రౌద్రం

ఈ “మోహనం”- నవరసాలకు ఆధునిక చిత్ర రూపం. నా దృష్టి నించి నాకు తెలిసిన రంగుల భాషలో చేస్తున్న వ్యాఖ్యానం.

మన కళల్లో కలల్లో నిజాల్లో అందంగా వొదిగిపోయిన సౌందర్యం నవరసాలు. మన చిత్రాలు, శిల్పాలు, సాహిత్యాలు అన్నీ నవరసభరితం. ముఖాల కదలికల్లో, శరీర భాషలో, శబ్ద రాగ కాంతిలో లీనమైపోయిన ఈ తొమ్మిది రసాలకు – ఉద్వేగాలకు- దృశ్యానువాదం ఈ ‘మోహనం’. ఒక్కో రసమూ ఒక భావనగా ప్రతిబింబించే ప్రయత్నం ఇది. ప్రతి రసం తనదైన ప్రతీకాత్మక వర్ణంలో, అల్లికతో, శక్తితో మీ ముందు వుంచే ప్రయోగం ఇది. ఇవి డిజిటల్ కాన్వాస్ మీద రూపు వెతుక్కున్న చిత్రాలు, కాబట్టి ఆ రకంగా కూడా ఇదొక ప్రయోగమే! ఇలా ప్రతి గురువారం ఒక రసదృశ్యం మీ ముందు…..

ఈ చిత్రాలు నాన్న – వేగుంట మోహన ప్రసాద్- స్మృతిలో, అందుకే ఇవి “మోహనం” !

Raudram

Mamata

Mamata Vegunta

Download PDF

17 Comments

  • Nisheedhi says:

    Thank you for bringing to us this awesomeness . Definitely will look forward for this space every week.

  • N Venugopal says:

    అద్భుతం. రౌద్రమూ ముగ్ధ మోహనంగా, సలలితంగా ఉంది. చిత్రకళలోనూ, వ్యక్తీకరణలోనూ అపారమైన శక్తి సామర్థ్యాలున్న మమత ఇన్నాళ్లూ ఎందుకు ఎక్కడ దాగిపోయిందో అని ఎప్పుడూ అనుకుంటాను. లేక నాకు తెలియలేదేమో. ఏమైనా ఈ శీర్షిక ధారావాహికం కావాలని ఆకాంక్ష. నవరసాలు మాత్రమే అంటే తొమ్మిదితో అయిపోతుందేమో… 1990లో, ఇరవై ఐదేళ్ల కింద నేను ఆంధ్ర పత్రిక ఆదివారం అనుబంధం బాధ్యతల్లో ఉన్నప్పుడు మమతతో ‘కుంచె కదలిక’ అని ఒక వారం వారం శీర్షిక రాయించాను. ఆ శీర్షికకూ మంచి స్పందన వచ్చింది…. మమతా, శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు…

    • Mamata Vegunta says:

      వేణు… Down memory lane.. అవును 1990 లో కుంచె కదలిక రాసాను, ఇప్పుడు కుంచె కదిలిస్తున్నాను.. Thank you వేణు – మమత

  • P Mohan says:

    మమతగారూ చాలా బావుంది.
    కుంకుమ బొట్టు, గోరింట మొదలుకుని నిప్పులు, నెత్తురు వరకు అన్నీఉన్నాయి మీ రౌద్రంలో. అవును, Red is matter.
    Josef Albers quote గుర్తుకు వచ్చింది.
    ”If one says “Red” (the name of color) and there are fifty people listening, it can be
    expected that there will be fifty reds in their minds. And one can be sure that all these
    reds will be very different.”

    • Mamata Vegunta says:

      మోహన్ గారు.. నా వర్ణం కన్నా మీ వివరణ బాగుంది.. thank you! మమత

  • kandukuri ramesh babu says:

    మమత ఎవరోగాని, రొమాంటిక్ గ ఉంది రౌద్రమ. చిత్రం.

  • Naresh Nunna says:

    నేను చాలా కానట్లే, పెయింటర్ ని కూడా కాను. అది ప్రాప్తానికి, ప్రారబ్ధానికీ సంబంధించినది కావొచ్చు; కానీ, పెయింటింగ్ కి దగ్గర కాకపోయిన అపరాధం మాత్రం స్వయంకృతం. రంగుల రాగాలు తెలియాలంటే మరో కన్ను ఉండి తీరాలని అర్థమయ్యీకాని తొలినాళ్లలో ఎదురై నా అంధత్వాన్ని నాకు గుర్తు చేసిన Frank O’Hara కవిత ఇది:

    I am not a painter, I am a poet.
    Why? I think I would rather be
    a painter, but I am not. Well,

    for instance, Mike Goldberg
    is starting a painting. I drop in.
    “Sit down and have a drink” he
    says. I drink; we drink. I look
    up. “You have SARDINES in it.”
    “Yes, it needed something there.”
    “Oh.” I go and the days go by
    and I drop in again. The painting
    is going on, and I go, and the days
    go by. I drop in. The painting is
    finished. “Where’s SARDINES?”
    All that’s left is just
    letters, “It was too much,” Mike says.

    But me? One day I am thinking of
    a color: orange. I write a line
    about orange. Pretty soon it is a
    whole page of words, not lines.
    Then another page. There should be
    so much more, not of orange, of
    words, of how terrible orange is
    and life. Days go by. It is even in
    prose, I am a real poet. My poem
    is finished and I haven’t mentioned
    orange yet. It’s twelve poems, I call
    it ORANGES. And one day in a gallery
    I see Mike’s painting, called SARDINES.
    ** ** **
    చిత్రలేఖనానికి సంబంధించిన నా కబోదితనం నేను అమితంగా ఆరాధించే మో (వేగుంట మోహనప్రసాద్ గారు) సాహిత్యం పరిచయమయ్యాక నాకు మరింత తెలిసొచ్చింది.
    ఆయన తన ‘బ్రతికిన క్షణాలు’లో అంటారు కదా-
    అక్షరంలోని ఎక్స్టెండెడ్ రియాలిటీ (extended reality)ని చూపించాలంటే రంగుల్నీ షేప్స్(shapes)నీ సైజెస్(sizes)నీ టిక్మర్నీ స్పేసియోటెంపోరల్ యాక్సిస్ (spatiotemporal axis)లో పిన్నుల్ని గుచ్చుకుంటూపోవాలి (టిక్మర్ అంటే నాకు బోధపడలేదు. బహుశా- Homer కవిత్వంలో solemn sign, లేదా ముగింపు అనే అర్థం వచ్చే Tekmor కావొచ్చు)
    గాఢమైన, నిగూఢమైన ఈ పంక్తుల్ని జాగ్రత్తగా అర్థంచేసుకోవడానికి ప్రయత్నిస్తే- Temporal art form అయిన కవిత్వ చర్చలో Spatial art form అయిన చిత్రకళకి సంబంధించిన రంగులు, ఆకారాలు, పరిమాణాలూ, సంకేతాల్ని Spatiotemporal planeలో అనుసంధానించేందుకు చూశారేమో ‘మో’- అనిపిస్తుంది.
    ఇదొక కొనసాగింపు అనుకుంటే, ఈ నిరంతరత తరాన్ని దాటి ముందుకు రావడం ఒక అద్భుతం. ముఖ్యంగా, బయొలాజికల్ వారసులు భావ వారసులు కావడం నాకు తెలిసి తెలుగు సాంస్కృతిక సీమల్లో (కవి శివారెడ్డి గారిని మినహాయిస్తే) ఎక్కడా లేదు. మో ‘ఎక్స్ ప్రెషనిజమ్’ కవిత (రహస్తంత్రి) చదివితే, చిత్రకళ పోయిన ఒంపులన్నింటి పైనా ఆయనకున్న అవగాహన, తన మూడోకంటితో వర్ణ సంలీనానికి ఆయన పడిన తపన అర్థమౌతాయి.
    ఆయన ఆ తపనకీ, అక్షర తపస్సుకీ గొప్ప నివాళిగా మమత ఇలా “మోహనం” పేరిట నవరసాలకు ఆధునిక చిత్ర రూపం కల్పించడం, అదీ ‘మో’ స్మృతిలో కావడం పరమాద్భుతం అనిపిస్తుంది. రౌద్రంతో ప్రారంభమైన “మోహనం”ని చూస్తుంటే- మమతా!
    “….రక్తపు మడుగులోని నిశ్శబ్దం విను
    పూలు మంటల చొక్కాల్ని తొడుక్కునే దృశ్యం కను
    ఆకారాల్నీ రంగుల్నీ కుంచెల్తో కలుపుకో
    రూపనైరూప్యాల శాశ్వతత్వాన్ని తెలుసుకో …”
    – అని ‘మో’ తన ‘చాయావాదం (చితి చింత)’లో చెప్పినదాన్ని పుట్టకముందే నువ్వు ఆలకించావనిపిస్తోంది!

    • Mamata Vegunta says:

      నరేష్, నెనూ చాలా కానట్లే, కవినీ కాను. నాన్నని నాన్న గానే అర్ధం చేసుకున్నా- కవిని అర్ధం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు కవిత్వమే మిగిలింది కాబట్టి తప్పేట్లేదు.. నా రంగుల భాషలో ఎక్ష్ప్రెస్స్ చేస్తున్నా. Thank you నరేష్.
      మమత

  • raamaa chandramouli says:

    మిత్రులు మోహనప్రసాద్ కవిత్వ గాఢతను సరియైన సాంద్రతతో రసాత్మకంగా వ్యక్తీకరిస్తున్న వర్ణ చిత్రమిది.

    దీన్ని రచించినందుకు మమతకు అభినందనలు.

    – రామా చంద్రమౌళి,వరంగల్లు.

  • mani vadlamani says:

    నాకు చిత్ర లేఖనం గురుంచి విస్లేష్ణ చేసేంత శక్తి లేదు. కాని ఆ ఎర్రటి రౌద్రం లో అందరిని శాసించ గలిగే ఒక శక్తి కనిపించింది . రియల్లీ మమత great

  • Usha says:

    ఒక చిత్రం వేయి పదాల ప్రోది అనేది కొన్నిటికే వర్తిస్తుంది మీ చిత్రం కి అభినందనలు, మీ నాన్నగారి కవితల అభిమానిగా శుభాకాంక్షలు.

  • indira says:

    hey mamata, one picture n a celebrity already! so u r back with ur colors after decades…go on…u can’t escape…ur genes compel…love

Leave a Reply to Mamata Vegunta Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)