మహాఖననం

 

సిద్ధార్థ

సిద్ధార్థ

యములోడా… ఇది భస్మ సరస్సు 
రణ గొంగలి కప్పుకున్న యవ్వన భూమి 
ధిక్కార ప్రాంతాన 
నిలిపిన నిషేధ ద్వారం… 
                          ఇంగలాల నిచ్చెన 
కాలు, తగలబడు, వేలాడు 
ఉరుకెత్తే రైలు బండికెదురుగ బోయి 
                          ఢీ కొట్టు… 
పెరుగన్నం తిని పాటలు పాడి 
రోడ్డెక్కి 
నవ్వుతూ చావు రథమెక్కి 
ఉరుముకుంటూ పో… 
యములోడా వింటున్నావా 
నాది భస్మ సరస్సు… 
 
వాయిదాలూ, చర్చలూ, తనిఖీలు, ప్రకటనలు 
వెన్నుదెబ్బలూ 
ఉచ్చపోసుకుంటూ చెప్పుకునే మాటలు 
సుతీమానం లేని ఎవ్వారం 
యములోడా… ఇది భస్మ సరస్సు 
ఏదీ తినాలనిపిస్తలేదు 
ఏదీ తాగాలనిపిస్తలేదు 
బేచేనీ జిందగీ ఈ రూప లావణ్యం 
అవమానం తలకెక్కి గుండెను 
                                     తూట్లు పొడుస్తుంది 
అనుమానం నిద్రను కొరికి చంపుతుంది 
సోపతి వల్లకాడయ్యి 
                                    పుష్పవతి కాకుండానే గర్భవతయ్యింది 
                                    శవాలను కంటున్నది 
యములోడా… యములోడా… 
యములోడా… 
picasso-pine-tree-nude
 
ఎన్నో తరాల పాపం 
ఎన్నో నమ్మకాల ఎర్రితనం, గాండుతనం 
తందురుస్తుగా సుఖంగా పడుకున్న 
అంధకారపు మత్తు వదిలింది 
 
కనబడుతూన్నదంతా, మిగిలినదంతా 
దెయ్యాల దిబ్బ… 
మెడకు పూసలతాడు 
దొబ్బదేహం…నలుపు దుఃఖం 
ఇదే కదా దొరికింది 
తెలివి తెచ్చుకోవడమే చేసిన పాపం 
ప్రశ్నించడమే ఘాతుకం 
అయితే… 
ఒక్కో అంగాన్ని కోసుకుని అంటించుకుని 
వదిలేస్తూ వుంటాను చూస్కో… 
ఊదుతూన్న కొద్దీ… ఊరు అంటుకుంటూనే 
                                           ఉంటుంది
మానం పగిలి కాలిన నెత్తురు 
                               పట్నానిదీ పల్లెలదీ…
దీన్ని నుదుటికి పూసుకుని 
వలయ పరా వలయాన్నై 
నీ దొడ్డి దారినుంచే ప్రపంచాన్ని 
                                  చుట్టుకొస్తుంటాను 
నేనిప్పుడు
వెయ్యి కాళ్ళతో నడిచే కాష్టాన్ని
 
సుక్కల రుమాల్  ని వేలుకు కట్టుకుని 
దిమ్మీసలాడుతూ… భూమ్మీద 
తైతక్క లాడుతూనే వుంటాను 
 
                              సిద్ధార్థ
Download PDF

8 Comments

 • raghava charya prativadi bhayamkara says:

  attitude, contempt చాలా బాగుంది.

  రచయితకి భాష అంటే బజారు వస్తువు కాబోలు.

 • bhasker says:

  అన్నా , సిద్ధార్థా!
  చాలా మంచి కవిత. మీదైన ముద్ర ఉన్న కవిత. ఆర్ద్రంగా ఉంది.
  భాషమీద మీకున్న పట్టు చూస్తె అబ్భురంగా ఉంది. అసూయగానూ ఉంది.
  రచయితకి భాష అంటే బజారు వస్తువేట్లా అవుతుందో నాకైతే అర్ధం కాలేదు.
  ఆయన కాస్త వివరణ ఇస్తే బావుణ్ణు! అవును, మన కోపాన్ని దుఃఖాన్ని అక్కసుతో
  నాభి దగ్గరనుండి మొహం మీద ఉమ్మేసినట్టు మనదైన నగిషీలు లేని వాడుక భాషలో
  వ్యక్తపరిస్తే అట్లానే అనిపిస్తుందేమో నాకైతే తెలియదు.
  -భాస్కర్ కూరపాటి.

 • సిద్ధూ, వాక్యమూ ఆవేశమూ ఉద్వేగమూ వొక దాని వెంట వొకటి కాకుండా మూడూ కలగలిసి కలపోస్తే నీ ఈ కవిత. దొంగ రాజకీయాలూ, దొంగ తాత్వికతలూ దొంగ సౌందర్య శాస్త్రాల వేట నీ వాక్యాలు. ఎదురు చూస్తున్నా నీలోంచి వొక దీర్ఘ శోకం లాంటి దీర్ఘ కవిత కోసం…

  • balasudhakarmouli says:

   ‘ నీలోంచి వొక దీర్ఘ శోకం లాంటి దీర్ఘ కవిత కోసం… ఎదురు చూస్తున్నా ‘ adbhtamaiana vaakyaM

 • ***నేనిప్పుడు
  వెయ్యి కాళ్ళతో నడిచే కాష్టాన్ని***

  జస్ట్ అట్టర్ కంటెమ్ప్ట్
  కానీ కవితాత్మ ప్రస్ఫుటం గా కనిపిస్తోంది..
  బర్నింగ్ వర్డ్స్ అంటే ఇవే

 • వ్యక్తీకరణ బలంతో వస్తువుని స్పష్టాస్పష్టంగా చేయటం వల్ల కవిత గొప్ప లోతును విస్త్రుతిని పొందింది. ఇది కవి ప్రతిభ

  భావం, భావజాలంల పట్ల కవికి ఎప్పుడైతే నిబద్దత ఎక్కువగా ఉంటుందో, భాష దాసోహం అంటూ వాక్యాలను పరిగెట్టిస్తుందనటానికి ఈ కవిత చక్కని ఉదాహరణ.

  …… “ననువరించిన శారద లేచిపోవునే” అన్న ఓ మహా కవి మాటలను స్వాభిమాన వ్యక్తీకరణగానే చూస్తాం/చూడాలి తప్ప, భాష బజారుదా విశ్వవిద్యాలయాలదా అని కాదు కదా!

  సిద్దార్ధ గారంటే దీపశిల సంకలన సిద్దార్ధ గారా? అయితే వారికి నా వందనాలు.

 • C.V.SURESH says:

  నిజమే! ఇది మహా ఖననమే! సమకాలీన పరిస్థితులపై రచయత తనదైన శైలిలో అగ్నిగోళాలను కురిపి౦చారు. “నేనిప్పుడు
  వెయ్యి కాళ్ళతో నడిచే కాష్టాన్ని

  సుక్కల రుమాల్ ని వేలుకు కట్టుకుని
  దిమ్మీసలాడుతూ… భూమ్మీద
  తైతక్క లాడుతూనే వుంటాను “………! చాలా స౦వత్సరాల క్రిత౦ రాసిన మహా ప్రస్థాన౦ కు ఇప్పటివరకు జీవమున్నట్లు.దోపిడి, దుర్మార్గపు అత్యాచారాలు ఉన్న౦త వరకు ఇలా౦టి రచనలకు జీవము౦టు౦ది. “కష్ట౦” ఎలా కరాళ నృత్య౦ చేస్తు౦దో చెప్పారు. కవిత ఆద్య౦త౦ ఊపిరి ఉగ్గబట్టి చదివి౦చే౦త ఆవేశాన్ని ని౦పారు. ! చాలా బావు౦ది.

 • Karimulla says:

  True poetry! Rarest one! Goes like an eruption underneath. The Form and the Content in perfect unison. My deepest honours be to you, Poet.

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)