నీల్ కమల్

అరుణ్ సాగర్

అరుణ్ సాగర్

సముద్రమూ ఆకాశమూ డెనిమ్! వర్ణాంధుడైనా కాంచగలడు. రిధమ్ బ్లూస్: పిచ్చిస్వేచ్ఛగా ఎగురుకుంటూ-దే వోంట్ రియలీ కేర్ ఎబౌట్ అజ్ అని మైకేలు జాక్సనుడు బ్లూజీన్స్ వేసుకునేకదా ఎలుగెత్తి పాడాడు. ఆకాశాన్ని అంటినట్టు. సముద్రంలో దుంకినట్టు.
పాతకొత్త బట్టలు. నీతోపాటు సీజనైన స్నేహితులు. నీతోపాటూ వెదరైన వెలిసిన వికసించిన. వెలిసిపోయిన కొద్దీ వెలిగిపోయే డెనిమ్. జస్ట్ లైక్ మన స్నేహం. పాతబడిన కొద్దీ కొత్తగా. బలం హార్లిక్స్ తాగితే వస్తుందా, ఛెర్మాస్ షర్ట్ వేసుకుంటే వస్తుందా.
ఉరికే బైకు సీటు మీద పరిగెత్తుకు వెళ్లి ఎక్కుతుండగా ఆమె ననుజూసి ముసిముసిగా నవ్వుకుంటూ హాస్టల్ లోనికి వెళ్లిపోయెను. రెండు బాక్ పోకెట్లూ మూడు ఇత్తడి బటన్లూ నాలుగు వరసల దారాలతో టాప్ టూ ట్యాపింగ్ ఫుట్ నిలువుగా కట్లపాము లాంటి బ్రౌను రంగు స్టిచెస్-అండ్ అఫ్ కోర్స్ దట్ హెవీమెటల్ జిప్ ఆన్ యువర్ క్రాచ్. అందుచేతనే ఎంతటి బక్క పోరగాడైనా కొమ్ములొచ్చి మొద్దుగా మాఛోగా. మర్ద్! ఆమె నవ్వుకుండును గాక మనకేమి?
బఫెలో ఈజ్ మై ఫస్ట్ జీన్స్. నాన్న ఇచ్చిన తళతళలాడే కొత్తనోట్లు జేబులో పెట్టుకుని-ఓషన్స్ ఆఫ్ బ్లూ. గో టూ షాప్. యూ కాంట్ వెయిట్ ఫర్ యువర్ బర్త్ డే టూ కమ్. దానిమీద ఓ క్రోకడైల్ టీ షర్ట్ వేస్తేనా. బాసూ. శరీరభాషకు కొత్త మాడ్యులేషన్. నడక మారిపోయిందా నీటుగాడా. ఫాస్ట్ ఫార్వార్డ్ సినిమా గుర్తుందా. ముగ్గురు. మూడు జీన్స్ పాంట్లు పైన లైట్ పింక్, లైట్ యెల్లో, లైట్ బ్లూ ఫ్లో షర్ట్స్. తీన్మార్ టైటిల్ కొత్తగా పెట్టినట్టు పోజుకొడతారేమిటి గురూ.
ఇదియొక టెంపరుమెంటు. జీన్స్ ఒక యాటిట్యుడ్. బహుశా ఆ టైంలో గానీ జీన్సుంటేనా: దుర్యోధనుడు ఐ లివిన్ ఇట్ అనేటోడు. జీన్స్ ఒక కమ్యూనికేషన్ టూల్. భావవాహకము. వింటున్నవా అన్నా. విను జీన్స్ వాంట్ టూ టెల్ యూ సంథింగ్. విను. ఆ భాష అర్ధం చేసుకో. దాని డిమాండ్లు అంగీకరించు.
మూడునెలలు జిమ్ముకెళ్లారో లేదో రొమ్ము విరుచుకు తిరిగే పోరగాళ్లు. పట్టుమని పదిహేనేళ్లు నిండాయో లేదో జీన్స్ లాంగ్వేజ్ మాటాడే కుర్రోళ్లు. ఏదో బలమొచ్చినట్టు. కొత్త శక్తి వచ్చినట్టు. కుబుసం విడిచినట్టు. కొత్తగా రెక్కలొచ్చినట్టు. గుర్రమెక్కినట్టు. నో, గుర్రమే అయినట్టు! ఇది బూస్ట్ తాగితే వచ్చేదికాదు బేటా.
image_ga.php
మేబి! నువ్వెప్పుడూ పారేయలేదేమో. వెలిసినా మాసినా చిరిగిపోయి చింకిపాతయినా. వాన్ డామ్మ్ ఇంటిపేరు జీన్. జీన్ పాల్ బెల్మేండో గుర్తున్నడా. ఆడవాళ్లకి డైమండ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు గాక. నీకు కష్టంలో సుఖంలో మాయలో మోహంలో నీళ్లలో బురదలో మట్టిలో ఇసుకలో అడుగడుగులో. నువ్వెపుడైనా నీతోపాటూ ఏజ్ అయిన జీన్స్ ను మ్రుదువుగా ముట్టుకున్నవా. యే దోస్తీ హం నహీ చోడేంగే.
బ్లూజీన్స్ అండ్ బేర్ ఫుట్! బీచ్ ఒడ్డున పాంట్ పైకి మడిచి షూస్ చేతిలో పట్టుకుని. కెరటాల కాంతి ప్రతిఫలిస్తున్న సిలుయెట్! ఎన్నో ఫేమస్ పోస్టర్లు కలవు. మెమొరీస్. ఇత్తడి రివిట్లు కలిపినట్టు.
నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీతో కలిసి తొలి బైక్ రైడ్ చేసినపుడు ఈ జీన్సే వేసుకున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీతో తుళ్లింతలైనపుడు పారబోసుకున్న కాఫీ మరకల్ని మోసుకు తిరుగుతున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీ కోసం పరిగెత్తినపుడే మోకాలు దగ్గర చించుకున్నాను. నువ్వేదైనా అడుగు ఇది తప్ప. నీ కోసం ఎండలో వానలో చలిలో తిరిగి తిరిగి చివరకు ఆ పార్కు బెంచీ మీద ముడుచుకు పడుకున్నాను. ఒక్కడినే కాదు. ఈ జీన్స్ లోనే.
నిద్రపట్టని రాత్రులు ఓల్డ్ సిటీకెళ్లి ఛాయ్ తాగాను. షాలిమార్ లో సినిమాలు చూసాను. ప్రహరీ గోడమీద కూర్చుని రాళ్లు విసిరాను. ఎవడో పడేసిన బీరుసీసాని కాలితో తన్నుకుంటూ ఈ రోడ్లమీడే నడిచాను. పాతగోడ మీద బొగ్గుముక్కతో పేర్లు చెక్కాను. జ్వరం సలిపినపుడూ మాసిన రగ్గు మీద అలజడితో పొర్లాను. బారెడు పొద్దెక్కాక లేచి బన్ మస్కా తిన్నాను. ఒక్కడినే కాదు. ఈ జీన్స్ లోనే.
ఆసిడ్ వలన కాలదు. ఐస్ వలన చెదరదు. స్టోన్  వలన  చిరగదు- భగవద్గీత కాదు గురూ వాషాది వాషులుగా ఎన్నెన్నో అవతారములెత్తి లెవీస్ట్రాస్ విశ్వరూపదర్శనం. ప్రతి ఫేడూ ఓ న్యూ షేడ్. ప్రతి షేడూ ఓ నీడ. ఆ నీడలో గడచిన కాలపు జాడ. పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నీకు నచ్చిన కాలంలో నచ్చిన వాక్యం రాసుకో.
ఏం కావాలన్నా ఈ జీవితానికి. మంచోడికి ఓ జీన్స్ పాంట్ ఉంటే చాలదా?
-అరుణ్ సాగర్
Download PDF

11 Comments

  • balasudhakarmouli says:

    ప్రత్యేకమైన కవిత… బాగుంది………. అరుణ్ సాగర్ గారూ ……..

  • మీ మాటల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అరుణ్ సాగర్ గారూ

  • కోడూరి విజయకుమార్ says:

    “నీతో తుళ్లింతలైనపుడు పారబోసుకున్న కాఫీ మరకల్ని మోసుకు తిరుగుతున్నాను
    నువ్వేదైనా అడుగు ఇది తప్ప … నీ కోసం పరిగెత్తినపుడే మోకాలు దగ్గర చించుకున్నాను
    నువ్వేదైనా అడుగు ఇది తప్ప… నీ కోసం ఎండలో వానలో చలిలో తిరిగి తిరిగి
    చివరకు ఆ పార్కు బెంచీ మీద ముడుచుకు పడుకున్నాను.
    ఒక్కడినే కాదు …. ఈ జీన్స్ లోనే”

    సాగరన్నా ….!
    పోయెం చదువుతూ, చదువుతూ సరిగ్గా ఇక్కడికి వొచ్చేసరికి టాప్ గేర్ వేసావు ….
    ఈ అనుభవం పలికి ఉండకపోతే పోయెం కి అందం వోచ్చేదే కాదు … లవ్డ్ ఇట్ భాయ్ !

  • Thirupalu says:

    సర్రియలిజమా ?

  • Jhansi Papudesi says:

    ఉఫ్ … ఆడవాళ్ళను వర్ణించి వర్ణించి గొప్పోళ్ళను చేసిన రాతలపై కత్తి కట్టినట్టు …మీ రాతలతో మగాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే మా ఉనికేం కాను :( ఇక జీన్స్ విషయానికొస్తే …ఆకాశమూ, సముద్రమూ బ్లూ జీన్స్ కి మ్యాచ్ అవుతాయని …మీరు చెప్పిన తర్వాతే…’అవును కదా! ‘ అనుకున్నా:) జీన్స్ మర్ద్ కే కాదు, మాక్కూడా నేస్తమే. ఎన్ని బ్లూ జీన్స్ కొన్నా షాప్ కెళ్ళిన ప్రతిసారీ ఇంకో కొత్త షేడ్ కనిపిస్తుంది. మీరు రాసే ప్రతి పదమూ కొత్తగా కనిపించినట్టుగానే :) ఎక్సెలెంట్ ఎక్స్ప్రెషన్!!!

  • సాయి పద్మ says:

    ఆసిడ్ వలన కాలదు. ఐస్ వలన చెదరదు. స్టోన్ వలన చిరగదు- భగవద్గీత కాదు గురూ వాషాది వాషులుగా ఎన్నెన్నో అవతారములెత్తి లెవీస్ట్రాస్ విశ్వరూపదర్శనం. ప్రతి ఫేడూ ఓ న్యూ షేడ్. ప్రతి షేడూ ఓ నీడ. ఆ నీడలో గడచిన కాలపు జాడ. పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. నీకు నచ్చిన కాలంలో నచ్చిన వాక్యం రాసుకో….

    బాగుంది మీ జీన్స్ ప్రేమ .. జెనరల్ గా, జెనరస్గా , జేనేటికల్ గా …రావాల్సిన ప్రేమని జీన్స్ పరం చేసిన అమ్మాయిలూ , అబ్బాయిలూ కూడా ఉన్నారు .. అదే జీన్స్ తో జాగ్రత్తగా సాధించే అబ్బాయిలని వదిలి పెట్టేసారు .. బాగుంది .. ! మియర్ మేల్ అయినంత మాత్రాన స్మియరింగ్ ఫీమేల్ కావాల్నా .. హ హ

  • RAMESH HAZARI says:

    “చివరకు ఆ పార్కు బెంచీ మీద ముడుచుకు పడుకున్నాను.
    ఒక్కడినే కాదు …. ఈ జీన్స్ లోనే”—సాగర్
    నీ జీన్స్” చదివిన తరువాత అన్నా. మా బ్రహ్మం* మాటలు గుర్తుకొచ్చినయి.
    ***** ****
    “ఎందుకు బ్రహ్మం ఎప్పుడు ఆ కండువ బుజాన యేసుక తిరుగుతవ్. ఆకరికి ఆపీసులకు కూడా ఏసుకోస్తవ్. ఏమనుకుంటరు ఎవలన్న సూత్తే” అన్న
    ” ఏమో సారూ.. నా కెందుకో బుజం మీద కండువలేకుంటే యాందో పోగొట్టుకున్నట్టే వుంటది. నీను ఏ పని జేసినా ఈ కండువే నాకు అండగా వుంటది. అసలో మనిసి పెట్టనుకో. బరువులెత్తి నప్పుడు సుట్ట బట్ట సుట్టుకుంటిని. గడ్డ పార ఎసేతప్పుడు నడుమ్కు కట్టుకుంటిని. సొక్కి అల్సి పంటె భూమ్మీద పరుసు కుంటిని. సానం గిట్ట జేసినప్పుడు మానం మీద కప్పుకుంటిని.ఏం జెప్పాలె. పెండ్లం లేకున్నా పంట గని నా కండువ పక్కల లేకుంటే నిద్ర బట్టదంటే నమ్మున్రి” అన్నడు
    (* బ్రహ్మం మమ్ముల అపార్ట్ మెంటుల కనిపెట్టుకుంట వుండే మిత్రుడు (వాచ్మన్))

  • buchireddy gangula says:

    సూపర్ –సిక్సర్ –చాల బాగుంది సర్

    ———————————–
    బుచ్చి రెడ్డి గంగుల

  • Nagaraj says:

    సార్ నీల్ కమల్ చాల బాగుంది :)

Leave a Reply to aparna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)