కారుణ్యం

K_Black

 

K_Black

దుఃఖమూ కరుణా మనలోపలి ఉద్వేగభరితమైన  కవలల్లా కనిపిస్తాయి  నాకు.

దుఃఖం ఎలా అయినా రావచ్చు కదా, నిరాశలోనో  వేదనలోనో ఏదో వొక రూపంలో.

అలాగే, కరుణ కూడా సహానుభూతి రూపంలోనో, అపారమైన దయ రూపంలోనో రావచ్చు.

మనల్ని మనం పూర్తిగా నిండుగా దుఃఖంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలో, ఆనక, మనల్ని మనం పూర్తిగా క్షమించుకోగలిగే అంత  స్థైర్యమూ  వుండాలి.

నిజమైన కరుణ వొక సంపూర్ణమైన లోచూపు వల్ల వస్తుంది.

ఇక్కడ నీటి బిందువులున్నాయి కదా, అవి దుఃఖపు మనఃస్థితిని చెప్తాయి.

ఆ వెనక వున్న తెలుపు అంతా క్రమంగా ఆ దుఃఖాన్ని పీల్చుకునే కారుణ్య సీమ, ఓదార్పు లాంటి భూమిక.

ఇక ఆ తరవాత మన ముందున్న ఖాళీ పుటని రంగులతో నింపడమే!

                                                                                         -మమత వేగుంట 

Mamata Vegunta

Download PDF

6 Comments

 • Srivatsa says:

  Mam, at first I thought you are a corporate professional. Then I discovered that you are an artist. Now I think you are also a philosopher. Happy to have worked with you. Sri.

 • మనల్ని మనం పూర్తిగా నిండుగా దుఃఖంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలో, ఆనక, మనల్ని మనం పూర్తిగా క్షమించుకోగలిగే అంత స్థైర్యమూ వుండాలి……….ఎంతటి నిండైన వాక్యాలో ఈ పెయింటింగ్ లాగే

 • Rekha Jyothi says:

  తెల్లటి కాగితం మీది వుండీ లేని రంగుచుక్కల్ని ఇలా చూడాలంటే ఎంత లోతైన, అందమైన దృష్టి కావాలో కదా! Its beautiful relaxing verse మమత గారూ !

 • Mamata Vegunta says:

  భవాని గారు, రేఖా జ్యోతి గారు,
  ఉండీ లేని చుక్కల్లో నిండుతనం చూసినందుకు.. థాంక్సండి..
  మమత

 • kandukuri ramesh babu says:

  నీలం తో చెప్పడం వలన, తెలుపుతో కనడం వలన
  కన్నీరు, ఆనంద బాష్పముల మధ్యన కరుణ చాలా శాంతి.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)