కనువిప్పు

DSC_0421
చాలా కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు. ఫొటో తీయాలంటేనే కాదు, చూడాలంటేనూ.

కానీ, వాస్తవం ఏమిటంటే, చూడగా చూడగా తెలుస్తుంది, కష్టమేమీ లేదని!నిజం.
ఈ తల్లి మాదిరి, ఇలా ఒక కన్నో ఒక కాలో లేదా ఏదో ఒకటో రెండో బాలేవని తెలిసి, చూడాలంటే బాధ.
కానీ, ఏదో ఒక వైకల్యమో మరో దురదృష్టమో వెంటాడిన కారణంగా ఆ మనిషిని చూడ నిరాకరిస్తే మరి ఆమె సంగతేమిటి?
ఆమెను కళ్లారా చూస్తే కదా! అసలు దృష్టిలోపం అన్నది తనకున్నదో లేదో తెలిసేది!
ఒక కన్ను లేకపోతే కానవస్తుందా రాదా అన్నది తెలిసేది?

చూడటం అన్న మౌలిక విషయం గురించి లోతైన చింతన నాది.
వారినుంచి తప్పించుకు పోవడమేనా పరిష్కారం అన్న బాధ నుంచే ఇదంతా?
కాదనే ఈ దృశ్యాదృశ్యం.

+++

నిజానికి ఛాయాచిత్ర లేఖనంలో ఒక కన్ను మూసి మరో కన్ను తెరిచి దృశ్యబద్దం చేయడమే సిసలైన కళ.
చూడగా చూడగా దృష్టి నిశితం అవుతుంటుంది. లోకమంతా కన్ను మూయగానే అంతర్లోకాలు తెరుచుకుంటయి. ద్వారాలను కాసేపైనా మూయగానే విశాలంగా తెరుచుకుంటుంది వాన. ఈదురుగాలి. విషాదం. అలాగే ఆనందమూనూ.

కళ్లు ఆర్పకుండా చూడటంలో కాసేపైనా అలా దృక్పథాన్ని పట్టుకుని ఈదులాడినప్పుడే జీవన నావ గురించిన అలుపు సొలుపు లేదంటా విశ్రాంతి అవిశ్రాంతి కాదంటే చేతనం అచేతనం…ఇవన్నీ తెలిసి వస్తయి.
అప్పటిదాకా అవగాహనకు రానివెన్నో కానవస్తూ ఉంటయి. మరింత విస్తృతంగా లోవెలుపలా కనెక్ట్ అయి నిదానంగా అవలోకనంలోకి వస్తూ ఉంటయి.

మనోఫలకంపై పడే చిత్రలేఖనంలో కెమెరా ఉండకపోవచ్చు. కానీ, నేత్రాలున్నయి కదా మనకు.
వాటిలోంచి ఒక జత మనవైన ఒక జత గురించి ఒకమాట.

నిజానికి ఒక కన్ను మూసి, మరొక కన్ను తెరిచి కెమెరా గుండా చూస్తున్నప్పుడు ఆ జతలో ఒకటి పనిచేయడం మరొకటి పనిచేయక పోవడం ఏమీ లేదు. తెరవడం ఒక పని, మూయడం ఒక పని. అలా రెండూ పనిలోనే ఉండగా మరొక కన్నూ ఉంటుంది.
అదే వ్యూ ఫైండర్. దానితో కలిసి చూపును సవరించుకుంటేనే అవతలినుంచి ఇవతలికి ఒక ప్రసరణ. తెలిసీ తెలియక లోన ఏర్పడిన గ్రహణాలన్నీ తొలిగే ఒకానొక జీవస్పర్శ. అదే చిత్రణం. కెమెరా ఉన్నా లేకపోయినా, కళ్లుంటే చాలు. ఆ మాటకంటే చూపుంటే చాలు దర్శనం అవుతుంది.

ఇక్కడా అంతే.
వెలుగునీడల్లో ఉన్న ఆమెను చూడండి.
ఒక వైపు ఆమెను చూస్తే తెరిచి ఉన్న జీవితం. మరొక పక్క చూస్తే తెలియని జీవితం.
కానీ, ఈ పక్కే తన బిడ్డ తల్లి ఆసరాతో తన అమాయకపు కుతూహలపు కళ్లతో ప్రపంచాన్ని చూస్తు ఉండటం నిజంగా ఒక ఆసరా.
తల్లికే.

అవును. నా వరకు నాకు ఒక మనిషి తన పాలిటి జీవన సాహచర్యంతోనో లేదా రక్త సంబంధం తాలూకు కన్నపేగుతోనో లోకాన్ని పరిశీలిస్తరని!
ఆ లెక్కన ఆమె తెరిచిన కన్ను, మూత కన్నూ, బిడ్డ తాలూకు వ్యూ ఫైండరూ కలిసి ఆమె ఎంత చూపరో కదా, జీవితానికి అనిపించి ఒక చెప్పనలవి కాని ఆత్మవిశ్వాసం.

నిజానికి ఈమె కూడా అంతే. ఒక విశ్వాసం. ఒక ధీమా.
అసలైతే తాను భాగ్యవంతురాలు.

ఒక వైపు మెరుస్తున్న ముక్కెర చూడాలి. మెరుపంటే అదే కాదు, ఇటువైపు కూడా ఉంది. అది సూర్యరశ్మి.
అదంతా కూడా ఆమె మొహంపైన.

అదీ వెలుగునీడల రహస్యం.
తానూ పూర్తిగా వెలుతురులోనే ఉందన్న ఆత్మవిశ్వాసం తాలూకు అవగాహన.

సూర్యోదయంతో పనికి బయలుదేరి సూర్యాస్తమయానికి ఇంటికి చేరడంలో ఆమె కన్నుపైనే ఆధారపడి లేదు.
సూర్యుడినీ కళ్లు చేసుకుంది. ఆ సంగతి తెలిస్తే కలిగే విశ్వాసం మహత్తరమైంది.

+++

నాకా అదృష్టం కలిగించే మహిళ తాను.
తానే కాదు, ఎందరో మహానుభావులు…విధి వక్రించి జీవితంలో గాయపడి ఎందరెందరో మనకు కనిపిస్తూనే ఉంటరు.
వారిని చూసి తప్పుకోకుండా అలాగే నిలిస్తే వారు నిజంగా అపూర్వంగా కనిపిస్తరు. అనివార్య  జీవన ప్రస్థానంలో వారు తమకున్నదాంతో అలాగే లేనిదాంతో జీవిస్తూ మెరిసిపోతూ ఉంటరు.
మనకు అంతుపట్టని లోపాలతోనే వాళ్లు జీవితాన్ని అలవోకగా జీవిస్తూ సామాన్యశాస్త్రాన్ని అర్థవంతం చేస్తూ అగుపిస్తరు.

అనిపిస్తుంది, కాసేపు మన కంటికి పని చెబుతేనే లోకం రహస్యంగా తన అపరిమిత రహస్యాలను మన పరిమితులను చెదరగొడుతూ చూపిస్తుందే!
మరి తన కంటిని సంపూర్ణంగా వాడుకునే ఇలాంటి నేత్రధారులను గనుక పదే పదే చూస్తే మనమెంతగా కళ్లు తెరుచుకుంటామని!
ఎవరు సంపూర్ణం, మరెవరు అసంపూర్ణం అని తెలిసిపోతుంటే కళ్లు తెరుచుకోవూ!

అదే ఆశ్చర్యం నాకు. ఆ ఆశ్చర్యంనుంచే తనను పలుసార్లు చూస్తూ ఉంటాను. ఒకసారి నేరుగా కన్ను కన్నూ కలిపితే చిర్నవ్వింది. ఫొటోలు తీస్తుంటే నా శ్రద్ధకు ఆమె సహకరించింది. ఆ సమయంలో బిడ్డ ధిలాసాగా చంకలో ఒదిగి ఉన్నది.

తనలో ఏమాత్రం తడబాటు లేదు. ఇటు నా వైపు నుంచి. ఒక శాంతి.
ఆమెలో మరే మాత్రం న్యూనతా లేదు. ఇరువైపులా అదే అయింది. దాంతో ఒక ఆనందం.
అంతకుమించి ఒక హృదయపూర్వకమైన ఆలింగనం. దాంతో వైకల్యం అన్నమాట దేవుడెరుగు. ఒక చిద్విలాసంగా ఒక తీయటి పండును పంచుకున్నట్టు శుభ్రమైన ఆనందం. కల్మషం లేని ఆ చిరునవ్వు చూడండి. కళ్లు నవ్వినట్టు.

అనుకుంటాం గానీ, ఆ బిడ్డ కనులూ పనిచేస్తున్నయి.
అదొక గమ్మత్తు. అదొక తన్మయత్వం.

చిత్రమేమిటంటే, చంకలో ఉన్న బిడ్డకు ఊహ లేదు. కానీ, ఉనికి తెలుసు.
అదీ నిజంగానే ఒక చూపు. అందుకే ఈ చిత్రం చిత్రమే.

+++

మనం చూడగా చూడగా అన్నీకనపడుతూ ఉంటయి.
అందుకే అభ్యర్థన. దయుంచి మనుషులను తప్పించుకోవద్దు. వైకల్యం పేరిట వికల మనస్కులు కానేవద్దు. వాళ్లు మీరనుకున్నది కాదు. వాళ్లు జీవించిందే జీవితం. అదెట్లో తెలుసుకునేందుకే మన కళ్లు. రెండు చాలకపోతే ఒక కన్ను మూసుకుని చూద్దాం.
అదే కళ. జీవకళను చూపించే కళ.

నేరుగా చూడండి.
ఒక రకంగా ఇదీ సాహిత్య పఠనమే.
మానవేతిహాసాన్ని చదవడానికి చూపూ అవసరం అని చెప్పే సాహిత్య అవలోకనం, ఛాయాచిత్ర లేఖనం.

~  కందుకూరి రమేష్ బాబు

ramesh
Download PDF

2 Comments

  • dhanraj says:

    శ్రామిక జనం నోట చెరిగిపోదు నీపాట …
    శ్రామిక జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఎర్రజెండ ..ఎర్రజెండెన్నియ్యల్లో .. ఇంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న పాట రచించి 38 ఏండ్లు గడిచిం ది. 1976లో ‘మే’డే రోజున ఈపాట పురుడు పోసుకొంది. ఎర్రజెండెపూరజెండెనియ్యలో ..ఎర్రెర్రనిది ఈ జెండెనియ్యలో..అనే ఈ మహత్తర చైతన్య గీతాన్ని రచించింది మంథని మండలంలోని గాజులపల్లె అనే కుగ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అల్లం వీరయ్య. ఆయన సోదరులలో అల్లం రాజయ్య రచయిత కాగా, అల్లం నారాయణ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎడిటర్. వీరయ్య సార్ మా సర్కార్ బడి పంతులు . బడుగు, బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించిన ఈ పాట ప్రజల ముందుకు విస్తృత స్థాయిలో చేరడానికి కొంత కాలం పట్టింది. మేడే నాడే ఈ పాటను రచించడం విశేషం. ఈ పాట సినిమా తెరపైకి ఎక్కడంతో మరింత ప్రాచుర్యం పొందింది. విద్యార్థి దశలో ఉండగానే అల్లం వీరయ్య కలం నుంచి మహాద్భుతమైన కవితా సంకలనాలు, పాటలు జాలువారాయి. చైతన్య గీతంగా ప్రజల అభిమానాన్ని పొంది న ఎర్రజెండ ఎర్రజెండెనియలో..పాట ప్రప్రథమంగా గోదావరి నది తీరం లో గల గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ఒక బహిరంగ సభ లో- కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు అల్లం నారాయణ సార్ , ఆయన మిత్రుడు కలిసి ఆలపించారు. జార్జి ఫెర్నాండేజ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ పాట సభను ఉర్రూతలూగించింది.
    ఎంత ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం అల్లం వీరయ్యగారిది. ఎర్రజెండ ఎర్రజెండెనియలో పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ‘చీమలదండు’ సినిమాలో పెట్టుకున్నారు. ఇందుకు పారితోషికంగా ఆయన 10 వేల రూపాయలు అల్లం వీరయ్యకు ఇచ్చారు. వీరయ్య ఈ పారితోషికాన్ని తాను చిన్ననాడు చదువుకొన్న మంథని మండలంలోని గాజులపల్లె, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నెంపల్లె గ్రామాల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అందచేశారు.ఈ సమాజంలో నీతి, నిజాయితి, ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, అన్యాయా లు, అక్రమాలు, ఇలా చెప్పుకొంటుపోతే ఎన్నో… ఇటువంటి సామాజికాంశాలే ఇతివృత్తాలుగా అల్లం వీరయ్య పలు రచనలు చేశారు. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే ఆసక్తి కల్పించేదే ఈ చైతన్య గీతిక.
    ఎర్రజెండ.. ఎర్రజెండ ఎన్నియ్యలో .. పాటను సభలో విని గంతులేసిన వారున్నారు. చీమల దండు సినిమాలో చూసి గొంతు కలిపినవారున్నారు. కానీ ఈ పాటను రచించిన అల్లం వీరయ్య మాత్రం చీమలదండు సినిమాను థియేటర్‌లో చూడనే లేదట .. టీవీలోనే చూశారట. మరో విశేషమేమిటంటే ఈ పాట రచయిత అల్లం వీరయ్య అనే విషయం చాలా కాలం వరకు తెరపైకి రాలేదు. దశాబ్దాలుగా శ్రామిక జనం నోట ప్రవహి స్తూనే ఉన్నది. పరవళ్ళు తొక్కుతున్నది, పరవశింప చేస్తున్నది. మా గురువర్యులు అల్లం వీరయ్య గార్కి దీర్ఘ ఆయురారోగ్య శుభాకాంక్షలు.

  • dhanraj says:

    శ్రామిక జనం నోట చెరిగిపోదు నీపాట …
    శ్రామిక జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఎర్రజెండ ..ఎర్రజెండెన్నియ్యల్లో .. ఇంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్న పాట రచించి 38 ఏండ్లు గడిచిం ది. 1976లో ‘మే’డే రోజున ఈపాట పురుడు పోసుకొంది. ఎర్రజెండెపూరజెండెనియ్యలో ..ఎర్రెర్రనిది ఈ జెండెనియ్యలో..అనే ఈ మహత్తర చైతన్య గీతాన్ని రచించింది మంథని మండలంలోని గాజులపల్లె అనే కుగ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అల్లం వీరయ్య. ఆయన సోదరులలో అల్లం రాజయ్య రచయిత కాగా, అల్లం నారాయణ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎడిటర్. వీరయ్య సార్ మా సర్కార్ బడి పంతులు . బడుగు, బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించిన ఈ పాట ప్రజల ముందుకు విస్తృత స్థాయిలో చేరడానికి కొంత కాలం పట్టింది. మేడే నాడే ఈ పాటను రచించడం విశేషం. ఈ పాట సినిమా తెరపైకి ఎక్కడంతో మరింత ప్రాచుర్యం పొందింది. విద్యార్థి దశలో ఉండగానే అల్లం వీరయ్య కలం నుంచి మహాద్భుతమైన కవితా సంకలనాలు, పాటలు జాలువారాయి. చైతన్య గీతంగా ప్రజల అభిమానాన్ని పొంది న ఎర్రజెండ ఎర్రజెండెనియలో..పాట ప్రప్రథమంగా గోదావరి నది తీరం లో గల గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించిన ఒక బహిరంగ సభ లో- కార్మిక, కర్షక, పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు అల్లం నారాయణ సార్ , ఆయన మిత్రుడు కలిసి ఆలపించారు. జార్జి ఫెర్నాండేజ్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ పాట సభను ఉర్రూతలూగించింది.
    ఎంత ఎదిగినా ఒదిగిపోయే మనస్తత్వం అల్లం వీరయ్యగారిది. ఎర్రజెండ ఎర్రజెండెనియలో పాటను ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి ‘చీమలదండు’ సినిమాలో పెట్టుకున్నారు. ఇందుకు పారితోషికంగా ఆయన 10 వేల రూపాయలు అల్లం వీరయ్యకు ఇచ్చారు. వీరయ్య ఈ పారితోషికాన్ని తాను చిన్ననాడు చదువుకొన్న మంథని మండలంలోని గాజులపల్లె, కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వెన్నెంపల్లె గ్రామాల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అందచేశారు.ఈ సమాజంలో నీతి, నిజాయితి, ప్రేమ, ఆత్మీయత, అనుబంధం, అన్యాయా లు, అక్రమాలు, ఇలా చెప్పుకొంటుపోతే ఎన్నో… ఇటువంటి సామాజికాంశాలే ఇతివృత్తాలుగా అల్లం వీరయ్య పలు రచనలు చేశారు. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనే ఆసక్తి కల్పించేదే ఈ చైతన్య గీతిక.
    ఎర్రజెండ.. ఎర్రజెండ ఎన్నియ్యలో .. పాటను సభలో విని గంతులేసిన వారున్నారు. చీమల దండు సినిమాలో చూసి గొంతు కలిపినవారున్నారు. కానీ ఈ పాటను రచించిన అల్లం వీరయ్య మాత్రం చీమలదండు సినిమాను థియేటర్‌లో చూడనే లేదట .. టీవీలోనే చూశారట. మరో విశేషమేమిటంటే ఈ పాట రచయిత అల్లం వీరయ్య అనే విషయం చాలా కాలం వరకు తెరపైకి రాలేదు. దశాబ్దాలుగా శ్రామిక జనం నోట ప్రవహి స్తూనే ఉన్నది. పరవళ్ళు తొక్కుతున్నది, పరవశింప చేస్తున్నది. మా గురువర్యులు అల్లం వీరయ్య గార్కి దీర్ఘ ఆయురారోగ్య శుభాకాంక్షలు. BY
    DHANRAJ

ఒక వ్యాఖ్యను

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)