తెలంగాణా కత 2013 ఆవిష్కరణ 29న!

10583882_10204556357861922_3574023066456842865_n

T katha pamphlet-page-001

Download PDF

11 Comments

  • తెలంగాణ కత 2013 ఆవిష్కరణ సందర్భంగా సంపాదకద్వయానికి అభినందనలు.

  • raamaa chandramouli says:

    మొట్టమొదటి “తెలంగాణా కథలను” తెస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్ కు,స్కై బాబా కు అభినందనలు.
    “రంది” సంపుటిలోని కథకుల పేర్లు కూడా ప్రకటించి ఉంటే బాగుంటుందేమో..!

    రామా చంద్రమౌళి,వరంగల్లు

  • raamaa chandramouli says:

    సారీ..కథకుల పేర్లు ఉన్నాయి.నేనే చూడలేదు.
    సంపాదకులు “తెలంగాణా కథకు” న్యాయం చేయగలరన్న విశ్వాసం సడలిపోయింది.
    “దు@ఖాగ్ని” అని “పాలపిట్ట” మాసపత్రికలో ప్రచురించబడి బహుళ పాఠకాభిమానమూ,ప్రత్యేక బహుమతీ పొందిన నా కథను బహిరంగ ప్రకటనకు ప్రతిస్పందనగా పంపిన నేను సంపాదకులకు.ఆ కథ ప్రత్యేకంగా తెలంగాణా ఉద్యమ క్షోభ నేపథ్యంగా రాయబడ్డ కథ . దానికి ఈ సంకలనంలో చోటు లభించలేదు.
    ఇన్నాళ్ళూ “ఆంధ్ర” పత్రికలు తెలంగాణా రచయితలను వివక్షతో అవమానించారు.ఇప్పుడు ” సిండికేట్లు సిండికేట్లు” ఏర్పడుతున్న తెలంగాణా రచయితల సో కాల్డ్ ముఖ్యులు పసగల నిజమైన తెలంగాణా కథను గుర్తించక ..వాటికి తగు గౌరవం ఇవ్వక విస్మరిస్తూ అవమానించడం ప్రారంభిస్తున్నారు.సంకలన కర్తలు తమ ఇష్టమైన కథలను పుస్తకాల్లో చేర్చాలనుకుంటే ఆ పని చేసుకోవచ్చు,కాని బాహాటంగా ప్రకటించి కథలను సేకరించినపుడు కథల నాణ్యతను జాగ్రత్తగా బేరీజు వేయవలసి ఉంటుంది.నా కథ “దు@ఖాగ్ని” ని బాహాటంగా పునర్ముద్రించి పాఠకుల తీర్పును కోరవలసి ఉంటుంది అది ఈ సంకలనంలో వస్తున్న ఏ కథకంటే అథమంగా ఉందో.
    “మా సంకలనం.. మా ఇష్టం” అని జవాబు చెబుతే ..అది భాధ్యతా విస్మరణే ఔతుంది.నేను ఒక సీనియర్ కథా రచయితగా ఈ అనారోగ్యకర ధోరణిని అభిశంసిస్తున్నాను.
    – రామా చంద్రమౌళి ,వరంగల్లు.

  • samanya says:

    ”తెలంగాణా కత”ప్రయత్నం చాలా సంతోషాన్ని కలిగించింది . మరిన్ని మంచి కథలు చదువుకోవడానికి అవకాసం కలిగిస్తున్న సంపాదకులకు అభినందలు . ప్రయత్నం పది కాలాలను చేరాలని కోరుకుంటున్నాను . పెద్దలకు ,రచయితలకు , వక్తలకు ,మిత్రులకు శుభాభినందనలు.
    పిఎస్ :కవర్ పేజ్ మస్తుంది .

  • Srinivasarao says:

    Nice coverpage

  • “ ఇన్నాళ్ళు “ ఆంధ్ర ” పత్రికలు తెలంగాణా రచయితలను వివక్షతో అవమానించారు. ” — రామా చంద్రమౌళి గారు ఎక్కువగా “ ఆంధ్ర ” పత్రికలలోనే పరిచయం అయ్యారు పాఠకులకు.

  • skybaaba says:

    Dear Sri Sangishetti ngaru/Sri sky baba garu,

    namaste,

    “TELANGANA KATHA-2013 ” nundi oka yagna sadrusha kaaryaanni meeru praarambhistunnanduku abhinandanalu.ee prayatnam vijayavantan kaavaalani aakaankshistaanu.

    naa katha “Dukhaagni” ( publishrd in ‘ paalapitta-Feb-March-2014..telangana raashtra aavirbhaava sanchika’)nu pamputunnaanu.parisheelinchi veelunte prachurinchandi.

    regards,

    -Prof.raamaa చంద్రమౌళి

    (రామా చంద్రమౌళి గారు మాకు పెట్టిన మెయిల్ ఇది.
    మేము వేసింది 2013 లో వచ్చిన కథలు..
    అకారణంగా అభిశంసించడం ఆయనకు తగదు..)

  • Chennuri Sudarshan says:

    గౌరవనీయ సంపాదకులు శ్రీయుతులు సంగిశెట్టి శ్రీనివాస్ మరియు స్కైబాబా గార్లకు నమస్కారములు.
    ఎన్నో వ్యవప్రయాసాలకోర్చి ‘రంది’ తెలంగాణ కథకులతో కూర్చిన సంపుటి తీసుకురావడం అభినందనీయం. వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.
    ప్రఖ్యాత రచయిత శ్రీ రామా చంద్రమౌళి గారి ఆరోపణ సరియైనది కాదనుకుంటాను. 2013 లో ప్రచురించిన కథల సంపుటి అని ప్రకటించినప్పుడు వారు అదే సంవత్సరంలో ప్రచురితమైన కథానికను పంపిస్తే బాగుండేదేమో!.. అని నా అభిప్రాయం. బహుశః సమాచార లోపమనుకుంటాను. పెద్ద వారికి అభిశంసించడం కంటే ఆశీర్వదించడం వారి ఉన్నతమైన మనసుకు శోభాయమానంగా ఉంటుంది.
    నేను ఎంతో కష్టపడి వారి ఇల్లు వెదికి పట్టుకొని వారికి నా ప్రథమ కథానికల సంపుటి ఇచ్చి దయతో చదివి స్పందన తెలియజేయుమని విన్నవించుకున్నాను. ఒక సారి ఫోన్ కూడా చేసి గుర్తు చేశాను. వారు నా మొర ఆలకించలేదు.
    ‘రచయితకు మరో రచయిత వైరి’ అనే సంప్రదాయం ప్రస్తుతం నెలకొని ఉందని గమనిస్తున్నాను.
    కేవలం ఇది నా వ్యక్తిగతం.. ఎవరి మనసినా నొప్పించిన వాడిని అయితే మన్నించగలరు..
    చెన్నూరి సుదర్శన్.

    • raamaa chandramouli says:

      సుదర్శన్ గారు..సారీ..సాధారణంగా ఏ రచయితైనా తన పుస్తకాన్ని నాకిచ్చిన వెంటనే స్పందించి నా అభిప్రాయం రాస్తాను.మీ విషయంగా ఎలా జరిగిందో..ఏదేమైనా అది పొరపాటే. మీరు దయచేసి ఆ విషయం మరిచిపొండి.శుభం.

      -మౌళి

  • raamaa chandramouli says:

    మొట్టమొదటిగా వస్తున్న ” తెలంగాణా కథ” లో నేనుకూడా ఉండాలనే కాంక్షవల్ల 2013..2014 ల విషయాన్ని గమనించకుండా నేనే తొందరపడ్డట్టున్నాను.
    ఔను పొరపాటు జరిగింది.
    చింతిస్తున్నాను.
    సంగిశెట్టి శ్రీనివాస్,స్కైబాబా గార్లకు హృదయపూర్వక అభినందనలు.

    – రామా చంద్రమౌళి

  • srinivas sangishetty says:

    మా ప్రయత్నానికి పూర్తీ సహకారం అందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సహకారం ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ

Leave a Reply to raamaa chandramouli Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)