
చాలామంది అడుగుతున్నారు.
ముగ్గుల బొమ్మలు అన్నప్పుడు అందరూ అదే అడుగుతున్నారు…
ఎన్ని రకాల ముగ్గులు చిత్రించావూ అని!చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, రంగవల్లులు…
ఈ మూడు రకాల ముగ్గులూ ఉంటాయి గనుక, ఒక్కొక్క రకంవి ఎన్ని ప్రదర్శిస్తున్నవూ అని!
కొంచెం భయంగానే ఉన్నది.
అయితే, వారు ఊహించినవి కాకుండా చూపి, ఇవీ ముగ్గులే కదా అంటే ఏమంటారో!
తిట్టినా కొట్టినా నేను మటుకు భయభక్తులతోనే ఉన్నాను గనుక భరోసా!
ఏమైనా ఒక కుతూహలం, సంబురం.
ముగ్గులు స్త్రీల చిత్రలిపిలు కనుక.
స్త్రీ అంటే ప్రకృతి కదా కనుక!
నాకైతే సూరీడు తన కిరణాలతో భూమాత హృదయంపై నర్తించడమే తొలి ముగ్గు.
అటు పిమ్మట పకృతి ఒడిలోంచి నిదానంగా నిద్రలేచిన ఓ మాత వొంగి చుక్కలు పెడుతుంటే…ముగ్గూ…ఆ తల్లీ….ముగ్గుబట్ట వంటి తన తలను ముగ్గులో వొంచి చిత్రిస్తుండటం మలి చిత్రం.
ఇంకా చాలా…
అయితే, అన్నీనూ ఒక ఛాయా చిత్రకారుడిగా వెలుగు నీడలను వాకిట్లో చూసుకుంటూ, వీధుల్లో అడుగులు వేసుకుంటూ పోవడమే నా చిత్రలిపి.
నిజమే. ఇంటికి శుభప్రదం అని ముగ్గులు వేస్తారు. దుష్టశక్తుల నివారణకూ ముగ్గులను గీస్తారు.
అవన్నీ చెప్పినా చెప్పక పోయినా, రాళ్లబండి గారు అన్నట్లు జీవితాన్ని ముగ్గులోకి దింపే ప్రయత్నమే నా చిత్రాలు.
ఎవరైనా చూసి ఆశీర్వదిస్తారని అభిలాష…
కందుకూరి రమేష్ బాబు
ప్రకృతిని ఆరాధించడం అంటే కన్నా తల్లిని సన్మానించడం కదా,
ముగ్గులు స్త్రీల మనోభావాలతో పాటు వారి బతుకు చిత్రాలను ప్రదర్శించడం అంటే
వారిని గౌరవించడమే కదా
సంక్రాంతికంటూ ప్రత్యేకంగా వేసే ముగ్గుల కంటే ఇలా హడావుడిగా పన్లోకి పోతూ ఇంటి ముందు ముగ్గుతో గీసిన రెండు గీతల్లోనే జీవం కనిపిస్తుంది.
అందం కాదు, జీవం!
nijame nandee! sujata garu annatlu jeevam pradhanam, andam kaadu!
సోదరుడు కందుకూరి రమేశ్ బాబు గారి ‘సూరీడు తన కిరణాలతో భూమాత హృదయంపై నర్తించడమే తొలి ముగ్గు’ అనే ఊహ చాలా బాగుంది. ఈ వాక్యం తో పాఠకుడు తనకు తెలియకుండానే అతని ముగ్గుల ‘ముగ్గు`లోకి మురిపెంగా దిగిపోతాడు.
`అటు పిమ్మట పకృతి ఒడిలోంచి నిదానంగా నిద్రలేచిన ఓ మాత వొంగి చుక్కలు పెడుతుంటే…ముగ్గూ…ఆ తల్లీ….ముగ్గుబట్ట వంటి తన తలను ముగ్గులో వొంచి చిత్రించే మలి చిత్రా’న్ని కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు.
సోదరుడికి అభినందనలు.
గుండె బోయిన శ్రీనివాస్,
హన్మకొండ,
14/01/2014.