ఒక ‘ఆర్గా’నిజపు స్వగతం

 

నేను ఉన్నానా.. విన్నానా ..అనుభూతించానా
నాలోకి నేను అతనిలా చొరబడే క్షణాల్లో ..
మనసులో ఒకరూ.. శరీరంలో ఒకరు ఉండే వేదనలలో .
స్నానించినపుడు .. ఆచ్ఛాదనంగా
ప్రేమించినపుడు .. దిగంబరంగా ఉండలేని క్షణాలవి ..
దాన్ని జీవితం అంటావ్ నువ్వు
నేను నాకు కాకపోవటం అంటాను నేను ..

ఒకానొక రోజు.. దయతో , జాలితో ..
నిన్ను మోహించానే అనుకో..
కానీ ప్రేమించలేదని అర్ధం చేసుకోవు . అడుక్కోవటం మానవు ..
పాతగాయాల సలుపు .. కొత్త ధవళాలు కూడా
జీర్ణ వస్త్రమే అన్నట్టు సలుపుతోంది నన్ను ..
అక్షరాలలోనే పట్టుకోవటం చాతకానప్పుడు ..
పలవరింత కూడా నటించవచ్చు తెలుసా ..
అలాగే నిన్ను ప్రేమించానని చెప్పవచ్చు ..

నిండుగా నా కాంతితో.. నిండిపోతున్నాను నేను ..
నీ విరహంలా అనిపించే వాంఛ కాంతి కాదది ..
మెత్తటి రెల్లు గడ్డి లో .. నీ మాటల ఈత ముళ్ళంత
వేగవంతమైన కాంతి ..

వారి వారి వాసనా పరిష్వంగం లో ఇచ్చేదే స్వేచ్చ అనుకుంటారు
వాళ్లకి తెలిసిన గీతలు దాటితే ..
దింపుడుకళ్ళెపు మాట ఉండనే ఉందిగా
ఇది బరితెగించింది అని …”
నాటి సీత నుండీ .. నేటి నిర్భయ వరకూ
బరితేగిస్తూనే ఉన్నారు పాపం .. వేరే పని చేతకాక
మహిళలు పుట్టరు.. తయారు చేయబదతారని
చదివానెక్కడో .. నిజమే ..

నిజం చెప్పటం లోని ఆర్గాజం అర్ధం కానంత వరకూ..
అర్ధం అయినా .. నిజంగా వోప్పుకోనంత వరకూ
నింఫోమేనియాక్ లు తయారవుతూనే ఉంటారు ..!!
( నింఫో మేనియాక్ అని ముద్ర పడి , భర్తచే వదిలివేయబడి ..ఇద్దరు పిల్లలతో జీవితం సాగిస్తున్న ఒక మహిళ కోసం, ఆమె చిరునవ్వుకి అంకితం )

 

Download PDF

20 Comments

 • టైటిల్ సరి పో లే ద ని పిస్తోంది. ఆర్గాజం స్వగతం అంటే బాగుండేదేమో

 • ఒక చెంపపెట్టులా…బాగుంది.

 • సాయి పద్మ says:

  లింగారెడ్డి గారూ, ఆర్గాజం లో నిజం వెతికే ప్రయత్నం చేసాను. ఈ సారి సరి చూసుకుంటాను . థేంక్ యు.

 • సాయి పద్మ says:

  థేంక్ యు మహేష్ గారూ

 • vamshi says:

  “orgasmic intro of an organism” .. very well written maam..

 • haragopal.s says:

  మీ కవిత ఒక సహానుభూతవేదన.సార్వజనిక సంవేదనాత్మకంగా వుంది.
  పేరు బాగుంది.కవితాభివ్యక్తి బాగుంది.

 • చాల చాల నచ్చింది పద్మా

  సహజమైనదే నిజం అర్థం చేసుకోవడానికి నిరాకరించినపుడు అతి తేలికగా

  *వారి వారి వాసనా పరిష్వంగం లో ఇచ్చేదే స్వేచ్చ అనుకుంటారు*

 • డా. లక్ష్మణ్ స్వామి says:

  బాగా ఆకలిగా ఉన్న ఓ దున్నపోతు పచ్చని పైరులో చేసిన విశృంఖలం లా ఉంది ………అతి సున్నిత స్త్రీ భావోద్వేగా లను పట్టించుకోకుండా …..నలిపి వేస్తున్న మగ రెక్కలకిందా ఇంకెక్కడి ‘ఆర్గాజం’ అది నలిపివేయబడిన తన ముళ్ళే తనకు గుచ్చుకున్న గులాబీ మొగ్గ !!
  మగ మదపు పైశాచిక ‘భావప్రప్తి’లో ‘ఆర్గాజం’ అతివలకు ఎండమావే ?!….లక్షల మంది అనుభవిస్తున్న రహస్య వేదనని అక్షరాల్లో పొదగటం కాస్త కష్టమే అయినా ….మీ స్వేచ్చా ‘విహంగా’నికి జయహో పద్మాజీ !!

 • టైటిల్ జస్టిఫికేషన్ తో పాటూ విషయాన్ని అందించిన కవితాత్మకత పై ఎలాంటి సందేహాలూ లేవు..క్యుడొస్ పద్మాజీ

 • m s naidu says:

  పద్మ గారు. చాలా గొప్పగా రాసారు

 • సాయి పద్మ says:

  థేంక్ యు హర గోపాల్ గారు, అవును సహానుభూతి .. సరిగ్గా అర్ధం చేసుకున్నారు . చాలా థాంక్స్ .

 • సాయి పద్మ says:

  థేంక్ యు జయ… స్వేచ్చ ఇస్తున్నాం అనే మాట నాకెప్పుడూ గుచ్చుకుంటూనే ఉంటుంది . ఇవ్వటం ఏమిటి ? తీసుకోవటం ఏమిటి అన్నట్లుగా .. థేంక్ యు

 • సాయి పద్మ says:

  dr. లక్ష్మణ స్వామీ గారు, అవును , అక్షరాలలో పొదగటం కష్టమే … అలాగే వేదనతో వొదిగి , ఏమీ లేకుండా వోరగటం కూడా కష్టమే ! ముఖ్యంగా తనకంటూ ఆలోచన ఉన్న స్త్రీ కి , నాకు చేతనయినంత వరకూ అర్ధం చేసుకొనే ప్రయత్నం చేసాను

 • సాయి పద్మ says:

  థేంక్ యు, వాసు దేవ్ గారూ ..

 • సాయి పద్మ says:

  థేంక్ యు , నాయుడు గారూ

 • రవి says:

  సాయి పద్మ గారు,

  కవిత చక్కగా వచ్చింది. అభినందనలు!

  -రవి

 • quite complex and multi-layered. దింపుడు “కళ్ళెపు”? నుడికారాలని కొంచెం గమనించుకోండి.

  • సాయి పద్మ says:

   తప్పకుండా స్వామి గారూ. థేంక్ యు

 • buchireddy gangula says:

  పద్మ గారు
  కవిత చాల చాల నచ్చింది —కత్తి గారి అబిప్రాయం తో
  నేను ఎకేబవిస్తా

Leave a Reply to buchireddy gangula Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)