స్వర్గాల చీకటి మీద..

నందకిషోర్

నందకిషోర్

1
ఎవరిదైతేనేం?

జాగ్రత్తలేని ఊహల్లోంచి
జారిపడ్డ రాత్రికి గుర్తు.

నీలాగా,నాలాగ
ఒక పసిప్రాణం.

చూస్తూ చూస్తూ
ఎలా చంపమంటావ్?

2

తెలిసిందా?

రాత్రులు నువుమోసిన
స్వర్గాలన్నీ

భారంగా తేలిపోయే
నల్లమబ్బులు.

నిజమైన స్వర్గం ఒకటి
ఖచ్చితంగా వేరే ఉంది.

3

ఏడుస్తావెందుకు?

ముడుచుకున్న పసివేళ్ళన్ని
మృదువుగా కదిలినందుకో

తెరుచుకోనీ కళ్ళవెలుగులో
శూన్యరాశి పరిచినందుకో

4

సున్నితమైన ఓదార్పు మాటతో
ఎముకలు చిట్లేటి
శబ్ధాలు వింటూ

మరలిరాని ప్రాణాల ధ్యాసలో
దీనంగా భారంగా
పాపాన్ని కంటూ

picasso

5

రా!ఇలా!
శుభ్రంగా
చేతులు మనస్సు కడుక్కో.

స్వర్గాల జలపాతాల్లో
నీటి తుంపరలు పిల్లలు

స్వర్గాల చీకటిమీద
నిప్పు తునకలై మెరిసిపోతారు.

6

పిల్లలకేదీ అంటదు!

ఆకాశాలమీద
ఆడుకుంటారు.

ఆకాశమై
వాళ్ళు బతికిపోతారు.

నువ్వే రక్తమని
తెలిసినా లేకున్నా

7

పిల్లలు దోసిళ్ళతో
నక్షత్రాలు చల్లుతారు.

నూరేళ్ళు బతకమంటూ
నిండుగా దీవిస్తారు.

( The greatest destroyer of peace is abortion because if a mother can kill her own child, what is left for me to kill you and you to kill me? There is nothing between. – Mother Theresa)

- నంద కిషోర్

Download PDF

3 Comments

 • రవి వీరెల్లి says:

  నందూ,
  అద్భుతం!!!
  సున్నితంగా, ఆర్ద్రంగా సాగింది కవిత. చదవగానే గుండె బరువెక్కింది.
  “if a mother can kill her own చైల్డ్ …” ఇది చదవగానే కళ్ళు చెమ్మగిల్లాయి.

 • అవును,. స్వర్గమూ,. చీకట్లలోనే మగ్గిపోతుంది,.ఏ అంటూ లేని పిల్లలు,.దానితో జట్టుకట్టనప్పుడు,. . బాగుంది,. నందు,,..

 • మెర్సీ మార్గరెట్ says:

  బాగుంది నందు …

Leave a Reply to bhaskarkondreddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)