ఆత్మ రంగు తెలుసుకున్న వాడు…

Velturu2

We live unsettled lives

And stay in a place

Only long enough to find

We don’t belong.

ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand – అంటే, 1960 లలో!

రెండు నెలల  కిందట కన్ను మూసేటప్పుడు కూడా అతని చివరి పదాలు అవే! జీవితంలోని అస్థిరత్వాన్ని, మనిషిని ఎక్కడా ఎప్పుడూ వొక్క క్షణం నిలవనీయని అశాంతినీ, మనం ఎప్పుడూ కోల్పోతూనే వుండే sense of belongingని దాదాపు వెయ్యి పేజీల కవిత్వం చేశాడు మార్క్.

జీవితం పట్ల వొక అంటీముట్టని తనాన్ని (detachedness) యింకో విధంగా చెప్పాలంటే- always living, always dying-లాంటి తత్వాన్ని చివరిదాకా అంటిపెట్టుకొని వుండిపోయాడు మార్క్. కాని, ఎవరూ చెప్పలేని మాటల్ని కవిత్వం అడ్డుపెట్టుకొని ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 1960ల తరవాతి ఆధునిక జీవితంలోని అంతస్సూత్రాన్ని అతి తేలికైన మాటల్లో ఎంత మృదువుగా పొదుగుతాడో, అంతే పదునుగా కూడా విసుర్తాడు. Everyone who has sold himself wants to buy himself back లాంటి వాక్యాలు వినడానికి తేలికగా వుంటాయి కాని, అలాంటి వాక్యాలు రాయడానికి కవి నరాలు తెగిపోయే బాధనే అనుభవించి వుంటాడు.

మొదటి సారి మార్క్ గురించి వినడం ఆ పైని చెప్పిన నాలుగు ముక్కల ద్వారానే! పదిహేనేళ్ళ కిందట మాడిసన్ లో వొక పాత పుస్తకాల షాపులో మొదటి సారి దొరికిన మార్క్ కవిత్వాన్ని ఆ తరవాత వెతికి  వెతికి పట్టుకొని  యింకొన్ని సార్లు చదువుకున్నప్పుడు అతనేమిటో నాకు  అంతగా అర్థమయ్యాడని అనుకోలేను. మార్క్ చెప్తున్న sense of belonging లో వుండే వేదన తెలీక కాదు. తెలిసిందే అయినా దాన్ని వొక తెలియనితనంగా  గుర్తుచేసే కవిత్వ లక్షణమే అది అనుకుంటా. మొదటి సారి చదివినప్పుడు అందులోని వొక్క అర్థం మాత్రమే రెక్క విప్పుకుంటుంది, పదే పదే చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని అర్థాలకు రెక్కలొస్తాయి. ఏ రెక్కలో నిజమైన అర్థం వుందో తెలియకపోవడం కవిత్వంలోని మిస్టరీ. బహుశా, అలాంటి మిస్టరీ కోసమే కవిత్వం చదవాలనిపిస్తుంది. ప్రతీసారీ ఇంకో అర్థాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.

మొదటి సారి మార్క్ కవిత్వం చదివినప్పుడు అది నన్ను నిజంగా అలాంటి తెలిసీ తెలియనితనంలోకి తీసుకెళ్ళి సవాల్ చేసింది. నేను రాయడానికి నిరాకరించే చాలా విషయాలు నిష్పూచీగా రాసి చూపిస్తున్నాడు మార్క్. నా కవిత్వ వ్యాకరణాన్ని మార్చుకోవాలని మందలిస్తున్నాడు. జీవితంలోని బలహీనతలని ఇంకా బలంగా చెప్పవచ్చని, చెప్పి తీరాలని నన్ను నమ్మించాడు చివరికి-

అసలు జీవితంలోని ఖాళీని అప్పటికే చాలా మంది కవులు పాడడం నేను విన్నాను.

నాలోపలి పురుగుని తొలిచిన కాఫ్కా అంటే ఇష్టం అప్పటికే-

అసంబద్దతని తాత్వీకరిస్తూ సాహిత్యీకరించిన Becket ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను అలవాటైనంత తేలికగా-

Wallace Stevens వాక్య ప్రయోగాల చిక్కుముడులలో అసంతృప్త క్షణాల విచ్చిన్నతని అర్థం చేసుకుంటున్నాను. కష్టమే అయినా-

Walt Whitman పొడుగాటి వాక్యాల వూపిరాడనితనం అంటే ఎందుకో మహా ఇష్టమవుతూ వుంది ఆ సమయంలోనే!

అదిగో, అప్పుడు దొరికాడు మార్క్!

mark2

2

కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది, అలాగే, కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా నేర్పుతుంది. అబద్ధాలకు తొందరగా అలవాటు పడే కవులే మనకి ఎక్కువ, అబద్ధానికి వుండే తగరపు ఆకర్షణ వల్ల- అదనపు తక్షణ కీర్తి వల్ల; కాని, మార్క్ లాంటి కవులు ఎప్పుడూ నిర్వచనానికి అందని నిజంలో – కవిత్వం అద్దమే అయినా, ఆ అద్దం- అతనే  అన్నట్టు- The mirror was nothing without you- అన్న ధ్యాన నిమగ్నతలో రాస్తారు. కవి ఈ లోకంలోనే వుంటూ ఈ లోకాన్ని నిరాకరించే ధ్యాని లేదా అంతర్లోకపు పక్షి  అనుకుంటాను ఇలాంటి కవుల్ని చదువుతున్నప్పుడు.

నిజానికి మార్క్ మొదట్లో చిత్రకారుడు. యేల్ స్కూల్లో చిత్రకళ విద్యార్థిగా వున్నప్పుడు అనుకోకుండా Wallace Stevens కవిత్వాన్ని చదివాడు. అంతే, ఇక అతని లోకంలోంచి చిత్రకళ నిష్క్రమించింది; కవిత్వ చిత్కళ ప్రవేశించింది.  ఆ తరవాత చదువుతూ వచ్చిన అమెరికన్ కవిత్వం అతన్ని కట్టి పడేసింది. కవిత్వ విద్యార్థిగా 1960 లో ఇటలీ వెళ్ళాడు. 1964 లో అతని మొదటి కవిత్వ సంపుటి Sleeping with One Eye Open అచ్చయింది. అప్పటి నించీ మొన్న చనిపోయేదాకా మార్క్ వి పదకొండు కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి.

జీవితాన్ని నడిపించే సూత్రం Absence అంటాడు మార్క్. వొక లేనితనంలోంచి వాక్యాల్ని అల్లుకోవడమే కవిత్వం అంటాడు. “మనం అన్నీటికీ అర్థాలు వెతుక్కోగలం అనుకుంటాం. కాని, అలా వెతుక్కోలేకపోవడమే జీవితం అని ఎప్పుడూ అనుకోం. మనకి మిస్టరీ అంటే ఇష్టమే. కాని, జీవితం అన్నిటినీ మించిన మిస్టరీ అంటే మాత్రం వొప్పుకోం,” అంటాడు.

What cannot be seen will define us, and we shall be prompted

To say that language is error, and all things are wronged

By representation. The self, we shall say, can never be

Seen with a disguise, and never been seen without one.

అని వొక కవితలో అంటాడు కూడా-

అయితే, మార్క్ తన కవిత్వం అంతటా చెప్పే అసంపూర్ణత అనే భావనలో ఇదొక కోణం మాత్రమే. సంపూర్ణత అనేది మానవ సాధ్యం కాదని మార్క్ కచ్చితమైన అభిప్రాయం. అందుకే, కవిత రాస్తున్నప్పుడు కూడా కవి తనకే తెలియని వొకానొక స్థితిలోకి ప్రయాణమై వెళ్తాడు. అక్కడ ఎదురుచూడని/వూహించని మిస్టరీలాంటి నిజమే తనకి కనిపిస్తుంది. ఆ స్థితినించి వెనక్కి వచ్చి, దానికి మళ్ళీ అర్థం కల్పించాలని తను తపనపడ్తాడు, కాని- అది తపన మాత్రమే! అలా వెనక్కి చేరుకున్నప్పుడు తను అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు, అంటే, ఆ కవిత్వ నిజస్థితిలో మాత్రమే తనకి తాను నిజదర్పణం. మిగిలిన వేళల్లో తను disguise కింద మారిపోతాడు.

mark1

3

ముసుగు తొలగిపోవాలి, ఆ ముసుగు ఎంత నిజాయితీగా ఎంత నిజంగా తొలగిపోతుందన్న దాన్ని బట్టి కవిత్వ తీవ్రత వుంటుంది.

మార్క్ కవిత్వంలో అలాంటి  ముసుగు తన కవిత్వాన్ని తనే  గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నల ద్వారా తొలగిపోయింది. కవిత్వం ఎందుకు రాయాలన్న విషయం మీద కనీసం పది కవితలు రాసుకున్నాడు మార్క్. ఉదాహరణకు చూడండి ఈ కింది వాక్యాలు:

For us, too, there was a wish to possess

Something beyond the world we knew, beyond ourselves,

Beyond our power to imagine, something nevertheless

In which we might see ourselves.

మనిషి తనని తాను నిక్కచ్చిగా చూసుకునే క్షణాలు తప్పకుండా వుంటాయంటాడు, కవికి అలాంటి క్షణాలు అతని వాక్యంలో దర్శనమిస్తాయని మార్క్ నమ్మకం. అలాంటి నమ్మకం గాయపడిన సందర్భాల్లో మార్క్ చాలా సార్లు మౌనంలోకి జారిపోయాడు, అందుకే అతని  కవిత్వ ప్రయాణంలో నిశ్శబ్దాలు ఎక్కువే వున్నాయి. అసలేమీ  తెలియని మౌనంలోకి కూరుకుపోయిన సందర్భాలు  చాలానే అతన్నివుక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి ఏదో  బలమైన బలహీన  సందర్భంలో మార్క్ అంటాడు, రచన అన్నది వొక  నిద్రలో నడకలాంటి స్థితి అని- ఆ వెంటనే అంటాడు మళ్ళీ, అసలు writing అన్నదంతా selfish act అని-

You were mine, all mine; who begged me to write, but always

Of course to you, without ever saying what it was for

Who used to whisper in my ear only the things

You wanted to hear….

మార్క్ కవిత్వం అంతా Self-assertive act – తనని తాను గుర్తుకు తెచ్చుకొని, తను వినాలనుకున్న లోపలి మాటేదో బయటికి నెట్టే మానసిక ప్రక్రియ.

As if there were something

You wanted to know, but for years had forgotten to ask

మార్క్ రోజువారీ జీవిత పదచిత్రాల్ని దాటి ఎక్కడికీ వెళ్ళడు. పైన చెప్పిన ఆ మరచిపోయిన something ఎలా వుండాలో చెప్తున్నాడు ఇలా-

నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు-

మార్క్ కవిత్వం నిండా ఇలాంటి రోజువారీ కదలికలు అతని మానసిక స్థితితో అందంగా లీనమైపోతూ కనిపిస్తాయి. అంటే, ఏది రోజువారీ ప్రతీక, ఏది కవిత్వ భాష అనే గీత చెరిగిపోతుంది అతని కవిత్వంలో-

నాకు తెలిసీ అర్థమయ్యీ, ఇది అతనికి Walt Whitman నించీ, Wallace Stevens నించీ అలవాటైంది. ఇతర కవుల్ని చదవడం అంటే ఇదీ అని నాకు అర్థమైంది ఈ ముగ్గురికీ మధ్య ఏర్పడ్డ పరోక్ష కేవల కవిత్వ సాన్నిహిత్యం చూశాక- ఎప్పుడూ కలవని ఈ ముగ్గురు కవులు కవిత్వంలో వొకరికొకరు ఆత్మబంధువులు, ఆ ముగ్గురి మధ్యా అనురాగ పరాగం మార్క్ ప్రతి వాక్యంలోనూ ఇంకిపోయిన వర్ణ విశేషం.

4

మొన్న నవంబరు చివరి వారంలో మార్క్ చనిపోయినప్పుడు నాకు వొక్కటే అనిపించింది- నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని –

ఇంకో మార్క్ పుడతాడా అంటే పుట్టవచ్చు. కాని, ఆ రంగు -అదే తాజాదనంతో- మళ్ళీ కనిపించదు కదా అనిపించింది.

 -అఫ్సర్

 

 

 

 

Download PDF

44 Comments

  • ఎప్పటిలాగే అక్షరం వదలకుండా చదివించారు సర్ . ఏదో సందర్భంలో ప్రతి మనిషీ ఎందుకు బ్రతుకుతున్నామో , ఎందుకు బ్రతకాలో అనే సందేహంలోకి జీవితాన్ని నెమ్మది చేసినట్టే, ప్రతీ కవీ ఎప్పుడో అప్పుడు తప్పనిసరిగా తనేం రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అని తన కవిత్వంలోకి తనే తొంగి చూసుకోకుండా ఉండలేడేమో. కానీ ఈకవి తన అనే తన జీవితంలోకే కాకుండా మనిషితనం అనే ఒక గుణంలోకి తొంగి చూస్తూ మనస్’తత్వాల్ని’ కవిత్వంగా రచించాడని అనిపించింది మీరు రాసింది చదివాకా . ఓ మంచి కవి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు .

    • భవాని గారూ: ధన్యవాదాలు వెంటనే చదివినందుకు! బహుశా, ఆ ఎందుకు అనే ప్రశ్నే అతని మార్క్! అతనిదే కాదు, ఏ రచనకైనా!

  • తిలక్ says:

    అఫ్సర్ గారు మంచి కవిని పరిచయం చేసిన మీకు ధన్యవాదములు,మనిషి తనను తను ఎలా రాసుకుంటాడో తెలిపిన మార్క్ కవిత్వం నిజంగా గొప్ప కవిత్వమే.ఇటువంటి కవిత్వాన్ని పరిచయం చేసిన సారంగకు నా ధన్యవాదములు.

    • “మనిషి తనను తను ఎలా రాసుకుంటాడో తెలిపిన మార్క్” తిలక్, మీరు చాలా బాగా మార్క్ సారాంశం గ్రహించారు. ఎక్కడ దొరికినా చదవండి అతని కవిత్వం!

    • కెక్యూబ్ వర్మ says:

      http://www.poemhunter.com/mark-strand/poems/ ఈ లింక్ లో ఈ మహాకవి కవితలు చాలా వరకు ఉన్నాయి. మీపరిచయం తరువాత ఇలా వెతికితే దొరికిందీ లింక్ అఫ్సర్ సర్.

  • kandukuri ramesh babu says:

    నేను రాయడానికి నిరాకరించే చాలా విషయాలు నిష్పూచీగా రాసి చూపిస్తున్నాడు మార్క్. నా కవిత్వ వ్యాకరణాన్ని మార్చుకోవాలని మందలిస్తున్నాడు. జీవితంలోని బలహీనతలని ఇంకా బలంగా చెప్పవచ్చని, చెప్పి తీరాలని నన్ను నమ్మించాడు చివరికి-

    అన్న ఇది మంచి పని.
    ఆయనెవరో నచ్చారు అన్న.
    ఇప్పుడు లేకపోయినా.

    నిర్వచనానికి అందని నిజంలో
    చాల బాగుందన్నా…

    • రమేష్, నీ వ్యాఖ్య మరీ సంతోషాన్నిచ్చింది. లేనప్పుడే మనిషి ఎక్కువ అర్థమవుతాడెమో…ఉన్నంత సేపూ అతన్ని అపార్థాలతో frustrate చేస్తాం

  • ns murty says:

    Dear Afsar,

    In your inimitable style, this is a great write up. Thanks for this.

  • Mythili Abbaraju says:

    ” నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

    ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

    వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

    వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

    దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు-” పరిచితమైన కొత్త తలుపును నాకు తెరిచారు, అనుభవించి ఉండని జ్ఞాపకాన్ని రేపారు అఫ్సర్ గారూ. ఇంకొన్ని, మరికొన్ని…ఇలాగ, మీ నుంచి మాకు ప్రాప్తమైతె ఎంత బావుండును ….

    • “ఇంకొన్ని, మరికొన్ని…ఇలాగ” రాయాలనే వుంది, మైథిలి గారూ, ఈ లోపు ఏ నిరాశో, నిరాసక్తతో ఆవహించకపోతే….

  • Suresh Kaja says:

    ” వి ఆల్ హావ్ రీజన్స్ టు మూవింగ్ – ఐ మూవ్ టు కీప్ థింగ్స్ హోల్ ” . ఎప్పుడో ఎక్కడో విన్న మార్క స్ట్రాండుని మళ్లీ పరిచయము చేసారు. ధన్యవాదాలు అఫ్సర్ గారు

    • సురేష్, అది నాకు బాగా నచ్చిన లైన్…మీకూ నచ్చడం మనం వొకే పేజీ చదువుతున్నంత సంతోషం..

  • ఆర్.దమయంతి says:

    ‘మార్క్ చనిపోయినప్పుడు నాకు వొక్కటే అనిపించింది- నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని –’

    * ఈ మీ మాటలకి మనసు కలుక్కుమంది అఫ్సర్ గారు!
    నిజానికి మీ మాటల్లో వెలిసి పోలేదాయాన. వెలిగిపోయారు.
    అసలు చెప్పాలంటే, నిజమైన కవికి మరణ మేదీ? ..ఇన్నేసి జ్ఞాపకాలలో ఆయన సజీవమై వుంటేనూ.!
    జైహో!

    • మీరన్నది తాత్విక స్థాయిలో నిజమే, దమయంతి గారూ
      వొక కవితలో నేనే రాసుకున్నట్టు:

      వాళ్ళు ఎక్కడికీ వెళ్లరు
      వొక తలుపు మూసుకొని
      ఇంకో తలుపులోంచి మనలోకి వస్తారు.

      కదా?

  • c.v.suresh says:

    అఫ్సర్ సార్! మహా కవులను మీరు పరిచయ౦ చేసే విధాన౦ అనన్యసామాన్య౦. మార్క్ స్త్రాండ్ కవి భౌతిక, ఆ౦తర౦గిక కవితాజాడలను వెతికి వెతికి ఈ అ౦దమైనరైటప్ ని౦డా పరిచారు. ఆయన మాటల్లో ఆయన కవిత్వాన్ని తినేశాడని చెప్పారు. కానీ, మీరు ఆయన తిన్న కవిత్వపు రుచిని అ౦దమైన వ్రేపర్ చుట్టి మాకు చాక్లెట్ గా ఇచ్చారు.. !
    ఎన్నో అద్భుత కవిత, కవితత్వ విషయాలను అక్షరాలలో ని౦పి, ఆ అక్షరాలకు ఒక ఊతకర్ర జతచేసి… పాటకులకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ ఉతకర్ర ఉపయోగి౦చుకొనేలా మలచారు..!!! హాట్సాఫ్! ఇక ఆయన మాటలు అత్య౦త ముద్దుగా చక్కటి తెలుగులో ఇక్కడ పొ౦దు పరచిన రీతి అద్భుత౦…
    నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

    ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

    వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

    వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

    దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు- ” ఇవి ప్రతి మనిషి తన నిత్య జీవన౦లో ఎదురయ్యే అ౦శాలే.. మన చె౦తనే మసలే దృశ్యాలలో ఏదో క్రొత్త దనాన్ని తన మాటల్లో చూపడ౦ నిజ౦గా అద్భ్తుత౦..! ఒక లేనితన౦లో కవిత్వాన్ని వెతుక్కోవడ౦… ఒక అ౦తిమ లక్ష్య౦ వైపు అల్లుకొ౦టూ వెళ్ళడ౦… తిరిగి వెనుకకు రావడ౦.. దాన్నికి అక్షరాల పరిమళాలను అద్దాలనుకోవడ౦…. కవి హృదయ౦లోని స౦ఘర్షణలను ఆయన రాసిన విధాన౦ ఒక ఎత్తైతే… మీరు వాటిని చిక్కగా అక్షరమాలను అల్లి అలా సార౦గలో విసిరేశారు..! మార్వేలస్ సార్!!! అఫ్సర్ గారు…

    @ సి.వి.సురేష్!!

    • సురేష్. చాలా సార్లు ఆశ్చర్యంగా వుంటుంది. మీలో ఇంత కవితాశక్తి, విశ్లేషణ ఎలా వచ్చిందా అని! ఎన్నో తీరికలేని పనుల్లో వుండి కూడా మీరు ఇలా చదవడం, మీ మాటల్ని పంచుకోవడం బాగా అనిపిస్తోంది.

      • c.v.suresh says:

        థా౦క్యు సర్… అఫ్సర్ గారు….. ఇద౦తా ఆ౦ధ్రభూమి లో నేను జర్నలిస్టు గా పని చేస్తున్నప్పుడు మీరిచ్చిన ప్రోత్సాహ౦ తోనే..!!! ఎన్నో ఆర్టికల్స్ రాయి౦చారు..! ఇ౦టర్వ్యూలు చేయి౦చారు…థా౦క్యు ఒన్స్ అగైన్ సార్!

      • c.v.suresh says:

        ఆ౦ధ్ర భూమి లో జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మీరిచ్చిన ప్రొత్సాహ౦తోనే …రాయగలుగుతున్నాను….. సార్!!! అఫ్సర్ గారు…..

  • బ్యూటిఫుల్!!!

    “నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని……”

    ఒక రంగు గురించి ఇంకొక రంగుకి మాత్రమే ఇంత బాగా తెలుస్తుంది కాబోలు!!!

    అప్పుడెప్పుడో కూడా చెప్పాను, ఒక వ్యక్తిని ఎలా తలచుకుంటే ఆ వ్యక్తి ఉనికికి న్యాయం చేసినట్లు అవుతుందో అది మీ ఒక్కరికే సరిగ్గా తెలుసు!

    • నిషి, మనకి ఎదురుపడి మనలోకి కొన్ని మాటల్ని వొంపే రూపాలు ఇంకో కోణం నించి చూస్తె మన fragments ! అందుకే కొన్ని పేర్లూ, వాళ్ళ వాక్యాలూ మనలోపలి భాగమైపోతాయి. రంగులై పోతాయి. అందుకే, స్నేహంలో అంత అందం!

  • Mamata Vegunta says:

    Afsar, Thank you for the introduction to the life and works of this great poet. I haven’t read any of his works before, but I will now. Your interpretations give me a context to understand his writings better. Regards.

    • మమత, షుక్రియా. మీరు చదవడం నాకు మంచి ఫీల్! నాన్నగారి “కరచాలనం” వ్యాసాలూ, ముఖ్యంగా ఆయన కమలాదాస్ గురించి రాసిన వ్యాసం ఇలాంటి వాటికి ప్రేరణ. కవిత్వం అనేది మనసుకి మాత్రమే కాదు, మెదడుకి కూడా సంబంధించిన వ్యాయాయం అని ఇలాంటి కవులు గుర్తు చేస్తారు కదా!

  • నిశీధి says:

    కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.
    కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది << ఈ లైన్ లో ఆగిపోయాను ఎంత నిజంకదా , మీరు అన్నట్లే అబద్ధాలకు తొందరగా అలవాటు పడే కవులే మనకి ఎక్కువ, అబద్ధానికి వుండే తగరపు ఆకర్షణ వల్ల- అదనపు తక్షణ కీర్తి ముసుగు ఎంత నిజాయితీగా ఎంత నిజంగా తొలగిపోతుందన్న దాన్ని బట్టి కవిత్వ తీవ్రత వుంటుంది ఈ రెండు లైన్స్ ఔత్సాహిక కవులకి నిజంగా వెలుతురు పిట్టనే . నిజాన్న్జి నిర్భయంగా చెప్పలేని వాక్యాలు క్షణ కాలపు ఆనందం ఇస్తాయేమో కాని మనసుని రగిలించే నిప్పు ని అందించలేవు . ఇంత మంచి పరిచయం ఇంత గొప్ప వాక్యాలు ఇచ్చిన మీకు ఒక పెద్ద హాగ్

    • నిశీధి

      “నిజాన్న్జి నిర్భయంగా చెప్పలేని వాక్యాలు క్షణ కాలపు ఆనందం ఇస్తాయేమో కాని మనసుని రగిలించే నిప్పు ని అందించలేవు ” చాలా బాగా చెప్పారు!

  • Jayashree Naidu says:

    మొదటి సారి చదివినప్పుడు అందులోని వొక్క అర్థం మాత్రమే రెక్క విప్పుకుంటుంది, పదే పదే చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని అర్థాలకు రెక్కలొస్తాయి. ఏ రెక్కలో నిజమైన అర్థం వుందో తెలియకపోవడం కవిత్వంలోని మిస్టరీ. బహుశా, అలాంటి మిస్టరీ కోసమే కవిత్వం చదవాలనిపిస్తుంది. ప్రతీసారీ ఇంకో అర్థాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.

    కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

    కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది, అలాగే, కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా నేర్పుతుంది. — మీ వాక్యాలు చదువుతూ.. ఆగి ఆగి తరచి చూసుకుంటూ… అందులోనే మరొక కవి కవిత్వపు రుచిని వినిపిస్తూ.. మానసిక వ్యాహ్యాళి ని అనుభవం లోకి తెస్తారు.

  • నారాయణస్వామి says:

    చాలా బాగుంది అఫ్సర్! యిన్ని రోజులూ మార్క్ స్ట్రాండ్ ని చూస్తూ ఉన్నా కానీ సీరియస్ గా చదవలేదు – యిప్పుడు చదవాల్సిన అవసరాన్ని గుర్తు చేసావు –

    What cannot be seen will define us, and we shall be prompted
    To say that language is error, and all things are wronged
    By representation. The self, we shall say, can never be
    Seen with a disguise, and never been seen without one.

    అద్భుతమైన వాక్యాలు! అసలు absence నుండి కవిత్వం చెప్పడమే గొప్ప తాత్వికత!
    నెనర్లు!

    • స్వామీ

      ఈ వ్యాసం రాసినప్పటి నించీ ఆబ్సేన్స్ గురించి అనేక వైపులా ఆలోచిస్తున్నా. ప్రతి కవీ చేసేది అదే కాని, ఏమ్ఫసిస్ మారుతుంది కదా!?

  • rohith says:

    “I think if you try too hard to be immediately comprehensible to your audience, if you give too much to the moment, you’re also giving too much to the status quo. The poet’s obligation isn’t to his audience primarily, but to the language that he hopes he’s perpetuating. ” -Mark Strand (in the Paris Review Interview)

    Thanks for the great writeup sir. Very evocative- made me revisit the Paris Review interview.

  • balasudhakarmouli says:

    ఎంతో ఎంతో చదవాల్సివుందని అఫ్సర్ సర్ వ్యాసం నాకు చెబుతుంది.

  • balasudhakarmouli says:

    ఇష్టమైన కవుల కవిత్వంతో అటాచ్ మెంట్ ని మళ్లీ యిలా గొప్ప సాన్నిత్యంగా వ్యక్తం చేయడం … యిదీ కవిత్వమే.

    • సుధాకర్, అవును…చదవాల్సింది చాలా వుంది, పుస్తకాల చైనా గోడ ముందు నిలబడితే…కాని, నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది ఏమంటే, ఆ చదువులోంచి ఏం తీసుకుంటామా అని! మళ్ళీ కవిత్వం రాయడానికి కొంత శక్తి కదా!

  • మాకు అతి కొద్ది పరిచయం ఉన్న వ్యక్తులు కూడా, ఆత్మీయపు రంగులద్దుకుని మీ తలపోతలు, తన్మయత్వాలతో మాకు సరికొత్తగా పరిచయం అవుతారు. మళ్ళీ మాకూ సరి కొత్తగా ఆత్మీయులైపోతారు. శంషాద్ బేగం అయినా, త్రిపుర అయినా, ఇంకా ఎవరైనా సరే. మనుషుల్ని ఆర్తిగా తడుముకునే మీ జ్ఞాపకాల పలవరింతలని చదవడం నాకు ఇష్టం.

    • నిజమే కదా, పద్మ గారూ. మన పరిచయాల్లోనే కాదు, మామూలుగా మనం చదువుకుంటున్నప్పుడు కూడా అదే గుల్జార్, అదే మార్క్ స్త్రాండ్ చదివిన ప్రతి సారీ కొత్తగా పరిచయమవుతారు. అలాంటి పునః పరిచయమే సరికొత్తదనం అనుకుంటా.

  • N Venugopal says:

    అఫ్సర్

    చాల చాల బాగుంది.
    ఎప్పటిలాగే ఒక బిగి కౌగిలింత.
    ఆలస్యంగా చదివినందుకు మరొకటి.
    పరిహారంగా ఇదిగో ఒక మార్క్ కవిత:

    అలా నువ్వంటావు

    అంతా మన మనసులోనే ఉందంటావు నువ్వు
    సంతోషంతో సంబంధమే లేదంటావు…
    వణికించే చలీ మండించే ఎండా
    ప్రపంచమంతా మనసులోనేనంటావు

    నా చెయ్యి నీ చేతుల్లోకి తీసుకుని
    ఏదో జరుగుతుందంటావు
    ఏదో అసాధారణమైనది
    మనం ఎప్పుడూ సిద్ధంగా ఎదురుచూసేది
    సూర్యుడు ఆసియాలో ఉదయించిన మర్నాడు మనదగ్గరికొచ్చినట్టు
    చంద్రుడు ఒక రాత్రి తర్వాత మననొదిలి వెళ్లినట్టు….

  • Kiran Gali says:

    Great write up. “జీవితాన్ని నడిపించే సూత్రం Absence అంటాడు మార్క్. వొక లేనితనంలోంచి వాక్యాల్ని అల్లుకోవడమే కవిత్వం అంటాడు” loved those lines. Thanks for introducing us to Mark and his poetry. The journey begins to meet him now.

    – Kiran Gali

    • నా తోటి కవిమిత్రులు అలాంటి అక్షర ప్రయాణాలు మొదలెట్టాలనే ఈ వెల్తురు పిట్టల అంతరంగం, కిరణ్!

  • Ravi Verelly says:

    Inspiring write up Afsar garu.
    Kudos to you!

  • Iqbal Chand says:

    Hi Bhai,
    కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

    ఈ ఆర్టికల్ చదివాక కూడా మార్క్ ని ఆవహించకుండా ఉంటానా ?థాంక్స్
    Wallace Stevens గురించి ఎప్పుడు చెబుతారు?

    • afsar says:

      బహదూర్
      షుక్రియా రా!
      Wallace Stevens ఇంకా మనసుకి చిక్కలేదు! కొంచెం కష్టంగా వుంది అతన్ని అర్థం చేసుకోవడం! అయినా, త్వరలో రాస్తాను!

Leave a Reply to అఫ్సర్ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)