బీభత్సం

Bhibahatsam

పైన అంతా గందరగోళం, పధ్ధతిలేనితనం.

కిందన ద్వేషమూ, అసహ్యమూ వాటి గరుకుదనం.

పైనేమో శకలాలైన వొక లోకం.
కిందన మానవత అంతా నిశ్శేషమైన నిస్పృహ.
 
పైన కనిపించే దృశ్యమే మనిషితనానికి కిందన వుంటే,
ఇక ఆ కిందన వున్నదేమనుకోవాలి?!
 
అట్టడుగు చిమ్మ చీకట్లోంచి వొక తీవ్రమైన విధ్వంస నీలిమ,
పాలిపోయిన  ఎర్రెర్రని నిస్సహాయత.
 
అది మన సౌందర్య కాంతిని మసక  చేస్తోందని,
మనం కళ్ళు మూసుకుంటామా?
అది మన సఖ్య శాంతికి గాయం చేస్తోందని,
 అక్కడి నించి మనం నిష్క్రమిస్తామా?
Mamata Vegunta

Mamata Vegunta

Download PDF

2 Comments

  • Rekha Jyothi says:

    ” పైన కనిపించే దృశ్యమే మనిషితనానికి కిందన వుంటే, ఇక ఆ కిందన వున్నదేమనుకోవాలి?! ” :(

  • kandukuri ramesh babu says:

    బీభత్సం-సౌందర్యం: విలియం బ్లేక్ గురించి తల్చుకున్నప్పుడల్లా పిచ్చి లేస్తుంది. ఎందుకంటే అతడు కవి, చిత్రకారుడే కాదు, భగవంతుడి మాదిరి మనిషి. అమాయకత్వాన్ని కవిత్వం చేసి చెప్పిన అతడి చేయే, అనుభవాన్ని విప్పి చెప్పింది. తొలుత “Songs of Innocence” అని కవిత్వ సంకలనం తెచ్చిండు(1789). తర్వాత “Songs of Experience” అన్న సంకలనమూ తెచ్చిండు(1794). రెండూ కలిపి కూడా Songs of Innocence and Experience పేరిటా తెచ్చిండు. స్వయంగా బొమ్మలు చిత్రించిండు. చిత్రమేమిటంటే మొన్న ఫేసుబుక్ లో నేను పోస్టు చేసిన అమాయకపు పిల్ల వంటి పోయెం the lamb అన్న తన కవిత. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్సీలో ఉన్న పోయెం అది. ఆ తర్వాత ఇటీవల -ఆశ్చర్యం’ అని పెట్టిన ఒక చిరుత ఫొటో వంటిది The Tyger అన్న పులి కవిత. అది songs of experience లో ఉండే కవిత. అతడు మనిషి తాలూకు రెండు ముఖాలు పట్టుకున్న ఆత్మ. ఒకటి చిత్తు అయితే మరొకటి బొత్తు కానీ క్రియేషన్ ఒకటే అని చెప్పే సోల్ ఏదో ఒకటి అతడిలో నన్ను లాగి చెంప దెబ్బ కొడుతూ ఉంటుంది. చలనం నుంచి నిశ్చలం చేస్తూ ఉంటుంది. .చిత్రమేమిటంటే ఆయన lamb అన్న పోయెంలో ఆ మేకపిల్లను అడుగుతాడు, నిన్నెవరు స్రుష్టించారే అని, అట్లే tiger పోయెంలోనూ అడుగుతాడు, నీ సంగతేమిటే అని! ఒక దాన్ని చూసిన ఓ మనిషీ మరొకదాన్ని కూడా చూడరా అని అడిగే ఆయన కవితా న్యాయం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చుతూ ఉంటుంది, గుర్తొచ్చిన ప్రతీసారి. ఒక కళాకారుడు భిన్న పార్శ్వాలను కంపోజ్ చేయడం వల్ల నాకు పిచ్చి లేస్తుంది, అమాయకత్వంతో. అనుభవంతో, అట్లే కొన్ని చిత్రాలను చూస్తే ఈట్స్ కవితలోని టెర్రిబుల్ బ్యూటీ గుర్తొస్తుంది. All changed, changed utterly:A terrible beauty is born అన్న ఈస్టర్ 1916 అన్న కవిత గుర్తొస్తుంది. ఇదంతానూ ఎందుకూ అంటే ‘కింద ఏమున్నదీ…what lies beneath?’ అని Mamata Vegunta Singh తాత్వికంగా అడిగితే!

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)