to it—that’s the reason.

The little graveyard where my people are!

So small the window frames the whole of it.

Not so much larger than a bedroom, is it?

There are three stones of slate and one of marble,

Broad-shouldered little slabs there in the sunlight

On the sidehill. We haven’t to mind those.

But I understand: it is not the stones,

But the child’s mound—’

 

‘Don’t, don’t, don’t, don’t,’ she cried.

 

She withdrew shrinking from beneath his arm

That rested on the banister, and slid downstairs;

And turned on him with such a daunting look,

He said twice over before he knew himself:

‘Can’t a man speak of his own child he’s lost?’

 

‘Not you! Oh, where’s my hat? Oh, I don’t need it!

I must get out of here. I must get air.

I don’t know rightly whether any man can.’

 

‘Amy! Don’t go to someone else this time.

Listen to me. I won’t come down the stairs.’

He sat and fixed his chin between his fists.

‘There’s something I should like to ask you, dear.’

 

‘You don’t know how to ask it.’

 

‘Help me, then.’

 

Her fingers moved the latch for all reply.

 

‘My words are nearly always an offense.

I don’t know how to speak of anything

So as to please you. But I might be taught

I should suppose. I can’t say I see how.

A man must partly give up being a man

With women-folk. We could have some arrangement

By which I’d bind myself to keep hands off

Anything special you’re a-mind to name.

Though I don’t like such things ’twixt those that love.

Two that don’t love can’t live together without them.

But two that do can’t live together with them.’

She moved the latch a little. ‘Don’t—don’t go.

Don’t carry it to someone else this time.

Tell me about it if it’s something human.

Let me into your grief. I’m not so much

Unlike other folks as your standing there

Apart would make me out. Give me my chance.

I do think, though, you overdo it a little.

What was it brought you up to think it the thing

To take your mother-loss of a first child

So inconsolably—in the face of love.

You’d think his memory might be satisfied—’

 

‘There you go sneering now!’

 

‘I’m not, I’m not!

You make me angry. I’ll come down to you.

God, what a woman! And it’s come to this,

A man can’t speak of his own child that’s dead.’

 

‘You can’t because you don’t know how to speak.

If you had any feelings, you that dug

With your own hand—how could you?—his little grave;

I saw you from that very window there,

Making the gravel leap and leap in air,

Leap up, like that, like that, and land so lightly

And roll back down the mound beside the hole.

I thought, Who is that man? I didn’t know you.

And I crept down the stairs and up the stairs

To look again, and still your spade kept lifting.

Then you came in. I heard your rumbling voice

Out in the kitchen, and I don’t know why,

But I went near to see with my own eyes.

You could sit there with the stains on your shoes

Of the fresh earth from your own baby’s grave

And talk about your everyday concerns.

You had stood the spade up against the wall

Outside there in the entry, for I saw it.’

 

‘I shall laugh the worst laugh I ever laughed.

I’m cursed. God, if I don’t believe I’m cursed.’

 

‘I can repeat the very words you were saying:

“Three foggy mornings and one rainy day

Will rot the best birch fence a man can build.”

Think of it, talk like that at such a time!

What had how long it takes a birch to rot

To do with what was in the darkened parlor?

You couldn’t care! The nearest friends can go

With anyone to death, comes so far short

They might as well not try to go at all.

No, from the time when one is sick to death,

One is alone, and he dies more alone.

Friends make pretense of following to the grave,

But before one is in it, their minds are turned

And making the best of their way back to life

And living people, and things they understand.

But the world’s evil. I won’t have grief so

If I can change it. Oh, I won’t, I won’t!’

 

‘There, you have said it all and you feel better.

You won’t go now. You’re crying. Close the door.

The heart’s gone out of it: why keep it up.

Amy! There’s someone coming down the road!’

 

You—oh, you think the talk is all. I must go—

Somewhere out of this house. How can I make you—’

 

‘If—you—do!’ She was opening the door wider.

‘Where do you mean to go?  First tell me that.

I’ll follow and bring you back by force.  I will!—’

mythili

 

 

Download PDF

10 Comments

 • Sivaramakrishna Vankayala says:

  Robert ఫ్రాస్ట్ కవిత్వం నాకు చాలా ఇష్టం. ఆయన కవితల్లో అధిక భాగం ఆనాటి అమెరికన్ గ్రామీణ వాతావరణం, పరిసరాలూ,ప్రకృతి పరిశీలనా అన్నీ కలగలిసి ఉంటాయి. స్వతహాగా ఒక రైతూ, కోళ్ళ పెంపకందారూ అయినా Frost గ్రామీణతను చక్కగా చిత్రించగలిగాడు. ఆయన మాటల్లోనే “Poetry is more often of the country than the city…Poetry is very, very rural – rustic. It might be taken as a symbol of man, taking its rise from individuality and seclusion – written first for the person that writes and then going out into its social appeal and use.” ఆయన రాసిన చాలా కవితల్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రఖ్యాతి పొందిన Stopping by the Woods on a Snowy Evening లో కూడా మనం దీన్ని చూడవచ్చును.
  మైథిలి గారు ఆంగ్ల సాహిత్యాన్ని ఆపోశన పట్టిన వారు కావడం వల్లnoo, కవితాహృదయము కలవారు కావడం వల్లనూ కవి మనసును చక్కగా చూడగలిగారు. మంచి వివరణ ఇచ్చారు. ఆమెకు నా ధన్యవాదాలు.

 • lakshmi says:

  చాలా బాగా వ్రాసారండి మైథిలి గ్కరు. ఆడవాళ్ళ శోకం వ్యక్తపరిచే తీరుకు మగవాళ్ళు దాన్ని జీర్ణించుకుని వ్యక్తపరిచే ఆలోచనాసరళికి ఉన్న తేడాని రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినదాన్నిఎంతో బాగా వివరించారు

 • Rekha Jyothi says:

  నిజమే ! ఒక్కోసారి మన బాధ కంటే మనకు ఇష్టమైన వారి బాధ ( ఎలాగూ తీర్చే అవకాశమే లేనప్పుడు ) తట్టుకోవడం కష్టం. అందుకే ఆ బాధించే కొన్ని విషయాలూ తెలిసీ తెలియనట్టు, చూడనట్టు , అంత ప్రాముఖ్యమైనవి కానట్టు పై పైన కనిపించే వ్యక్తి ప్రవర్తిస్తూ , లోపలి వ్యక్తిని దాచేస్తాడు “వెనక్కి నెట్టి ఉంచే ప్రయత్నం … ” చేస్తాడు . ఇంత ప్రయత్నం చేస్తున్న వ్యక్తి మరోసారి మరోసారి “ఇంకొకరితో పంచుకోకు నీ బాధను ” అని పదే పదే అర్దిస్తూ , “నీ దుఃఖం లోకి నన్ను రానీయవూ ! ” అని బ్రతిమాలినా సరే , అవతలి వ్యక్తి ఆశించిన ఆ కాస్తా వస్తే కాని శాంతించరేమో! – మైథిలీ మామ్ , ఈ మధ్య ఎప్పుడూ ఇంత భారంగా ఫీల్ అవ్వలేదేమో ! చాలా దగ్గరగా ,( చాలా ) రాశారు , కళ్ళముందు ‘ఒకే విషాదానికి ప్రతిఫలించిన రెండు వేర్వేరు నీడలు ‘ చూపించారు ఈ చిన్న వ్యాసం లో :( _/\_

 • గుండే పిండేసే బాధ. ఎందుకో అమీర్ ఖాన్ తలాష్ మూవీ గుర్తుకు వచ్చింది.కొడుకు కళ్ళ ముందే చనిపోయిన తరువాత రాణీ ముఖర్జీ, అమీర్ ఖాన్ ల మధ్య ఇలాంటి అగాధమే. బహుశ ఆ డైరెక్టరో, రచయితో ఈ కవిత తప్పక చదివి ఉంటారు. మైథిలీ గారు ఎంత బాగా ఆ బాధను విశ్లేషించారు! అణువణువు పట్టుకొని.

  • Mythili Abbaraju says:

   నిజమే రమాసుందరి గారూ..తలాష్ లో ఆ వైరుధ్యమే. ధన్యవాదాలు. మనం దుఖాన్ని ఎదుర్కొనే తీరు మీద అవతలివారి అభిప్రాయం ….ఈ విషయంలో మీ కథ నమూనాబొమ్మ నాకొక benchmark

 • రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన గ్రేట్ రస్టిక్ పోయెమ్స్ లో గుండెలు పిండే ఆర్ద్రతను కలిగించే కవితను పరిచయం చేసిన మైథిలి గారికి అనంతమైన థాంక్స్.

 • Mythili Abbaraju says:

  ధన్యవాదాలు యజ్ఞమూర్తి గారూ !

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)