లాల్ సింగ్ కవిత్వం గరమ్ గరమ్ చాయ్!

lalsingh1

 

కవులు తమలోకంకి నిజలోకంకి వంతెనలు కట్టలేక  పిచ్చివాళ్ళు గా మారతారో లేదా, ప్రపంచం మీద పిచ్చి ప్రేమ వాళ్ళని కవులుగా చేస్తుందా అన్నది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అయితే దానికి పర్ఫెక్ట్  అన్సర్ పేరులోనే ఆకలి రక్తం రంగు పులుముకున్న మన  మనసు కవి  లాల్ సింగ్ దిల్ మాత్రమే .  “నేను అనుభవించిన సామాజిక అన్యాయం, మానసిక వేదన మరియు భౌతిక హింస అన్ని నా కవితలు భాగంగా మారాయి అంటూ తన కవితల గురించి చెప్పుకున్న లాల్ సింగ్ , మనిషిగా వియత్నాం లో చేయలేని మంచేదో  నక్సల్బరి ఉద్యమం నాకీ దేశంలోనే అందించింది అని ఉద్యమం గురించి కూడా గొప్పగానే రాసుకున్న పంజాబీగా చరిత్రలో నిలబడిపోతారు  .

 

తక్కువ కులాల కుటుంబం లో( చమార్ ) పుట్టి కాలేజి చదువులు వరకు వెళ్ళిన మొదటి వ్యక్తిగానే కాదు అదే విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు గుండెల మీద చెయ్యి వేసుకొని ఇక్కడ నుండేదో జారిపోయిన ఫీలింగ్ అని అపురూపంగా మాట్లాడుకున్న  అందగాడై  ప్రేమ రూబాయిల రచయితగా పేరు తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే

(నిరాధారమయినది

అయినా ఒకే ఆలోచన ,

నాకు ఎప్పటికయినా మోక్షాన్ని

కలిగించేది నీ తల నూనేనెమో

: Forlorn, I contemplate

a single thought:

that your oiled hair

would bring me salvation. – )

lalsingh3

 

అంతే గాఢంగా ప్రేమించిన పెద్ద కులం (జాట్ ) అమ్మాయి తల్లి  ఇంటికి పిలిచి ఇచ్చిన టీ గ్లాసులు పట్టకారుతో నిప్పుల మీద కాల్చి శుద్ధి చేసుకున్న సంఘటనతో వణికిన మనసు పడ్డ వేదన అంతా అక్షరాల్లో రాసుకోగలగడం నిజంగా ఇంకో  ఎత్తు

(ఇక్కడ ఇతర గ్రహాల నివాసులు ఉంటే

ఎప్పటికి పెరగని రాళ్ళు గా మారిపోతారు ,

అదే జంతువులయితే ఈ మానవత్వం

తట్టుకోలేక భయంతో అరుస్తూ అడవుల్లోకి పరిగెడతాయి :

If the inhabitants of other planets

would learn of this

they would turn to stone

and never rise again

If animals were to

experience this

they would run to the forest

screaming in fear of humanity…)

 

అయితే బెణికిన మనసు గురించి రాసుకున్నా , వ్యవస్థ ఉలిక్కిపడే పదాలని వ్యక్తికరించి రాసుకున్నా , మొత్తానికి ప్రేమత్తుల భావనల నుండి  పదును లేని పదాల రోమాన్సుల నుండి పంజాబీ సాహిత్యాన్ని వీపు చరిచి ఆ భాష లో తన మాటలతో పుట్టించిన అగ్నికణాలు రగిలించిన మనిషి గా లాల్ సింగ్ దిల్  ఎప్పటికి గుర్తు ఉండిపోతాడు అంటూ తన కవితలు ఇంగ్లీష్ లోకి అనువదించిన నిరుపమ రాయ్ గారి మాటలు మాత్రం ఎప్పటికీ  అక్షర సత్యం .

 

పోతే , మనం తన రచనల్లో ముఖ్యమయిన sutluj Di Hawa (Breeze from the Sutlej) 1971; Bahut Sarey Suraj (So Many Suns) 1982; and Satthar (A Sheaf) 1997.  Naglok (The World of the Nāgas)  అంతే కాకుండా తన అటోబయోగ్రాఫి పుస్తకం  Dastaan ఇలా అన్ని చదువుకోలేకపోయినా  భారత దేశపు అతి పెద్ద దౌర్భాగ్యం అయిన కులవ్యవస్థ, ప్రపంచంలో మరెక్కడా లేకుండా అన్ని ప్రపంచపు మతాలన్నింటికీ   తనదయిన అసహ్యపు రంగునేదో ఎలా అద్దిందో చెప్పే Caste అనే  కవిత ఒకటి ,  అలాగే నక్సల్బరి ఉద్యమం మీద తన ప్రేమ ని ఒక ఒక విషాద సాయంత్రం గా అందించిన ‘The shades of Evening మాత్రం  తప్పక చదువుకోవాల్సిందే

 

Caste

 

You love me, do you?

Even though you belong

to another caste

But do you know

our elders do not

even cremate their dead

at the same place?

 

 

The shades of evening

 

The shades of evening

Are old once again

The pavements

Head for settlements

A lake walks

From an office

Thrown out of work

A lake is sucking

The thirst of water

Throwing off all wages

Someone is leaving

Someone comes wiping

On his dhoti

The blood of weak animals

On his goad

The shades of evening

Are old once again

Loaded with rebuke

The long caravan moves on

Along with the

Lengthening shadows of evening

 

ఇలా ఎంత చదువుకున్నా ఇంకా ఎంతో మిగిలిపోయే కవుల జీవితాలు , వాటి వెనక దాగున్న విషాదాలు  , చాయ్ వాలా లు ప్రధాని అయ్యారని మురుసుకొనే జనం మధ్యలో అదే జనం కోసం విప్లవోద్యమం లో పాల్గొన్న కవులు చివరి శ్వాసలలో చాయ్ వాలాలుగా  బ్రతకాల్సి వచ్చిన  ప్రజాస్వామ్యాపు అపహాస్య పరిస్తితులు , బహుశ మన దేశం లో ఎప్పటికయినా మారతాయి అని ఆశిస్తూ లాల్ సింగ్ దిల్ అక్షరాలకో లాల్ సలాంతో .

-నిశీధి

 

 

 

 

 

Download PDF

11 Comments

  • వాసుదేవ్ says:

    మిగిలిన ప్రభుత్వవ్యవస్థల మాదిరిగా ప్రజాస్వామ్యం కవుల్నీ కవిత్వాన్నీ బ్యాన్ చెయ్యదు. పైగా ఎంకరేజ్ చేస్తుందికూడా. ఐతే ప్రతికవికీ అన్నంపెట్టలేకపోవచ్చు. నాదృష్టిలో కవిత్వం ఓ క్వాలిఫికేషన్ కాదు జీవనాధారానికి. మనదేశంలో కనీసమ్ పరిస్థితులు చాలా మెరుగు. సిన్మా ఇండస్ట్రీ పుణ్యమా అని కొంతమంది రచయితలు కాస్తంత బతుకుతున్నారు అదే ప్రొఫెషన్‌‌గా. కాబట్టి ఓ ప్రముఖకవి చాయ్‌‌ వాలాగా బ్రతుకుతెరువు చూసుకోవడంలో సమాజం తప్పేంలేదన్నది నా అభిప్రాయం.
    కానీ మీ పరిచయం, రచనాశైలీ అందులోని పదఘట్టనల క్రింద కొంచెంసేపు ఉక్కిరిబిక్కిరై మళ్ళీ సావధానంగా చదివి మీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందుస్తున్నా.
    “నిరాధారమయినది

    అయినా ఒకే ఆలోచన ,

    నాకు ఎప్పటికయినా మోక్షాన్ని

    కలిగించేది నీ తల నూనేనెమో” ది బెస్ట్ ఇవాళ్టికి. క్యుడోస్ నిశీ జీ.

    • నిశీధి says:

      నిజమే ప్రజాస్వామ్యం కవుల్నీ కవిత్వాన్నీ బ్యాన్ చెయ్యదు అఫీషియల్ గా కాని తునకల మధ్య లేని సెక్యురిటీ గొడుగు ఉందని ఉహించుకొని బ్రతికేసే మనుష్యుల ప్రజాస్వామ్యం , నిజంగా అవసరం అయిన వ్యక్తులని ఎప్పుడు పట్టించుకోలేదు . పోతే కవులని ప్రజలు మోయక్కరలేదు , ముఖ్యంగా విప్లవ కవులు పుట్టిందే ఆ జనం బాధలు నెత్తిన మోయడానికి కాని మరి అదే సమయంలో చాయ్ వాలా ని ప్రధానులని చేసాం అని బూర్జువా మాటలు చిరాగ్గానే ఉంటాయి , మీకు తెలియంది కాదుగా ? మీకు నచ్చిన కవిత లో తత్వం నాకు అర్ధం అవుతుంది అంటారా ? ఎప్పటికన్నా ?

  • ఇక్కడ వ్యవస్థతో రాజీ పడి బతికేయగల కళాకారులు కోకొల్లలు సార్. కానీ దాంతో పోరాటమే జీవితంగా బతికినా వాళ్లకి ఈ గొప్ప ప్రజాస్వామ్యం ఇలా కేన్సర్ జబ్బుతోనో (చెరబండరాజు) టీబీ (అలిసెట్టి ప్రభాకర్) చంపేస్తుంది. లేకపోతే తాగడం నిరసన రూపంగా ఎంచుకున్న కలేకూరిలా అకాల మరణం శాసిస్తుంది. నిశీ మంచి పరిచయం చేసారు. మీకూ లాల్ సలాం చెప్పే అర్హత నాకు లేకపోయినా చెప్తున్నా..

    • నిశీధి says:

      సర్ జీ చాలా థాంక్స్ . మీరు వెన్నంటి ఉన్నారన్న దైర్యం ఎప్పటికీ .

  • తిలక్ says:

    ఇలాంటి కవిత్వాన్ని పరిచయం చేసి సగం దాహం తీర్చి వెళ్ళిపోతారు మీరు విశ్లేషించిన ప్రతిసారీ,ఇదేనా కవిత్వమంటే ,ఇలానేనా రాసేది అని అనిపించకపోదు రాయాలని మనసున్న ప్రతివారికీ. ఇప్పుడీ లాల్ సింగ్ కవిత్వం చదివాక నాకలానే తోచింది,బెణికిన హృదయాన్ని చేతుల్లోకి తీసుకుని రాసారా ఈయన అనిపిస్తోంది.
    మీ విశ్లేషణ నాకెప్పుడూ కొత్త మొదళ్ళను పరిచయం చేస్తుంది.నా మెదడింకా మీ అక్షరాల చుట్టూనే ఉంది నిశీధి గారు,అద్భుతం ఈ విశ్లేషణ.

    • నిశీధి says:

      తిలక్ గారు , థాంక్స్ . ఎందుకో ఇంకా చదవాలి మనం అన్న కోరికే కవిత్వాన్ని అన్వేషించేలా చేస్తుంది . లాల్ సింగ్ పరిచయం నాకు ఒక ఉద్వేగమే .

  • buchireddy gangula says:

    లాల్ సింగ్ జి ——-లాల్ సలాం
    నిశిధి గారు — పరిచయం చాల బాగుంది సర్
    ———————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  • NS Murty says:

    నిశీధిగారూ,

    చాలా మంచి పరిచయం చేశారు. సమాజంతో రాజీ పడలేని కవులకి వాళ్ళ పోరాటం, దాని పర్యవసానం కూడా ముందుగా తెలుసు. అదే వాళ్ళ బలం. అది తెలిసికూడా వాళ్ళు పోరాటం చెయ్యకుండా ఉండలేరు. అదే వాళ్ళ బలహీనత. కాని ఆ బలహీనత మనకి నచ్చుతుంది. ఆమాత్రం బలహీనతకూడా మనకు లేనందుకు. అందుకే వాళ్ళ కవిత్వంలో సార్వజనీనత పోదు. కాలం మారుతుంది … సమాజం మారుతుంది…పాత పద్ధతులు పోతాయి కొత్తవి వస్తాయి. కానీ బడుగువర్గాలెప్పుడూ పీడింపబడుతూనే ఉంటారు. పీడనలో కొత్త కొత్త పోకడలు వస్తాయి తప్ప పీడన అయితే మాత్రం ఆగదు.
    మంచి పరిచయాన్ని అందించినందుకు అభినందనలు.

    • నిశీధి says:

      మూర్తి గారు , ఎక్కడో ఉన్న సంశయం మీ మాటలతో తీరిపోయింది . కృతజ్ఞతలు .వీలు ఉంటే రివోల్యుషనరీ రైటర్స్ ని అందరిని తెలుగులో పరిచయం చేయాలని ఒక ఊహ .

  • Dely says:

    We co’dvule done with that insight early on.

Leave a Reply to Dely Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)