అరచేతిలో తెల్లకాగితం

renuka

ఉత్తరం చేతివేళ్ళమధ్యలో

మెత్తని అడుగులతో  ఊపిరివేడిని మొసుకొచ్చి విప్పి చూడమని అడుగుతోంది

అలసిపో్యిన కనుల నలుపుచారలు దాటిన బిందువులు

అక్షరాలని తడిచేసి చెదురుమదురు చేసాయి

ఆశ్రమ పాకలో చీకటినిర్మించుకున్నప్పుడు

సవ్వడిలేని నిద్ర ధ్యాననిమగ్నతలో ఒరిగిపోయినప్పుడు

చీకటితో రాజీ కుదుర్చుకున్న చంద్రుడి వెలుగు మసకబారగానే

ఉత్తరం సన్నని వెలుగు వెచ్చదనంతో  చేతివేళ్లనుతాకి

పాటలోని పల్లవి శృతి మంద్రంలోకి దింపి

నర్మదా నదీ తీరాల వెంట పాలరాయి కొండలలో  ఊగే తెప్ప సవ్వడి

నిశ్శబ్ధంలో నింగికి చుక్కలు

Damerla-Rama-Rao

వేలయోజనాల దూరాన్ని దగ్గరచేసి చమ్కీలు కుట్టీ

పగటివెలుగు దాకదాచి లేఖలోకి ఒదగలేక

జారపోయిన అక్షరాలు

మెల్లగా అడుగుతున్నాయి

సందేశాన్ని వంపుతూ పదిలాన్ని ప్రశ్నిస్తూ

తప్పిపోయిందనుకున్న పరిచయం ముఖాన్ని వెదికింది

ముగింపులేకుండా ఏదో అడుగుతూనే వుంది

జాబు రాద్దమని కూర్చున్నానేగాని ఏది చిరునామ

ఊహలో ఊపిరిరెక్కలతో ఇక్కడికి చేరుకుంది

జ్జాపకాల రెల్లుపొదల్లొ చిక్కుకుపోయింది

అయినా అరిచేతులో నలుగుతున్న

తెల్లకాగితం మీద   రాస్తూన్నాను

పెరటి  తలుపు అడ్డగడియా తీసి

నూతిపళ్ళేం గట్టు మీదకూర్చుని…

రేణుక అయోల  

Download PDF

5 Comments

  • జాన్ హైడ్ కనుమూరి says:

    ఉత్తరాన్ని గుర్తుచేసి “ఊహలో ఊపిరిరెక్కలతో ఇక్కడికి చేరుకుంది”

    “నర్మదా నదీ తీరాల వెంట పాలరాయి కొండలలో ఊగే తెప్ప సవ్వడి
    నిశ్శబ్ధంలో నింగికి చుక్కలు”
    తెలుగులో సాహిత్యంలో, కవిత్వంలో ఎక్కువ గోదారి కన్పిస్తుంది, కానీ నర్మాదా నదిని వాడేసరికి కొత్తగా అనిపించింది. ఆ అనుభవ అనుభూతిలోకి చేరలేకపోయాను.

    మీరు వాడిన చాలా పదాలవెంట “పెరటి తలుపు అడ్డగడియా తీసి
    నూతిపళ్ళేం గట్టు మీదకూర్చుని” జ్ఞాపకాలవెంట పరుగులు తీసేటట్టు చేసారు.

    అభినందనలు

  • కొన్ని నేమరవేతల మిఠాయి పొట్లం… చాలా నచ్చింది మేడమ్..

  • vijay kumar svk says:

    Wah….. Salaam… Super poem….

  • చాలా నోస్టాల్స్జిక్ కవిత రేణుకాజీ. ఉత్తరం ఓ మర్చిపోయిన జ్ఞాపకం. ఎక్కడో గుండెమారుమూల మిగిలిన ఓ తడి ఇంకా. మంచి కవితావస్తువునెంచుకుని దానికి న్యాయం చేసారు…మొదటి వాక్యం నుంచీ ఆకట్టుకుంది. అభినందనలు

  • లోవ దాస్ says:

    లేఖలోకి ఒదగలేక

    జారి పోయిన అక్షరాలు

    మెల్లగా అడుగుతున్నాయి – చక్కని కవితకు వందనాలు

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)