అనువాద నవల

పెద్రో పారమొ చివరి భాగం

పేద్రో పారమొ మెదియా లూనా పెద్ద తలుపు దగ్గర పాత కుర్చీలో కూచున్నాడు. రాత్రి ఆఖరి నీడలు తప్పుకుంటున్నాయి. అతనట్లాగే ఒంటరిగా మూడు గంటలనుండీ ఉన్నాడు. అతను నిద్ర పోవడం లేదు. నిద్ర…

Read More

పెద్రో పారమొ-13

పొద్దు పొడుపుతో రోజు మొదయింది, తక్కుతూ తారుతూ. భూమి తుప్పు పట్టిన గేర్లు దాదాపుగా వినపడుతున్నాయి. చీకటిని తోసేస్తూ ఈ పురాతన భూప్రకంపనలు. “రాత్రి పాపాలతో నిండిపోయిందా జస్టినా?” “అవును సుజానా!” “నిజంగా…

Read More

పెద్రో పారమొ-12

చీకటి పడగానే వాళ్ళు వచ్చారు. వాళ్ల వద్ద చిన్న తుపాకులు ఉన్నాయి. ఛాతీల మీద అటూ ఇటూ ఏటవాలుగా గుళ్ళ పట్టీలు ఉన్నాయి. ఇరవై మంది దాకా ఉన్నారు. పేద్రో పారమొ వాళ్లను…

Read More

పెద్రో పారమొ-11

కోమల లోయలోని పొలాల మీద వాన పడుతూంది. కుంభవృష్టి కురిసే ఈ ప్రాంతాల్లో అరుదుగా పడే పలచటి వాన. అది ఆదవారం. ఆపంగో నుండి ఇండియన్స్ వాళ్ళ సీమ చేమంతి జపమాలలతోటీ, మరువం,…

Read More

పెద్రో పారమొ-10

చాలాకాలం క్రిందట మా అమ్మ చనిపోయిన మంచం మీదే పడుకున్నాను. అదే పరుపు పైన, మమ్మల్ని నిద్రపుచ్చేముందు మాపై కప్పే ఉన్ని దుప్పటి కింద. ఆమె పక్కనే పడుకుని ఉన్నాను, ఆమె బుజ్జాయిని….

Read More

పెద్రో పారమొ-9

వాళ్ళు అతని ఇంటి తలుపుల మీద బాదారు కానీ బదులు లేదు. ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తడుతూ అందరినీ లేపుతూండడం అతను విన్నాడు. ఫుల్గోర్ – అడుగుల చప్పుడు విని…

Read More

పెద్రో పారమొ-8

( గత వారం తరువాయి ) వేడికి కాబోలు అర్థరాత్రికి కొంచెం ముందుగా మెలకువ వచ్చింది. ఆపైన చెమట ఒకటి. ఆమె శరీరమంతా మట్టితో చేసినట్టు, పొరలు పొరలుగా పొడవుతూ, బురదగా కరిగిపోతూ….

Read More

పెద్రో పారమొ-7

పొద్దుటి ఎండకి నా జ్ఞాపకాలు వెలిసిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడూ మాటల శబ్దాలు విన్నాను. తేడా గమనించాను. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్న మాటలన్నీ నిశ్శబ్దమైనవి. శబ్దమేదీ లేదుగానీ అర్థం తట్టేది. కలలో మాటలు…

Read More

పెద్రో పారమొ-6

“ఆమెని అడిగాను, ఒప్పుకుంది. ప్రీస్ట్ అరవై పీసోలు అడిగాడు ముందస్తు పెళ్ళి ప్రకటనలగురించి పట్టించుకోకుండా ఉండేందుకు. వీలయినంత తొందర్లోనే ఇస్తానని చెప్పాను. దైవ పీఠాన్ని బాగు చేయడానికి కావాలన్నాడు. అతని భోజనాల బల్ల…

Read More

పెద్రో పారమొ-5

“నువు అదృష్టవంతుడివి నాయనా, చాలా అదృష్టంతుడివి.” ఎదువిజస్ ద్యాడా నాతో చెప్పింది. అప్పటికే చాలా ఆలస్యమయింది. మూలనున్న దీపం సన్నగిల్లుతూ ఉంది. చివరిగా వణికి ఆరిపోయింది. ఆమె పైకి లేచినట్టు అనిపించింది. ఇంకో…

Read More

పెద్రో పారమొ-4

నీటి చుక్కలు నిలకడగా రాతి దోనె మీద పడుతున్నాయి. తేట నీరు రాతిమీదినుంచి తప్పించుకుని కలశంలోకి పడుతున్న చప్పుడును గాలి మోసుకొస్తూంది. అతనికి చప్పుళ్లన్నీ వినిపిస్తున్నాయి. నేలను రాపాడుతున్న పాదాలు, ముందుకూ వెనక్కూ,…

Read More

పెద్రో పారమొ-౩

“.. నేను చెపుతున్నాయన మెదియా లూనా కొట్టం దగ్గర గుర్రాలను మాలిమి చేసి దారికి తెస్తుండేవాడు. తన పేరు ఇనొసెంసియో ఒజారియో అని చెప్పేవాడు. గుర్రమెక్కితే దానికి అతుక్కుపోతాడంతే. అందరూ చికిలింతగాడనే పిలిచేవాళ్ళు….

Read More

పేద్రో పారమొ-2

“నేను ఎదువిజస్ ద్యాడని. రా లోపలికి.” ఆమె నాకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి, నన్ను వెంట రమ్మని సైగ చేస్తూ వరసగా ఖాళీగా కనిపిస్తున్న చీకటి…

Read More

కొత్త అనువాద నవల ప్రారంభం: పేద్రో పారమొ-1

ద్రో పారమొ అనే పేరుగల మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పబట్టే ఈ కోమలాకి వచ్చాను. చెప్పింది మా అమ్మే. ఆమె చనిపోయాక వెళ్ళి ఆయన్ని కలుస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా వెళతానంటూ…

Read More

వచ్చే గురువారం నుంచి: మాంత్రిక వాస్తవికతకి పునాది వేసిన నవల “పేద్రో పారమొ” మీ కోసం…

పేద్రో పారమొ నవల మొదట మెక్సికో సిటీలో 1955లో ప్రచురింపబడింది.  రచయిత హువాన్ రుల్ఫో వయసు అప్పటికి ముప్పయి ఏడో, ముప్పయి ఎనిమిదో. అంతకు మూడేళ్ళ ముందు ప్రచురించబడిన కథల పుస్తకానికి లభించిన…

Read More

వీలునామా – చివరి భాగం

  జేన్ హొగార్త్ క్రిస్మస్ భోజనం తయారీలో తల మునకలుగా వుంది. మెల్బోర్న్ కి దగ్గరలో ముచ్చటైన ఒక చిన్న ఇంట్లో వుంటున్నారు వాళ్ళు. ఎర్రటి ఎండాకాలం కావడంతో పళ్ళూ ఫలాలూ ఏవీ…

Read More

వీలునామా – 45, 46 భాగాలు

కిం కర్తవ్యం? మర్నాడే ఫ్రాన్సిస్ ఎడిన్ బరో బయల్దేరి వెళ్ళి గ్రంథాలయాలల్లో పాత పేపర్లన్నీ తిరగేసాడు. ఎక్కడైనా ఆ తేదీన బయల్దేరిన పడవల వివరాలో, పిల్లాణ్ణి పారేసుకున్న తల్లి వివరాలో దొరుకుతాయేమోనని. పడవల…

Read More

వీలునామా – 44వ భాగం

ఎల్సీ ఉత్తరం తన జీవితం లోంచి జేన్ వెళ్ళిపోయాక ఫ్రాన్సిస్ ప్రజా సేవలో నిమగ్నమైనాడు. పార్లమెంటు సమావేశాలూ, చర్చలూ క్రమం తప్పకుండా హాజరవుతూ తన వాక్పటిమకీ, లోక ఙ్ఞానానికీ మెరుగులు దిద్దుకున్నాడు. ఎలాగైనా…

Read More

వీలునామా – 43 వ భాగం

ఆశా- నిరాశా   మిసెస్పెక్చెప్పినవింతకథనుబ్రాండన్ఆసాంతమూఅడ్డుచెప్పకుండావిన్నాడు. విన్నతర్వాతఏమనాలోఅతనికితోచలేదు. కొంచెంసేపుఆలోచించినతర్వాత, అతను “అయితేనువ్వుతర్వాతఎప్పుడైనాఆపిల్లాణ్ణిపోగొట్టుకున్నఆవిడనికలిసేప్రయత్నంచేసావా?” “ఎలాచేస్తాను? ఆరాత్రికేపడవఎక్కిసిడ్నీవెళ్ళిపోతిమి. ఆవిడపేరేమిటోకూడానాకుతెలియదు. ఆవిడఎవరో, ఎక్కడవుందో, అసలిప్పుడుబ్రతికుందోలేదో, తనపిల్లాడుమారిపోయినసంగతిగుర్తుపట్టిందోలేదో, ఏదీతెలియదునాకు.” “ఇదంతాఎప్పుడుజరిగింది?” “సరిగ్గాముఫ్ఫైనాలుగేళ్ళక్రితం.” “అప్పుడులండన్లోమీరుబసచేసినసత్రంపేరుగుర్తుందా?” “పేరుగుర్తుందికానీచిరునామాగుర్తులేదు.” “మీరుప్రయాణించినపడవపేరు?” “పేరుగుర్తులేదుకానీ, మేంబయల్దేరినతేదీసరిగ్గాగుర్తుంది. మే…

Read More

వీలునామా – 42

“పారిస్ లో మేమిద్దరం పెళ్ళీ పెటాకులూ లేకుండానే ఒకే ఇంట్లో కలిసి వున్నాం. అక్కడెవ్వరూ ఏదీ పట్టించుకోరు! అక్కడ నాకు బానే వుండేది. అన్నిటికంటే డబ్బుకి కొదవ వుండకపోవడం లోని హాయి తెలిసొచ్చింది….

Read More

వీలునామా-41

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద ) (కిందటి వారం తరువాయి) మిసెస్ పెక్ ఆత్మకథ   ఆ మర్నాడు తన ఇంట్లోకి వస్తూన్న బ్రాండన్…

Read More

వీలునామా – 40 వ భాగం

  లిల్లీ ఫిలిప్స్ చెప్పా పెట్టకుండా ఇంట్లో కొచ్చిన బ్రాండన్ ని చూసి తత్తరపడింది. ఇంట్లో ఎల్సీ లేదనీ, పైగా మిసెస్ పెక్ తో కలిసి బయటికెళ్ళిందనీ తెలిస్తే ఏమంటాడో నన్న భయం…

Read More

వీలునామా – 39 వ భాగం

స్వామి కార్యమూ-స్వకార్యమూ -II వాల్టర్ బ్రాండన్! పెద్దపెద్దఅంగలువేసుకుంటూ తమవైపే వొస్తున్నాడు. చటుక్కున మిసెస్పె కాగితాన్ని లాక్కుని తన సంచీలో పెట్టేసుకుంది. “ఎల్సీ! ఇక్కడేంచేస్తున్నావునువ్వు? ఈవిడతోఏంపనినీకు?” మిసెస్పెక్వంకచిరాగ్గాచూస్తూఅన్నాడుబ్రాండన్. ఎల్సీమొహంపాలిపోయింది. ఏమీమాట్లాడలేకపోయింది. “పద, నిన్నుఇంటిదగ్గర దిగబెట్టివెళతాను….

Read More

వీలునామా – 38 వ భాగం

స్వామికార్యమూ-స్వకార్యమూ-I ఆ మర్నాడు మిసెస్ పెక్లిల్లీఇంటికితానుచెప్పినట్టే ఒకచిన్నచేతి సంచీలోకత్తెరా, టేపూ, సూదీదారమూ మొదలైనవితెచ్చుకునివచ్చికూర్చుంది. కాసేపులిల్లీతోపోచికోలుమాటలయ్యాకనెమ్మదిగాఎల్సీపక్కన చేరింది, “నాక్కొంచెంకుట్టుపనినేర్పమ్మాయీ,” అంటూ. ఆమెని చూస్తున్నకొద్దీ ఎల్సీకిఆశ్చర్యం అధికమవుతూంది. కుట్టు పనినేర్చుకుంటానంటుందికానీ, ఆమెకిసూదిలోదారంఎక్కించడం కూడారాదు. పెద్దధాష్టీకంపైగా! “నేనుఇంతవరకూనర్సు…

Read More

వీలునామా – 37 వ భాగం

తాననుకున్నట్టే మిసెస్పెక్ అడిలైడ్ వదిలి  మెల్బోర్న్ చేరుకుంది. సముద్రప్రయాణంలో మూడురోజులుఅలిసిపోయినా, ఉత్సాహంగాకూతురి చిరునామా వెతికిపట్టుకుంది. ఏమాత్రం ఆలస్యంచేయకుండాఉన్నంతలోశుభ్రమైనబట్టలువేసుకుని కూతురిఇల్లుచేరుకుంది. తలుపుతెరిచినపనమ్మాయితోతనపేరుమిసెస్మహోనీఅనీ, ఒక్కసారిఅమ్మగారితోమాట్లాడాల్సినఅవసరంవుందనీప్రాధేయపడింది. ఆఅమ్మాయిఅనుమానంగాచూస్తూమిసెస్పెక్నిలోపలికితీసికెళ్ళింది. అదృష్టవశాత్తూలిల్లీఫిలిప్స్ముందుగదిలోవొంటరిగాకూర్చొనుంది. చంటిపాపఆయాదగ్గరుంటే, ఎల్సీఇంకేదోపనిలోలోపలేవుంది. లోపలికెళ్తూనేమిసెస్పెక్, కూతురిదగ్గరికెళ్ళిఆమెచేయిగట్టిగాపట్టుకుని, “బెట్టీ! అమ్మా!…

Read More

వీలునామా – 35, 36 భాగాలు

హేరియట్ వస్తూ వస్తూనే, ఆస్ట్రేలియాని, వలస వచ్చిన వాళ్ళనీ, నగరాలనీ విమర్శించి పారేసింది. నిజానికి తను ఇంకో పదేళ్ళు ముందొచ్చినట్టయితే ఇంకా ఎక్కువ తిట్టిపోయడానికి వీలుగా వుండేది. స్టాన్లీ, బ్రాండన్ ఇద్దరూ మెల్బోర్న్…

Read More

వీలునామా – 34 వ భాగం

మిసెస్ పెక్ తన గ్లాసులోని బ్రాందీని నెమ్మదిగా తాగుతూ వ్యూహాన్ని సిధ్ధం చేసుకొంది. లేచి మెల్లగా డెంస్టర్ పక్కనెళ్ళి కూర్చుని, తన ‘జీవిత గాథా ను అత్యంత దయనీయంగా ఆతనికి విశదీకరించింది. మధ్య…

Read More

వీలునామా – 33వ భాగం

    అడిలైడ్ నగరానికి దాదాపు ఇరవై మైళ్ళ దూరంలో- రహదారికి పక్కనే వున్న ఒక ఇరుకు హోటల్లో, ఆ సాయంత్రం ఒకావిడా, ఒకతనూ కూర్చుని ఉన్నారు. అంద చందాల సంగతటుంచి కనీసం…

Read More

వీలునామా – 32 వ భాగం

మేనల్లుడు ఎడ్గర్తోసహా మెల్బోర్న్ చేరుకున్న బ్రాండన్ హుటాహుటిని తన ఎస్టేటు బార్రాగాంగ్ చేరుకున్నాడు. అయితే అక్కడ పరిస్థితి తనూహించినంత దారుణంగా లేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అతని మేనేజరు స్వతహాగా కొంచెం భయస్తుడు…

Read More

వీలునామా – 31 వ భాగం

ఇంగ్లండు వదిలి మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నామన్న ఊహతోనే ఎమిలీ ఆరోగ్యం కుదుటపడసాగింది. స్టాన్లీ ఇంగ్లండు వదిలి వెళ్ళేముందు ఒక్కసారి ఎమిలీని తీసికెళ్ళి పెగ్గీకి చూపించాలనుకున్నాడు. తన చేతుల్లో పుట్టిన ఫిలిప్స్ పిల్లలని ఒక్కసారి…

Read More