ఇలా ఎప్పటికప్పుడు…

మనస్సు కకావికలం అయినప్పుడు
కేవలం నేనొక శకలం లా మిగిలినప్పుడు
ఒక చిన్న మాట కూడా తుత్తునియ చేస్తుంది

కానీ మరుక్షణం లోనే
నేను ముక్కలు ముక్కలుగానైనా
మళ్ళీ జీవం పోసుకుంటాను ,
జీవితేచ్చ తో కెరటమల్లె ఎగిసిపడతాను
అయినా ఇలా ఎప్పటికప్పుడు
కొత్తగా పురుడు పోసుకోవడం
నేనేన్నిసార్లు చూడలేదుకనుక

ఇన్నేళ్ళ జీవితోష్ణానికి ఇంకిపోయిన
చల్లని భావసంద్రమంతా
బడబాగ్నిలా మారి దహించి వేస్తుంది
బహుశా నీరు నుండి నిప్పు పుట్టడం అంటే ఇదేనేమో

ఆ దహనకాండ ఎలా ఉంటుందంటే
ఏమని చెప్పుకుంటాం చెప్పు
లోలోని పీడలన్నీ దగ్దం చేసే ఆ సెగ ని
సంక్రాంతి  భోగితో సరిగా సంభోదించాలి

ఎక్కుపెట్టిన ఒక్కో ప్రశ్నారవళిని
సవ్యసాచి అమ్ములపొదిలోని
అక్షయ తూణీరంతో
సరిసమానం అని చెపితేనైనా సరిపోతుందా

ఎలా వర్ణించినా వర్ణననకు
చిక్కనిది ఇంకా మిగిలే ఉంటుంది
తెనేటీగకే పట్టు దొరికే తేనే లాగ
అనుభూతికే చిక్కే అంతర్జనిత ఆహ్లాదం లాగా

ఇక షడ్రుచులు అనుభూతిస్తూ
ఉగాది కి పిలుపునిచ్చి
వసంతాన్ని ఆహ్వానించాల్సిందే

-పూర్ణిమా సిరి 

purnima siri

Download PDF

7 Comments

  • Nisheedhi says:

    మీ వాక్యాలు ప్రేమతో పెనవేస్తూనే బెంగటిల్లేలా చెస్తాయి . loved every line .

  • Manohar Kumar says:

    వహ్ జీ….
    చాలా చక్కని భావ వ్యక్తీకరణ చేసారు
    ప్రతి పదం బాగుంది మేడమ్..

    మను..

  • jagaddhatri says:

    అద్భుతమైన కవితా ఝరి పూర్ణీ …ప్రేమతో జగతి

  • balasudhakarmouli says:

    బాగుంది

  • ఉగాదిని ఆహ్వనిన్చాల్సినే …తప్పదు —మంచి కవిత

  • సింపుల్ & సూపర్

  • narayanasharma says:

    ప్రశ్నారవళి/జీవితోష్ణం/అంతర్జనిత ఆహ్లాదం- కొత్తగా భావగర్భితంగా ఉన్నపదబంధాలు .తుత్తునీయ/తుత్తునీయలు-ఇది నిత్యబహువచనమే..ఏక వచనం లేదనుకుంటాను.మంచికవిత చాలా బాగుంది.
    “ఎప్పటికప్పుడు
    కొత్తగా పురుడు పోసుకోవడం
    నేనేన్నిసార్లు చూడలేదుకనుక”-తాత్విక వాక్యం

Leave a Reply to Sadlapalle Chidambarareddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)